శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకోవటంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో విమానాశ్రయ అధికారులు శంషాబాద్‌కు వచ్చే పలు విమానాలను దారి మళ్లించారు. షార్జా, మస్కట్, అబుదాబి నుంచి వచ్చే విమానాలను బెంగళూరుకు మళ్లించారు. మరోవైపు ఢిల్లీ, దుబాయి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. దాంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.