skids off
-
మిజోరాంలో ప్రమాదానికి గురైన మయన్మార్ సైనిక విమానం..
ఐజ్వాల్: మిజోరంలో మయన్మార్ ఆర్మీకి చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం రన్‌వేపై దిగుతుండగా అదుపు తప్పి కొంత దూరంలో ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. మిజోరాంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో జరుగుతున్న అతర్యుద్ధం కారణంగా సరిహద్దుల దాటి భారత్‌లోని మిజోరం రాష్ట్రంలోకి చొరబడిన మయన్మార్ సైనికులను స్వదేహానికి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చిన సమయంలో ప్రమాదం జరిగింది. కాగా టేబుల్‌టాప్ రనేవేలు (పీఠభూమి లేదా ఎత్తైన కొండ పైభాగం ప్రాంతాల్లో నిర్మించిన రన్‌వే) సవాలుతో కూడుకొని ఉన్నాయి. ఇలాంటి రన్‌వేలో భారత్‌లో ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి వల్ల విమానాలు ల్యాండింగ్ అవుతున్న సమయాల్లో రన్‌వే నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది. చదవండి: భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు ఇక మయన్మార్‌లో తిరుగుబాటు గ్రూపులతో జరుగుతోన్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో ఆ దేశం నుంచి భారీగా సైనికులు భారత్‌లోకి చొరబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత వారం మొత్తం 276 మంది మయన్మార్ సైనికులు మిజోరాంలోకి ప్రవేశించారని, వీరిలో 184 మంది సైనికులను భారత్ సోమవారం వెనక్కి పంపినట్లు అస్సాం రైఫఙల్స్ సోమవారం పేర్కొంది. స్వతంత్ర రాఖైన్ రాష్ట్ర కోసం పోరాటం చేస్తున్న మయన్మార్ తిరుగుబాటు బృందం ‘అరాకన్ ఆర్మీ’ సాయుధులు గతవారం దేశ సైనిక క్యాంప్‌పై దాడి చేసి ఆక్రమించుకున్నారు. దీంతో మయన్మార్ సైనికులు మిజోరాంలోని లాంగ్ట్లై జిల్లాలోని భారత్-మయన్మార్-బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ వద్ద ఉన్న బందుక్‌బంగా గ్రామం ద్వారా దేశంలోకి ప్రవేశించి అస్సాం రైఫిల్స్ క్యాంప్‌లో లొంగిపోయారు. వీరి వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా ఉన్నాయి. మయన్మార్ సైనికులను పర్వాలోని అస్సాం రైఫిల్స్ శిబిరానికి తరలించారు. అనంతరం వారిని లుంగ్లీకి మకాం మార్చారు. ఐజ్వాల్ సమీపంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుండి మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని సిట్వేకు మయన్మార్ వైమానిక దళానికి చెందిన విమానాల్లో సైనికులను స్వదేశానికి పంపే ప్రక్రియ ప్రారంభించినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి ఒకరు తెలిపారు. మిగిలిన 92 మంది సైనికులను నేడు మయన్మార్ తరలిస్తామని చెప్పారు. -
పెళ్లి వ్యాను బోల్తా
సాక్షి, గజ్వేల్: టాటా ఏస్ వాహనం బోల్తాపడిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో శుక్రవారం చోటుచేసుకుంది. తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన మమత వివాహం శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌తో తూప్రాన్‌లో శుక్రవారం నిశ్చయించారు. ఉదయం పెళ్లి కూతురు ముందుగానే ఫంక్షన్‌హాల్‌కు చేరుకోగా కుటుంబ సభ్యులు, బంధువులు, పెళ్లి సామగ్రితో టాటా ఏస్ వాహనంలో హాలుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో నాచారం గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద వారి వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పెళ్లి కూతురు తల్లి లక్ష్మి, చిన్మమ్మ రాణి, పెద్దమ్మ యాదమ్మ, బంధువులు మల్లమ్మ, సత్తయ్యలతో పాటు డ్రైవర్ సుధాకర్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
మృత్యువు అంచులను చూశారు
-
మృత్యువు అంచులను చూశారు
అంకారా(టర్కీ) : టర్కీకి చెందిన పెగాసస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ఆదివారం పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి రన్ వేపై నుంచి పక్కకు వెళ్లినట్లు టర్కీ మీడియా పేర్కొంది. టర్కీ రాజధాని అంకారా నుంచి ట్రబ్జాన్ పట్టణానికి 162 మంది ప్రయాణీకులతో విమానం బయల్దేరినట్లు చెప్పింది. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన విమానం.. కొంచెం ఉంటే సముద్రంలోకి దూసుకెళ్లేదని తెలిపింది. సముద్రానికి కొద్ది మీటర్ల దూరంలో విమానం ఆగినట్లు చెప్పింది. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. అయితే, విమానం నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయని చెప్పింది. దీంతో ఫైర్ ఇంజన్లు హూటాహుటిన అక్కడికి చేరుకుని పొగను అదుపులోకి తీసుకొచ్చాయని పేర్కొంది. కాగా, విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ట్రబ్జాన్ ప్రభుత్వం వెల్లడించింది. -
ట్యాక్సీ వే లోకి దూసుకెళ్లిన ఫ్లైట్
వాషింగ్టన్: అమెరికాలోని నాష్ విల్లే అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం హ్యూస్టన్ నుండి 133 మంది ప్రయాణికులతో వచ్చిన సౌత్‌వెస్ట్ విమాన సంస్థకు చెందిన బోయింగ్ విమానం ఒకటి ప్రమాదవశాత్తు రన్ వే నుండి జారిపోయింది. రన్ వే మీద ల్యాండ్ అయిన విమానం దారి తప్పి టాక్సీ వే లోకి దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా ముందున్న గడ్డిలోకి జారుతూ వెళ్లి ఆగింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని ఎయిర్ పోర్ట్ అధికారులు సమీపంలోని అసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పెద్ద శబ్దంతో రన్‌వే నుండి విమానం జారి పోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.