soil test
-
ఇస్రో కీలక ప్రకటన.. చంద్రునిపై ఉష్ణోగ్రతల వివరాలు పంపిన విక్రమ్
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ఉపగ్రహంలోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలం గురించి అధ్యయనం చేసి సమాచారాన్ని ఇస్రోకి చేరవేసింది. చంద్రుడి దక్షిణ ధృవం నేలకి సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చుతగ్గుల సమాచారం ప్రపంచానికి చేరడం ఇదే మొదటిసారి. చంద్రయాన్-3 విజయవంతంగా చందుడిపై అడుగుపెట్టడమే కాదు దాని కార్యాచరణను కూడా మొదలుపెట్టింది. శనివారం శివశక్తి పాయింట్ వద్దనున్న విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి జారుకుని అధ్యయనాలను కూడా ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై 10సెం.మీ. లోతు వరకు ఉపరితలాన్ని అధ్యయనం చేసిన ప్రజ్ఞాన్ రోవర్ తొట్టతొలిసారి చంద్రుడి దక్షిణ ధృవం వద్దనున్న నేలకి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేసింది. ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్) పేలోడ్ చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసింది. ఇస్రో ఈ సమాచారాన్ని తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. ఇస్రో షేర్ చేసిన ఈ గ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నుండి 60 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు తెలుస్తోంది. 'ఈ గ్రాఫ్ చంద్రుని ఉపరితలంపై లోతు వ్యత్యాసాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను సూచిస్తోంది. చంద్రుని దక్షిణ ధృవానికి సంబంధించి ఇదే మొట్టమొదటి అధ్యయనం. ఇంకా లోతైన పరిశీలనలు జరుగుతున్నాయి' అని ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్-3లో మొతం ఏడు పేలోడ్లు ఉండగా అందులో విక్రమ్ ల్యాండర్ నాలుగు, ప్రజ్ఞాన్ రోవర్ రెండు నిర్వహించనుండగా ఒకటి మాత్రం ప్రపల్షన్ మాడ్యూల్ నిర్వహించనుంది. ఈఏడు పేలోడ్లు ఒక్కొక్కటీ కొన్ని శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తాయి. చంద్రుడి నేలపై అధ్యయనం చేస్తున్న ChaSTE కాకుండా విక్రమ్‌లోని RAMBHA (అయాన్లు మరియు ఎలక్ట్రాన్లను అధ్యయనం చేయడానికి), ILSA (భూకంపాన్ని అధ్యయనం చేయడానికి), LRA (చంద్రుని వ్యవస్థ యొక్క గతిశీలతను అర్థం చేసుకోవడానికి) నిర్దేశించబడ్డాయి. Chandrayaan-3 Mission: Here are the first observations from the ChaSTE payload onboard Vikram Lander. ChaSTE (Chandra's Surface Thermophysical Experiment) measures the temperature profile of the lunar topsoil around the pole, to understand the thermal behaviour of the moon's… pic.twitter.com/VZ1cjWHTnd — ISRO (@isro) August 27, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ నినాదాల కలకలం -
90 సెకన్లలో భూసార పరీక్ష
కాన్పూర్: భూమిలో సారం ఎంత ఉందో తెలుసుకొనేందుకు రోజుల తరబడి వేచి ఉండనక్కర్లేదు. కేవలం 90 సెకన్లలో ఫలితం తెల్సుకోవచ్చు. ఇందుకు ప్రత్యేకమైన పోర్టబుల్ టెస్టింగ్ పరికరాన్ని ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ–కాన్పూర్ అభివృద్ధి చేసింది. ఈ పరీక్ష కోసం ఐదు గ్రాముల మట్టి చాలు. మొబైల్ యాప్ ద్వారా భూసారం తెలిసిపోతుంది. ‘భూ పరీక్షక్’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని ఐఐటీ–కాన్పూర్ తెలిపింది. పోర్టబుల్, వైర్లెస్ సాయిల్ టెస్టింగ్ పరికరం మట్టిలోని పోషకాలను కచ్చితంగా గుర్తిస్తుంది. ఈ పరికరంలో 5 సెంటీమీటర్ల పొడవైన స్తూపాకర పాత్ర ఉంటుంది. చదవండి: ‘నెల రోజులే ఎందుకు? రెండు, మూడు నెలలు బెనారస్‌లోనే ఉండాలి’ ఇందులో 5 గ్రాముల పొడి మట్టిని ఉంచి, బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేయాలి. ఈ మట్టి నమూనాను పరికరం వేగంగా విశ్లేషిస్తుంది. అందులోని నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం, కార్బన్ తదితర పోషకాలను గుర్తిస్తుంది. 90 సెకన్లలో సాయిల్ హెల్త్ రిపోర్టు స్క్రీన్‌పై కనిపిస్తుంది. సదరు భూమిలో ఏయే ఎరువులు ఎంత పరిమాణంలో చల్లాలో కూడా సూచిస్తుంది. ఈ పరికరం రైతులకు చక్కగా ఉపయోగపడుతుందని ఐఐటీ–కాన్పూర్ ప్రతినిధులు తెలిపారు. ఒక్క పరికరంతో లక్ష దాకా నమూనాలను పరీక్షించవచ్చని అన్నారు. ఐఐటీ–కాన్పూర్‌లోని డిపార్ట్మెంట్ కెమికల్ ఇంజనీరింగ్‌కు చెందిన ప్రొఫెసర్ జయంత్‌కుమార్ సింగ్, పల్లవ్ ప్రిన్స్, అషర్ అహ్మద్, యశస్వి ఖేమాని, మొహమ్మద్ అమిర్‌ఖాన్‌తో కూడిన బృందం ఈ ర్యాపిడ్ సాయిల్ టెస్టింగ్ డివైన్‌ను అభివృద్ధి చేసింది. రైతులు భూసార పరీక్ష చేయించాలంటే నమూనాను సేకరించి, జిల్లా కేంద్రాల్లో ఉండే ల్యాబ్‌లకు పంపించాల్సి వస్తోంది. సాయిల్ హెల్త్ కార్డు కోసం కనీసం 15 రోజులపాటు ఎదురు చూడాల్సి వస్తోంది. -
రన్‌వేకు అనుకూలమేనా?
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు ఆరేళ్లుగా కసరత్తు జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో ఒక్కో అధికారుల బృందం ఒక్కో అంశాన్ని పరిశీలిస్తోంది. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి.? ప్రతికూల పరిస్థితులేంటి.? అనే దానిపై క్షేత్రస్థాయికి వెళ్లి ఆరా తీస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు, గాలివాటం, కావాల్సిన స్థలం, రన్‌వే ఏర్పాటుకు మట్టి నమునాల సేకరణ, పెద్దపెద్ద భవనాలు, విద్యుత్ టవర్ల తొలగింపు, తదితర అంశాలను అధ్యయనం చేస్తూ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా సాయిల్ ఇన్వెస్టిగేషన్ కన్సల్టెంట్ (నేల దర్యాప్తు సలహాదారు) బృందం సభ్యులు సోమవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి మట్టి నమూనాలు సేకరించనున్నారు. అయితే నమూనాల సేకరణకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి అనుమతి రాలేదని, అనుమతి రాగానే మట్టి నమూనాలను సేకరిస్తామని బృందం సభ్యులు తెలిపారు. ఒక్కో బృందం.. ఒక్కో అంశంపై పరిశీలన జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారుల బృందం 2014లో భూమి సర్వే చేపట్టింది. అప్పట్లో ఐదు రోజుల పాటు సర్వే చేసిన అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కలిపి 1,562 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మూడేళ్ల వరకు విమానాశ్రయ ఏర్పాటులో ఎలాంటి కదలిక లేదు. 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉడాన్’ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై కదలిక వచ్చింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం అవకాశం కల్పించింది. ఇందులో ఆదిలాబాద్ కూడా ఉండడంతో విమానాశ్రయ ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే 2019 ఆగస్టులో ఎయిర్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారుల బృందం జిల్లాకు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసింది. విమానాశ్రయానికి కావాల్సిన స్థలం, బౌండ్రీలు, గుట్టలు, విద్యుత్ టవర్లు, పెద్ద భవనాలు, ట్రాఫిక్, వ్యాపార అభివృద్ధి అవకాశాలు, తదితర వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. నేటి నుంచి మట్టి నమూనాల సేకరణ విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా రన్‌వే స్థలంలో ఉన్న మట్టిని పరిశీలించేందుకు నేల దర్యాప్తు సలహాదారు (సాయిల్ ఇన్వెస్టిగేషన్ కన్సల్టెంట్) బృందం సభ్యులు జిల్లాకు వచ్చారు. విమానాశ్రయ స్థలంలో ఉన్న మట్టి రన్‌వేకు అనుకూలంగా ఉందా.? లేదా.. అనేది తేల్చేందుకు మట్టి నమూనాలు సేకరించనున్నారు. అయితే మంగళవారం వరకు ఏఏఐ నుంచి మట్టి నమూనాల సేకరణకు అనుమతి రాకపోవడంతో బృందం సభ్యులు అక్కడే టెంట్ వేసుకొని ఉన్నారు. అనుమతి రాగానే నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపుతామని, తద్వారా ఇక్కడున్న మట్టిని దృష్టిలో ఉంచుకొని రన్‌వే ఏ విధంగా డిజైన్ చేయొచ్చనే ఐడియా వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం వరకు అనుమతి వస్తే సాయంత్రం నుంచి మట్టి నమూనాలు సేకరించనున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. త్వరలో మరో బృందం? ఆదిలాబాద్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు పరిస్థితులన్నీ అనుకూలించడంతో త్వరలో మరో అధికారుల బృందం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఇక్కడి సాంకేతిక అంశాలపై ఆ బృందం పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయానికి దగ్గరగా ఎలాంటి విద్యుత్ టవర్లు ఉండకూడదు. అయితే రన్‌వే స్థలానికి కొద్ది రూపంలో అనుకుంట గ్రామ శివారులో విద్యుత్ టవర్లు ఉన్నాయి. వాటిని తీసి కొత్త చోట ఏర్పాటు చేయడమా.? లేక విమానాశ్రయ డిజైన్‌ను మార్చడమా.? అనే దానిపై ఆ బృందం ఆరా తీయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు భూమి స్వాధీనం, విమానాశ్రయం చుట్టు పక్కల అనుకూలతలను పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. మట్టి నమూనాలు సేకరిస్తారు విమానాశ్రయ ఏర్పాటు విషయమై జిల్లాకు వచ్చిన అధికారుల బృందాలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన సాయిల్ ఇన్వెస్టిగేషన్ బృందం రన్‌వే ఏర్పాటు కోసం మట్టి నమూనాలు సేకరించనుంది. ఇందుకు సభ్యులకు లోకేషన్, ఇక్కడి పరిస్థితులు, స్థలం, బౌండ్రీలు తదితర విషయాలను వివరించాం. రాబోయే రోజుల్లో మరిన్నీ పరిశీలనలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. – సురేశ్ రాథోడ్, ఆర్అండ్బీ డిప్యూటీ ఈఈ -
అయోధ్య: ప్రారంభమైన రామమందిర నిర్మాణం
-
ప్రారంభమైన రామమందిర నిర్మాణం
లక్నో: దేశప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూసిన రామ మందిర నిర్మణానికి సంబంధించి ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. ఆలయాన్ని నిర్మించే ప్రాంతంలో ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి ఐఐటీ మద్రాస్, సీబీఆర్ఐ రూర్కీ ఇంజనీర్లు మట్టిని పరీక్షిస్తున్నారు. 36 నుంచి 40 నెలల కాలంలో ఆలయం నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా రామ జన్మభూమి ట్రస్ట్ ట్వీట్ చేసింది. ‘మన పురాతన, సంప్రదాయబద్ధమైన నిర్మాణ నైపుణ్యాలను అనుసరించి మందిర నిర్మాణం జరుగుతుంది. భూకంపాలు, తుపానులతో పాటు అన్ని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నాము. మందిర నిర్మాణంలో ఉక్కును వాడటం లేదు’ అంటూ ట్వీట్ చేసింది. The construction of Shri Ram Janmbhoomi Mandir has begun. Engineers from CBRI Roorkee, IIT Madras along with L&T are now testing the soil at the mandir site. The construction work is expected to finish in 36-40 months. — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 20, 2020 -
మన్ను.. మన్నిక ఇక్రిశాట్ చెప్పునిక!
సాక్షి, హైదరాబాద్: భూఅంతరాల్లో దాగి ఉన్న పోషకాల రహస్యాన్ని ఛేదించేందుకు అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ కాకతీయ ఫలితాలెలా ఉన్నాయన్న దానిపై దృష్టి సారించిన ఇక్రిశాట్ అభివృద్ధి కేంద్రం (ఐడీసీ) ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించింది. దీనికోసం 90 గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించింది. ఇద్దరితో కూడిన ఎనిమిది బృందాలు ఇక్కడ పర్యటించి ప్రతి గ్రామంలో 11 నమూనాలను సేకరించాయి. ఇందులో 10 నమూనాలు రైతుల భూములవి కాగా, మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల్లోని మట్టిని పోసిన భూముల్లో ఒక్కో నమూనా తీసుకున్నారు. ఈ నమూనాలను పరిశీలించి ఆయా భూముల్లోని పోషక విలువల వివరాలు, భూ క్షారత, మేలు చేసే మూలకాల వివరాలను సేకరించనున్నారు. ప్రస్తుతం ఈ నమూనాలు పరిశీలన దశలో ఉన్నాయని, పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని ఇక్రిశాట్ అధికారులు చెపుతున్నారు. కాగా, నమూనాల సేకరణకు వెళ్లినప్పుడు రైతులు తమ భూమిలోని పోషక విలువలను తెలుసుకునేందుకు ఉత్సాహం చూపించారని, వారి సహకారంతో సేకరణ 8 రోజుల్లో పూర్తి చేయగలిగామని ఇక్రిశాట్ సైంటిఫిక్ అధికారి అరుణ శేషాద్రి తెలిపారు. నమూనాల సేకరణకు ప్రత్యేక యాప్‌ను తయారుచేసి జీఐఎస్‌తో అనుసంధానం చేసినట్లు చెప్పారు. -
అన్నదాతకు అండగా..
సాక్షి, నాగిరెడ్డిపేట (కామారెడ్డి): జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,46,770 హెక్టార్లు ఉంది. ప్రధాన పంట వరి కాగా తర్వాత మొక్కజొన్న, పత్తి తదితర పంట లు సాగు చేస్తున్నారు. కాగా జిల్లాలో రైతులు ఎడాపెడా ఎరువులను వినియోగించడం వల్ల పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ (ఎన్ఎంఎస్ఏ)ను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాలకు వ్యవసాయ అధికారులు వెళ్లి, మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. జిల్లాలో అధికారులు రైతుల భూముల్లోనుంచి మట్టిని సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మండలానికో మోడల్ విలేజ్ జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ కింద అధి కారులు 2019–20 సంవత్సరానికి జిల్లాలో మండలానికో మోడల్ విలేజ్ ఎంపిక చేశారు. జిల్లాలో 22 మండలాలు ఉండగా.. 22 గ్రామాలను ఎంపిక చేశారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలను సాగు చేయడం, ఎరువులు వినియోగించడం వల్ల ఆశించిన దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో భూసారం తెలుసుకోవడానికి వ్యవసాయ అధికారులు మట్టి పరీక్షలు నిర్వహిస్తారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ఆధునిక పద్ధతులను అమలు చేస్తారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగులో పాటించాల్సిన మెలకువలను రైతులకు వివరిస్తారు. మోడల్ విలేజ్‌లుగా ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతిరైతుకు సంబంధించిన భూముల్లో మట్టిని సేకరించి పరీక్షలకు పంపించారు. వీటి ఫలితాలను వచ్చేనెలలో రైతులకు అందించేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కాగా జిల్లాలో ఎంపిక చేసిన 22 గ్రామాల్లో 3,485 మంది రైతులకు సంబంధించి 3,520 మట్టి నమూనాలను సేకరించారు. గతంలో పలుమార్లు భూసార పరీక్షల నిమిత్తం రైతుల భూముల్లో మట్టిని సేకరించినప్పటికీ వాటి ఫలితాలను రైతులకు అందించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఈసారైనా రైతుల భూముల్లో నుంచి సేకరించిన మట్టినమూనాలకు సంబంధించి ఫలితాలను రైతులకు అందిస్తారా అని రైతులు అనుమానిస్తున్నారు. వచ్చేనెలలో ఫలితాలు అందిస్తాం ఎన్ఎంఎస్ఏ పథకం కింద జిల్లాలో 22 గ్రామాలను ఎంపిక చేశాం. ఈ గ్రామాల్లో రైతుల భూములకు సంబంధించి మట్టినమూనాలను సేకరించి భూసార పరీక్షలకు పంపించాం. వీటి ఫలితాలను వచ్చేనెలలో రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీంతోపాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఈ గ్రామాల్లో అమలు చేస్తాం. – నాగేంద్రయ్య, డీఏవో, కామారెడ్డి -
అనంత భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువ
– పశువుల ఎరువు, వర్మీ, ప్రకృతి వ్యవసాయం శరణ్యం – 67,500 మట్టి పరీక్షలకు సాయిల్హెల్త్ కార్డుల పంపిణీ – భూసార పరీక్షా కేంద్రం ఏడీఏ ఎం.కృష్ణమూర్తి వెల్లడి అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఉన్న ఎర్రనేలలు, నల్లరేగడి భూముల్లో దాదాపు 80 శాతం మేర సేంద్రియ కర్బనం తక్కువగా ఉందని స్థానిక భూసార పరీక్షా కేంద్రం సహాయ సంచాలకులు ఎం.కృష్ణమూర్తి తెలిపారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల ఎరువుతో పాటు వర్మీకంపోస్టులు, వేప, కానుగ లాంటి వృక్ష సంబంధిత ఎరువులు, అలాగే జనుముల, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట ఎరువులు వేయడంతో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తే సేంద్రియ కర్బనం పెరిగే అవకాశం ఉందన్నారు. 1.63 లక్షల మట్టి పరీక్షలు : విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూసారం తగ్గిపోవడం జరుగుతోంది. ఈ క్రమంలో పంట దిగుబడులు తగ్గిపోవడంతో పాటు రైతులకు పెట్టుబడి భారం పెరిగిపోతోంది. దీంతో ఇటీవల మట్టి పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 2014లో 30,350 మట్టి పరీక్షలు, 2015లో 65,500, 2016లో 67,500.. ఇలా గత మూడేళ్ల కాలంలో 1,63,350 మట్టి పరీక్షలు నిర్వహించారు. 25 ఎకరాలను ఒక గ్రిడ్‌గా విభజించి గత మూడేళ్లలో 5.10 లక్షల మంది రైతులకు మట్టి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు, ఎలాంటి ఎరువులు వాడాలనే సిఫారసులు చేస్తూ సాయిల్ హెల్త్‌కార్డులు (భూసార పత్రాలు) అందజేశారు. ఈ క్రమంలో రైతుల్లో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతోంది. గతంలో పోల్చిచూస్తే ప్రస్తుతం 10 నుంచి 15 శాతం రసాయన ఎరువుల వినియోగం తగ్గినట్లు కనబడుతోంది. ఇది మంచి పరిణామంగా భావించి రైతుల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి అన్ని అవకాశాలను వ్యవసాయశాఖ వినియోగించుకుంటోంది. భూసార పరీక్షల ప్రాధాన్యతను రైతులు ఇపుడిప్పుడే గుర్తిస్తూ ఇటీవల కాలంలో రైతులే స్వచ్ఛందంగా మట్టినమూనాలు తీసుకువస్తున్నారు. సేంద్రియ కర్బనం, నత్రజని, జింక్ తక్కువే : గత మూడేళ్లుగా చేసిన మట్టిపరీక్షలు, వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తే నత్రజని, జింక్, సేంద్రియ కర్బనం చాలా తక్కువగానే ఉన్నాయి. భూసారం పెరగడానికి, పంట దిగుబడులు పెరగడానికి అవసరమైన సేంద్రియ కర్బనం దాదాపు 80 శాతం భూముల్లో తక్కువగానే ఉంది. నత్రజని శాతం తక్కువగా ఉండగా జింక్, బోరాన్ లాంటి సూక్ష్మపోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) 26 నుంచి 30 శాతం మేర తక్కువ ఉన్నట్లు స్పష్టమవుతోంది. భాస్వరం, పొటాష్ లాంటివి సాధారణంగా, కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న భూసారం, పంటల దిగుబడులు పెరిగి వ్యవసాయం రైతులకు లాభసాటి కావాలంటే పెట్టుబడి లేని వ్యవసాయం (జీరోబేస్డ్ ఫార్మింగ్), ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం (నాచురల్ ఫార్మింగ్), పురుగు మందులు లేని వ్యవసాయం (నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్) లాంటి పద్ధతులు అవలంభించాలి. ఒకరకంగా చెప్పాలంటే ఈ రకం వ్యవసాయం మన పెద్దలు, పూర్వీకులు చేసిన సేద్యపు పద్ధతులే. మరోసారి అలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే కాని వ్యవసాయం మనుగడ సాధ్యం కాదు. అలాగే పశువుల ఎరువు, వర్మీ, వేప, కానుగ, పచ్చిరొట్ట ఎరువులు వాడితే సేంద్రియ కర్బనం శాతం పెరుగుతుంది. జింక్‌సల్ఫేట్, జిప్పం, బోరాన్ లాంటి సూక్ష్మపోషకాలు పంటలకు వేయాలి. రసాయన ఎరువులు బాగా తగ్గించాలి. భూసార పత్రాల్లో సిఫారసు చేసిన విధంగా సమగ్ర సమతుల్య ఎరువుల వాడకం చేపట్టాలి. ప్రాంతాల వారీగా నేల స్వభావాన్ని బట్టి అధికారులు, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు ఎరువులు వేస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. -
తేలిక నేలల్లో పత్తి సాగు వద్దు
నంద్యాల అర్బన్ : భూసార పరీ„ýక్షల ఫలితాలకనుగుణంగా పంటల సాగు జరగాలని, తేలికపాటి నేలల్లో పత్తిసాగు చేపట్టవద్దని జేడీఏ ఉమామహేశ్వరమ్మ రైతులకు సూచించారు. స్థానిక వైఎస్సార్ సెంటినరీ హాల్లో బుధవారం నంద్యాల రెవెన్యూ డివిజన్ స్థాయి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక ఖరీఫ్ 2017పై డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేడీఏ మాట్లాడుతూ పంటలతో పాటు పాడి పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. రసాయనిక ఎరువులను విచక్షణా రహితంగా వాడరాదని చెప్పారు. నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పచ్చిరొట్టె ఎరువులు, అంతర్ పంటలను ప్రోత్సహించాలన్నారు. నల్లరేగడి నేలల్లో రెండు పంటలను సాగు చేయాలని చెప్పారు. కొత్త వంగడాలతో పంటల సాగు పెరగాలని తెలిపారు. ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళికల ప్రకారం జిల్లాలో 6 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అవుతున్నాయన్నారు. ఈ ఏడాది పత్తి, వరి, మినుము, మొక్కజొన్న తదితర పంటల సాగు పెరగవచ్చన్నారు. గత ఏడాది జిల్లాలో 1.76 లక్షల హెక్టార్లలో సాగైన పత్తి ఈ ఏడాది 2.30 లక్షల హెక్టార్లు, లక్ష హెక్టార్లలో వరి సాగయ్యే అవకాశం ఉందని తెలిపారు. కంది గతేడాది 1.10 లక్షల హెక్టార్లలో సాగు కాగా ఈ ఏడాది 50 వేల హెక్టార్లకు తగ్గవచ్చని చెప్పారు. నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల్లో యాజమాన్య పద్ధతులను అనుసరించాలన్నారు. సీనియర్ శాస్త్రవేత్త సరళమ్మ, ఆత్మ డీడీ భగత్‌సింగ్ స్వరూప్, ఎఫ్‌టీసీ డీడీ సంధ్యారాణి, ఆత్మ డీడీ రవికుమార్, జేడీఏ కార్యాలయ ప్రతినిధి మల్లికార్జున పాల్గొన్నారు. -
భూసార పరీక్షలు విదేశీ కుట్ర
అమలాపురం/ కాకినాడ రూరల్: ‘భూమి తల్లిలాంటిది. తల్లి పాలు ఇచ్చినట్టు పంట చేనుకు నేలతల్లి పోషకాలందిస్తోంది. అటువంటి తల్లిపాలను పరీక్ష చేయడం న్యాయమేనా? దేశీయ ఆర్థిక విధానాలను విచ్ఛన్నం చేసే కుట్రలో భాగంగానే విదేశీయులు ఆధునిక సాగుపై రుద్దినదే భూసార పరీక్ష’ అని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో జరుగుతున్న పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతుల్లో ఐదో రోజు గురువారం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ‘భూసార పరీక్ష రైతులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. భూమి ఉపరితలంపై ఆరు అంగుళాల మట్టిని తీసుకుని పరీక్షిస్తారు. దీంతో భూమిలో ఏమున్నదనేది ఎలా నిర్ధారిస్తారని ఆయన యూనివర్శిటీ శాస్త్రవేత్తలను, వ్యవసాయశాఖాధికారులను ప్రశ్నించారు. ‘భూసార పరీక్ష చేసిన తరువాత ఇచ్చే నివేదికలో మొదటిలైన్‌లోనే మీ భూమిలో 7.8 పీహెచ్ ఉందని ఉంటుంది. ఇది చాలా విచిత్రం. ఏ రైతుకు అర్థం కాదు’ అని గుర్తు చేశారు.