sincerity
-
స్కూలుకు ఆలస్యంగా వచ్చాడని కొట్టినందుకు.. హెడ్మాస్టర్ను కాల్చి చంపాడు!
ఛతర్పూర్: స్కూలుకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థి(17)ని దండించడమే ఆ హెడ్ మాస్టర్ పాలిట శాపమైంది. పగబట్టిన విద్యార్థి బాత్రూంలోకి వెళ్తున్న హెడ్ మాస్టర్‌ను వెంబడించి వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి చంపాడు. హెడ్ మాస్టర్ ద్విచక్ర వాహనంపై పరారైన అతడిని పోలీసులు పట్టుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా ధమోరా ప్రభుత్వ హయ్యార్ సెకండరీ స్కూల్లో చోటుచేసుకుంది. ధిలాపూర్ గ్రామంలోని ధమోరా స్కూల్లో చదువుకునే ఓ విద్యార్థి తరచూ ఆలస్యంగా క్లాసులకు వస్తుంటాడు. శుక్రవారం కూడా ఆలస్యంగా రావడంతో ప్రధానోపాధ్యాయుడు సురేంద్ర కుమార్ సక్సేనా(55) నిందితుడిని, మరో విద్యార్థిని కొట్టారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్కూల్ ఆవరణలోని బాత్ రూంకి వెళ్తుండగా సక్సేనాను నిందితుడు అనుసరించాడు. వెంట తెచ్చుకున్న నాటు తుపాకీని సక్సేనా తలకు గురిపెట్టి కాల్చాడు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు సక్సేనాకు చెందిన ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. తుపాకీ శబ్దం విని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉలిక్కి పడ్డారు. ఉపాధ్యాయులు వచ్చి చూడగా సక్సేనా రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు యూపీ సరిహద్దులకు సమీపంలో నిందితుడిని పట్టుకున్నారు. హత్యకు వాడిన తుపాకీని సైతం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తరచూ స్కూలుకు ఆలస్యంగా వస్తుంటాడని, సరిగ్గా చదువుకునేవాడు కాదని, ఉపాధ్యాయుల మాటలను లక్ష్య పెట్టే వాడు కాదని దర్యాప్తులో తేలింది. ‘అతనొక్కడే కాల్పులు జరిపాడు. అతడొక్కడే నిందితుడనేది స్పష్టమైంది. మరో విద్యార్థి అఘాయిత్యాన్ని ఆపేందుకు మాత్రమే బాత్రూం వద్దకు వచ్చాడు. అనంతరం అతడు ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత అతడు భయంతో ఎటో వెళ్లిపోయాడు. నిందితుడిచ్చిన సమాచారం మేరకు తుపాకీ సమకూర్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నాం’అని ఎస్పీ ఆగమ్ జైన్ చెప్పారు. -
సేవ కోసం నిరీక్షణ
హజ్రత్ షర్ఫుద్దీన్ ధార్మిక భావాలు గల యువకుడు. తల్లిదండ్రుల సేవ చేయడంలో అతనికి అతనే సాటి. ఒకసారి అతని తల్లి జబ్బున పడింది. మూలుగుతూ తనయుణ్ణి పిలిచి ‘‘నాయనా దాహమేస్తోంది కాసిన్ని మంచినీళ్లివ్వు’’ అని అడిగింది. తల్లి దాహం తీర్చేందుకు కడవ దగ్గరికి హుటాహుటిన నీళ్లకోసం పరిగెత్తాడు షర్ఫుద్దీన్. ఆ వెంటనే పాత్రలో నీళ్లతో తల్లిముందు ప్రత్యక్షమయ్యాడు. ఈలోగా ఆయన తల్లి నిద్రలోకి జారుకుంది. ‘అమ్మను నిద్రనుంచి మేల్కొలిపితే నిద్రాభంగమవుతుంది. దాహం తీర్చకపోతే అమ్మ పట్ల అవిధేయత చూపినవాడను అవుతాను’ అని మనస్సులోనే అనుకోసాగాడు. అలా నీళ్ల పాత్రను చేతిలో పట్టుకొని తల్లి తలాపు వైపున నిల్చుండిపోయాడు. తన తల్లి ఏ క్షణంలో మేల్కొని నీళ్లు అడుగుతుందోనని పడిగాపులు కాసాడు. రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ఇలానే నిల్చుండిపోయాడు. చాలా పొద్దుపోయాక తల్లి నిద్ర నుండి మేల్కొన్నది. కళ్లు తెరిచి చూసేసరికి నీటి పాత్రతో షర్ఫుద్దీన్ నిలబడి ఉన్నాడు. ‘‘అప్పటి నుండి నీవు ఇలా నిల్చునే ఉన్నావా నాయనా’’ అని ఆప్యాయతతో అడిగింది తల్లి. ‘‘అవునమ్మా నీవు నిద్రనుంచి లేవగానే నీళ్లు ఇద్దామని ఇక్కడే నిల్చుండిపోయానమ్మా’’ అని సమాధానమిచ్చాడు. షర్ఫుద్దీన్. తన ముద్దుల కుమారుడి సేవకు ఆ తల్లి ఎంతగానో ఆనందించింది. కొడుక్కి ఆశీర్వచనాలు అందించింది. – సుహైబ్ -
డ్రా చేయకుండానే ఏటీఎం నుంచి డబ్బులు
చిత్తూరు (అర్బన్) : ఏటీఎం సెంటర్లో డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి కార్డును ఉపయోగించకుండానే నోట్లు వచ్చాయి. ఏకంగా రూ.15 వేల నగదు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు ఆ వ్యక్తి. అయితే తనది కాని డబ్బు వద్దని నిర్ణయించుకుని ఈ మొత్తాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. బంగారుపాళ్యంకు చెందిన విజయకుమార్ సోమవారం చిత్తూరుకు పని మీద వచ్చాడు. కొంగారెడ్డిపల్లెలోని ఎస్బీఐ స్టేట్ బ్యాంకు ఏటీఎంలో రూ.15 వేల నగదు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించాడు. మిషన్ నుంచి నగదు రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తరువాత ఎస్ఆర్.పురం మండలం డీకే.మర్రిపల్లెకు చెందిన బి.బాబు అనే వ్యక్తి అదే ఏటీఎంలో నగదు తీసుకోవడానికి వచ్చాడు. కార్డు ఉపయోగించేలోపే ఏటీఎం నుంచి రూ.15 వేలు బయటకు వచ్చాయి. దీన్ని తీసుకున్న కొద్ది సెకన్లలో బ్యాలన్స్ చూపే కాగితం కూడా వచ్చింది. నగదును తీసుకున్న బాబు ఆ మొత్తాన్ని చిత్తూరు వన్‌టౌన్ సీఐ నిరంజన్‌కుమార్‌కు అందజేశారు. బ్యాలెన్స్ చీటీలో ఉన్న ఆధారాలతో విజయకుమార్‌ను స్టేషన్‌కు పిలిపించిన సీఐ, ఎస్ఐ రాంభూపాల్‌లు రూ.15 వేల నగదును బాబు చేతులు మీదుగా అందచేశారు. నిజాయితీను చాటుకున్న బాబును పోలీసు అధికారులు అభినందించారు. -
నిజాయితీగా పనిచేయండి
వెదురుకుప్పం : రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి పేదలకు అన్యాయం చేయవద్దని, బదిలీలకు భయపడకుండా నిజాయితీగా పనిచేయాలని గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి అధికారులకు హితవుపలికారు. ఆదివారం వెదురుకుప్పం స్త్రీ శక్తి భవన్లో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెదురుకుప్పం మండల తహశీల్దార్ ఇంద్రసేనపై ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కా రం కోసం వచ్చిన ప్రజల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల అండ చూసుకునే ఇలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందని, రాజకీయా లు ఎన్నికల వరకే ఉండాలని తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజాసేవకు కట్టుబడాల ని సూచించారు. ఫిర్యాదులపై కలెక్టర్ స్పందించి ఆమెను బదిలీ చేసేందుకు ప్రయత్నించినా మంత్రి నుంచి ఫోన్ రా వడంతో ఆ ఫైల్‌ను పక్కన పడేసినట్లు ఆరోపించారు. సాక్షాత్తు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇలాకాలోనే అవినీతి అధికారులును ఏసీబీ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేయడం చూస్తుం టే వారి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రెవెన్యూ అధికారుల తీరు మారాలని ఆరు నెలలుగా చెబుతున్నా ఫలితం కనిపించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు రాజకీయ దురుద్దేశంతోనే రేషన్ డీలర్లపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు చేసిన తప్పులను సరిదిద్దుకుని నిజాయితీగా పనిచేయాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరి ణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఎస్.మాధవరావు, ఎంపీపీ పురుషోత్తం, పలువురు నాయ కులు పాల్గొన్నారు.