షిమోగాకు లింగా టీమ్ | Lingaa climax to be shot in Shimoga? | Sakshi
Sakshi News home page

షిమోగాకు లింగా టీమ్

Published Sun, Aug 3 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

షిమోగాకు లింగా టీమ్

షిమోగాకు లింగా టీమ్

లింగా చిత్ర టీమ్ షిమోగాకు పయనం కానుందా? అవుననే అంటోంది చిత్ర యూనిట్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లింగా. రజనీకాంత్ నాయకుడిగా, ప్రతి నాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అందాల భామ అనుష్క, ముంబాయి ముద్దు గుమ్మ సోనాక్షి సిన్హాలు నాయకలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ముత్తు, పడయప్పా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తరువాత రజనీకాంత్ దర్శకుడు కె.ఎస్.రవి కుమార్ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
 
 ఇప్పటికే మైసూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో కీలక సన్నివేశాల రూపకల్పన పూర్తి చేసుకుంటోంది. చిత్ర తుది ఘట్ట సన్నివేశాలను షియోగాలో చిత్రీకరించాలని నిర్ణయించినట్టు యూనిట్ వర్గాల సమాచారం. ఈ నెల 18న రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హాలతో సహా యూనిట్ షిమోగా పయనం కానున్నట్లు తెలిసింది. అలాగే లింగా చిత్రం కోసం బ్రహ్మాండమైన శివుని శిలను ఒక డామ్ సెట్‌ను వేయనున్నట్లు సమాచారం. చిత్ర ఆడియోను దీపావళికి మార్కెట్లోకి విడుదల చేయూలని చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు డిసెంబర్ 12న తెరపైకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement