Shiv Kumar rungta
-
ఫ్యాప్సీ పేరు మారింది...
ఇక ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రెండు రాష్ట్రాల్లో చెరో మూడు కేంద్రాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ) పేరును ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టాప్సీ)గా మార్చారు. రెండు రాష్ట్రాలకు ఒకే సంస్థగా ఉంటూ, ఆయా రాష్ట్ర అవసరాలను తీర్చడానికి మెంబర్స్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ కుమార్ రుంగ్టా తెలిపారు. ఫ్యాప్సీ పేరును ఎఫ్టాప్సీగా మార్చడానికి మంగళవారం జరిగిన ఏజీఎంలో నిర్ణయం తీసుకున్నామని, దీనికి ఇంకా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ కమిటీయే ఈ రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. విలేకరుల సమావేశంలో రుంగ్టా మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో ఆరు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణలో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్‌లలో... ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రుంగ్టా తెలిపారు. రెండు రాష్ట్రాల పారిశ్రామిక విధానాలు బాగున్నాయని, వీటిల్లో 80% అంశాలు ఫ్యాప్సీ సూచించినవే ఉండటం సంతోషంగా ఉందని ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనీల్ రెడ్డి వెన్నం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీల్లో రూ. 2,000 కోట్ల వరకు ఉన్నాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటాకు సంబంధించిన రూ. 1,500 కోట్లు చెల్లించనున్నట్లు ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, తెలంగాణకు సంబంధించిన రూ. 650 కోట్లు మార్చిలోగా వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదిలాగా వచ్చే ఏడాది విద్యుత్ కొరత ఉండకపోవచ్చని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికోత్పత్తి పెరిగితే విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని అనీల్ తెలిపారు. -
మరిన్ని నిధులు కేటాయించాల్సింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరిశ్రమలకు, ఖనిజ రంగానికి తెలంగాణ ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాల్సిందని ఫ్యాప్సీ అభిప్రాయపడింది. ‘విద్యుత్ రంగానికి స్పల్ప కేటాయింపులు నిరాశ కలిగించాయి. ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల విద్యుదుత్పాదన లక్ష్యాన్ని ఎలా చేరుకునేది స్పష్టత ఇవ్వలేదు. వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత ఇచ్చారు’ అని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా తెలిపారు. సబ్సిడీల కింద రావాల్సిన బకాయిలకుగాను రూ.638 కోట్లు కేటాయించడం వల్ల చిన్న కంపెనీలకు ఊరట లభించినట్టు అయిందన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటును ఆహ్వానిస్తున్నామని సీఐఐ తెలంగాణ చైర్పర్సన్, ఎలికో ఈడీ వనిత దాట్ల తెలిపారు. దీర్ఘకాలిక దృష్టికోణానికి బడ్జెట్ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ సెక్రటరీ గోపాలరావు తెలిపారు. రిసర్చ్, ఇన్నోవేషన్ సర్కి ల్ ఆఫ్ హైదరాబాద్ నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తుందని హైసియా ప్రెసిడెంట్ రమేష్ లోగనాథన్ తెలిపారు.స్టార్టప్‌లకు మరిన్ని ప్రోత్సాహకాలిస్తే బాగుండేదని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం అభిప్రాయపడ్డారు. -
ఫ్యాప్సీ అధ్యక్షులుగా శివకుమార్ రుంగ్టా
సాక్షి, హైదరాబాద్: ఫ్యాప్సీ నూతన అధ్యక్షులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త శివకుమార్ రుంగ్టా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రుంగ్టా గ్లాస్‌టెక్ అధినేతయైన ఆయనకు గత 12 ఏళ్లుగా ఫ్యాప్సీతో అనుబంధం వుంది. గతంలో ఆయన బ్యాంకింగ్, ఫైనాన్స్, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అనేక విభాగాలకు చైర్మన్‌గా పనిచేశారు. ఐఐటీ అహ్మదాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన ఖేతాన్ గ్రూపులో చిన్న స్థాయి ఉద్యోగంలో చేరిన శివకుమార్ రుంగ్టా అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో కెన్యా దేశానికి విదేశీ రాయబారిగా కూడా పనిచేశారు. 2012-13వ సంవత్సరంలో ఫ్యాప్సీ ఉపాధ్యక్షుడిగా, 2013-14 సీనియర్ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. సీనియర్ ఉపాధ్యక్షులుగా వి.అనీల్‌రెడ్డి దశాబ్దానికి పైగా ఫ్యాప్సీతో అనుబంధం ఉన్న వి.అనీల్‌రెడ్డి సీనియర్ ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈ పూర్తి చేసిన అనీల్‌రెడ్డి ఫ్యాప్సీ నిపుణుల కమిటీ, ట్రేడ్ కమిటీ, కామర్స్ కమిటీలకు చైర్మన్‌గా పనిచేశారు. 2013-14వ సంవత్సరంలో ఫ్యాప్సీకి ఉపాధ్యక్షులుగా కొనసాగారు. ఇప్పుడాయిన ఫ్యాప్సీ సీనియర్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.