Sociopaths activities
-
ప్రకృతిలో వికృత చేష్టలు!
పేరేచర్ల(గుంటూరు): పేరేచర్ల ప్రధాన రహదారి పక్కనే 531 ఎకరాల్లో ప్రకృతి రమణీయతను ఆకళింపు చేసుకుని ఉంది నగరవనం. ఇక్కడ ఎత్తైన కొండలు, చెట్లు, వన్యప్రాణులు, ఔషధ మొక్కలు ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తాయి. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సేదదీరేందుకు ప్రభుత్వం నగరవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2017 నవంబర్ 4న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నగరవనానికి శంకుస్థాపన చేశారు. ఔషధ మొక్కల పెంపకం, పిల్లల పార్కు, సైక్లింగ్, ట్రెక్కింగ్, జంతుప్రదర్శనశాల తదితరాల ఏర్పాటుకు రూ.5 కోట్లు నిధులు కేటాయిస్తున్నామని ప్రకటించారు. నగరవనం అందుబాటులోకి వచ్చి ఆహ్లాదం చేరువవుతుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. దీంతో ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. కొరవడిన నిఘా.. నగరవనంలో నిఘా వ్యవస్థ పూర్తిగా నిద్రావస్థలోకి జారుకుంది. దీనికి తోడు వనంలో ఒక్కచోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో పర్యవేక్షణ కొరవడడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆకతాయితీలు ప్రకృతి రమణీయతలో వికృతి చేష్టలకు పాల్పడుతున్నారు. దీంతో కుటుంబాలతో నగరవన వీక్షణకు వెళ్లేవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక అటవీశాఖకు చెందిన అధికారులు ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా కనిపిస్తారు లేకపోతే అదీ కూడా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వనంలో కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. బోర్డుకే పరిమితమైన పిల్లల పార్కు.. నగరవనంలోకి అడుగుపెట్టగానే కొద్ది దూరంలో పిల్లల పార్కు అని కనబడుతుంది తప్ప పార్కు కనిపించదు. పిల్లల కోసం ఇంత దూరం వస్తే ఇక్కడ పరిస్థితి వేరేలా ఉందని పర్యాటకులు వాపోతున్నారు. కనీసం పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, వారు ఆసక్తిగా తిలకించేందుకు బొమ్మలు లాంటివి కూడా ఏర్పాటు చేయలేదు. నగరవనానికి సమీపంలోనే కొన్ని క్రషర్లు, కంపెనీలు ఉండడంతో వాటి నుంచి వచ్చే పొగ వనాన్ని కమ్మేస్తోంది. దీంతో పర్యాటకులు కొంతమేర ఇబ్బంది పడుతున్నారు. నగరవనానికి చుట్టుపక్కల ఉన్న క్రషర్లు, కంపెనీలను వేరే చోటకి మారుస్తానని అప్పుడు అధికారులు, మంత్రులు చెప్పారు కానీ ఆచరణలో పాటించలేదు. పిల్లలను అతిగారాబం చేయకూడదు తల్లిదండ్రులు తమ పిల్లలను అతి గారాబం చేయకూడదు. కొంతవారి పట్ల కఠినంగానే వ్యవహరించాలి. పిల్లల కదలికలపై నిఘా ఉంచాలి. ముఖ్యంగా సంస్కృతీ, సంప్రదాయాలు పట్ల కాసేపు వారితో ప్రేమగా మాట్లాడాలి. తల్లిదండ్రులు ప్రమేయం లేకుండా తీసుకొనే కొన్ని నిర్ణయాల వలన జరిగే సంఘటనలు వారికి ఉదాహరణగా తెలియపరచాలి. అంతేకాకుండా నగరవనంలో ప్రత్యేకమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలి. – కాసు విజయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రభుత్వ పనితీరు లోపం కనిపిస్తుంది ఇలాంటి వనాల్లో ప్రభుత్వ పనితీరు లోపం కనిపిస్తుంది. రూ.5 కోట్లు మంజూరు చేసి దానిని గుత్తేదార్లుకు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకొంటుంది. దీని వలన అక్కడ సరైన వసతులు లేకుండా పోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నగరవానికి కుటుంబ సభ్యులతో రాలేని దుస్థితి. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి. వనంలో నిఘానేత్రాలు ఏర్పాటు చేయాలి. – రమాదేవి, ఐద్వా నాయకురాలు -
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు
♦ ఫాంహౌస్‌లలో అనైతిక చర్యలు ♦ తరచూ ఘటనలు ♦ తాజాగా వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ♦ హైదరాబాద్ యువకులు పరిగి: అసాంఘిక కార్యకలాపాలకు ఫాంహౌస్‌లు అడ్డాలుగా మారుతున్నాయి. డివిజన్ పరిధిలోని పూడూరు, పరిగి పరిసరాల్లో దాదాపు 200-250 ఫాంహౌస్‌లు ఉన్నాయి. నగరానికి ఈ ప్రాంతం చేరువగా ఉండడంతో జల్సారాయుళ్లు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. నగరంలో అయితే పోలీసుల దాడులు జరుగుతాయని భావించి నగరానికి దూరంగా ఉన్న ఈ ఫాంహౌస్‌లను సురక్షిత ప్రాంతాలుగా భావించి ఇక్కడికి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున పూడూరు మండలంలోని మీర్జాపూర్ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో పోలీసులు దాడి చేసి వ్యభిచారం చేస్తున్న నలుగురు యువకులు, నలుగురు యువతులతో పాటు ఫాంహౌస్ నిర్వాహకుడిని అరెస్టు చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. నగర శివారు ప్రాంతాల్లోని ఫాంహౌస్‌లలో అసాంఘిక కార్యకలపాలకు పోలీసులు అడ్డుకట్ట వేయడంతో అక్రమార్కుల కన్ను పరిగి ప్రాంతంలోని ఫాంహౌస్లపై పడినట్లు తెలుస్తోంది. భారీగా ఫాంహౌస్‌లు.. రియల్ భూ సమయంలో బడా బాబులు పరిగి, పూడూరు తదితర మండలాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు. ఫాంహౌస్‌లు ఏర్పాటు చేసుకొని పలు రకాల తోటలు పెంచుకుంటున్నారు. కొందరు ఫాంహౌస్‌లలో విలాసవంతమైన భవనాలను నిర్మించుకొని అందులో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా పెద్దఎత్తున ప్రహరీలు, కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు పోలీసులను కూడా తమ ఫాంహౌస్‌లలోకి అనుమతించడం కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆందోళనలో స్థానికులు... మంచికి, మానవత్వానికి మారుపేరైన పల్లె వాతావరణం కలుషితమవుతోంది. ఫాంహౌస్‌లలో అసాంఘిక కార్యకలాపాలు వెలుగుచూడడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యవహారాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఆవేదనకు గురవుతున్నారు. ఫాంహౌస్లపై పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని పలువురు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన జంటల తాకిడి.. సిటీలో నిత్యం పని ఒత్తిడి, కలుషిత వాతావరణంలో గడిపే నగర వాసులు సెలవు దినాల్లో వారానికి ఒకటిరెండు రోజులు వచ్చి ఫాంహౌస్‌లలో సేద తీరుతున్నారు. అయితే, ఇటీవల కొన్ని ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫాంహౌస్‌లకు జంటల తాకిడి బాగా పెరిగిందని, స్థానికులు వారెవరనే విషయంపై ఆరా తీయడానికి వెళ్తే వాళ్లు వాహనాల్లో పారిపోతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫాంహౌస్‌ల నిర్వాహకులు కొందరు డబ్బులకు ఆశపడి అసాంఘిక కార్యకలాపాలకు కిరాయికి ఇస్తున్నట్లు సమాచారం. గతంలో పరిగి మండల పరిధిలోని తొండపల్లి సమీపంలో, పూడూరు మండల పరిధిలోనూ పలు ఘటనలు వెలుగుచూశాయి. -
హైటెక్ బెట్టింగ్స్!
మూసధోరణి వీడిన వ్యవస్థీకృత ముఠాలు హాట్‌లైన్ బాక్సులు, రికార్డర్లతో వ్యవహారం మూడు రోజుల్లో పట్టుబడిన రెండు గ్యాంగ్స్ సిటీబ్యూరో: భారత్‌లో జరిగే లేదా భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలోనే బెట్టింగ్ నిర్వహించడం... టీవీ, పంటర్ల వివరాలు రాసుకోవడానికి రికార్డులు, ఫోన్లు... ఒకప్పుడు బెట్టింగ్స్ నిర్వహించే ముఠాల వ్యవహార శైలి ఇది. 365 రోజులూ పని చేసే డెన్లు... ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా పందాలు స్వీకరించడం.... ల్యాప్‌టాప్‌లు, హాట్‌లైన్ బాక్సులు, వాయిస్ రికార్డర్లు... ఇదీ నేటి బెట్టింగ్ రాయుళ్ల హైటెక్ పంథా. పోలీసు విభాగమే కాదు... అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ముఠాలు సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ‘సమకాలీన’ అవసరాలకు తగ్గట్టు మార్పుచేర్పులు సంతరించుకుంటున్నాయి. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు రోజుల వ్యవధిలో అరెస్టు చేసిన రెండు బెట్టింగ్స్ గ్యాంగ్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు ముఠాలూ భారత్‌తో ఎలాంటి సంబంధం లేని, ఆస్ట్రేలియాలో జరుగుతున్న అక్కడి దేశవాళీ మ్యాచ్‌లకు పందాలు నిర్వహిస్తూ చిక్కినవే. ముఖేష్‌శర్మ... ‘హాట్ హాట్ హాట్’ చార్మినార్‌లోని చిల్లాపురకు చెందిన ముఖేష్‌శర్మ నేతృత్వంలో సాగుతున్న ఈ ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా ‘ఇదే వృత్తి’లో కొనసాగుతున్న ఇతగాడు మరో ఐదుగురితో కలిసి ముఠా ఏర్పాటు చేసి బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. దీనికోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన మనోజ్ నుంచి మూడు హాట్‌లైన్ బాక్సులు సమీకరించుకున్నాడు. ఒక్కో బాక్సులో గరిష్టంగా 10 సెల్ఫోన్ల అనుసంధానించే అవకాశం ఉంది. ఆ ఫోన్లలో కేవలం పంటర్లతో మాట్లాడటానికి వినియోగించే సిమ్‌కార్డుల్ని మాత్రమే వేస్తారు. ఆ పది మందీ ఒకేసారి ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నించినా... అవన్నీ హాట్‌లైన్ బాక్సులో రికార్డు అయిపోతాయి. ఎంత పందెం కాశారు? ఏ జట్టు వైపు కాశారు? అనేవి తెలుసుకోవడానికి, ఆట ముగిశాక లావాదేవీల ఆధారంగానూ ఆ రికార్డింగ్స్ ఉపకరిస్తాయని నిందితులు వెల్లడించారు. కుల్దీప్సింగ్ ‘రికార్డ్’... మంగళ్‌హాట్‌కు చెందిన కుల్దీప్సింగ్ నేతృత్వంలో మరో నలుగురితో ఏర్పాటైన గ్యాంగ్‌ను బుధవారం పట్టుకున్నారు. వీరి నుంచి టీవీ, సెట్‌టాప్ బాక్సులు తదితరాలతో పాటు ప్రముఖ కంపెనీకి చెందిన ఓ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాత, కొత్త పంటర్ల నుంచి పందాలు అంగీకరిస్తున్న ఈ గ్యాంగ్ వారి నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేయడానికి దీన్ని వినియోగిస్తోంది. ఈ వాయిస్ రికార్డర్‌ను కేవలం ఒక ఫోన్‌కు మాత్రమే కనెక్ట్ చేసే అవకాశం ఉంది. దాని ద్వారానే ఈ ముఠా.. పంటర్లకు కాల్ చేస్తూ, వారి నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకుంటూ ఆధారాలు భద్రపరుచుకోవడం ప్రారంభించిందని టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్న కుల్దీప్... వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ‘అదనపు ఆదాయం’ కోసం వ్యవస్థీకృత బెట్టింగ్ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ల్యాప్టాప్స్, ఏజెంట్స్ సైతం... ఈ రెండు ముఠాలకూ మరో ప్రత్యేకత ఉంది. ముఖేష్ గ్యాంగ్ పంటర్ల (పందాలు కాసే వ్యక్తులు) జాబితాను భద్రపరచడానికి, లావాదేవీలు చేయడానికి ల్యాప్టాప్స్ వినియోగిస్తోంది. ఆట ముగిసిన తర్వాత నగదు వసూలు, చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను సైతం ఏర్పాటు చేసుకుంది. కుల్దీప్ ముఠా ఈ కోణంలో మూసధోరణిలోనే ఉండి ఇంకా స్లిప్పులు, పుస్తకాలు నిర్వహిస్తుండగా... పంటర్లను గుర్తించడానికి మాత్రం ఏజెంట్లను పెట్టకుంది. -
రెడ్ అలెర్ట్
ఎర్రమట్టి దిబ్బలపై ఎనలేని నిర్లక్ష్యం బోర్డు లేదు.. గార్డూ లేడు.. ఎక్కడ చెత్త అక్కడే అసాంఘిక కార్యకలాపాలు దుస్థితిలో చరిత్రాత్మక ప్రాంతం విశాఖపట్నం: సాగరతీరంలో గుట్టల కొద్దీ కుంకుమ రాశులు పోసినట్టు కనిపిస్తాయి. మధ్యమధ్య లో పచ్చదనంతో మేళవిస్తాయి. దేశవిదేశాల్లోని పర్యాటకు ల మదిని దోచుకున్నా యి. సుమారు పన్నెండు వేల ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. విశాఖ కీర్తిని, ప్ర తిష్టను ప్రపంచవ్యాపితంగా ఇనుమడింప చేసేందుకు తోడ్పడ్డాయి. గత ఏడాది జియో హెరిటే జ్ స్థలంగానూ గుర్తింపు తెచ్చుకున్నాయి. అంతటి విశిష్టత కలిగిన ఎర్రమట్టి దిబ్బలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కనీసం ఇవే ఎర్రమట్టి దిబ్బలు అని తెలిపే బోర్డు కూడా ఏర్పాటు చేసే వాడే లేడు. అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకునే వాడే లేడు. వాటిని సంరక్షించే నాథుడూ లేడు. విశాఖ పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు, అధికారులు ఈ ఎర్రమట్టి దిబ్బలను పేరు గొప్ప ఊరు దిబ్బ అనే స్థితికి తీసుకొస్తున్నారు. విశాఖలోని ఎర్రమట్టిదిబ్బలు లాంటివి ఆగ్నేయాసిలో తమిళనాడు, శ్రీలంకల్లో మాత్రమే ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించడానికి గొప్పగా ఎర్రమట్టి దిబ్బలను ప్రముఖంగా చూపిస్తుంటారు. సాగరతీరంలో ఉన్న వీటిని ఏటా వేలాది మంది ప ర్యాటకులు విదేశాల నుంచి కూడా వస్తుంటారు. కానీ ఇప్పుడక్కడ పరిస్థితి వేరుగా ఉంది. సంబంధింత అధికారులు ఎర్రమట్టి దిబ్బలను గాలికొదిలేశారు. శుభ్రతను పట్టించుకోవడం మానేశారు. హుద్‌హుద్ తుపాన్‌కు విరిగిపడ్డ చెట్ల కొమ్మలను, ఇతర వ్యర్థాలను చాన్నాళ్లు అలాగే వదిలేశారు. పగలు, సాయంత్రం తేడా లేకుండా కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పర్యాటకులకు రక్షణకు పోలీసులు కూడా ఉండరు. అరకొరగా వస్తున్న పర్యాటకులు, సందర్శకులు దిబ్బలపైకి ఎక్కి, దిగడంతో సహజత్వాన్నీ, ఆకృతినీ కోల్పోతున్నాయి. ైగె డ్లను ఏర్పాటు చేయలేదు. ఎర్రమట్టిదిబ్బలు ఇవే అని తెలిపే ఒక్క బోర్డు కూడా లేదు. స్వచ్ఛందంగా బోర్డు ఏర్పాటుకు వివిధ సంస్థలు ముందుకొచ్చినా అధికారులు అనుమతించడంలేదు. రానున్న 15-20 ఏళ్లలో ఎర్రమట్టిదిబ్బల ఉనికికే ప్రమాదం ఏర్పడవచ్చని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ కవచంలో ఉంచాలి ఎంతో విలువైన వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టిదిబ్బలను కాపాడుకోవాలి. దిబ్బల సహజత్వాన్ని దెబ్బతీయకుండా తగు చర్యలు తీసుకోవాలి. పిక్నిక్లు, సినిమా షూటింగ్‌లను నిలువరించాలి. జియాలజిస్టులు దీనిని పర్యాటక ప్రాంతంగా చూడొద్దంటున్నారు. పర్యాటకుల్లో అవగాహన వచ్చేదాకా దిబ్బల చుట్టూ ఫెన్సింగ్ వేయిం చాలి. మట్టితో కట్టడాలు ని ర్మించాలి. సత్వరమే ఎర్రమట్టిదిబ్బలపై సర్వే పూర్తి చేయా లి. అక్కడ బోర్డు ఏర్పాటుతో పాటు వీటి విశిష్టతను తెలిపే సమాచారం ఉంచాలి. -సోహన్ హటంగడి, పర్యావరణవేత్త. ఎందుకిలా? ఎర్రమట్టిదిబ్బలు ఎవరి అజమాయిషీలోనూ లేవు. జీవీఎంసీ, వుడా, ఆర్కియాలజీ, ఏపీటీడీసీ ఇలా ఎవరూ వీటి బాధ్యతను తీసుకోవడం లేదు. అప్పుడెప్పుడో ఏపీటీడీసీ ముందుకొచ్చినా విమర్శల నేపథ్యంలో అడుగు ముందుకు పడలేదు. గతంలో జీఎస్ఐ డెరైక్టర్ జనరల్ వీటిని సంరక్షించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ రాశారు. అయినా అతీగతీలేదు. దీంతో వీటి సంరక్షణను గాలికొదిలేశారు. -
విందుపేరుతో అశ్లీల నృత్యాలు
గుట్టుచప్పుడు కాకుండా రిసార్టుల్లో రేవ్‌పార్టీలు జిల్లా శివారులో అసాంఘిక కార్యకలాపాలు షాద్‌నగర్ రూరల్ : విందు పేరిట నిర్వహిస్తున్న రేవ్ పార్టీలకుఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రిసార్టుల్లో ఈ పార్టీలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని రిసార్టులపై పోలీసులు ని ఘా పెట్టినందున రేవ్ పార్టీలకు షాద్‌నగర్ అనువైన ప్రాంతంగా ఎంచుకున్నట్లు సమాచారం. 2014 ఫిబ్రవరిలో ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ శివారులోని అగ్రిగోల్డ్ రిసార్టులో హైదరాబాద్, కడప, కర్నూలు, రాయిచూర్‌కు చెందిన 24మంది యువకులు, ముగ్గురు మహిళా డాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేస్తూ, పేకాట ఆడుతూ రేవ్ పార్టీ నిర్వహించారు. దీంతో అప్పటి డీఎస్పీ ద్రోణాచార్యులు సిబ్బందితో అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పది వాహనాలను సీజ్ చేయడంతోపాటు *21లక్షలను స్వాధీనం చేసుకుని ముగ్గురు అమ్మాయిలను స్టేట్‌హోంకు తరలించారు. అదే రిసార్టులో.. ఇదే రిసార్టులో శనివారం అర్ధరాత్రి రేవ్‌పార్టీ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఏఎస్పీ కల్మేశ్వర్సింగెనెవారె 40 మంది యువకులను, ఎనిమిది మంది యువతులను అదుపులోకి తీసుకున్నా రు. కొంతకాలంగా మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రా, తెలంగాణ, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులు ఔరంగాబాద్, హైదరాబాద్‌లోని ఆటోనగర్‌లో సుపీరియా క్రాఫ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి వారిలో 40మంది యువకులు విందు చేసుకునేందుకుగాను ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ శివారులోని అగ్రిగోల్డ్ వెంచర్‌కు వచ్చా రు. వారితోపాటు వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ముగ్గురు, ఆంధ్రాకు చెందిన ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒకరు, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు యువతులు అక్కడికి చేరుకున్నారు. విందు పేరుతో యువతులను తీసుకొచ్చి అశ్లీలనృత్యాలు చేస్తూ రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ కల్మేశ్వర్సింగెనెవారె, ఎస్ఐలు పోచయ్య, శ్రీని వాస్ హుటాహుటిన అక్కడికి చేరుకుని 40మంది యువకులతోపాటు అశ్లీలనృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది యువతులను అరెస్టు చేశారు. అనంతరం షాద్‌నగర్ పట్టణ సీఐ శంకరయ్యకు నిందుతులను అప్పగించారు. విందు పేరుతో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. కాగా, రేవ్ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించే ఆస్కారముందని, ఈ రిసార్టులను సీజ్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రాంతంలోని ఆరు రిసార్టుల్లో ఇలాంటి పార్టీలు జరుగుతూనే ఉంటాయి. కొందరు సినీప్రముఖులు సైతం తమ ఫాంహౌస్‌లను ఇక్కడే నిర్మించుకోవడం గమనార్హం.