Short term gains
-
స్వల్పలాభాలతో సరి...
♦ వరుసగా ఐదో రోజూ లాభాలే ♦ బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ ♦ 13 పాయింట్ల లాభంతో 24,659 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఒడిదుడుకులమయంగా సాగిన మంగళవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసింది. దీంతో స్టాక్ సూచీలు వరుసగా ఐదో రోజూ లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 13 పాయింట్లు లాభపడి 24,659 పాయింట్లు వద్ద, నిఫ్టీ ఎలాంటి మార్పు లేకుండా 7,485 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఆర్థిక, ఐటీ, ఇన్ఫ్రా షేర్లు నష్టపోగా, లోహ, ఫార్మా, రియల్టీ షేర్లు లాభపడ్డాయి. చైనా ఎగుమతుల క్షీణత కొనసాగుతోందని గణాంకాలు వెలువడిన నేపథ్యంలో మన స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైనా, గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. చివరకు స్వల్పంగా లాభపడింది. లోహ షేర్ల వెలుగులు... అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ధరలు పెరగడంతో లోహ షేర్లు బాగా పెరిగాయి. సెయిల్ 8.3 శాతం, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 4.6 శాతం, నేషనల్ అల్యూమినియం కంపెనీ 4.4 శాతం, హిందాల్కో ఇండస్ట్రీస్ 4.3 శాతం,హిందూస్తాన్ కాపర్ 2 శాతం, హిందూస్తాన్ జింక్, టాటా స్టీల్ షేర్లు 1 శాతం వరకూ పెరిగాయి. గత వారంలో 8-20 శాతం లాభపడిన బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. 30 సెన్సెక్స్ షేర్లలో 16 షేర్లు లాభాల్లో ముగిశాయి. గెయిల్ 2.4 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం, లుపిన్ 2 శాతం చొప్పున పెరిగాయి. -
ఊగిసలాటలో మార్కెట్
సెన్సెక్స్‌కు 54 పాయింట్లు, నిఫ్టీకి 18 పాయింట్లు లాభం స్టాక్ మార్కెట్ శుక్రవారం షార్ట్ కవరింగ్ కారణంగా స్వల్పలాభాలతో గట్టెక్కింది. ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి, మే వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి(మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెల్లడయ్యాయి) నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్రమైన ఊగిసలాటకు గురయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 26,425 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 7,983 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, విద్యుత్, రిఫైనరీ, వాహన షేర్లలో కొనుగోళ్లు జరగగా, ఐటీ, టెక్నాలజీ, మెటల్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు, కీలక గణాంకాల వెల్లడి కారణంగా ఇన్వెస్టర్లు జాగరూకతగా వ్యవహరించడం మార్కెట్ లాభాలకు కళ్లెం వేశాయని నిపుణులంటున్నారు. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,205 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.12,623 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,96,271 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టరు లరూ.671 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.706 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. -
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు స్వల్ప లాభాలు
న్యూఢిల్లీ: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 2014-15 మార్చితో ముగిసిన త్రైమాసికంలో స్వల్ప లాభాలను ఆర్జించింది. 2013-14 ఇదే క్వార్టర్‌తో పోల్చితే నికర లాభం స్వల్పంగా 2.2 శాతం పెరిగి, రూ.378 కోట్లుగా నమోదయ్యింది. ఇక ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.2,478 కోట్ల నుంచి రూ.2,861కి పెరిగింది. కాగా మొత్తం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.1,317 కోట్ల నుంచి రూ.1,386కు ఎగసింది. ఆదాయం రూ.9,335 కోట్ల నుంచి రూ.10,799 కోట్లకు చేసింది. నికర వడ్డీ మార్జిన్ 2.40 శాతం నుంచి 2.47 శాతానికి పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 22 శాతం పెరిగి రూ.650 కోట్లకు చేరింది. మొత్తం రుణ పంపిణీ 23 శాతం వృద్ధితో రూ.9,938 కోట్లకు ఎగసింది. వ్యక్తిగత రుణ పంపిణీ 24% వృద్ధితో రూ.9,550 కోట్లుగా నమోదయ్యింది. కాగా ఫలితాలు మంచి ఉత్సాహాన్ని ఇచ్చినట్లు సంస్థ మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీతా శర్మ పేర్కొన్నారు. ప్రత్యేకించి రుణ పంపిణీలో వృద్ధి, బకాయిల వసూళ్లు సానుకూల పరిణామాలన్నారు. 2015- 16లో కూడా ఇదే విధమైన ప్రోత్సాహకర పరిస్థితి ఉంటుందన్న విశ్వాసాన్ని మేనేజింగ్ డెరైక్టర్ వ్యక్తం చేశారు.