simhadri ramesh
-
ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు
-
టీడీపీ అరాచకాలపై సింహాద్రి రమేష్ బాబు ఫైర్
-
"ఆ" పని చేయకపోతే నాకు ఓటేయంకండి
-
CM YS Jagan: అవనిగడ్డ ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
-
అవనిగడ్డ ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: అవనిగడ్డ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సింహద్రి రమేష్‌బాబు కుమారుడి రిసెప్షన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో గురువారం జరిగిన ఈ వేడుకలో నూతన దంపతులు వికాస్, రవళిని సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు హాజరయ్యారు. -
డబ్బుతో రాజకీయం.. కాలం చెల్లింది
సాక్షి, విజయవాడ: ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక నూతన అధ్యయనాన్ని సృష్టించబోతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డబ్బు, మద్యం, పక్షపాతంగా ఎన్నికలు జరిపించారని విమర్శించారు. బాబు సృష్టించిన ఈ చెడ్డ సంస్కృతిని కూకటి వేళ్లతో సహా పెకిళించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బుతో రాజకీయం చేయాలనే రోజులకు కాలం చెల్లిందన్నారు. పాలన, పనితీరు ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తాము పాలన సాగించామని తెలిపారు. మరో నాలుగేళ్లు ప్రజలకు జవాబుదారీతనంగా పాలన అందిస్తామన్నారు. అవినీతి కనుచూపు మేరలో కనబడకుండా సంక్షేమ పాలన సాగిస్తున్నామన్నారు. ప్రజలకు ఏం చేశామో, ఏం చేయబోతున్నామో వివరించి ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. 22 డివిజన్లతోపాటు, మేయర్ పీఠాన్ని సైతం కైవసం చేసుకుని వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు.(రాష్ట్రంలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా) అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లిన పథకాలే మా విజయానికి నాంది. నూటికి 80 శాతం మంది పేద ప్రజానీకానికి అవసరమైన పథకాలను ప్రవేశ పెట్టారు. రాజకీయ పార్టీలు చివరి ఆరు నెలల్లో ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చుతాయి. కానీ సీఎం జగన్ మొదటి ఆరునెలల్లోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చారు. గత పాలకులు లక్షకోట్ల రాజధాని మాటలను ప్రజలు గమనించారు. సామాన్యులకు లక్ష కోట్ల రాజధాని అవసరం లేదు. ఆర్ధిక సంపన్నులకు ఉపయోగపడే రాజధాని అవసరం లేదు. పథకాలను ప్రజలు మెచ్చారు, అందుకే సీఎం జగన్‌కు అధికారం ఇస్తారు. స్థానిక సంస్థల్లో 99 శాతం సీట్లు కైవసం చేసుకుని వైసీపీ విజయఢంకా మోగిస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. (తక్షణమే అమలులోకి ఎన్నికల కోడ్) తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన రెండు స్కీంలు స్థానికంగా ప్రతి ఇంటికి చేరాయన్నారు. ప్రతి ఒక్క గ్రామపంచాయతీలోనూ వైసీపీ జెండా ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ ఆశించిన విజయాన్ని అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సంక్షేమ పాలనపై ప్రజలే ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జగనన్న మాకు మంచి పధకాలు ఇచ్చారని.. గెలిపిస్తే మరిన్ని పథకాలు తెస్తారని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు. జిల్లా పరిషత్తుల నుంచి పంచాయతీ, మున్సిపాలిటీల్లో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. తిరువూరులోని నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
కరకట్టపై బస్సు ప్రమాదం; ఎమ్మెల్యే సహాయం
సాక్షి, విజయవాడ : డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు బోల్తా పడిన సంఘటన శనివారం ఉంగరాల కట్ట వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే సుమారు 60 మంది ప్రయాణీకులతో విజయవాడ నుండి ఆవనిగడ్డ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ బస్సు ఉంగరాల కట్ట మూల మలుపు వద్ద బోల్తా పడి పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. అదే దారిలో ప్రయాణీస్తున్న ఆవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విషయం తెలుసుకొని ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేసి, అంబులెన్స్‌ను పిలిపించి దగ్గరుండి బాధితులను మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. కాగా, బస్సును వేగంగా మలుపు తిప్పడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు చెబుతున్నారు. -
పోరాటాల పురిటిగడ్డ..అవనిగడ్డ
సాక్షి, అవనిగడ్డ : జిల్లాకు తూర్పున.. కృష్ణమ్మ చెంతన ఏర్పడింది అవనిగడ్డ నియోజకవర్గం. ఆరు మండలాలతో అతిపెద్ద నియోజక వర్గంగా ఖ్యాతికెక్కింది. ప్రశాంత కు మారుపేరైన ఈ పల్లెసీమల నుంచే ఎందరో ఉద్దండులైన రాజ కీయ నాయకులు జన్మించారు. ఇక ఉద్యమాలకు ఊపిరిలూదిందీ ఈ పురిటిగడ్డే. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. గాంధీ జీ ఉద్యమ స్పూర్తికి ఊపిరి పోశా రు. జమిందారీ వ్యవస్థ్ధపై ఉక్కుపిడికిలి బిగించారు. భూపోరాటా లతో మార్గదర్శకులయ్యారు. 1952 అవనిగడ్డ దివి నియోజకవర్గంగా ఏర్పడింది. దివి ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అవనిగడ్డ, నిడుమోలు నియోజకవర్గాలు కలిసి ఉండేవి. దివి తాలూకా నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవారు. అవనిగడ్డ నియోజకవర్గంకు జిల్లాలో ప్రత్యేకతక ఉంది. 1972లో ఏకగీవ్రం కాగా జిల్లాలో ఈ ఘనత సాధిం చారు. అవనిగడ్డ. ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలు హాట్రిక్ సాధించారు కమ్యునిస్టు యోధులు చండ్రరామలింగయ్య, గుంటూరు బాపనయ్య, సనకా బుచ్చికోటయ్యతో గాంధేయవాది మండలి వెంకటకృష్ణారావు, దేవుడి మంత్రి సింహాద్రి సత్యనారాయణ వంటి నాయకులను ఈ గడ్డ అందించింది. ఏడుసార్లు కాంగ్రెస్.. ఆరు సార్లు టీడీపీ 1962లో అవనిగడ్డ నియోజకవర్గం ఏర్పడింది. 1962ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి వై శివరాంప్రసాద్, కమ్మునిస్టు పార్టీ అభ్యర్ధి సనకా బుచ్చికోటయ్యపై 2992 ఓట్లతో గెలుపొందారు. 1967లో ఈ ఇద్దరే తలపడగా శివరాం ప్రసాద్ 8663ఓట్లతో గెలుపొందారు. 1972లో మండలి వెంకట కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978లో మండలి వెంకట కృష్ణారావు, జనతా అభ్యర్థి సైకం అర్జునరావుపై 490 ఓట్లతో గెలుపొందారు. 1983లో టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన ఎన్నికల్లో మండలి వెంకట కృష్ణారావు గెలుపొందారు. 1985లో టీడీపీ అభ్యర్ధి సింహాద్రి సత్యనారాయణరావు, మండలి వెంకట కృష్ణారావుపై 6683ఓట్లతో గెలుపొందారు. 1989లో వీరిద్దరే పోటీపడగా సింహాద్రి సత్యనారాయణరావు 167ఓట్లతో గెలుపొందారు. 1994లో సింహాద్రి సత్యనారాయణరావు, కాంగ్రెస్ అభ్యర్ధి మండలి బుద్ధప్రసాద్‌పై 5377ఓట్లతో గెలుపొందారు. 1999లో మండలి బుద్ధప్రసాద్, టీడీపీ అభ్యర్ధి బూరగడ్డ రమేష్నాయుడుపై 794ఓట్లతో గెలుపొందారు. 2004లో వీరిద్దరే పోటీపడగా, మండలి బుద్ధప్రసాద్ 8483ఓట్లతో గెలుపొందారు. 2009లో టీడీపీ అభ్యర్ధి అంబటి బ్రహ్మణయ్య, మండలి బుద్ధప్రసాద్‌పై 417ఓట్లతో గెలుపొందారు. 2013లో బ్రాహ్మణయ్య మరణంతో జరిగిన ఎన్నికల్లో ఆయన తనయుడు అంబటి శ్రీహరిప్రసాద్, ఇండిపెండెంట్ అభ్యర్ధి సైకం రాజశేఖర్‌పై 61,644 ఓట్లతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మండలి బుద్ధప్రసాద్, సింహాద్రి రమేష్‌బాబుపై 5859 ఓట్ల తేడాతో గెలుపొందారు. హ్యాట్రిక్లతో పాటు మంత్రి పదవులు అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో యార్లగడ్డ శివరాంప్రసాద్ 1955, 1962, 1967 వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందం మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేయగా, 1972, 1978, 1983లో మండలి వెంకట కృష్ణారావు హ్యాట్రిక్ సాధించగా, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. 1985, 1989, 1994లో హ్యాట్రిక్ సాధించిన సింహాద్రి సత్యనారాయణరావు ఎన్టీరామారావు, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చేశారు. 1962, 1967లో సనకా బుచ్చికోటయ్య, 1985, 1989లో మండలి వెంకటకృష్ణారావు, 1999, 2004లో బూరగడ్డ రమేష్‌నాయుడు వరుసగా పరాజయం పాలయ్యారు. తండ్రీ కొడుకులు మండలి వెంకట కృష్ణారావు, మండలి బుద్ధప్రసాద్ ఇద్దరినీ ఓడించిన ఘనత సింహాద్రి సత్యనారాయణకు దక్కింది. జిల్లాలో ఏకైక ఏకగ్రీవ నియోజకవర్గం 1972లో జరిగిన ఎన్నికల్లో మండలి వెంకట కృష్ణారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో ఏకైక ఏకగ్రీవ నియోజకవర్గంగా అవనిగడ్డ రికార్డు సాధించింది. మూడు సార్లు హ్యాట్రిక్ సాధించి, మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణరావు 2004లో ఇండిపెండెంట్‌గా పోటీచేయగా 14,845 ఓట్లతో మూడో స్ధానంకు పరిమితమయ్యారు. సామాజిక వర్గాలే కీలకం కాపు సామాజిక వర్గం : 69,500 బీసీలు : 64,600 మత్స్యకార సామాజిక వర్గం : 29,400 ఎస్సీలు : 41,450 ఎస్టీలు : 6,460 ఉన్నారు కమ్మ సామాజిక వర్గం : 9,800 మంది ముస్లీంలు : 3,840 నియోజకవర్గం జనాభా : 2,63,771 ఓటర్లు : 2,12,830 పురుషులు : 1,06,171 స్త్రీలు : 1,06,640 పోలింగ్ బూత్‌లు మొత్తం : 266 -
అవనిగడ్డ ఆవేదన పట్టని బుద్ధప్రసాద్
అవనిగడ్డ: అవనిగడ్డ, కోడూరు మండలాల్లో రూ.19 కోట్లతో వేసిన మూడు రహదారులు రెండో రోజే దెబ్బతిన్నా పట్టించుకోని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అ«ధికారులపై కేకలు వేస్తున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు విమర్శించారు. పుష్కరాల్లో రూ.4కోట్లతో నిర్మించిన అవనిగడ్డ–కోడూరు రహదారి పలుచోట్ల దెబ్బతినగా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావుతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రూ.12.98 కోట్లతో కోడూరు–పాలకాయతిప్ప, రూ.2 కోట్లతో కోడూరు వయా దింటిమెరక–పాలకాయతిప్ప రోడ్లు వేసిన రెండో రోజే దెబ్బతిన్నాయన్నారు. రూ.18. 98 కోట్లతో వేసిన ఈ రోడ్లు రాళ్లు లేచిపోయి, గోతులు ఏర్పడ్డాయని గతంలో ఎన్నడూ లేనివిధంగా వేసిన రోజే రహదారి దెబ్బతిన్న ఘనత స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌కే దక్కుతుందని, ఈ రికార్డును ఎవరూ తిరగరాయలేరని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లు అడ్డంగా పనులు చేసి కోట్లు దోచేసుకుంటున్నా స్ధానిక ఎమ్మెల్యే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. రైతుల గోడు పట్టదు, సమస్యలను పట్టించుకోరు ఈ ఏడాది కోడూరు, నాగాయలంక మండలాల్లో సాగునీరందక ఇంకా 25 వేల ఎకరాల్లో నాట్లు వేయలేదని, ఎమ్మెల్యే వైఫల్యమే కారణమని సింహాద్రి ఆరోపించారు. అటవీ అధికారుల అభ్యంతరాల సాకుతో ఎదురుమొండి–నాచుగుంట, పాలకాయతిప్ప–సాగరసంగమం రహదారి నిర్మాణాలు నిలిచిపోయాయని అన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలున్నా ఎమ్మెల్యే పట్టించుకోరని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి రాజనాల మాణిక్యాలరావు, నేతలు ఇంకొల్లు శేషగిరి, చింతలపూడి బాలు, తోట శివప్రసాద్, గార్లపాటి గోపీ పాల్గొన్నారు.