హర్యానా సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిక్కుల నిరసన ప్రదర్శన
న్యూఢిల్లీ: హర్యానాలోని గురుద్వారాల నిర్వహణ కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ సిక్కు కమిటీ నియామక చట్టం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట సిక్కులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించా రు. అక్కడ ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటుకుని ముందుకుసాగిన సిక్కులు... కాంగ్రెస్ పార్టీకి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు వారిపై నీటి ఫిరంగులను ప్రయోగించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది సిక్కులు పాల్గొన్నారని, అందులో కొందరిని అరెస్టు చేశామని డీసీపీ త్యాగి తెలిపారు. కాగా హర్యానాలోని గురుద్వారా నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించేం దుకు ఉద్దేశించిన బిల్లును అక్కడి శాసనసభ ఇటీవల ఆమోదించిన సంగతి విదితమే.