solution problems
-
హెల్త్: మెడనొప్పికి అసలు కారణాలేంటో తెలుసా!?
సాధారణంగా టీనేజర్లలో మెడనొప్పి, నడుమునొప్పి లాంటి మధ్యవయస్కులకు వచ్చే ఆరోగ్య సమస్యలు అంతగా కనిపించకపోవచ్చుగానీ.. అవి రాకపోవడం అంటూ ఉండదు. ఆ వయసులో వారికుండే కొన్ని రకాల లైఫ్‌స్టైల్ అలవాట్లూ, ఇబ్బందులే అందుకు కారణం. ఉదాహరణకు.. వారు స్కూళ్లూ/కాలేజీలలో చాలాసేపు అదేపనిగా కూర్చునే ఉండటం, సరైన పోశ్చర్‌లో కూర్చోకపోవడం, బల్ల మీద ఉన్న కంప్యూటర్‌కూ, కుర్చీకీ మధ్య తగినంత దూరం లేకపోవడం లాంటి ఎన్నో అంశాల కారణంగా వాళ్లకూ మెడనొప్పి రావచ్చు. అలవాట్లే కాకుండా.. ఆరోగ్య సమస్యల విషయానికొస్తే.. థైరాయిడ్ లోపాలు, చిన్నతనంలో వచ్చే (టైప్–1) డయాబెటిస్, విటమిన్ లోపాలు, జీవక్రియల్లో లోపాల వల్ల కూడా టీనేజర్లలో మెడనొప్పి వస్తుంటుంది. అలాగే, టీనేజర్లకు ఆ వయసులో కొందరికి వచ్చే స్థూలకాయం, సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతోనూ రావచ్చు. టీనేజర్లలో మెడనొప్పి నివారణకు చేయాల్సినవి.. పై సమస్యల్లో ఏదైనా కారణమా అని మొదట చూసుకోవాలి. ఉదాహరణకు.. స్కూల్ / కాలేజీలో కూర్చునే చోట.. డెస్క్ తమ ఎత్తుకు తగినట్లుగా ఉందో లేదో, అందుకు తగినట్లుగా పోశ్చర్ ఉందో లేదో పరిశీలించుకోవాలి. కంప్యూటర్లపై పనిచేయడం లేదా వీడియో గేమ్స్ కోసం అదేపనిగా మెడను నిక్కించి ఉంచడం వల్ల ఆ భాగంలోని వెన్నుపూస ఎముకలూ, మెడ కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. పోశ్చర్ సరిగా లేనప్పుడు / కూర్చున్నప్పుడు వెన్నుతో పాటు, దేహంలోని కండరాల మీద పడాల్సిన విధంగా కాకుండా.. ఒక్కోచోట ఎక్కువ ఒత్తిడి పడటం, మరికొన్ని చోట్ల సరిగా పడకపోవడం వంటి సమస్యలతో మెడనొప్పి, వెన్నునొప్పి రావచ్చు. అందుకే స్కూల్లో/కాలేజీలో లేదా ఇంట్లో చదువుల బల్ల / కంప్యూటర్ టేబుల్ వద్ద సరిగా (సరైన పోశ్చర్‌లో) కూర్చుండేలా చూడాలి. వెన్నుపై సమాన భారం పడేలా నిటారుగా ఉండాలి. ఏదో ఒక వైపునకు ఒంగిపోకూడదు. స్థూలకాయం ఉన్న టీనేజీ పిల్లల్లో మెడనొప్పి సమస్య ఎక్కువ. అందువల్ల ఒబేసిటీని పెంచే జంక్‌ఫుడ్ /బేకరీ ఐటమ్స్ లాంటివి కాకుండా టీనేజర్లకు అన్ని పోషకాలూ, విటమిన్లు అందేలా సమతులాహారం ఇవ్వాలి. గతంలో టీనేజీ పిల్లలు వారి వయసుకు తగ్గట్లు బాగానే ఆటలాడేవారు. కానీ ఇటీవల వారు ఆటలాడటం తగ్గిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత అరుదుగా ఆడే ఆటలూ పూర్తిగా కరవైపోయాయి. దాంతో వెన్ను, దాని ఇతర ఎముకలకు తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా మెడనొప్పి రావడం ఇటీవల పెరిగింది. తగినంత వ్యాయామం లేని టీనేజర్లు.. తమ దేహ శ్రమతో తమ సామర్థ్యం (స్టామినా) పెంచుకోకపోవడం వల్ల త్వరగా అలసిపోతుంటారు. వారి మెడ భాగపు కండరాలూ, అక్కడి వెన్నుపూసల సామర్థ్యం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే పిల్లలు తగినంత వ్యాయామం చేయడం / ఆటలాడటం ద్వారా స్టామినా పెంచుకుంటే మెడనొప్పి వంటి సమస్యలూ తగ్గిపోతాయి. పిల్లల్లో విటమిన్–డి లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. అంతేకాదు.. వ్యాధి నిరోధకత తగ్గి.. వయసు పెరిగే క్రమంలో డయాబెటిస్, క్యాన్సర్ వ్యాధుల రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే టీనేజీ పిల్లలు ఆరుబయట ఆడేలా చూడాలి. ఇవి చదవండి: హెల్త్: నిద్రలేమి సమస్యా? అయితే ఇలా చేయండి! -
విరాసత్ నుంచి నాలా వరకు..
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల లావాదేవీలకు సంబంధించి తలెత్తుతున్న చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిత్తల్ కసరత్తు ప్రారంభించారు. సమస్యలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు వారంలోపే పూర్తవుతాయని.. ఆ తర్వాత ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో వస్తున్న ఇబ్బందుల్లో పదికిపైగా చిన్నచిన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీసీఎల్ఏ వర్గాలు చెబుతున్నాయి. చిన్నవే కానీ.. సతాయిస్తున్నాయి వాస్తవానికి వ్యవసాయ భూముల లావాదేవీలు మాన్యువల్‌గా జరిగే సమయంలో ఎక్కడికక్కడ సమస్యలు వచ్చినా పెద్దగా వెలుగులోకి వచ్చేవి కావు. వాటి పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టినప్పటికీ క్షేత్రస్థాయిలోనే వాటిని పరిష్కరించేవారు. కానీ ధరణి పోర్టల్ ఆన్లైన్ వేదిక కావడంతో ఏ చిన్న సమస్య అయినా రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఏకరీతిలో ఇబ్బందులు పెడుతోంది. దీనికితోడు భూసమస్యల పరిష్కార అధికారం కలెక్టర్ల చేతిలో ఉండటంతో మరింత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ధరణి సమస్యలపై సీసీఎల్ఏ నవీన్‌మిత్తల్ ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ రికార్డులను ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేయడంలోనే అసలు సమస్య వచ్చిందనే నిర్ధారణకు వచ్చి ఆయా సమస్యల నివృత్తి, పరిష్కారానికి రోజూ కొంత సమయం కేటాయిస్తున్నారు. తన వరకు వస్తున్న దరఖాస్తులు, విజ్ఞప్తులను అధ్యయనం చేయడంతోపాటు సీసీఎల్ఏ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా.. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు చిన్న సమస్యలు కూడా అగ్నిపరీక్షలుగా మారిపోయాయి. ముఖ్యంగా పట్టాదారు చనిపోయే సమయం నాటికి ఆ వ్యక్తి పేరిట ఉన్న భూమికి సంబంధించిన రికార్డులపై తహసీల్దార్ డిజిటల్ సంతకం లేకపోతే ఆ భూమిని చనిపోయిన పట్టాదారు వారసులకు బదిలీచేసే అవకాశం ధరణి పోర్టల్ సాఫ్ట్‌వేర్‌లో అందుబాటులో లేదు. అలాగే గతంలో నాలా (వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు) భూములు ఇప్పటికీ ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల విభాగంలోనే కనిపిస్తున్నాయి. ఈ భూములను నాలా కింద మార్పు చేసే ఆప్షన్ కూడా ధరణిలో లేదు. గతంలో కంపెనీలు, ట్రస్టుల పేర్లపై ఉన్న భూముల వివరాలు ధరణిలో సక్రమంగా అప్లోడ్ కాకపోవడంతో వాటి పాసుపుస్తకాలు ఆయా కంపెనీలు, ట్రస్టుల పేరిట రావట్లేదు. ఇలాంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారం చూపగా ఇందుకు సంబంధించిన మార్పులు వారం రోజులు లోపే ధరణిలో కనిపించనున్నాయి. మరోవైపు మరికొన్ని సమస్యలను గుర్తించి వాటికి అవసరమైన మార్పులు చేసే ప్రక్రియను ప్రారంభించారు. మిస్సింగ్‌కు మిత్తల్ ‘మార్కు’ ధరణిలో ఎదురవుతున్న మరో సమస్య మిస్సింగ్ సర్వేనంబర్లు. రెవెన్యూ ఆన్లైన్ రికార్డుల్లో కొన్ని సర్వేనంబర్లు మిస్సవడంతో ఈ సర్వే నంబర్లలోని భూముల రైతులు పాసు పుస్తకాలు లేక, ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు అందక ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ధరణిలో మిస్సింగ్ సర్వేనంబర్ల నమోదు కోసం సీసీఎల్ఏ ప్రత్యేక ఆప్షన్ కల్పించారు. టీఎం–33 కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు సంబంధించిన సర్వేనంబర్లను పోర్టల్‌లో సరిచేస్తున్నారు. ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో ఉన్న నేపథ్యంలో రోజుకు 500 చొప్పున దరఖాస్తులను పరిష్కరించేందుకు సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. -
కలుపుతోనే కలుపు నిర్మూలన!
ఏ పంటకైనా కలుపు సమస్యే. కలుపు నివారణకు సంప్రదాయకంగా కూలీలతో తీయించడం లేదా గుంటక తోలటం చేస్తుంటారు. అయితే, కొద్ది సంవత్సరాలుగా కూలీల కొరత నేపథ్యంలో కలుపు నిర్మూలనకు రసాయనిక కలుపు మందుల పిచికారీ పెరిగిపోయింది. గ్లైఫొసేట్ వంటి అత్యంత ప్రమాదకరమైన కలుపు మందుల వల్ల కేన్సర్ వ్యాధి ప్రబలుతోందని నిర్థారణ కావడంతో ప్రభుత్వాలు కూడా దీని వాడకంపై తీవ్ర ఆంక్షలు విధించడం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు సేంద్రియ కలుపు మందులపై దృష్టిసారిస్తున్నారు. కలుపుతోనే కలుపును నిర్మూలించవచ్చని ఈ రైతులు అనుభవపూర్వకంగా చెబుతుండటం రైతాంగంలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఒక పొలంలో ఏవైతే కలుపు రకాలు సమస్యగా ఉన్నాయో.. ఆ కలుపు మొక్కలు కొన్నిటిని వేర్లు, దుంపలతో సహా పీకి, ముక్కలు చేసి, పెనం మీద వేపి, బూడిద చేసి దానికి పంచదార, పాలు కలిపి మురగబెడితే తయారయ్యే ద్రావణాన్ని ‘గరళకంఠ ద్రావణం’ అని పిలుస్తున్నారు. ఈ ద్రావణాన్ని పొలం అంతటా పిచికారీ చేస్తే.. చల్లిన 12 రోజుల నుంచి 30 రోజుల్లో కలుపు మొక్కలు ఎండిపోతున్నాయని చెబుతున్నారు. ఈ ద్రావణంలో కలపని మొక్కలకు అంటే.. పంటలకు ఈ ద్రావణం వల్ల ఏమీ నష్టం జరగక పోవడం విశేషం. సీజన్లో రెండుసార్లు ఇలా కలుపు మొక్కల బూడిద నీటిని చల్లితే కలుపు తీయాల్సిన లేదా కలుపు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదని ఈ రైతులు నొక్కి చెబుతున్నారు. ఇది తాము కనిపెట్టిన పద్ధతి కాదని, 6వ శతాబ్దం నాటి ‘వృక్షాయుర్వేదం’లో పేర్కొన్నదేనంటున్నారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి, భూసారానికి హాని కలిగించని ‘కలుపుతోనే కలుపును నిర్మూలించే పద్ధతి’పై రైతుల అనుభవాలు వారి మాటల్లోనే.. ‘సాగుబడి’ పాఠకుల కోసం..! ఇరవై రోజుల్లో కలుపు మాడిపోతుంది! నా పేరు మర్కంటి దత్తాద్రి (దత్తు). ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ఎన్.ఐ.ఆర్.డి. ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లి సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇచ్చి వస్తూనే.. నా వ్యవసాయం నేను చేసుకుంటున్నాను. ఈ ఏడాది పత్తి చేనులో కలుపు బాగా పెరిగింది. వృక్షాయుర్వేదంలో చెప్పినట్టు ఆచరించి ఫలితాలు పొంది సీనియర్ రైతులు మేకా రాధాకృష్ణమూర్తి, కొక్కు అశోక్ కుమార్ సూచించిన విధంగా నేను కలుపు మొక్కల బూడిద ద్రావణంతో నా ఎకరం పత్తి చేనులో కలుపును విజయవంతంగా నిర్మూలించుకుంటున్నాను. జూలై 15న ఈ ద్రావణాన్ని పత్తి పంటలో పిచికారీ చేశాను. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. అలాగే జూలై 15వ తేదీన పిచికారీ చేశాను. ఫలితాలు చాలా బాగున్నాయి. గడ్డి జాతి కలుపు మొక్కలు తొందరగా మాడిపోతున్నాయి. వెడల్పు ఆకులు/ వేరు వ్యవస్థ బలంగా ఉన్న మొక్కలు కొంచెం నెమ్మదిగా చనిపోతున్నాయి. మామూలుగా గరిక పీకినా రాదు. ఈ ద్రావణం చల్లిన ఆరో రోజు తర్వాత పట్టుకొని పీకగానే వస్తుంది. అప్పటికే దాని వేరు వ్యవస్థ మాడిపోయి ఉంది. 8–12 రోజుల నుంచి మొండి జాతుల కలుపు మొక్కలు చనిపోతాయి. కలుపు మొక్కల బూడిద ద్రావణం తయారీ ఇలా.. ఎకరం పత్తి చేను కోసం నేను ద్రావణం తయారు చేసుకున్న విధానం ఇది.. గరిక, బెండలం, వయ్యారిభామ, గూనుగ అనే నాలుగు రకాల కలుపు మొక్కలను.. రకానికి కిలో చొప్పున వేర్లు, దుంపలతో సహా పచ్చి మొక్కలను పీకి, మట్టిని కడిగేయాలి. నీటి తడి ఆరిపోయే వరకు కొద్దిసేపు ఆరబెట్టి.. ముక్కలు చేసి.. పెనం మీద వేసి.. బూడిద చేశాను. ఇలా తయారు చేసిన బూడిద 200 గ్రాములు, చక్కెర 200 గ్రాములు, లీటరు ఆవు పాలు కలిపితే.. నల్లటి ద్రావణం తయారవుతుంది. దీన్ని రెండు రోజులు బాగా, అనేకసార్లు కలియదిప్పాలి. మిక్సీలో పోసి.. తిప్పాలి. లేదా కవ్వంతో బాగా గిలకొట్టాలి. మూడో రోజు ఈ ద్రావణాన్ని.. ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిలో ఈ ద్రావణాన్ని కలిపి.. 2 రోజులు బాగా కలియబెడుతూ మురగబెట్టాలి. నీరు నీలి రంగుకు మారుతుంది. 3వ రోజు ఈ నీటిని నేరుగా కలుపుతో నిండిన పొలంలో పవర్ స్ప్రేయర్‌తో కలుపు మొక్కలు నిలువెల్లా బాగా తడిచి వేర్లలోకి కూడా ద్రావణం నీరు చేరేలా పిచికారీ చేయాలి. దీన్ని పిచికారీ చేసేటప్పుడు కచ్చితంగా భూమిలో తేమ ఉండాలి. తేమ లేనప్పుడు పిచికారీ చేస్తే దీని ప్రభావం ఉండదు. పంట కాలంలో రెండు సార్లు పిచికారీ చేసుకుంటే.. ఏయే రకాల కలుపు మొక్కలను పీకి మసి చేసి ద్రావణం తయారు చేసి వాడామో.. ఆయా రకాల కలుపు జాతుల నిర్మూలన అవుతుంది. ఇంకా మిగిలిన రకాలేమైనా ఉంటే.. వాటితో మరోసారి ద్రావణం తయారు చేసి చల్లితే.. అవి కూడా పోతాయి. ఆ భూమిలో పంటలకు ఎటువంటి హానీ ఉండదు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రధాన, అంతర పంటల మొక్కలను ఈ ద్రావణంలో వాడకూడదు. ఒక్కోసారి కలుపు మొక్కల విత్తనాలు గాలికి కొట్టుకు వచ్చి పడినప్పుడు, ఆ రకాల కలుపు మళ్లీ మొలవొచ్చు. అలాంటప్పుడు మరోసారి ద్రావణం తయారు చేసి వాడాలి. ప్రమాదకరమైన రసాయనిక కలుపు మందులు చల్లకుండానే కలుపు సమస్య నుంచి ఈ గరళకంఠ ద్రావణంతో నిస్సందేహంగా బయటపడొచ్చు. ఇది నా అనుభవం. ఒకసారి ఏవైనా తప్పులు జరిగితే, ఫలితాలు పూర్తిగా రావు.. అలాంటప్పుడు మళ్లీ ప్రయత్నించండి. చల్లిన తర్వాత ఫలితాలు పూర్తిగా కంటికి కనపడాలంటే.. కనీసం 20 రోజులు వేచి ఉండాలి. గరళకంఠ ద్రావణంతో కలుపు నిర్మూలన అద్భుతంగా జరుగుతుంది. లేత కలుపు మొక్కలను త్వరగా నిర్మూలించవచ్చు. ముదిరిన కలుపు మొక్కల నిర్మూలనకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. బాగా ముదిరి విత్తనం వచ్చిన కలుపు మొక్కల నిర్మూలన కష్టం. – మర్కంటి దత్తాద్రి (దత్తు) (80084 84100), సేంద్రియ పత్తి రైతు, విఠోలి, ముదోల్ మండలం, నిర్మల్ జిల్లా (ఫొటోలు: బాతూరి కైలాష్, సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్) వయ్యారి భామ, తుంగ, గరిక నిర్మూలన! ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అరెకరంలో ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ.. కలుపు నిర్మూలనకు గరళకంఠ ద్రావణం పిచికారీ చేశాను. ఏ కలుపు రకాలను తీసుకొని, బూడిద చేసి చల్లానో ఆ రకాల కలుపు మొక్కలన్నీ నూటికి నూరు శాతం చనిపోయాయి. తుంగ, గరికతోపాటు వయ్యారిభామ కూడా చనిపోయాయి. అయితే, కలుపు మొక్కలను పీకి బూడిద చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పంటకు సంబంధించిన మొక్కలు కలవకుండా చూసుకోవాలి. అవి కూడా కలిస్తే ఈ ద్రావణం చల్లినప్పుడు పంట కూడా చనిపోతుంది. పిచికారీ చేసిన 48 గంటలు దాటాక.. వేర్ల దగ్గర నుంచి ప్రభావం కనిపించింది. కలుపు ఎదుగుదల అప్పటి నుంచే ఆగిపోయింది. 20–30 రోజుల్లో కలుపు మొక్కలు చనిపోయాయి. ఆ పంట కాలంలో ఆ కలుపు మళ్లీ పుట్టదు. – తుపాకుల భూమయ్య (96767 18709), జూలపల్లి, పెద్దపల్లి జిల్లా చిన్న, పెద్ద రైతులెవరైనా అనుసరించవచ్చు! కలుపు మొక్కలతో తయారు చేసిన గరళకంఠ ద్రావణంతో ప్రధాన పంట మొక్కలకు ఎటువంటి హానీ జరగదు. కలుపు మొక్కలు వేర్ల నుంచి మురిగిపోతాయి. కొద్ది రోజుల్లోనే పెరుగుదల ఆగిపోయి.. కలుపు మొక్కలు ముట్టుకుంటే ఊడిపోతాయి. తర్వాత కొద్ది రోజులకు ఎండిపోతాయి. ఎన్ని ఎకరాలకైనా బెల్లం వండే బాండీల్లో/పాత్రల్లో ఒకేసారి భారీ ఎత్తున కలుపు బూడిదను తయారు చేసుకొని.. దానితో ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చిన్న, పెద్ద రైతులు ఎవరైనా ఆచరించదగిన ఖర్చులేని, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని లేని కలుపు నిర్మూలన పద్ధతి అని అందరూ గుర్తించాలి. కలుపు మొక్కల బూడిదను ఎప్పటికప్పుడు వాడుకోవాలన్న నియమం ఏమీ లేదు. ఈ బూడిదను నిల్వ చేసుకొని.. ఆ తర్వాతయినా వాడుకోవచ్చు. – కొక్కు అశోక్‌కుమార్ (98661 92761), సేంద్రియ రైతు, జగిత్యాల తుంగ వేర్లు 3 రోజుల్లో మాడిపోతాయి! 2011 నుంచి ప్రకృతి వ్యవసాయంలో వరి, తదితర పంటలు పండిస్తున్నాను. వరిలో తుంగ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. వృక్షాయుర్వేదంలో చెప్పిన ప్రకారం.. కలుపును కలుపుతోనే నిర్మూలించడం సాధ్యమేనని అనుభవపూర్వకంగా మేం తెలుసుకున్నాం. తుంగ, గరిక వంటి కలుపును సమర్థవంతంగా నిర్మూలించాను. కిలో తుంగ గడ్డలతో సహా వేర్లు, మొక్కలు మొత్తం పీకి.. వేర్ల మట్టిని కడిగి.. పెనం మీద కాల్చి బూడిద చేయాలి. 100 గ్రా. కలుపు మొక్కల బూడిద, 100 గ్రా. పంచదార, అర లీటరు నాటావు పాలు కలిపి.. రెండు రోజులు తరచూ కలియదిప్పుతూ ఉండాలి. 2 రోజుల తర్వాత ఆ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి మరో రెండు రోజులు పులియబెట్టాలి. తరచూ కలియదిప్పుతూ ఉండాలి. మూడో రోజున ఆ ద్రావణాన్ని వరి పొలంలో అంతటా పిచికారీ చేయాలి. ఈ ద్రావణం కలుపును దుంపను నాశనం చేస్తుంది. మొదట దుంపను, వేర్లను ఎండిపోయేలా చేస్తుంది. క్రమంగా మొక్క కాండం, ఆకులు కూడా ఎండిపోతాయి. తుంగ మొక్కను పట్టుకొని పీకితే తేలిగ్గా రాదు. నేను ద్రావణం చల్లిన తర్వాత మూడో రోజు తుంగ మొక్కను పట్టుకుంటే చాలు ఊడి వస్తుంది. దుంప, వేర్లు మాడిపోయాయి. ఇలా నిర్మూలించిన తర్వాత మా పొలంలో మళ్లీ ఇంత వరకు తుంగ రాలేదు. వరి మొక్కలకు ఎటువంటి హానీ జరగలేదు. గరికను పెనం మీద మాడ్చి ద్రావణం తయారు చేసి చల్లితే 10 రోజులకు వడపడింది. పీకి చూస్తే వేరు ఎండిపోయింది. సాధారణంగా రసాయనిక కలుపు మందులు పిచికారీ చేసిన తర్వాత 48 గంటల్లో మొదట ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు.. పై నుంచి కిందకు ఎండిపోతాయి. ఈ ద్రావణం చల్లితే ఇందుకు భిన్నంగా.. మొదట వేర్లు, గడ్డలు, కాండం, కొమ్మలు, ఆకులు చివరగా ఎండుతాయి. అయితే, భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు నిర్మూలన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. చల్లిన ద్రావణం వేరు ద్వారా కిందికి దిగాలంటే భూమిలో పదును ఉండాలి. అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రైతులంతా రసాయనిక కలుపు మందులు వాడి భూములను నాశనం చేసుకోకుండా, స్వల్ప ఖర్చుతో ఈ ద్రావణం తయారు చేసుకొని వాడుతూ కలుపు నిర్మూలన చేసుకుంటున్నారు. – మేకా రాధాకృష్ణమూర్తి (84669 23952), మంత్రిపాలెం, నగరం మండలం, గుంటూరు జిల్లా. -
నేడు మున్సిపల్ కార్యాలయాల ముట్టడి
విజయనగరం మున్సిపాలిటీ: సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు, సిబ్బంది చేస్తున్న సమ్మె ఉద్ధృతమవుతోంది. ఆందోళనలో భాగంగా బుధవారం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించనున్నారు. మంగళవారం పార్వతీపురంలో కార్మికులు వంటా వార్పు చేసి నిరసన వ్యక్తం చేయగా, బొబ్బిలిలో మోకాళ్లపై నడిచారు. సాలూరు పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. వ్యవసాయ అధికారులు కూడా ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా రూపొందించారు. సాగునీటి వనరులు అందుబాటులో ఉన్న 61,500 హెక్టార్లలో సాగు చేయించేందుకు కార్యాచరణ తయారు చేశారంటే వారికెంత అనుమానాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎలా అధిగమించాలి? రైతుల్ని ఎలా సిద్ధం చేయాలి? భవిష్యత్‌లో ఏం చేయాలి? అన్నదానిపై అధికారుల్లో కనీస స్పష్టత లేదు. దీనికంతటికీ వారి మధ్య సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణం. సీజన్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు అధికారులు ముందుగానే సమాయత్తం కావాలి. సంబంధం ఉన్న శాఖలన్నింటితోనూ ఎప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండాలి. అప్పుడే పరిస్థితుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది.కానీ, ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ఇంకా అప్రమత్తం కాలేదు. సాగుతో సంబంధం ఉన్న వ్యవసాయం, ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ శాఖలతో ఇంతవరకు ఒక్క సమావేశాన్నీ కలెక్టర నిర్వహించలేదు. ఎప్పుడేం చేయాలో ఎవరేం చేయాలో సూచించిన దాఖలాలు లేవు. దీంతో ఖరీఫ్ సాగు అగమ్య గోచరంగా తయారైంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలెంత ఉన్నాయో వ్యవసాయ అధికారుల కు ఇంతవరకు తెలియదు. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసేదెప్పుడో వ్యవసాయ శాఖకు కనీస సమాచారం లేదు. చెరువుల్లో ఉన్న నీటి సామర్థ్యం పైనా వ్యవసాయ శాఖకు అవగాహన లేదు. వాస్తవంగానైతే ఇరిగేషన్ అధికారులు ఆ సమాచారం ఇవ్వవల్సి ఉంది. వారిచ్చే సమాచారం మేరకు రైతుల్ని సిద్ధం చేయాలి. ఇక, వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరాపై ట్రాన్స్‌కో అధికారులు స్పష్టత ఇవ్వవల్సి ఉంది. ఎప్పుడిస్తారో, ఎప్పుడు నిలిపేస్తారో సమాచారం ఉంటే ఆ విధంగా రైతుల్ని వ్యవసాయ అధికారులు అప్రమత్తం చేసే అవకాశం ఉంది. వర్షాల్లేకపోతే అటు చెరువులు, ప్రాజెక్టులు, ఇటు వ్యవసాయ బోర్లుపైనే రైతులు ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా అప్రమత్తం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. దీనికంతటికీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని తెలుస్తోంది. కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించకపోవడంతో అధికారులకు అవగాహన కొరవడంది. ఈ నేపథ్యంలో చివరికి రైతులు నష్టపోవాల్సి వస్తోంది.