జాతీయ రికార్డు సృష్టించిన అదానీ కంపెనీ
భారతదేశ ఆర్థికవ్యవస్థ రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో తయారైన వస్తువుల ఎగుమతులు రెట్టింపవుతున్నాయి. దాంతోపాటు దేశీయ అవసరాలకు విదేశాల నుంచి వస్తున్న దిగుమతులు హెచ్చవుతున్నాయి. ఈ వస్తురవాణా వివిధ మార్గాల్లో జరుగుతోంది. దేశంలో అధికంగా తీరప్రాంతం ఉంది. కాబట్టి ఎక్కువ వస్తువులు జలమార్గంలో పోర్ట్ల ద్వారా రవాణా చేస్తున్నారు.
తాజాగా ముంద్రాలోని అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నవంబర్ నెలకుగాను గరిష్ఠంగా 3,00,000 కంటైనర్లను సరఫరా చేశారు. అదానీ పోర్ట్ సెజ్(ఏపీ సెజ్) టెర్మినల్ నవంబర్ 2023లో 97 నౌకల్లో 3,00,431 ట్వెంటీ ఫుట్ ఈక్వాలెంట్ యునిట్(టీఈయూ)లను సరఫరా చేసి జాతీయ రికార్డును సృష్టించింది. మార్చి 2021లో ప్రతిరోజూ దాదాపు 10,000 చొప్పున 2,98,634 టీఈయూలను నెలలో సరఫరా చేసి రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం తన రికార్డును తాజాగా 3 లక్షల కంటైనర్ల సరఫరాతో తనే బద్దలుకొట్టింది.
అంతేకాకుండా, ఏపీ సెజ్కు చెందిన ధమ్రా, ఎన్నూర్ పోర్ట్లు కూడా అత్యధిక నెలవారీ వాల్యూమ్లను నమోదు చేశాయి. వరుసగా 3.96 ఎంఎంటీ, 65,658 టీఈయూలను సరఫరా చేశాయి. ఏపీ సెజ్ కార్గో వాల్యూమ్లలో 36 ఎంఎంటీతో 42 శాతం పెరుగుదల నమోదు చేసింది.
ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే..
ఏపీ సెజ్ ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎనిమిది నెలల్లో 275 ఎంఎంటీ కార్గోను నిర్వహించాయి. అదానీ పోర్ట్స్ షేర్లు ఈరోజు ప్రారంభంలో 4.45 శాతం పెరిగి రూ.864.40 వద్ద ట్రేడవుతున్నాయి. సెప్టెంబర్ 2023 నాటికి, అదానీ గ్రూప్ సంస్థలో ప్రమోటర్లు 65.53 శాతం వాటాను కలిగి ఉన్నారు.