Shiv Sena Editorial
-
కేజ్రీవాల్ ఒక్కడే..
ముంబై : మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై శివసేన ప్రశంసలు గుప్పించింది. ఓట్ల వేటలో బీజేపీ మతపరమైన విభజనకు పాల్పడుతున్న క్రమంలో ఆ పార్టీ కుయుక్తులను కేజ్రీవాల్ దీటుగా ఎదుర్కొంటున్నారని పేర్కొంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఓటమితో ఢిల్లీలో గెలిచేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, బీజేపీ సీఎంలు, 200 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు ప్రచారంలో దిగగా వారందరినీ కేజ్రీవాల్ ఒక్కడే ఎదుర్కొంటున్నారని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యానించింది. గత ఐదేళ్లలో తన ప్రభుత్వం చేపట్టిన పనుల ఆధారంగా కేజ్రీవాల్ ఢిల్లీ ఓటర్లను ఓట్లు కోరుతున్నారని, పార్టీలకు అతీతంగా దీన్ని అందరూ స్వాగతించాలని పేర్కొంది. ఎండిన చెరువులో కమలం వికసించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేసింది. ఢిల్లీ ప్రజలు తెలివైనవారని ఎవరిని ఎంచుకోవాలో వారికి తెలుసునని వ్యాఖ్యానించింది. ఆప్ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ ఆటంకాలు సృష్టిస్తోందని దుయ్యబట్టింది. కేంద్రం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పరిమిత అధికారాలతోనే కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యా, వైద్య, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో మంచి పురోగతి సాధించిందని పేర్కొంది. మోదీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోనూ కేజ్రీవాల్ తరహాను అనుసరించాలని శివసేన హితవు పలికింది. కేజ్రీవాల్ ఎంతగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా అభినందించాల్సిన కేంద్రం అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించింది. కేజ్రీవాల్‌ను బీజేపీ నేతలు ఉగ్రవాదిగా అభివర్ణించడాన్ని సేన తప్పుపట్టింది. ఉగ్రవాదైతే ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 2015లో 70 శాతం ఢిల్లీ ఓటర్లు ఉగ్రవాదికి ఓటు వేశారని బీజేపీ భావిస్తోందా అని ప్రశ్నించింది. చదవండి : బీజేపీలో సరైన సీఎం అభ్యర్ధి లేరు.. -
మోదీజీ..కొలువులు ఎక్కడ..?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం, వృద్ధి రేటు మందగించడంపై బీజేపీ మిత్రపక్షం శివసేన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నూతన ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని శివసేన సూచించింది. నిరుద్యోగం, ధరల పెరగుదల, పారిశ్రామిక ఉత్పత్తి పడిపోవడం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌కు ఎదురయ్యే ప్రధాన సవాళ్లని ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. దేశంలో నిరుద్యోగ సమస్యకు బీజేపీని నిందించరాదన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వాదనతో శివసేన అంగీకరించినా దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి తెస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇవ్వడాన్ని మరువరాదని గుర్తుచేసింది. మోదీ చెప్పినట్టుగా ఇప్పుడు పది కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉండగా అది జరగలేదని, దీనికి నెహ్రూ-గాంధీ కుటుంబాలను ఎలా విమర్శిస్తారని సంపాదకీయం పేర్కొంది. ఇక ప్రభుత్వ కొలువుల్లో నియామకాలు 30 నుంచి 40 శాతం మేర పడిపోయాయని, 2016-17లో కేవలం లక్ష ప్రభుత్వ ఉద్యోగాలే భర్తీ చేశారని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో లోపాలను చక్కదిద్ది ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చొరవ చూపాలని సేన సంపాదకీయం పేర్కొంది. -
భారత్ హిందువులదే: శివసేన
సాక్షి, ముంబై: శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత్ తొలుత హిందూ దేశమేనని స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పినట్టు భారత్ హిందువుల మాదిరిగా అందరిదీ అని, అయితే తొలుత ఇది హిందూ దేశమని, ఆ తర్వాతే ఇతరులని పార్టీ పత్రిక సామ్నా పత్రిక సంపాదకీయం పేర్కొంది. ముస్లింలకు 50కి పైగా దేశాలున్నాయని, అందుకే భారత్ ముందుగా హిందువులదేనని వ్యాఖ్యానించింది. క్రైస్తవులకు అమెరికా, యూరప్ దేశాలు, బౌద్ధులకు చైనా, జపాన్, శ్రీలంక, మయన్మార్ వంటి దేశాలుండగా, హిందువులకు భారత్ మినహా మరో దేశం లేదని పేర్కొంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌పైనా శివసేన మండిపడింది. కేంద్రంలో హిందుత్వ అనుకూల ప్రభుత్వమున్నా అయోధ్యలో రామాలయ నిర్మాణం, కశ్మీరీ పండిట్ల వ్యవహారం ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రామ మందిర నిర్మాణాన్ని చేపట్టకుండా న్యాయస్ధానానికి వదిలివేశారని ఆరోపించింది. జాతీయ గీతం ఆలపించే సమయంలో లేచి నిలబడాలన్న ఆర్ఎస్ఎస్ విధానాన్ని కొందరు వ్యతిరేకిస్తున్న తీరును ప్రస్తావిస్తూ దీనిపై కేంద్రం వైఖరి ఏమిటని సామ్నా సంపాదకీయంలో శివసేన నిలదీసింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో, మహారాష్ర్టలో బీజేపీ సర్కార్‌లో భాగస్వామిగా ఉన్న శివసేన ఇటీవల పలు అంశాలపై మోదీ సర్కార్‌తో విభేదిస్తోంది. -
మీ కప్పు టీ వల్ల.. ఏడుగురు అమరులయ్యారు!
ముంబై: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్‌ను నమ్మవద్దని తాము గతంలోనే ప్రధాని మోదీని హెచ్చరించామని గుర్తుచేసింది. ఇప్పటికైనా మోదీ ప్రపంచాన్ని ఏకం చేసే పనిని మాని.. భారత్‌పై దృష్టి పెట్టాలని ఘాటుగా సూచించింది. మన సరిహద్దులు సురక్షితంగా లేవని తాజా ఉగ్రవాద దాడి స్పష్టం చేస్తున్నదని, దేశ అంతర్గత భద్రత ప్రమాదంలో ఉన్నా సోషల్ మీడియాలో అమరులకు నివాళులర్పించడం మినహా జాతీయ స్థాయిలో ఎలాంటి పని జరుగడం లేదంటూ శివసేన తన అధికార పత్రిక 'సామ్నా'లో తీవ్రపదజాలంతో ధ్వజమెత్తింది. ' నవాజ్ షరీఫ్‌తో కప్పు చాయ్ పంచుకున్నందుకు ప్రతిఫలంగా ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. మన సరిహద్దులు సురక్షితంగా లేవని, మన అంతర్గత భద్రత విధ్వంసపూరితంగా ఉందని తాజా ఘటన రుజువు చేస్తోంది. ఆరుగురు ఉగ్రవాదులతో భారత ఆత్మగౌరవాన్ని పాకిస్థాన్ తుత్తునియలు చేసింది' అని శివసేన మండిపడింది. గతవారం లాహోర్‌లో నవాజ్ షరీఫ్ ఇంటికి ప్రధాని మోదీ అతిథిగా వెళ్లినా.. పాకిస్థాన్ మరోసారి మనల్ని మోసం చేసిందని, పాకిస్థాన్ నిజంగా భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటే.. వెంటనే జెషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్‌ను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేసింది.