Sourav Kothari
-
అద్వానీ ఖాతాలోమరో జాతీయ టైటిల్
పుణే: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. సీనియర్ జాతీయ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ లో అద్వానీ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో అతను 5–2 ఫ్రేమ్స్ తేడాతో సౌరవ్ కొఠారీపై విజయం సాధించాడు. తొలి ఫ్రేమ్ కోల్పోయిన అద్వానీ 13–150, 152–12, 151–0, 62–150, 150–45, 150–48, 150–2తో ప్రత్యర్థిని ఓడించాడు. ఓవరాల్‌గా జాతీయ స్థాయిలో ఈ వెటరన్ క్యూ స్పోర్ట్స్ స్టార్‌కు 33వ టైటిల్ కాగా... సీనియర్ కేటగిరీలో పదో టైటిల్. 3, 4 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ధ్వజ్ హరియా 3–0తో బ్రిజేశ్ దమానిపై గెలుపొందాడు. -
అంతిమ సమరంలో సౌరవ్ కొఠారి పరాజయం
మెల్బోర్న్: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ లాంగ్ అప్ ఫార్మాట్లో భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి రన్నరప్‌గా నిలిచాడు. మెల్బోర్న్లో ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సౌరవ్ 967–1307తో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. పలుమార్లు ఆధిక్యం చేతులు మారిన ఈ మ్యాచ్‌లో మొదటి సెషన్లో కొఠారి ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెషన్లో తడబడి ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చాడు. ఒకదశలో 250 పాయింట్లతో వెనుకంజలో ఉన్న గిల్‌క్రిస్ట్ 313 పాయింట్లు సాధించి 949–917తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇదే జోరును మూడో సెషన్లోనూ కొనసాగించి పీటర్ విజేతగా నిలిచాడు., -
ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా సౌరవ్ కొఠారి
విశ్వ వేదికపై గతంలో రెండుసార్లు తుది పోరులో బోల్తా పడ్డ భారత బిలియర్డ్స్ ఆటగాడు సౌరవ్ కొఠారి మూడో ప్రయత్నంలో మాత్రం మెరిశాడు. తొలిసారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో శుక్రవారం జరిగిన ఫైనల్లో సౌరవ్ కొఠారి 1134–944 పాయింట్ల తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో సౌరవ్ కొఠారి 1317–1246 పాయింట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ డేవిడ్ కాసియర్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. -
సౌరవ్ కొఠారికి స్వర్ణం
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): ప్రపంచ బిలియర్డ్స్ మాజీ చాంపియన్ ప్రప్‌రుట్ చైతనాసకున్ (థాయ్‌లాండ్)పై సంచలన విజయం సాధించిన భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. సోమవారం జరిగిన బిలియర్డ్స్ సింగిల్స్ ఫైనల్లో సౌరవ్ కొఠారి 3–1 (100–80, 101–0, 29–101, 101–88) ఫ్రేమ్‌ల తేడాతో చైతనాసుకున్ను ఓడించాడు. ఈ క్రీడల్లో క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) విభాగంలో భారత్‌కిది తొలి పతకం కావడం విశేషం. మరోవైపు టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ రజత పతకం సాధించాడు. ఫైనల్లో విష్ణువర్ధన్–ప్రార్థన తొంబారే (భారత్) ద్వయం 7–5, 4–6, 2–6తో నటనన్ కద్‌చాపనాన్–నిచా లెర్ట్‌పితాక్‌సిన్‌చాయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. తొలి సెట్‌ను నెగ్గిన భారత జోడీ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణ, రజత పతకాలు ఖాయమయ్యాయి. భారత ఆటగాళ్లు సుమీత్ నాగల్, విజయ్ నటరాజన్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో సుమీత్ 6–4, 7–5తో ఫరూఖ్ దస్తోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, విజయ్ 6–4, 6–2తో ఫెజీవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందారు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో విష్ణువర్ధన్–విజయ్ జంట స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో విష్ణు–విజయ్ ద్వయం 6–4, 3–6, 6–1తో చున్ హున్ వోంగ్–హాంగ్ కిట్ వోంగ్ (హాంకాంగ్) జోడీపై విజయం సాధించింది. బుధవారం ముగియనున్న ఈ క్రీడల్లో భారత్ ఇప్పటివరకు ఏడు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, 14 కాంస్య పతకాలు సాధించి మొత్తం 29 పతకాలతో 12వ స్థానంలో ఉంది. -
సెమీస్‌లో పంకజ్
బెంగళూరు: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 అప్ ఫార్మాట్లో భారత స్టార్ పంకజ్ అద్వానీ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5-2 (150-0, 150-0, 150-5, 89-150, 107-150, 150-69, 150-128) ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన ధ్రువ్ సిత్వాలాను ఓడించాడు. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారి, అలోక్ కుమార్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా... మరో ప్లేయర్ ధ్వజ్ హరియా 5-3తో చిట్ కూ కూ (మయన్మార్)పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. సోమవారం జరిగే సెమీఫైనల్స్‌లో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)తో ధ్వజ్ హరియా; ఆంగ్ హెచ్‌టే (మయన్మార్)తో పంకజ్ అద్వానీ తలపడతారు. -
రన్నరప్ కొఠారి
బెంగళూరు: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ లాంగ్ అప్ ఫార్మాట్లో భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి రన్నరప్‌గా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో సౌరవ్ 617-1500 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. సెమీఫైనల్స్‌లో సౌరవ్ 1250-816తో ధ్వజ్ హరియా (భారత్)పై, గిల్‌క్రిస్ట్ 1250-958తో రూపేశ్ షా (భారత్)పై గెలిచారు.