కనులపండువగా శోభాయాత్ర
నెల్లూరు(బందావనం) : శ్రీకష్ణ జన్మాష్టమి పర్వదినం, విశ్వహిందూ పరిషత్ స్థాపనాదివస్ను పురస్కరించుకుని విశ్వహిందూపరిషత్, శ్రీరంగనాథ కోలాట భజన మండలి, దుర్గావాహిని, భజరంగ్‌దళ్ తదితర సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా సాగింది. గురువారం నెల్లూరులోని వీఆర్ ఉన్నత పాఠశాలలో యాత్రను సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బాలబాలికల్లో ధార్మికచింతనను కలిగించేందుకు హిందూధార్మిక సంస్థలు విశాల ధక్పథంలో చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వంతో లోకంలో మంచిని కాపాడేందుకు శ్రీకష్ణపరమాత్మ అనుసరించిన తీరు సమాజానికి ఓ సందేశాన్ని ఇస్తుందన్నారు. పురాణపురుషుల జయంతులను జరుపుకోవడం ద్వారా దేశభక్తి పెంపొందడమే గాకుండా భావితరాలకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. భారతీయ పండగలు సంస్కతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, వీహెచ్‌పీ దక్షిణ భారతదేశ బాధ్యులు డాక్టర్ గోపాల్జీ, రాష్ట్ర కార్యదర్శి మెంటా రామమోహన్‌రావు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
చిన్నికష్ణుల సందడి :
నెమలిపింఛాలను ధరించి, పిల్లన గ్రోవులను చేతబట్టి, బుడిబుడి అడుగుల నడకలతో రాధా, గోపికలు వెంటరాగా చిన్నికష్ణులు నగరంలో సందడి చేశారు. శోభాయాత్ర సందర్భంగా బాలబాలికలు శ్రీకష్ణరాధాగోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు.