sivasai
-
బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం!
కరీంనగర్: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో మండలంలోని మల్లాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కోమటి శివసాయి(23) కరీంనగర్లో సెల్‌ఫోన్ రిపేర్ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శివసాయి ఈనెల ఒకటిన ఎల్ఎండీ కట్టపై పురుగుల మందు తాగాడు. తర్వాత బావ అడిచర్ల నరేశ్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. వెంటనే నరేశ్ 108కు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు. ఆత్మహత్యపై అనుమానాలు.. ఇదిలా ఉండగా శివసాయి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ప్రేమ విఫలంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బర్త్‌డేకు చిన్న గిఫ్ట్ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో లవ్ ఫెయిల్యూర్ అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసుల విచారణ.. ఇదిలా వుండగా కడుపునొప్పి భరించలేక తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు శివసాయి తండ్రి కోమటి కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: గ్యాంగ్‌స్టర్ గడోలీ ప్రియురాలు దివ్యా పహుజా హత్య -
పాప పుట్టిన 13 రోజులకే.. తండ్రీకొడుకుల విషాదం!
సాక్షి, కరీంనగర్: ఆ కుటుంబంలో పాప జన్మించింది.. అందరూ ఆనందంగా ఉన్నారు.. వైద్యులు డిశ్చార్జి చేయడంతో ఇంటి పెద్ద తల్లీబిడ్డను ఇంటికి పంపించాడు.. తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలో వెళ్తుండగా ఇసుక లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరినీ కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. వీణవంక మండలంలోని మామిడాలపల్లికి చెందిన దరిపెల్లి జ్యోతి డెలివరీ కోసం కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చేరింది. ఈ నెల 14న పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే, జ్యోతికి ఇన్ఫెక్షన్ కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, వైద్యం చేయించారు. రెండు రోజుల క్రితమే అక్కడి నుంచి కరీంనగర్ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు సోమవారం డిశ్చార్జి చేశారు. దీంతో జ్యోతి భర్త మొగిలి(45) తన భార్యాబిడ్డను ఆటోలో ఇంటికి పంపించాడు. కుమారుడు శివసాయి(12)తో కలిసి కూరగాయలు, పండ్లు, ఇంటి సామగ్రి తీసుకొని, తన సొంత ఆటోలో మామిడాలపల్లికి బయలుదేరాడు. మానకొండూర్ మండలంలోని రంగపేట వద్ద ఇసుక లారీ వేగంగా వచ్చి, ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మొగిలి, శివసాయి అక్కడికక్కడే మృతిచెందారు. లారీ పైనుంచి వెళ్లడంతో శివసాయి మృతదేహం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను చూసి, కన్నీరుమున్నీరుగా విలపించారు. న్యాయం చేయాలని ఆందోళన.. అనంతరం బంధువులు కరీంనగర్–జమ్మికుంట రహదారిపై ఆందోళన చేపట్టారు. మానకొండూర్, తిమ్మాపూర్ సీఐలు రాజ్‌కుమార్, ఇంద్రసేనారెడ్డిలు విరమించాలని కోరగా తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాలను తీసేది లేదని తేల్చిచెప్పారు. ఈ సంఘటనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి పోయి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఓవైపు పాప జన్మించడం, మరోవైపు ఇద్దరి ప్రాణాలు పోవడంతో ఆ కుటుంబ పరిస్థితిని చూసి, స్థానికులు కంటతడి పెట్టారు. అతివేగంగా వెళ్తున్న ఇసుక లారీలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతల పరామర్శ.. ప్రమాద విషయం తెలుసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మానకొండూర్ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఘటనాస్థలికి చేరుకొని, బాధితులను పరామర్శించి, ఓదార్చారు. -
ఒకటో తరగతి విద్యార్థి అదృశ్యం
కదిరి అర్బన్ : కుమ్మరవాండ్లపల్లిలో ఒకటో తరగతి చదివే శివసాయి అనే ఆరేళ్ల బాలుడు తప్పిపోయినట్లు తండ్రి నాగరాజు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి గ్రామంలోని కాకతీయ ప్రైవేటు పాఠశాలకు వెళ్లిన విద్యార్థి తిరిగి రాలేదని పేర్కొన్నాడు. ఇద్దరు వ్యక్తులు స్కూటీలో వచ్చి శివసాయి వెంట ఉన్న బాలుడిని చాక్లెట్ కొనుక్కో అని పంపించారని, ఆ తర్వాత శివసాయిని ఎక్కించుకుని వెళ్లారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేక బాలుడు తప్పిపోయాడా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. బాలుడి ఆచూకీ లభిస్తే డీఎస్పీ సెల్ నంబర్ 9440796850, సీఐ నంబర్ 94407 96851, ఎస్ఐ నంబర్ 9014440424కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు.