Sophisticated technology
-
యాప్‌లో వివరాలు 30రోజుల్లో డిలీట్
న్యూఢిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌లో సాధారణ వినియోగదారుడి వివరాలైతే 30 రోజుల్లో, కరోనా సోకిన వ్యక్తి వివరాలైతే 45–60 రోజుల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు. ఆరోగ్య సేతు యాప్ అనేది కరోనాను ఎదుర్కొనేందుకు రూపొందించిన సోఫిస్టికేటెడ్ సర్వీలెన్స్ కలిగిన యాప్ అని తెలిపారు. ఈ యాప్‌ను ఇప్పటికే 9.5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని, దీనిపై ప్రజలకు ఎంత నమ్మకముందో దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. కరోనా సోకిన వారు దగ్గరలో ఉంటే హెచ్చరిచేందుకు ఈ యాప్‌ను వాడేవారిలొకేషన్ వివరాలను తీసుకుంటుందని తెలిపారు. ఇతర దేశాల్లో ఇలాంటి యాప్‌లు వాడుతున్నారని, దీనిపై అక్కడ మనదేశంలో వచ్చినట్లు ఆరోపణలు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయవద్దంటూ రాహుల్ గాంధీని కోరారు. ప్రజల కోసమే ఐసీఎంఆర్ వద్ద ఉన్న డేటాబేస్‌తో దాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. -
మంత్రి ప్రారంభించిన మరుక్షణమే పగిలిన పైపులైన్
నాసిరకం పనులపై అమాత్యుని ఆగ్రహం విజిలెన్స విచారణకు ఆదేశం.. ? ఉప్పల్ : మంచినీటి పైపులైన్ ప్రారంభించిన వెంటనే.. పైపులైన్ పగలడంతో అమాత్యులు, అధికారులు అవాక్కయ్యారు. ఈ సంఘటన ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్ హిల్స్, కురుమానగర్, లక్ష్మీనర్సింహాకాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. రూ.3 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మంచినీటి సరఫరా పైపులైన్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. వెంటనే పైపులైన్ పగిలి పెద్దఎత్తున ఫౌంటెన్‌ను తలపించేలా నీరు పైకి ఎగిసింది. దీంతో నీటికోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వందలాదిమంది స్థానికులు, అప్పుడే ప్రారంభించిన మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జలమండలి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇవేమీ పనులంటూ ముక్కున వేలేసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో వేసిన పైపులైన్‌ను పగలడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి అంతటికి కారణం నాసిరకం పనులేనని అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని స్థానికులు ఆరోపించారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పైపులైన్ నాణ్యతపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. విజిలెన్స విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అరుుతే ఈ సంఘటనకు అవాక్కరుున జలమండలి అధికారులు తమ తప్పును సరిదిద్దుకునేందుకు పాత పైపులైన్లు పగిలిపోయాయని మంత్రికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. -
‘టెక్నాలజీ’ పూర్తిగా వాడేశాడు...!
పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థి అరెస్టు సహకరించిన స్నేహితుడూ రిమాండ్ పంజగుట్ట: అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడిన విద్యార్థితో పాటు అతడికి సహకరించిన మరో విద్యార్థిని ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్ నవ్భారత్నగర్ నివాసి షేక్ ఎజాజ్ (19) 2014లో ఎస్సార్‌నగర్‌లోని న్యూవిజన్ జూని యర్ కాలేజీలో ఇంటర్ చదివాడు. ఆరు సబ్జెక్ట్‌లు ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సెల్‌ఫోన్ సంస్థలో పని చేసిన ఇతను ఫోన్ టెక్నాలజీ-పని తీరును పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. ఈ టెక్నాలజీతో కాపీయింగ్‌కు పాల్పడి ఎలాగైనా ఇంటర్మీడియట్ పాస్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఆన్ లైన్ ద్వారా ఇందుకు అవసరమైన బ్లూటూత్, వైర్లెస్ మైక్రోఫోన్, చెవిలో ఇమిడిపోయే అతి చిన్న ఇయర్‌ఫోన్ తెప్పించుకున్నాడు. ఎస్సార్‌నగర్‌లోని రాయల్ జూనియర్ కాలేజీలో పరీక్ష సంటర్ పడింది. ఇంజినీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న తన స్నేహితుడు మహ్మద్ సమీయుల్లా (19) సాయంతో సివిక్స్ -1, సివిక్స్ -2 పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఈనెల 12న ఎకనామిక్స్ పరీక్ష రాసేందుకు వెళ్లగా... చీఫ్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ శంకర్‌రెడ్డి ఎజాజ్ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు గుర్తించాడు. వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎజా జ్, సమీయుల్లాలను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
డ్రోన్ సర్వేపై గందరగోళం
విజయవాడ : నగర గగనతలంపై డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. నగరంలోని వీధులు మొదలుకొని ఇళ్ల లెక్కింపు వరకు అన్నింటిని డ్రోన్లలో అమర్చిన కెమెరాల్లో నగరపాలక సంస్థ అధికారులు బంధిస్తున్నారు. వాటి ఆధారంగా భారీగా సొమ్ము చేసుకునే యత్నాల్లో ఉన్నారు. దీని కోసం ముందస్తుగా రూ.5.60 కోట్లు ఖర్చు పెట్టడానికి అంగీకారం కుదుర్చుకోవటంఇప్పుడచర్చనీయాంశమైంది. నగర సగటు జీవికి డ్రోన్లపై కనీస అవగాహన లేదు. కానీ నగరపాలక సంస్థ అధికారులు అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో దీనిని నిర్వహిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారి ప్రతిపక్షాలు, అధికారుల మధ్య మాటల యుద్ధానికి కారణమైంద అసెస్మెంట్ నంబర్ల నూరు శాతం గుర్తింపే లక్ష్యం... విజయవాడ రాష్ట్ర రాజధాని నగరంగా మారింది.ఈ క్రమంలో నగరంలో జనాభా రోజురోజుకీ పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో ఉన్న ఇళ్ల సంఖ్యకు, ఇంటి పన్ను చెల్లిస్తున్నవారి సంఖ్యకు కొంత వ్యత్యాసం ఉందనేది నగరపాలక సంస్థ అధికారుల అభిప్రాయం. దీంతో అన్ని ఇళ్లను గుర్తించి, అసెస్మెంట్లు సమగ్రంగా పరిశీలిస్తే ఇళ్ల సంఖ్య, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరిగే అవకాశముందనేది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. అనుకున్నదే తడవుగా నగరంలో డ్రోన్ సర్వేకు గత ఏడాది అక్టోబర్‌లో తెర తీశారు. అసెస్మెంట్ నంబర్లను నూరు శాతం గుర్తించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. దీనిపై అధ్యయనం చేసి డ్రోన్ సర్వే ఫలితాలు తెలుసుకున్న నగర కమిషనర్ వీరపాండియన్ కౌన్సిల్ తీర్మానం లేకుండానే అంతా సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. సింగపూర్‌కు చెందిన పేజ్ యూఎం సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ చేయటానికి ముందుకొచ్చి రూ.5.60 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు అందించగా, బీవోటీ ప్రాతిపదికన సదరు కంపెనీతో గత ఏడాది నవంబర్ 23న ఒప్పందం చేసుకున్నారు