ఎస్ఎల్ఆర్ బుల్లెట్ల బ్యాగ్ మాయం
విజయవాడ : ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఎస్ఎల్ఆర్ రైఫిల్ బుల్లెట్ల బ్యాగ్ మాయం అయ్యింది. కానిస్టేబుల్ బస్సులో విశాఖ నుంచి ఒంగోలు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో ఏఆర్ కానిస్టేబుల్ ..విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.