Slam
-
ముందు తిన్నగా ఆడటం నేర్చుకో...తర్వాత ప్రయోగాలు చేద్దువు
-
మురికివాడల రహిత నగరంగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం : నగరం దశ దిశ మార్చుకుంటూ ముందుకెళ్తున్నా మధ్యలో అక్కడక్కడా అభివృద్ధికి దూరంగా విసిరిపడేసినట్లుండే మురికివాడలను పాలకులు పట్టించుకున్న పాపానపోలేదు. చుట్టూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా వారి దరికి మాత్రం అవి చేరలేదు. విశాఖను మురికి వాడల రహిత నగరంగా మార్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నడుంబిగించింది. మొత్తం 793 మురికివాడల్లో నివసించే ప్రజలకు పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. లబ్ధిదారుల ఎంపిక సర్వేతో పాటు మ్యాపింగ్ చేసేందుకు జీవీఎంసీ 793 బృందాలతో రెండు రోజుల పాటు ఫ్లాష్ సర్వేకు సిద్ధమవుతోంది. జీవీఎంసీ పరిధిలో 2005 ముందు వరకూ 450 మురికివాడలుండేవి. ఆ తర్వాత భీమిలి, గాజువాక అనకాపల్లి విలీనం చేయడంతో 2013 నాటికి ఈ సంఖ్య 793కి చేరింది. గత ప్రభుత్వాలు ఈ మురికి వాడల అభివృద్ధికి ఏం చేయాలనేదానిపై ఏ ఒక్కరోజూ ఆలోచన చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం స్లమ్స్‌ను అభివృద్ధి చేయాలని, అందులో ఏళ్ల తరబడి నివాసముంటున్న ప్రజలకు పట్టాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించి స్లమ్‌లెస్ సిటీగా విశాఖను మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 426 నోటిఫైడ్ స్లమ్స్.... నగర పరిధిలో మొత్తం 426 నోటిఫైడ్ స్లమ్స్ ఉండగా 367 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. వీటిలో 20వేల వరకూ గృహాలున్నాయని, లక్ష వరకూ జనాభా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మురికివాడలు వివిధ రకాల భూముల్లో అభివృద్ధి చెందాయి. జీవీఎంసీకి చెందిన 67 స్థలాల్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన స్థలాల్లో 563, కేంద్ర ప్రభుత్వం, అనుబంధ సంస్థలకు చెందిన స్థలాల్లో 10, ప్రైవేట్ భూముల్లో 153 మురికి వాడలు ఏర్పడ్డాయి. ఈ మురికి వాడలు ఎంత మేర విస్తీర్ణంలో ఉన్నాయన్న అంశాలను గణించనున్నారు. రెండు రోజుల పాటు ఫ్లాష్ సర్వే మురికివాడలను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ నివసిస్తున్న ప్రజలకు సొంత ఇంటి పట్టాల్ని అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఈ నెల 11, 12 తేదీల్లో 793 మురికి వాడల్లో జీవీఎంసీ యూసీడీ విభాగం ఫ్లాష్ సర్వే నిర్వహించనుంది. ఒక్కో స్లమ్‌కు ఒక్కో బృందం చొప్పున 793 బృందాలను యూసీడీ పీడీ వై.శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఐదుగురు సభ్యులుంటారు. ఇందుకోసం జోనల్ కమిషనర్లు, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ సెక్రటరీ, ఇంజినీరింగ్ సిబ్బంది, టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, వీఆర్వోలు మొత్తం 3,965 మంది సర్వే నిర్వహించనున్నారు. సరిహద్దులు, ఒక్కో స్లమ్‌లో ఉన్న జనాభా, ఇళ్లు, స్థల స్వరూపం, స్లమ్ మ్యాపింగ్ మొదలైన అంశాలను సేకరించనున్నారు. ఈ సర్వే ఆధారంగా నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. -
’హోదా’పై మాట మార్చిన మంత్రులు
-
'ఎందుకు తీసుకోవాలి.. ఇదేం సినిమా కాదు?'
న్యూఢిల్లీ: కరువు సమస్యలపై సరిగా స్పందించని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు గట్టిగానే మందలిస్తోంది. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు మరోసారి హర్యానా, కేంద్ర ప్రభుత్వాలకు కలిపి ఛీవాట్లు పెట్టింది. ఇదేమైనా సినిమానా అంటూ వ్యాఖ్యానించింది. హర్యానాలో నెలకొన్న కరువు పరిస్థితులపై వివరణ ఇవ్వాలంటూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ఆ వివరాలను సుప్రీంకోర్టు కోరింది. అయితే, హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అసంపూర్ణంగా ఉన్న అఫిడవిట్ సమర్పించింది. అందులో పూర్తి వివరాలు ఇవ్వలేదు. దీంతో దీనిపై మండిపడిన సుప్రీంకోర్టు..'మేం ఎందుకు ఈ అసంపూర్ణంగా ఉన్న అఫిడవిట్ తీసుకోవాలి? మీరు ఇచ్చిన అఫిడవిట్లో మేం తనిఖీ చేయాల్సిన వివరాలు లేవు.. మేం మీ అఫిడవిట్‌ను స్వీకరించడం లేదు. ఇదేం సినిమాకాదు' అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. మనం చర్చించేది ఏ విహారయాత్ర గురించో.. రోడ్డు నిర్మాణాల గురించో కాదు.. ఎంతో తీవ్రమైన కరువు సమస్య గురించి, ప్రజల ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించకుంటే ఎలా అని సుప్రీంకోర్టు నిలదీసింది. -
'కోర్టులో కూర్చుంది పశువులనుకుంటున్నారా?'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మేమేమైనా పనికిరాని వాళ్లమా అంటూ మండిపడింది. కరువు పరిస్థితిపై తీసుకున్న చర్యలు వివరించేందుకు కేంద్రం తరుపున న్యాయవాది విఫలమవడమే కాకుండా తమకు మరింత గడువు కావాలని కోరడంతో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం చిర్రెత్తిపోయింది.'చేసే పనిలో, సమస్య తీవ్రత తెలుసుకోవడంలో సీరియస్‌నెస్ చూపించండి... మేం పనికిరాని వాళ్లమని మీ ఉద్దేశమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇదంతా(కోర్టులో ఉన్న సమూహాన్ని ఉద్దేశిస్తూ..) మీ కళ్లకు ఒక పశువుల మందలాగా కనిపిస్తుందా లేక ఇంకేదైననా? ఇక్కడికి అక్కడికి వెళ్లడానికి. ఇది మీకు నచ్చినట్లు చేసే అంశంకాదు.. ఇక్కడ ఇద్దరు న్యాయమూర్తులు కూర్చున్నారు. మీరు మా నుంచి ఏదో ఆశించాల్సిందిపోయి ఏం చేయకుండా మా ముఖాలు చూస్తూ సమయం వృధా చేయడం దేనికి?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ వచ్చి తాను వాదనలు వినిపించేందుకు సిద్ధమని అన్నారు. దీంతో పావుగంటలో వాదనలు వినిపించి వెళ్లిపోవాలని ధర్మాసనం తెలిపింది. కోర్టు సమయం చాలా విలువైనదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సభ్యుడు యోగేంద్ర యాదవ్ కు చెందిన సంస్థ కరువు దుస్థితిని కోర్టుకు వివరిస్తూ దీని నివారణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుందో తెలియజేయాలని కోర్టు ద్వారా కోరారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు కేంద్రాన్ని కోరినా అలసటత్వం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 12 రాష్ట్రాలు కరువు భారిన పడ్డాయంటే సమస్యను అంత తేలికగా తీసిపారేయలేమని అభిప్రాయపడింది. -
రైల్వే ఛార్జీల పెంపుపై మండిపడ్డ విపక్షాలు
-
ఎమ్మెల్యేలను ఇంతగా కించపరుస్తరా?
-
టీవీ 9పై కేసీఆర్ నిప్పులు