siddaiah
-
చీప్ లిక్కర్ సిద్దయ్య! వీడిన గుట్టు.. టీడీపీకి చెంపపెట్టు!
సాక్షి,పెనుకొండ: మండలంలోని శెట్టిపల్లికి చెందిన సిద్దయ్య టీడీపీ మండల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థ సారథికి, ఆయన అల్లుడు శశిభూషణ్‌కు నమ్మిన బంటు. పైకి రాజకీయ నేతగా కనిపించే సిద్దయ్య... చేసేదంతా అక్రమ దందానే. ఏళ్లుగా కర్ణాటక మద్యం అక్రమంగా జిల్లాకు తెచ్చి సొమ్ముచేసుకుంటున్నట్లు పచ్చ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాజీ ఎమ్మెల్యే, అతని అల్లుడి పేర్లు చెప్పి మద్యం దందా జోరుగా సాగించాడు. అనంతపురంలో కాపురం..శెట్టిపల్లి నుంచి దందా.. అక్రమార్జనే పరమావధిగా పనిచేసిన సిద్దయ్య టీడీపీ హయాంలో అడ్డంగా సంపాదించాడు. అధికారులు ఎవరైనా దృష్టి సారిస్తే బీకే పేరు చెప్పి తప్పించుకునేవాడు. కానీ రాష్ర్టంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సిద్దయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. పోలీసులకు భయపడి మకాం అనంతపురానికి మార్చాడు. అక్కడి నుంచే తన స్వగ్రామం శెట్టిపల్లిలో వ్యవహారాలు నడిపేవాడు. మూడేళ్లుగా కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెస్తూ గ్రామీణుల నుంచి అందినకాడికి దండుకున్నాడు. పగలంతా అనంతపురంలో ఖద్దరు దుస్తుల్లో కనిపించే సిద్దయ్య, రాత్రి కాగానే జిల్లా సరిహద్దులోని కర్ణాటకలోని మద్యం షాపుల్లో సరుకు కొని తన స్వగ్రామానికి తరలించేవాడు. అతను స్థానికంగా కనిపించపోవడంతో పోలీసులూ పెద్దగా దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఆధిపత్య పోరుతోనే... టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే సిద్దయ్య పోలీసులకు దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎవరినీ సంప్రదించకుండానే సిద్దయ్యను పార్టీ మండల కన్వీనర్‌గా ప్రకటించారు. దీంతో మండల కన్వీనర్ రేసులో ఉన్న నేతలంతా రగిలిపోయారు. కర్ణాటక మద్యం తెచ్చుకుని అమ్ముకునే సిద్దయ్యకు మండల కన్వీనర్ పోస్టు ఇవ్వడం ఏమిటని బీకేని కొందరు ప్రశ్నించారు. ఆయన పట్టించుకోకపోవడంతో పలువురు నేతలు టీడీపీకే చెందిన ఓ నాయకురాలి వర్గంలో చేరిపోయారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలనూ ఎవరికి వారు నిర్వహిస్తూ ఆధిపత్య పోరు సాగించారు. పలు కార్యక్రమాల్లో సిద్దయ్యపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఉప్పందించిన ‘పచ్చ’ నేతలు.. సిద్దయ్య అక్రమ మద్యం దందా చేయడం...అలాంటి వ్యక్తికి బీకే సహకరిస్తూ మండల కన్వీనర్ పదవి ఇవ్వడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే సిద్దయ్య కర్ణాటక మద్యం దందాపై పోలీసులకు పలుమార్లు ఉప్పందించినట్లు తెలుస్తోంది. అయితే మద్యం దందాలో ఆరితేరిపోయిన సిద్దయ్య... ఇన్నాళ్లూ చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సిద్దయ్య తన అనుచరులతో కలిసి కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా తీసుకువస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో బీకే వ్యతిరేక వర్గంలోని వారు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రాత్రి 12 గంటల ప్రాంతంలో మరవపల్లి సమీపంలో సిద్దయ్యతో పాటు అతని అనుచరులు పెనుకొండకు చెందిన దూదేకుల బాషా, ధర్మవరానికి చెందిన బిర్రు ప్రశాంత్‌కుమార్, అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన కృష్ణారెడ్డిని పట్టుకున్నారు. మద్యం బాక్సులతో పాటు కారు, ద్విచక్ర వాహనం స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు కూడా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తమకు వచ్చిన పక్కా సమాచారంతోనే దాడి చేసినట్లు పేర్కొనడం విశేషం. కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలే టార్గెట్.. తన అనుచరులతో కలిసి కర్ణాటక అక్రమ మద్యం దందాను అత్యంత గుట్టుగా నిర్వహిస్తున్న సిద్దయ్య... కొత్తచెరువు–పుట్టపర్తి మండలాల్లోని పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక మద్యాన్ని శెట్టిపల్లికి తీసుకువచ్చిన వెంటనే తన అనుచరులతో కలిసి గ్రామాల్లో... తమకు అనుకూలంగా ఉన్న మద్యం వ్యాపారులకు చేరవేసే వాడని తెలిసింది. తాను పెనుకొండ మండల టీడీపీ కన్వీనర్ కావడం వల్ల ఆ మండలంలో వ్యాపారం చేస్తే తెలిసిపోతుందని భావించే...పక్కన ఉన్న కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా అనంతపురం నుంచే ఫోన్ ద్వారా నడిపేవాడని తెలుస్తోంది. సంబరాల్లో మరో వర్గం.. మద్యం అక్రమ రవాణా చేస్తూ సిద్దయ్య పట్టుబడటంతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వ్యతిరేక వర్గం సంబరాలు చేసుకుంటోంది. ఆ వర్గానికి చెందిన పలువురు నేతలు స్థానిక హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో సమావేశమై ఆనందోత్సాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫోన్లలోనూ ‘సిద్దయ్య...దొరికిపోయాడు’ అని సంతోషంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తమ నాయకురాలికి ఫోన్లో తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. (చదవండి: సెల్ రోగం..అధికమవుతున్న టెక్స్ట్ నెక్ సిండ్రోమ్) -
ఎస్ఐ సిద్ధయ్య కుటుంబానికి అందని పరిహారం!
సాక్షి, ఆత్మకూరు: సిమీ ఉగ్రవాద కాల్పుల్లో వీరమరణం పొందిన యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలానికి చెందిన ఎస్ఐ డి. సిద్ధయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందలేదు. దీంతో ఆ పోలీసు అధికారి కుటుంబం ఇబ్బందులు పడుతోంది. మరణించి 5సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. 4 ఏప్రిల్ 2015లో సిమీ ఉగ్రవాదులు సూర్యాపేట నుంచి తçప్పించుకుని, తిరుమలగిరి మీదుగా మోత్కూరు మండలం జానకీపురంలోకి చొరబడ్డారు. అందులో భాగంగా ఆత్మకూరు(ఎం)కు చెందిన ఎస్ఐ డి. సిద్ధయ్యతో పాటు కానిస్టేబుల్ నాగరాజు ఉగ్రవాదులకు ఎదురుపడ్డారు. ఇరువురి మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఉగ్రవాదులిద్దరూ మరణించారు. అంతేకాకుడా కానిస్టేబుల్ నాగరాజు అక్కడికక్కడే మరణించాడు. ఎస్ఐ డి. సిద్ధయ్య తీవ్రంగా గాయపడి ఎల్బీ నగర్ కామినేనిలో చికిత్స పొందుతూ మరణించారు. (తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు) పరిహారం అంతంతే.. ఎస్ఐ డి. సిద్ధయ్య సిమీ ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందడంతో అప్పట్లో ప్రభుత్వం సిద్దయ్య కుటుంబానికి రూ. 40లక్షలతో పాటు ఇంటి స్థలం, సిద్ధయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన వాటిలో సిద్ధయ్య కుటుంబా నికి రూ.40లక్షలు మాత్రమే అందాయి. ఇంటి స్థలం ఇంత వరకు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేదు. ఇంటి స్థలం ఉద్యోగం చేసిన చోట లేదా పుట్టిన గ్రామంలో ఇంటి స్థలం ఇస్తామంటే హైదరాబాద్‌లోనే ఇవ్వాలని సిద్దయ్య భార్య ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం ఒప్పుకోవట్లేదని సమాచారం. సీఎం అపాయింట్మెంట్ కోసం.. ప్రభుత్వం పరిహారం ప్రకటించి 5సంవత్సరాలు అవుతుంది. రూ. 40లక్షలు మినహా మిగతా హామీలు అమలు కాలేదు. దీంతో తన బాధను చెప్పుకోవడానికి సిద్ధయ్య భార్య ధరణీష సీఎం కేసీఆర్‌ను కలవడానికి ప్రయత్నం చేసింది. అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా తన గోడును సీఎం కేసీఆర్ కు వినిపించడానికి అవకాశం ఇవ్వాలని ధరణీష కోరుతోంది. కల్నల్ సంతోష్ బాబు తరహాలో న్యాయం చేయాలి.. చైనా సరిహద్దు గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసిన విధంగా.. తమకు న్యా యం చేయాలని వీరమర ణం పొందిన సిద్ధ య్య భార్య ధరణీష కోరుతోంది. -
శౌర్య తెలంగాణ
కేంద్రం ప్రకటించిన పతకాల్లో రాష్ట్రం రికార్డు కానిస్టేబుల్ శ్రీనివాసులుకు ప్రతిష్టాత్మకమైన శౌర్యచక్ర ► రాష్ట్రపతి శౌర్య పోలీసు పతకాలు 2, ‘శౌర్య’ పతకాలు 24 ► ‘అత్యుత్తమ’ పతకాలు 11, రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం 1 ► నల్లగొండకు చెందిన ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజుకు మరణానంతరం అవార్డులు ► దేశవ్యాప్తంగా 170 మందికి ‘శౌర్య’ మెడల్ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే అవార్డుల్లో అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించే అధికారులకు ఇచ్చే శౌర్య పతకాల్లో అత్యధికం కైవసం చేసుకుంది. తెలంగాణ నిఘా విభాగానికి చెందిన కానిస్టేబుల్ కె.శ్రీనివాసులుకు ప్రతిష్టాత్మకమైన శౌర్యచక్ర పతకం లభించింది. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించే భద్రతా దళాల సిబ్బందికి కేంద్రం ఈ అవార్డు ఇస్తుంది. అత్యంత అరుదుగా మాత్రమే పోలీసు విభాగానికి ఇస్తుంది. కేంద్రం ఆదివారం రాష్ట్రపతి పోలీసు పతకాలతోపాటు అశోక్చక్ర, శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. దేశం మొత్తమ్మీద ఒకరికి అశోక్చక్ర లభించగా.. శౌర్యచక్ర పతకాలు 14 మందిని వరించాయి. అందులో శ్రీనివాసులు ఒక్కరే పోలీసు విభాగానికి చెందిన వారు కావడం విశేషం. మిగిలిన 13 మంది భద్రతా దళానికి చెందిన వారే. రాష్ట్ర చరిత్రలో (ఉమ్మడి ఏపీ సహా) కానిస్టేబుల్ స్థాయి వ్యక్తికి ఇంతటి మహోన్నత పథకం లభించిడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో ఉగ్రవాది ఆలం జెబ్ అఫ్రిదిని పట్టుకునేందుకు శ్రీనివాసులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఉగ్రవాది కత్తితో పొడవడంతో ప్రాణపాయస్థితిలో బయటపడ్డాడు. ఇక మొత్తంగా రాష్ట్రానికి రాష్ర్టపతి శౌర్య పోలీస్ పతకాలు 2, శౌర్య పోలీసు పతకాలు 24, రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు 1, అత్యుత్తమ సేవా పతకాలు 11 లభించాయి. నల్లగొండ జిల్లాకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ దూదేకుల సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజుకు మరణానంతరం రాష్ర్టపతి శౌర్య పోలీస్ పతకాలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా మొత్తం 170 మంది అధికారులకు రాష్ట్రపతి, పోలీసు శౌర్య పతకాలను ప్రకటించగా.. అందులో 26 పతకాలు తెలంగాణ పోలీసు విభాగానికే వచ్చాయి. అవార్డుల చరిత్రతో ఓ రాష్ట్ర పోలీసు విభాగానికి ఒకేసారి ఇన్ని రావడం రికార్డు అని అధికారులు పేర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా ఏడుగురు అధికారులు రాష్ట్రపతి పోలీసు శౌర్య పురస్కారానికి ఎంపిక కాగా అందులో రెండు పురస్కారాలు రాష్ట్రానికే వచ్చాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు 2, అత్యుత్తమ సేవా పతకాలు 14 లభించాయి. శౌర్యచక్ర 1. కె.శ్రీనివాసులు (కానిస్టేబుల్, నిఘా విభాగం) రాష్ట్రపతి శౌర్య పోలీస్ పతకాలు 1. దూదేకుల సిద్దయ్య (సబ్ ఇన్స్పెక్టర్, నల్లగొండ) 2. నాగరాజు (కానిస్టేబుల్, నల్లగొండ) రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం 1 రాజీవ్ రతన్, డిజి, ఫైర్ సర్వీసెస్ శౌర్య పోలీస్ పతకాలు 1.ఎం. చంద్రశేఖర్, ఏసీపీ 2.కె. రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ 3.సయ్యద్ అబ్దుల్ కరీం, హెడ్ కానిస్టేబుల్ 4.మహ్మద్ ముజీబ్, హెడ్ కానిస్టేబుల్ 5.మహ్మద్ తాజ్ పాషా, కానిస్టేబుల్ 6.ఎస్.రాజవర్ధన రెడ్డి, కానిస్టేబుల్ 7.మహ్మద్ ముషరఫ్ బాబా, కానిస్టేబుల్ 8.డాక్టర్ టి.ప్రభాకర రావు, ఎస్పీ 9.ఎన్.అనిల్ కుమార్, కానిస్టేబుల్ 10.వేమాద్రి రమేశ్, కానిస్టేబుల్ 11.కొనతం మధుసూధన్, కానిస్టేబుల్ 12.తోడేటి శివ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ 13.ముత్తినేని శ్రీను, కానిస్టేబుల్ 14.అన్నారెడ్డి చిన్న బాల గంగిరెడ్డి, ఇన్స్పెక్టర్ 15.ఎల్. జానకిరాం, కానిస్టేబుల్ 16.రాజేశ్ కుమార్, ఎస్పీ 17.మాద దయానందరెడ్డి, డీఎస్పీ 18.సిహెచ్ ఆర్వి.ఫణీందర్, ఇన్స్పెక్టర్ 19.జి.సత్యనారాయణ, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ 20.సోనిలాల్ అమృత్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ 21.సయ్యద్ సర్వర్ పాషా, హెడ్ కానిస్టేబుల్ 22.గొలనకొండ నరేందర్, కానిస్టేబుల్ 23.మహ్మద్ ఖాదిర్, కానిస్టేబుల్ 24. వేముల భాస్కర్, ఇన్స్పెక్టర్ అత్యుత్తమ సేవా పోలీస్ పతకాలు 1.వై. శ్రీనివాస రావు, కమాండెంట్, 7వ బెటాలియన్, టీఎస్ఎస్పి, నిజామాబాద్ 2.చింతకుంటల నరోత్తమ్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ, మెదక్ 3.కృష్ణస్వామి నటరాజన్ బాలాజీ, అసిస్టెంట్ కమాండెంట్, ఖమ్మం 4.పి.మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ, హైదరాబాద్ 5.షేక్ మహ్మద్ నిజాముద్దీన్, ఏసీపీ, హైదరాబాద్ 6. ఎ.బాలకోటి, డీఎస్పీ, మహబూబ్‌నగర్ 7.ఎ.వి.సత్యనారాయణ, ఇన్స్పెక్టర్, హైదరాబాద్ 8.డి.వీరంగయ్య, ఏఎస్ఐ, హైదరాబాద్ 9.వి.పాండురంగారావు, ఏఎస్ఐ, హైదరాబాద్ 10.మహ్మద్ అబ్దుల్ నయీమ్,హెడ్ కానిస్టేబుల్, హైదరాబాద్ 11. డి.బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్, హైదరాబాద్ పోలీసు శాఖకు అభినందనలు: సీఎం తెలంగాణ పోలీస్ యంత్రాంగం కనబరిచిన ప్రతిభను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ పోలీసు పతకాల్లో తెలంగాణ పోలీసులు అత్యధిక పతకాలు సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసు శాఖకు మనస్ఫూర్తిగా అభినందించారు. సంఘ వ్యతిరేక శక్తుల ఆటకట్టించటంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ, ఉగ్రవాదాన్ని అణచివేయడంలో తెలంగాణ పోలీసులు పోషిస్తున్న పాత్ర పట్ల జాతి యావత్తూ గర్విస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసుల కృషిని గుర్తించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అవార్డులు పొందిన పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు. గత రెండేళ్లలో ఉగ్రవాద నిర్మూలన కోసం రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీసుకున్న చర్యలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయన్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టిన 10 మందికి పతకాలు.. గతేడాది నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సిమీ ఉగ్రవాదులను జిల్లా పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల పోరాట పటిమను గుర్తించిన కేంద్రం రాష్ట్రపతి అవార్డులకు ఎంపిక చేసింది. అప్పటి జిల్లా ఎస్పీతో పాటు ఒక ఇన్స్పెక్టర్, ఆరుగురు కానిస్టేబుళ్లకు, వీర మరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజులకు ఈ అవార్డులను ప్రకటించింది. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
తాడ్వాయి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం కొండాపూర్‌లో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సిద్దయ్య(48) తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఎక్కువవడంతో.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నీరు మున్నీరైన సిద్ధయ్య భార్య ధరణి
-
కన్నీరు మున్నీరైన సిద్ధయ్య భార్య ధరణి
జడ్చర్ల : నల్గొండ జిల్లా జానకిపురంలో జరిగిన ఎన్ కౌంటర్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఆత్మకూరు (ఎం) ఎస్ఐ సిద్ధయ్య అంతిమ యాత్ర ప్రారంభమైంది. భర్త మృతదేహాన్ని చూసి సిద్ధయ్య సతీమణి ధరణి కన్నీరు మున్నీరయ్యారు. కామినేని ఆస్పత్రి నుంచి బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయిన ఆమె భర్త అంత్యక్రియలకు జడ్చర్ల వచ్చారు. భర్త మృతదేహాన్ని చూసి ధరణి భోరున విలపించారు. ఆమె నాలుగు రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు సిద్ధయ్యను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. అలాగే అధికారులు, రాజకీయ నేతలు సిద్ధయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మరోవైపు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ.. సిద్ధయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్నట్లు సమాచారం. -
11గంటలకు సిద్ధయ్య అంతిమ యాత్ర
మహబూబ్ నగర్: ఉగ్రవాదుల తూటాలను ఎదుర్కొని మృత్యువుతో పోరాడుతూ అమరుడయిన నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (మం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య (29) అంతిమ యాత్ర బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు జడ్చర్ల దర్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం 3 గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. -
చూపు తగ్గిందని ఆస్పత్రికి వెళితే.. రెండు కళ్లూ పోగొట్టారు
ఆరోగ్యశ్రీ ద్వారా రూ.70 వేల చెల్లింపు కవాడిగూడలో బాధితుడి ఆందోళన ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన కవాడిగూడ: కంటి చూపు మందగించిందని, వైద్యం కోసం ఆస్పత్రికి వెళితే వైద్యులు ఉన్న చూపును కూడా పోగొట్టి పూర్తి గుడ్డివాడిని చేశారు. ఈ సంఘటన వెస్ట్ మారేడ్‌పల్లిలోని పుష్పగిరి ఐ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు న్యాయపోరాటానికి దిగుతున్నాడు. వివరాల్లోకి వెళితే... కవాడిగూడకు చెందిన అవనిగంటి సిద్ధయ్య(40) డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా కంటి చూపు తగ్గుతుండటంతో వెస్ట్ మారేడ్‌పల్లిలోని పుష్పగిరి ఐ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేసి కంటి పొరలను తొలగిస్తామని వైద్యులు హామీ ఇచ్చారు. దీంతో సిద్ధయ్యలో గత ఏడాది జనవరి 31నలో ఆస్పత్రిలో చేరాడు. ఐదు రోజుల తర్వాత వైద్యులు డాక్టర్ మురళీధర్ ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ అనంతరం తన కుడి కన్ను కనిపించడం లేదని సిద్ధయ్య వైద్యుల వద్ద వాపోయాడు. అయితే, కుడి కన్ను చూపు తిరిగి రావాలంటే ఎడమ కంటికి కూడా ఆపరేషన్ చేయాలని, లేకుండే చూపు పోతుందని భయపెట్టారు. దీంతో బాధితుడు ఎడమ కంటి ఆపరేషన్‌కు సిద్ధవగా.. గత ఏడాది జూలైలో డాక్టర్ మురళీధరే ఆపరేషన్ చేశారు. అయితే, ఇప్పుడు సిద్ధయ్య రెండు కళ్ల చూపూ పోయింది. రెండు కళ్లకు శస్త్ర చికిత్స చేసినందుకు ఆస్పత్రికి రూ.70 వేలు ఆరోగ్యశ్రీ నుంచి మంజూరయ్యాయి. అంతా బాగుందని రిపోర్టు.. ఇదిలా ఉండగా సిద్ధయ్యకు ఆపరేషన్ చేసిన అనంతరం డిశ్చార్జ్ చేసిన రిపోర్టులో మాత్రం ‘స్టేటస్ గుడ్’ అని ఉండడం గమనర్హం. అంతే కాకుండా మొదట తన కుడి కన్నుకు ఆపరేషన్ చేశారని, ఆ తర్వాతే ఎడమ కంటికి చేశారని సిద్ధయ్య చెబుతున్నాడు. కానీ, రిపోర్టులో మాత్రం ముందు ఎడమ కన్నుకు ఆపరేషన్ చేసినట్టుగా, రెండో సారి మాత్రమే కుడి కంటికి చేసినట్టు ఉంది. ఈ ఆస్పత్రిలో తనతో పాటు ఆపరేషన్ చేయించుకున్నవారి పరిస్థితి కూడా తనలాగే ఉందని ఈ సందర్భంగా సిద్ధయ్య వాపోయాడు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఆస్పత్రి వర్గాల నుంచి ఈ విషయంపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా సంబంధిత అధికారులు అందుబాటులోకి రాలేదు. -
ఆ స్థలాలను వదిలేది లేదు
దర్శి : తమ ప్రాణాలు పోయినా సరే స్థలాలను వదిలేది లేదని తహశీల్దార్ కార్యాలయంలో రాజంపల్లికి చెందిన దళితులు మంగళవారం తహశీల్దార్ సిద్ధయ్య వద్ద ఆవేదన వెళ్లగక్కారు. ‘గ్రామ సర్వే నెంబర్ 227లో 4.73 ఎకరాల భూమిలో 97 మందికి 3 సెంట్ల చొప్పున 1998 నవంబర్ 4న తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చినా పొజిషన్ చూపలేదని, 2011లో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం స్థలాలను రివైజ్ చేసి తమకు మరోసారి రెండు సెంట్ల చొప్పున స్థలాలను కేటాయించారని, దీనిపై హైకోర్టు కూడా తమకు అనుకూలంగానే స్పందించిందని, గతంలో ఆ స్థలాలను ఆక్రమించిన రైతులు ఆగ్రహించి తమను మూడు నెలల పాటు గ్రామం నుంచి బహిష్కరించారని, ఆ రెండు సెంట్ల స్థలానికైనా పట్టాలిచ్చి పొజిషన్ చూపించాలని’ సోమవారం ఒంగోలులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కలెక్టర్‌కు అందజేసిన అర్జీలో తెలిపారు. ఆ విషయాన్ని పత్రికల్లో చూసిన ఆ గ్రామ టీడీపీ నాయకులు వెంటనే ‘ఈ స్థలం ప్రభుత్వానిది, ఆక్రమించిన వారు శిక్షార్హులు’ అని ఓ బోర్డును తలారీతో పాతించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం ఉదయం దళితులు ఆ స్థలాల వద్ద ఆందోళనకు దిగారు. తమకు పంపిణీ చేసిన స్థలంలో పొజిషన్ చూపకపోగా 16 ఏళ్ల నుంచి పెట్టని బోర్డు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చిన తెల్లవారుజామున 8గంటల్లోపే పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఆ బోర్డును పీకేశారు. అనంతరం 97 మంది మండల కార్యాలయానికి వెళ్లి తహశీల్దార్‌ను ప్రశ్నించారు. ఈ సర్వే నెంబర్లోనే టీడీపీ నాయకుడు వరిగడ్డి వాములు వేసుకొని అరెకరా ఆక్రమించుకున్నా బోర్డు ందుకు పెట్టలేదన్నారు. సుమారు 570 ఎకరాలు అన్యాక్రాంతమైనా నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దళితులకు ఒక న్యాయం, టీడీపీ నాయకులకు మరో న్యాయమా అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ దళితులతో మాట్లాడుతూ ఆ స్థలాల్లో గుడిసెలు వేయవద్దని, రెండు రోజుల్లో తాము వచ్చి పరిశీలించి అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. తహశీల్దార్ వద్ద దళితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్న సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అక్కడే కూర్చున్నా చాలాసేపు నోరు మెదపకపోవడం గమనార్హం. -
పీఆర్సీ కోసం... కేటీపీఎస్ ఉద్యోగుల సమ్మె
పాల్వంచ, న్యూస్‌లైన్ : విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటనలో జాప్యాన్ని నిరసిస్తూ కేటీపీఎస్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. గత 21నే పీఆర్సీకి సంబంధించిన జీవో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆలస్యం అవుతోంది. అయితే గతంలోనే విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధం కాగా.. రాష్ట్ర విభజనతో నిమిత్తం లేకుండా మే 21న జీవో విడుదల చేస్తామని ఏపీ జెన్కో ఎండీ హామీ ఇవ్వడంతో వారి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఆ హామీ నెరవేరేలా లేకపోవడంతో సమ్మెబాట పట్టారు. పలు సంఘాల నాయకులు ఏకమై కేటీపీఎస్ పరిధిలోని ఓఅండ్ఎం 5, 6 దశల కర్మాగారాల ఎదుట ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచే ఆందోళనకు దిగారు.మొదటి షిఫ్ట్ కార్మికులు విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం చీఫ్ ఇంజనీర్ సిద్దయ్య ధర్నా వద్దకు వచ్చి సమ్మెతో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందని, తక్షణం విధుల్లోకి రావాలని, మిగితా కార్మికులను లోనికి అనుమతించాలని నాయకులను కోరారు. అయితే వారు దానికి అంగీకరించకుండా పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఈపీఎఫ్‌ను జీపీఎఫ్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎస్పీఎఫ్ కమాండెంట్జమీల్పాషా ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని గేట్లు తెరవడంతో పాటు అక్కడ ఆందోళన చేయవద్దని, పక్కకు వెళ్లాలని చెప్పడంతో ఉద్యోగులకు - పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సీఈ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సిద్దయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉద్యోగ సంఘాల మధ్య ఘర్షణ... సమ్మె విరమించి విధులకు రావాలని ఎస్ఈలు ఆనందం, బిచ్చన్న కోరడంతో ఆందోళనకు దూరంగా ఉన్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు టి.ప్రవీణ్ కుమార్, వెంకటేషం, కట్టా మల్లికార్జున్ త దితరులు విధులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో వారిని జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సమయంలో వారి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రాత్రి షిఫ్ట్ సిబ్బందితోనే యూనిట్ల నిర్వహణ శనివారం రాత్రి విధులకు వెళ్లిన ఉద్యోగులు, కార్మికులు ఉదయం డ్యూటీ దిగాల్సి ఉండగా అధికారులు ఆదివారం కూడా వారితోనే పనులు చేయించారు. సిబ్బందికి అవసరమైన టిఫిన్, భోజనం, ఇతర సౌకర్యాలను అక్కడే కల్పించారు. కొన్ని మార్గాల ద్వారా కొంత మేరకు కార్మికులను లోనికి తీసుకెళ్లి యూనిట్లు పడిపోకుండా చర్య తీసుకోగలిగారు. సీఈలు, ఎస్ఈలు కర్మాగారాల్లోనే ఉండి విద్యుదుత్పత్తిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. సమ్మెకు 1104 యూనియన్ నాయకులు కె.కోటేశ్వరరావు, సునీల్ రెడ్డి, 327 నాయకులు పి.వి.కోటేశ్వరరావు, 1535 నాయకులు లీవెన్, అంబాల శ్రీను, హెచ్ 67 నాయకులు ఎం.రమేష్, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఏఈస్ అసోసియేషన్ నాయకులు అన్వర్‌బాషా తదితరులు నాయకత్వం వహించారు. విద్యుదుత్పత్తికి భారీగా గండి.. పాల్వంచ : రాష్ట్రానికి వెలుగులు పంచే కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో ఉద్యోగుల మెరుపు సమ్మె కారణంగా భారీగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీపీఎస్ ఓఅండ్ఎం, 5, 6 దశల్లోని మొత్తం 11 యూనిట్లలో 1,720 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుండగా ఆదివారం రాత్రికి సమ్మె కారణంగా 515 మెగావాట్లకు పడిపోయింది. ఇది ఇలానే కొనసాగితే మరో 24 గంటల్లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి నిలిచి పోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కర్మాగారంలో పనిచేసే సిబ్బంది లేక విద్యుదుత్పత్తి క్రమేణా పడిపోతోంది. 6వ దశలోని 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11వ యూనిట్ తొలుత ట్రిప్ కావడంతో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 5వ దశలో 9వ యూనిట్లో 250 మెగావాట్లకు గాను 95 మెగావాట్లు, 10వ యూనిట్లో 250 మెగావా ట్లకు గాను 120 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి వస్తోంది. ఓఅండ్ఎం పరిధిలో మొత్తం 720 మెగావాట్ల సామర్థ్యం ఉండగా అందులో గత శనివారం 8వ యూనిట్‌లోని 120 మెగావాట్లను వార్షిక మరమ్మతుల కోసం షట్‌డౌన్ చేశారు. దీంతో ప్రస్తుతం 600 మెగావాట్లు ఉత్పత్తి అవుతుండగా సమ్మె కారణంగా ఇక్కడ బొగ్గు లెవల్ పడిపోవడంతో 375 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే అవుతున్నట్లు అధికారులు తెలి పారు. అయితే సమ్మె ఇలానే కొనసాగితే పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.