Sonaksi Sinha
-
ఈరోస్ చేతికి లింగా
లింగా చిత్రం ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియూ లిమిటెడ్ సంస్థ ఖాతాలో చేరింది. ఈ సంస్థ ఇంతకుముందు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్ యానిమేషన్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అదే సంస్థ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల హక్కుల్ని సొంతం చేసుకుంది. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా అందాల భామలు సోనాక్షి సిన్హా, అనుష్క నటించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలందించారు. మునిరత్న సమర్పణలో రాక్‌లైన్ వెంకటేష్ రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న లింగా చిత్రం విడుదల హక్కుల్ని ఈరోస్ సంస్థ తన ఖాతాలో వేసుకుందని ఆ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. లింగా చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ర జనీకాంత్ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్టు వారు వెల్లడించారు. అదే విధంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఈ నెల 16న నిర్వహించనున్నట్టు హిందీ వర్షన్ ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ప్రిస్టీజియస్ చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేయడం సంతోషంగా ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ సునీల్‌లుల్లా అన్నారు. -
జీవితాన్నిచ్చిన నటుడు అజిత్
అజిత్‌కు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంత పేరు ఉందో వ్యక్తిగతంగాను అంతే మంచి పేరుంది. ఇతరులకు సహాయం చేసే గుణం ఆయనకు ఆది నుంచి అలవడిందని పేర్కొనవచ్చు. నేటి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కూడా తనకు జీవితాన్నిచ్చిన నటుడు అజిత్నేనంటారు. ఈయన తొలి చిత్రం హీరో అజిత్‌తోనే చేశారు. వీరి కలయికలో వచ్చిన దిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఏఆర్ మురుగదాస్ విజయ్ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం కత్తి ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తదుపరి ఈ దర్శకుడి చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి మురుగదాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను సహాయ దర్శకుడిగా కష్టాలను అనుభవిస్తున్నప్పుడు దర్శకుడిగా అవకాశం కల్పించి జీవితాన్ని ప్రసాదించిన నటుడు అజిత్ అని వెల్లడించారు. అంతేకాదు అలాంటి నటుడితో ఎప్పుడైనా చిత్రం చెయ్యడానికి సిద్ధమని, కథ కూడ తయారుగా ఉందన్నారు. దీంతో వీరి కలయిలో ఒక భారీ చిత్రం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ తన తదుపరి చిత్రాన్ని హిందీలో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా నాయకిగా నటించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్లో సెట్‌పైకి వెళ్లనుంది. -
నిర్మాతగా సోనాక్షి..!
వెండితెరపై రాణిస్తున్న సోనాక్షి సిన్హా త్వరలోనే నిర్మాతగా మారనుంది. సోదరులు లవ్, కుశ్లతో కలసి చిత్ర నిర్మాణం చేపట్టనుంది. ‘షాట్‌గన్’ శత్రుఘ్న సిన్హా వారసురాలిగా సోనాక్షి వెండితెరపై ఉనికి చాటుకుంటున్నా, ఆమె సోదరులు మాత్రం తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోలేకపోయూరు. సినీరంగంతో అనుబంధం ఉన్నందున త్వరలోనే ‘క్రాటోస్ ఎంటర్టైన్మెంట్’ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సోనాక్షి భాగస్వామ్యం కూడా ఉంటుందని కుశ్ సిన్హా ట్విట్టర్లో వెల్లడించాడు. -
సమస్యల్లో సినిమా
రెండు గంటల్లో ముగిసిపోయే సినిమా రూపకల్పనకు దాని స్థాయిని బట్టి రెండు నెలల నుంచి రెండేళ్లవరకు పట్టవచ్చు. అలాంటి సినిమా ఎన్నో పురుటి నొప్పులను ఎదుర్కొని తెరమీదకు రావాలి. కొన్ని పురిటిలోనే ఆగిపోతాయన్నది వేరే సంగతి. ప్రస్తుతం కొన్ని భారీ చిత్రాలతోపాటు చిన్న చిత్రాల నిర్మాణంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుందాం. లింగా: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం లింగా. అందాలతార అనుష్క, ముంబాయి భామ సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను కర్ణాటకలో షియోగా జిల్లా, సాగర్ తాలుకాలోని లింగాన్ మాక్కిడ్యాం సమీపంలో నిర్వహిసుతన్నారు. అయితే స్థానిక సమస్యల కారణంగా ఆ ప్రాంత ప్రజలు షూటింగ్ నిలిపివేయూలని డిమాండ్ చేస్తున్నారు. కత్తి : ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రముఖ యువ కథా నాయకుడిగా వెలుగొందుతున్న విజయ్ నటిస్తున్న చిత్రం కత్తి. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సమంత కథా నాయకి. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైక్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ అధినేత శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు సన్నిహితుడని, అందువల్ల చిత్ర విడుదలను అడ్డుకుంటామని తమిళ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో కత్తి చిత్రం సమస్యల్లో పడింది. చిత్ర నాయకుడు విజయ్, దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ తమిళుల వ్యతిరేకతకు గురవుతున్నారు. ఈ చిత్ర నిర్మాణం చేతులు మారనున్నట్లు సమాచారం. పులి పార్వై : తాజాగా తమిళుల తీవ్ర వ్యతిరేకతను చవిచూస్తున్న చిత్రం పులిపార్వై. ఇది శ్రీలంక తమిళుల కోసం పోరాడిన ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ కొడుకు బాలచంద్రన్ ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం. ఎస్.ఆర్.ఎం సంస్థల అధినేత పారివేందర్ నిర్మించిన ఈ చిత్రంలో ఎల్‌టీటీఈల యుద్ధాన్నే తప్పుపట్టే విధంగా సన్నివేశాలు చోటు చేసుకున్నాయని తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో చిక్కుల్లో పడ్డ చిత్ర దర్శక నిర్మాతలు సెన్సార్ పూర్తి చేసుకున్నా పులిపార్వై చిత్రానికి చేర్పులు మార్పులు చేసే పనిలో పడ్డారు. పాపనాశం: పాపనాశం చిత్రానికి ఆదిలోనే సమస్యలు చుట్టుముట్టాయి. ఇది ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్ ఇష్టపడి మరీ నటిస్తున్న చిత్రం మలయాళంలో దృశ్యంగా తెరకెక్కి విజయ దుందుభి మోగించిన చిత్రం. మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన చిత్రానికి తమిళంలో సమస్యలెదురయ్యాయి. మోహన్‌లాల్ పాత్రలో కమల్‌హాసన్ పోషిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఆ చిత్ర కథ తనదంటూ కేరళ దర్శకుడు సతీష్ పాల్ ఎర్నాకులం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తులుతమిళ రీమేక్‌పై తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కమల్‌హాసన్ పాపనాశం చిత్ర నిర్మాణం సమస్యల్లో చిక్కుకుంది. -
మహోన్నత వ్యక్తి రజనీ
రజనీకాంత్ ప్రతిభను, ఆయన సాధనను, ఆయన అనితర సాధ్యస్థాయిని పొగడని వారుండరు. అయితే వాటికి హద్దులుంటాయి. కానీ బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మాత్రం అలాంటి హద్దులను మూటకట్టి అటకెక్కించి వీర లెవల్లో మన సూపర్‌స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా లింగా చిత్రంలో రజనీ సరసన నటిస్తున్నారు. ఈమెకు దక్షిణాదిలో మొదటి చిత్రం కూడా ఇదే. లింగా చిత్రంలో రజనీకాంత్‌తో నటిస్తున్న అనుభవం గురించి సోనాక్షి సిన్హా మాట్లాడుతూ, జీవితంలో కొందరు మహోన్నత వ్యక్తులను కలుసుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. అలాంటి ఒక మార్పు లింగా చిత్రంలో రజనీకాంత్‌తో కలసి నటిస్తున్నప్పుడు తనలో కలిగిందని తెలిపారు. హిందీలో సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, సాహిత్ కపూర్ లాంటి ప్రముఖ హీరోలకు జంటగా నటించానని చెప్పారు. అప్పుడు తెలియని పలు విషయాలను, రజనీకాంత్‌తో నటిస్తున్నప్పుడు తెలుసుకున్నానని వివరించారు. రజనీ మహోన్నత వ్యక్తి అని, ఆయనో విశ్వవిద్యాలయం అని కూడా చెప్పవచ్చని పొగిడారు. ఇతరులకు తెలియని పలు విషయాల గురించి రజనీ తెలుసుకున్నారని, అసలు ఆయనకు తెలియదంటూ ఏమీ లేదని చెప్పారు. రజనీతో నటించిన ప్రతి రోజు ఎంతో విలువైందన్నారు. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థాయికి చేరుకున్న గొప్ప వ్యక్తి రజనీ అన్నారు. ఆయన తన అనుభవాలను చాలా తనతో పంచుకున్నారని చెప్పారు. తద్వారా తనకు ఆధ్యాత్మికానికి సంబంధించిన భక్తి భావాన్ని కల్పించారని తెలిపారు. స్థూలకాయం ఆరోగ్యకరం కాదని చాలామంది చెప్పగా విన్నానన్నారు. అయితే రజనీ చెప్పిన విధం చాలా కొత్తగా ఉందన్నారు. ఆయన చెప్పింది వింటున్నప్పుడు దేహం ఒక దే వాలయంలా అనిపించిందని అన్నారు. కెమెరాముందు రజనీకాంత్ కెమెరా వెనుక రజనీకాంత్ వేర్వేరని చెప్పారు. రజనీ కారణంగా తాను చాలా మారిపోయానని సోనాక్షి సిన్హా అంటున్నారు. మొత్తానికి లింగా చిత్రం షూటింగ్‌లోనే రజనీకాంత్ గుణగణాలను అవపోసన పట్టేసినట్లుందని కోలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది. -
షిమోగాకు లింగా టీమ్
లింగా చిత్ర టీమ్ షిమోగాకు పయనం కానుందా? అవుననే అంటోంది చిత్ర యూనిట్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లింగా. రజనీకాంత్ నాయకుడిగా, ప్రతి నాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అందాల భామ అనుష్క, ముంబాయి ముద్దు గుమ్మ సోనాక్షి సిన్హాలు నాయకలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ముత్తు, పడయప్పా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తరువాత రజనీకాంత్ దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే మైసూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో కీలక సన్నివేశాల రూపకల్పన పూర్తి చేసుకుంటోంది. చిత్ర తుది ఘట్ట సన్నివేశాలను షియోగాలో చిత్రీకరించాలని నిర్ణయించినట్టు యూనిట్ వర్గాల సమాచారం. ఈ నెల 18న రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హాలతో సహా యూనిట్ షిమోగా పయనం కానున్నట్లు తెలిసింది. అలాగే లింగా చిత్రం కోసం బ్రహ్మాండమైన శివుని శిలను ఒక డామ్ సెట్‌ను వేయనున్నట్లు సమాచారం. చిత్ర ఆడియోను దీపావళికి మార్కెట్లోకి విడుదల చేయూలని చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12న తెరపైకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.