ఈరోస్ చేతికి లింగా | Eros acquires worldwide rights of Rajinikanth's new movie 'Lingaa' | Sakshi
Sakshi News home page

ఈరోస్ చేతికి లింగా

Published Tue, Nov 11 2014 2:07 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

ఈరోస్ చేతికి లింగా - Sakshi

ఈరోస్ చేతికి లింగా

లింగా చిత్రం ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియూ లిమిటెడ్ సంస్థ ఖాతాలో చేరింది. ఈ సంస్థ ఇంతకుముందు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్ యానిమేషన్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అదే సంస్థ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల హక్కుల్ని సొంతం చేసుకుంది. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా అందాల భామలు సోనాక్షి సిన్హా, అనుష్క నటించారు.  కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలందించారు. మునిరత్న సమర్పణలో రాక్‌లైన్ వెంకటేష్ రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న లింగా చిత్రం విడుదల హక్కుల్ని ఈరోస్ సంస్థ తన ఖాతాలో వేసుకుందని ఆ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. లింగా చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ర జనీకాంత్ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్టు వారు వెల్లడించారు. అదే విధంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఈ నెల 16న నిర్వహించనున్నట్టు హిందీ వర్షన్ ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ప్రిస్టీజియస్ చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేయడం సంతోషంగా ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ సునీల్‌లుల్లా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement