sidha reddy
-
‘శంకుస్థాపన చేసినా.. తట్టెడు మట్టి కూడా తీయలేదు’
సాక్షి, అనంతపురం : తెలుగు ప్రజల ఐక్యత కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేసిన ఘనత రాయలసీమ ప్రజలదని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కోసం సమైక్యాంధ్ర ఉద్యమాలు జరిగాయని, చరిత్ర తెలిసి కూడా చంద్రబాబు తప్పులు చేశారని విమర్శించారు. మూడు పంటలు పండే భూముల్లో అమరావతి రాజధాని నిర్మించడం మంచిది కాదన్నారు. అవినీతి పరుడైన చంద్రబాబు పరిపాలనలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు చంద్రబాబు మూడుసార్లు శంకుస్థాపన చేసినా..తట్టెడు మట్టి తీయలేదని ఎద్దేవా చేశారు. బినామీ ఆస్తుల కోసమే చంద్రబాబు ఆరాటం, పోరాటమని విమర్శించారు. రాయలసీమ కరవు పై చంద్రబాబు, అయన కుటుంబ సభ్యులు ఎందుకు జోలె పట్టలేదని, ఆ సమయంలో రాయలసీమ టీడీపీ నేతలు చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. (మూడు రాజధానులకు మద్దతుగా అనంతలో భారీ ర్యాలీ) దేశమంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన వైపు చూస్తోందని, రాష్ట్ర సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశంసించారు. రాజధాని కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే స్థితిలో ఏపీ లేదని,అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రానికి అత్యవసరమని అన్నారు. వైఎస్సార్ కృషి వల్ల రాయలసీమకు కృష్ణా జలాలు వచ్చాయన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు, సమాంతర కాలువ ద్వారా పది వేల క్యూసెక్కుల నీరు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారని, జీఎన్ రావు, బోస్టన్,శివరామకృష్ణయ్య కమిటీలు అధికార వికేంద్రీకరణకు సిఫార్సు చేశాయని గుర్తు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాయలసీమకు వ్యతిరేకంగా జేసీ, ఇతర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. గ్రేటర్ అమరావతిలో నారాలోకేష్ ఎందుకు ఓడిపోయారో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. చదవండి: 'ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా' అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కరవు కాటకాలకు చంద్రబాబు విధానాలే కారణమని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి ధ్వజమెత్తారు. రెయిన్ గన్స్ పేరుతో చంద్రబాబు మోసం చేశారని, హంద్రీనీవా కాలువ వెడల్పుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంగీకరించారని తెలిపారు. వృథాగా వెళ్తున్న వరద నీటిని రాయలసీమకు తరలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన ప్రణాళికలు వేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే లతో చంద్రబాబు రాజీనామా చేయించి ఎన్నికల కు వెళ్లాలని, బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అప్పుడెందుకు బాబు రోడ్లు ఎక్కలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి తెలిపారు. రాయలసీమ వెనుకకబాటుకు చంద్రబాబే కారణమని, ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అదే విధంగా రాయలసీమ కరవుపై చంద్రబాబు ఏనాడూ స్పందించలేదని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు జరిగినప్పుడు చంద్రబాబు, ఆయన కుటుంబం ఎందుకు రోడ్లు ఎక్కలేదని, అమరావతి కోసం ఎందుకింత తాపత్రయమని ప్రశ్నించారు. అయిదేళ్ళ టీడీపీ పాలనలో అమరావతి ఎందుకు నిర్మించలేదని, రాజధానిలో ఎందుకు శాశ్వత నిర్మాణాలు జరపలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నిపుణుల కమిటీలను అధ్యయనం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని, ఏపీలో వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కన్నారు. -
బాబు ఘరానా మోసగాడు
- కదిరి నియోజకవర్గ ప్లీనరీలో వైఎస్సార్సీపీ నేతలు - ఎవరినోట విన్నా మోసపోయామన్న మాటే : ఎంపీ మిథున్‌రెడ్డి - బాబు అంతటి అవినీతిపరుడు మరొకడు లేడు : శంకరనారాయణ కదిరి : చంద్రబాబు ఘరానా మోసగాడని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. కదిరిలో శనివారం వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నదీం అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లి ఎవరిని పలకరించినా చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని, ఇక ఆయన మాటలు నమ్మే ప్రసక్తే లేదంటున్నారని చెప్పారు. హామీ మేరకు ఆయన రైతుల రుణాలను మాఫీ చేయలేదని, ఇప్పటికే ఎంతోమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన చెందారు. ఆ కుటుంబాలన్నింటినీ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వరుస కరువులతో అనంతపురం జిల్లా ముఖ్యంగా కదిరి ప్రాంత ప్రజలు వివిధ రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, ప్రభుత్వం ఏ మాత్రం ఉపశమన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. అలాగే సిద్దారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. శంకర్‌నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే మరొకరు లేరన్నారు. ఆయన పాలనలో అవినీతి పెరిగిపోయిందని, దాని గురించి చెప్పుకొంటూ పోతే సమయం సరిపోదని అన్నారు. రైతులకు న్యాయబద్దంగా అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వెంటనే రైతుల ఖాతాలో జమ చేయకపోతే పార్టీ తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నదీం అహమ్మద్ మాట్లాడుతూ చంద్రబాబుకు ముస్లిములంటే అస్సలు గిట్టదని, రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మైనార్టీ కూడా లేరని అన్నారు. మతతత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ కూడా ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించిందని, చంద్రబాబు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదని, ఆయన ముస్లింల ద్రోహి అని విమర్శించారు. ముస్లింలకు న్యాయం జరిగేది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనేనని చెప్పారు. ఎన్నికలెప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు : సిద్ధారెడ్డి మూడేళ్లకే చంద్రబాబు పాలనపై విసిగివేసారిన ప్రజలు ఎన్నికలెప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తున్నారని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ.సిద్ధారెడ్డి అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు వైఎస్సార్సీపీకి ఓటు వేసిన ప్రజలను కూడా ఎంతోమందిని వేధించారన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుని రాజన్న రాజ్యాన్ని మళ్లీ చూద్దామని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, వైఎస్సార్సీపీ మడకశిర సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, పార్టీ సీఈసీ సభ్యులు జక్కల ఆదిశేషు, పూల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఫర్హానా ఫయాజ్, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. -
‘రేపో మాపో మళ్లీ జైలు కెళ్తావ్.. గుర్తుంచుకో’
కదిరి(అనంతపురం జిల్లా): ‘పంజాబ్ నేషనల్ బ్యాంకులో సుమారు రూ. 9 కోట్ల నకిలీ డీడీల కుంభకోణంలో నువ్వు ఏ 2 ముద్దాయి. ఈ కేసులో నీకు జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల జరిమానా కూడా పడింది. శిక్షపడిన ఖైదీ నువ్వు విమర్శించడమా’ అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌పై కదిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి మండిపడ్డారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆదివారం కందికుంట తనపై చేసిన వ్యక్తిగత విమర్శలకు ఘాటుగా స్పందించారు. మంగళవారం సిద్ధారెడ్డి తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడుతూ కందికుంటపై నిప్పులు చెరిగారు. ‘నన్ను మూడు పార్టీలు మారావని విమర్శించే ముందు మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలు మారారో వెళ్లి బాబునడుగు? కదిరి మున్సిపాలిటీతోపాటు అన్ని మండలాల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని నీవు చెబుతున్నావ్. అందాకా ఎందుకు. మా పార్టీని వీడి మీ పార్టీలోకి వచ్చిన కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా చేత రాజీనామా చేయించు. అప్పుడు మా పార్టీ తరపున నేను నిలబడతాను. మీ పార్టీ తరపున నువ్వు నిలబడతావో..లేక చాంద్‌బాషాను నిలబెడతారో తేల్చుకోండి. ఎవరు గెలుస్తారో తేలిపోతుంది’ అని సవాల్ విసిరారు. ‘ఎస్బీఐ డీడీల స్కాం కేసులో రేపో, మాపో మీరు మళ్లీ జైలుకు వెళ్లబోతున్నారు. ఇప్పటికే మీరు శిక్ష పడిన ఖైదీ. రాబోయే రోజుల్లో మీరు కనీసం వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయడానికి అర్హుడు కాదన్న విషయం గుర్తుంచుకుంటే మంచిది’ అని హితవు పలికారు. నిజాయితీ, నిబద్దతతో ప్రజలకు సేవచేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీ టికెట్ రాకపోతే సొంత పార్టీ బలపరిచిన వ్యక్తిని ఓడించడానికి ఆయనలాగా రెబెల్‌గా పోటీ చేయలేదని, సొంత పార్టీ నేతలపై చెప్పులు విసరలేదు’ అని ఘాటుగా విమర్శించారు.