special court verdict
-
కోర్టు తీర్పుపై స్పందించిన ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు.. ఆయనపై ఉన్న రెండు కేసులను బుధవారం కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు వెల్లడించిన తీర్పుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలతో అక్బరుద్దీన్ ఒవైసీపై రెండు క్రిమినల్ కేసుల్లో ఎంపీ/ఎమ్మెల్యే స్పెషల్ కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. మా కోసం ప్రార్థనలు, మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. తమ విలువైన సహాయాన్ని అందించిన న్యాయవాది అబ్దుల్ అజీమ్ ఎస్బీ, సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని అసదుద్దీన్ ట్విట్ చేశారు. Alhamdulilah Akbaruddin Owaisi has been acquitted by MP/MLA Special Court in two criminal cases against him for alleged hate speeches. Grateful to all for their prayers & support. Special thanks to Advocate Abdul Azeem sb & senior lawyers who provided their valuable assistance — Asaduddin Owaisi (@asadowaisi) April 13, 2022 -
తొలగిన మచ్చ.. దక్కిన ఊరట
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ఎల్కే అడ్వాణీ: బాబ్రీ మసీదు స్థలంలోనే రామాలయాన్ని నిర్మించాలనే డిమాండ్‌తో అడ్వాణీ దేశవ్యాప్తంగా 1990లో రథయాత్ర నిర్వహించారు. ఈ యాత్రతో దేశంలో బీజేపీ బలం ఎన్నో రెట్లు పెరిగిందని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అడ్వాణీ పై బాబ్రీ మసీదు కూల్చివేత అంశం ఇన్నాళ్లూ ఒక మచ్చగా ఉండేది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో ఆ మచ్చ తొలగిపోయినట్లే. మురళీ మనోహర్ జోషీ: బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జోషీ వ్యవహరించారు. రామజన్మభూమి ఉద్యమంలో ఆయనది కీలక పాత్ర. వాజ్‌పేయి, అడ్వాణీ సమకాలీనుడైన జోషీ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు. 86 ఏళ్ల జోషీ ఉత్తరప్రదేశ్ నుంచి పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితుడు. కల్యాణ్ సింగ్: ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా కల్యాణ్‌సింగ్ ఉన్నప్పుడే అయోధ్యలో బాబ్రీ మసీదు నేలమట్టమైంది. వెంటనే ఆయన ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. మసీదు కూల్చివేతకు కల్యాణ్ సింగ్ సంపూర్ణంగా సహకరించారని అభియోగాలు ఉన్నప్పటికీ కేసు నుంచి బయటపడ్డారు. 88 ఏళ్ల కల్యాణ్‌సింగ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఉమా భారతి: బాబ్రీ మసీదు వ్యవహారంలో ప్రముఖంగా వినిపించే మహిళ పేరు ఉమాభారతి. జనాన్ని ఉత్తేజపరిచేలా ప్రసంగించడంలో ఆమె దిట్ట. మసీదు కూల్చివేత అనేది అప్పటికప్పుడు జరిగిన ఘటన అని, దీని వెనుక ఎలాంటి కుట్ర లేదని ఉమా భారతి పలు సందర్భాల్లో చెప్పారు. మసీదు కూల్చివేతపై క్షమాపణ చెప్పడానికి ఏనాడూ ఇష్టపడలేదు. వినయ్ కతియార్: హిందూత్వ ఫైర్‌బ్రాండ్ నాయకుడు వినయ్ కతియార్(66). ఆయన బజరంగ్ దళ్ అధ్యక్షుడిగా, విశ్వ హిందూ పరిషత్ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. కల్యాణ్ సింగ్, ఉమా భారతి లాగా బీజేపీలో ఓబీసీ నాయకుడిగా ఎదిగారు. పలుమార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగానూ సేవలందించారు. ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నాను. 1526 నుంచి 2020 దాకా.. 1526: 1526లో బాబర్ సైనికాధికారి మీర్ బాకీ అయోధ్యలో∙మసీదును నిర్మింపజేశాడు. గుడిని కూల్చి కట్టారా? నేలమట్టమైన గుడిపైన మసీదు కట్టారా? అన్నది స్పష్టంగా తెలియదు. అయితే విశాలమైన ప్రాంగణంలో మసీదుతోపాటు ఓ గుడి ఉండటం. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకుంటే.. బయట అదే ఆవరణలోని గుడిలో హిందువుల పూజలు జరిగేవన్నమాట. 1949: డిసెంబరు నెలలో బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. ఇది కాస్తా నిరసన ప్రదర్శనలకు దారితీసింది. హషీమ్ అన్సారీ ముస్లింల తరఫున కేసు వేస్తే తరువాతి కాలంలో నిర్మోహీ అఖాడా హిందువుల వైపు నుంచి కేసు వేసింది. 1984: రామ జన్మ భూమి ఉద్యమాన్ని కొనసాగించేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేత ఎల్కే అడ్వాణీ ఈ బృందానికి నేతృత్వం వహించారు. 1986: ఫైజాబాద్ జిల్లా జడ్జి వివాదాస్పద ప్రాంతపు గేట్లకు వేసిన తాళలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. హిందువులూ ఆ ప్రాంతంలోకి ప్రవేశించవచ్చునని, పూజలు జరుపుకోవచ్చునని తన తీర్పులో పేర్కొన్నారు. 1990: బాబ్రీ మసీదు కూల్చివేతకు మొదటి సారి విఫలయత్నం జరిగింది ఈ ఏడాది. 1992: డిసెంబర్ ఆరవ తేదీ కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చి తాత్కాలిక దేవాలయం ఏర్పాటు చేశారు. 1993: కేసుల సత్వర విచారణకు లలిత్‌పూర్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు. అయితే యూపీ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టుతో సంప్రదించి కేసులన్నింటినీ లక్నోలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ 197 విచారణ సీబీఐ చేపట్టగా మరో కేసు విచారణ రాయ్‌బరేలీలోని ప్రత్యేక కోర్టులో సీఐడీ ఆధ్వర్యంలో జరిగింది. 1993 అక్టోబర్‌లో సీబీఐ శివసేన అధ్యక్షుడు బాలా సాహెబ్ ఠాక్రే, బీజేపీ నేత కళ్యాణ్ సింగ్, చంపత్ రాయ్ బన్సల్, ధరమ్ దాస్, నృత్య గోపాల్‌దాస్ తదితరులపై అభియోగాలు నమోదు చేసింది. మసీదు కూల్చివేతకు ఒక్క రోజు ముందు బజరంగ్ దళ్ నేత వినయ్ కతియార్ ఇంట్లో ఒక రహస్య సమావేశం జరిగిందని, అందులోనే మసీదును పడగొట్టేందుకు కుట్ర పన్నారన్నది ఈ అభియోగపత్రంలోని ప్రధాన అంశం. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన అన్ని కేసులూ లక్నోలోని ప్రత్యేక కోర్టు విచారించేలా ఏర్పాటు జరిగాయి. 1996: సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్ ఆధారంగా ఎల్కే అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు నమోదు చేసేందుకు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎల్కే అడ్వాణీ తదితరులు 1990 నుంచి కుట్ర పన్నారని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 2001: ప్రభుత్వ పరంగా జరిగిన లోటుపాట్ల ప్రస్తావిస్తూ ఎల్కే అడ్వాణీ, ఉమాభారతిలు కోర్టు తీర్పును సవాలు చేశారు. లోటుపాట్లను సరిచేస్తామన్న సీబీఐ అభ్యర్థనకు యూపీ ప్రభుత్వం నిరాకరించడంతో నేరపూరిత కుట్ర అరోపణ వీగిపోయింది. రాయ్‌బరేలీ ప్రత్యే కోర్టులో కేసు విచారణ పునఃప్రారంభమైంది. అడ్వాణీ తదితరులు కేసు గెలిచారు. 2003: రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టులో సీబీఐ అభియోగపత్రం నమోదు చేయగా.. తగినన్ని ఆధారాలు లేనందున ఎల్కే అడ్వాణీని అభియోగాల నుంచి విముక్తుడిని చేయాలని జడ్జి ఆదేశం. 2005: అలహాబాద్ హైకోర్టు నేరపూరిత కుట్ర ఆరోపణలు లేకుండా మళ్లీ కేసు విచారణ మొదలుపెట్టింది. 2010: అలహాబాద్ హైకోర్టు కింది కోర్టు 2001లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు కొట్టివేసింది. రాయ్ బరేలీ ప్రత్యేక కోర్టులో మరోసారి కేసు విచారణ చేపట్టాలని ఆదేశించింది. 2012: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు సీబీఐ. 2015: బీజేపీ సీనియర్ నేతలకు సుప్రీం నోటీసులు 2017: అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాలు. నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్దరించాలని స్పష్టీకరణ. అన్ని కేసులను కలిపి లక్నోలో విచారణ చేపట్టాలని ఆదేశాలు. 2019: వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంతం మొత్తాన్ని రామ మందిర నిర్మాణానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశాలు. 2020: కేసు విచారణకు విధించిన గడువు ఆగస్టు 31తో పూర్తి. తుది గడువును ఒక నెల పొడిగించిన సుప్రీంకోర్టు. సెప్టెంబరు 30వ తేదీన అధారాలు లేని కారణంగా నిందితులందరిపైని ఆరోపణలను కొట్టివేస్తూ లక్నో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కే.యాదవ్ తీర్పు. -
కమలనాథుల్లో కొత్త ఉత్సాహం
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు, హిందూత్వవాదులు నిర్దోషులుగా బయటపడడం కాషాయం కూటమిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వివాదాస్పద కట్టడాన్ని కుట్ర ప్రకారం కూల్చలేదని, అప్పటికప్పుడు జరిగిపోయిన సంఘటన అంటూ పదే పదే చెబుతూ వస్తున్న బీజేపీ నాయకులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నారు. బిహార్ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాబ్రీ తీర్పుతో మరో భావోద్వేగ అంశాన్ని ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశం బీజేపీకి వచ్చింది. కమలనాథులు రామ మందిర నిర్మాణాన్ని తమ ఖాతాలో వేసుకుంటూనే మసీదు కూల్చివేతతో అంటిన మట్టిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇప్పుడు మసీదు కూల్చివేతలో బీజేపీ ప్రమేయం లేదని కోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయంగా తమకు బాగా లబ్ధి చేకూరుతుందని బీజేపీ వర్గాలు యోచిస్తున్నాయి. కోర్టు తీర్పుని జై శ్రీరామ్ నినాదాలతో స్వాగతించామని అగ్రనేత ఎల్కే అడ్వాణీ వ్యాఖ్యానించారు. అటు రాముడికి గుడి కడుతున్నారన్న పేరు ప్రతిష్టలు రావడంతో పాటు, మసీదు కూల్చివేత అప్రతిష్ట కూడా పార్టీకి అంటకుండా తీర్పు వెలువడడం బీజేపీలో మంచి ఉత్సాహాన్ని నింపింది. మొత్తమ్మీద రామజన్మభూమి ఉద్యమం పార్టీకి అన్ని రకాలుగా కలిసొచ్చిందనే విశ్లేషణలు వినబడుతున్నాయి. తీర్పుపై ఎవరేమన్నారు.. ► సీబీఐ కోర్టు తీర్పు చరిత్రాత్మకం. ‘జై శ్రీరామ్.. అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నాను. –మురళీ మనోహర్ జోషి, బీజేపీ ► కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. ఆలస్యమైనా చివరికి న్యాయమే గెలిచింది. –రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి ► 472 ఏళ్లుగా సాగిస్తున్న పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. ఆలయాల రక్షణకు, వాటి ఆస్తుల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం. –వినోద్ బన్సల్, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి ► రాజ్యాంగ స్ఫూర్తికి 2019నాటి సుప్రీంకోర్టు తీర్పుకు ఈ తీర్పు విరుద్ధం. –రణ్‌దీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ► ప్రభుత్వాలు పక్షపాత ధోరణితో వ్యవహరించరాదు. న్యాయం పూర్తిగా వక్రీకరించబడింది. –సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ► సీబీఐ కోర్టు తీర్పు దురదృష్టకరం. దీనిపై ప్రభుత్వం కోర్టులో సవాల్ చేయాలి. –ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ► ఈ కుట్రలో భాగస్వాములెవరన్నదీ బహిరంగ సత్యం. దీనిపై సీబీఐ అప్పీలుకు వెళ్లాలి. –వలీ రహ్మానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రధాన కార్యదర్శి ► పట్టపగలే జరిగిన మసీదు విధ్వంసాన్ని ప్రపంచమంతా చూసింది. ఎవరి ప్రోద్బలంతో ఈ ఘటన జరిగిందో అందరికీ తెలుసు. –మౌలానా అర్షద్ మదానీ, జమైత్ ఉల్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు ► ఆ నిర్మాణాన్ని కూల్చివేశారనడానికి సంబంధించి ఎన్నో సాక్ష్యాలున్నా కోర్టు పట్టించుకోలేదు. దీనిపై ముస్లింలు హైకోర్టుకు వెళ్లవచ్చు. దీనిపై అంగీకారం కుదిరితే బోర్డు కూడా పార్టీగా చేరవచ్చు. బాధితులు, తనవంటి ఎందరో సాకు‡్ష్యలు కూడా అవసరమైతే అప్పీలుకు వెళ్లే హక్కుంది. –జఫర్యాబ్ జిలానీ, ఏఐఎంపీఎల్బీ సభ్యుడు, సీనియర్ లాయర్ ► చారిత్రక మసీదు ధ్వంసానికి బాధ్యులైన వారిని నిర్దోషులుగా పేర్కొనడం సిగ్గు చేటు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం మైనారిటీలకు, వారి ప్రార్థనా స్థలాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. –పాకిస్తాన్ విదేశాంగ శాఖ ► కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో సీబీఐ పంజరంలో చిలక మాదిరిగా మారిపోయింది. బాబ్రీ కేసులో నిజాయతీగా వ్యవహరించడంలో సీబీఐ విఫలమైంది. –ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు -
న్యాయ చరిత్రలో బ్లాక్ డే: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు భారతీయ న్యాయ చరిత్రలో బ్లాక్ డే అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బుధవారం హైదరాబాద్ దారుస్సలాంలో ఒవైసీ విలేకరులతో మాట్లాడారు. అందరూ నిర్దోషులైతే మరి మసీదును ఎవరు కూల్చేశారు? దానంతట అదే కూలిపోయిందా? అని ప్రశ్నించారు. భారతీయ న్యాయ చరిత్రలో ఈ రోజు విషాద దినంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ‘కోర్టు తీర్పు తనకెంతో బాధ కలిగించింది. మసీదును ధ్వంసం చేశారనేందుకు ఆధారాలు లేవంటున్నారు. కానీ దాన్ని ఎవరు కూల్చారో ప్రపంచమంతా చూసింది. మసీదును కూల్చండి అని ఉమాభారతి రెచ్చగొట్టడం నిజం కాదా..? బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదని కోర్టు చెబుతోంది.. ఈ ఘటన అప్పటికప్పుడు జరిగిందని తేల్చేందుకు ఎన్ని నెలల సమయం పడుతుంది’అని ఆయన ప్రశ్నించారు. సరైన ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టివేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించారని, ప్రణాళిక ప్రకారమే ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశారని ఇప్పటి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశం న్యాయానికి సంబంధించినదని, మసీదు కూల్చివేతకు కారణమైన వాళ్లను దోషులుగా తేల్చాల్సి ఉందని, కానీ వారికి రాజకీయంగా లబ్ధి జరిగినట్లు ఒవైసీ ఆరోపించారు. -
1992 డిసెంబర్ 6న ఏం జరిగింది ?
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్ తన నివేదికలో ఆ రోజు అయోధ్యలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వివరించింది. కరసేవకులు మసీదుని కూలగొట్టడానికి వస్తున్నారన్న సమాచారం ముందే అందడంతో వేలల్లో పోలీసుల్ని పట్టణంలో మోహరించారు. అయితే లక్షన్నర మంది వరకు కరసేవకులు ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో వారిని అడ్డుకోవడం సాధ్యం కాలేదని నివేదిక వెల్లడించింది. మన్మోహన్ సింగ్ లిబర్హాన్ ఆధ్వర్యంలోని కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉదయం 12:15కి మొదలైన కూల్చివేత కార్యక్రమం సాయంత్రం 5:30కి ముగిసింది. 1992 డిసెంబర్ 5 నుంచే అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో యూపీలో నాటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం భారీగా పోలీసుల్ని మోహరించింది. 35 కంపెనీల ప్రావిన్షియల్ ఆర్మీడ్ కాన్‌స్టబ్యులరీ (పీఏసీ), 195 కంపెనీల పారామిలటరీ బలగాలు, నాలుగు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, 15 బాష్ప వాయు స్క్వాడ్స్, 15 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్ఐలు, 2,300 మంది పోలీసు కానిస్టేబుళ్లు మోహరించారు. ఉదయం 10:30 గంటలకి అడ్వాణీ, జోషి వంటి బీజేపీ అగ్రనాయకులు కరసేవ ప్రారంభం చూడడం కోసం వచ్చారు. ఒక 20 నిమిషాల సేపు అక్కడే గడిపిన వారు రామ్‌కథ కుంజ్‌లో మతాధికారులు ఇచ్చే ప్రసంగాలు వినడానికి వెళ్లారు. పలుగు పారలతో మసీదుపై దాడి మసీదు చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని ఛేదించుకొని ఒక టీనేజీ యువకుడు 12 గంటల సమయంలో మసీదు గుమ్మటంపైకి నెమ్మదిగా ఎక్కాడు. అతని వెంట మరో 150 మంది వరకు పైకి ఎక్కి గునపాలు, ఇనుప రాడ్లు, పలుగులు, పారలతో మసీదుని కూల్చడం మొదలుపెట్టారు. మరో పావు గంట గడిచేసరికి 5 వేల మంది వరకు కరసేవకులు మసీదుపైకి ఎక్కేశారు. చేతికి దొరికిన ఆయుధాలతో కూల్చే పని కొనసాగించారు. అడ్వాణీ, జోషి, అశోక్ సింఘాల్, విజయ్‌రాజె సింథియా వంటి నేతలు వారిని వెనక్కి వచ్చేయమని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కరసేవకులు వినిపించుకోలేదు. భద్రతా బలగాలు, మీడియా ప్రతినిధులపైకి ఇటుకలు విసురుతూ ఉద్రిక్తతలకు తెర తీశారు. పోలీసు బలగాలు అడ్డుకోలేకపోయాయి జిల్లా మెజిస్ట్రేట్ పారామిలటరీ బలగాల్ని మోహరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వాళ్లెవరూ కాల్పులకు దిగకూడదన్న షరతు మీద ఆ నాటి యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ బలగాలకు అనుమతించారు. కానీ వారు వివాదాస్పద కట్టడం దగ్గరకి వెళ్లడంలో విఫలమయ్యారు. మార్గం మధ్యలోనే వారిని కరసేవకులు అడ్డుకున్నారు. ఇక రాష్ట పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్ట కుండా మిన్నకుండిపోయారు. మసీదులో ఒక భాగం కూలిపోగానే డీజీపీ కాల్పులకు అనుమతి అడిగితే కళ్యాణ్‌సింగ్ నిరాకరిం చారు. మసీదు కూలడం మొదలు కావడంతో ఒక్కసారిగా అయోధ్యలో మత ఘర్షణలు పెచ్చరిల్లాయి. సాయంత్రమ య్యేసరికి మసీదు అంతా నేలమట్టమైంది. కేంద్ర కేబినెట్ యూపీలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టుగా ప్రకటించింది. -
‘బాబ్రీ’ తీర్పు: అందరూ నిర్దోషులే
లక్నో: దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ విచారణకు తెరపడింది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులంతా నిర్దోషులేనని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం స్పష్టం చేసింది. వారిలో బీజేపీ అగ్రనేత, నాటి రామ మందిర నిర్మాణ ఉద్యమ రథ సారథి ఎల్కే అడ్వాణీ(92), బీజేపీ సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి(86), ఉమా భారతి, మసీదు కూల్చివేత సమయంలో యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్, వీహెచ్‌పీ నేత వినయ్ కటియార్, సాధ్వి రితంబర, ప్రస్తుతం అయోధ్యలో రామాలయ నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్.. తదితరులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. పైగా, అందులో రామ్‌లల్లా విగ్రహం ఉన్నందున, ఆ నిర్మాణాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్ నేత దివంగత అశోక్‌సింఘాల్ ప్రయత్నించారని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్కే యాదవ్ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సమయంలో కూల్చివేత ఘటన నాటి వార్తాకథనాలను కానీ, వీడియో క్యాసెట్లను న్యాయమూర్తి సాక్ష్యాలుగా పరిగణించలేదు. ఒరిజినల్ కాపీలు కానందున వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేదన్నారు. కోర్టుకు సమర్పించిన వీడియోలు కూడా స్పష్టంగా లేవన్నారు. అలాగే, నెగెటివ్స్ సమర్పించనందున, ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా సాక్ష్యాలుగా పరిగణించలేమన్నారు. లాస్ట్ వర్కింగ్ డే దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో సీబీఐ కోర్టు ఉన్న ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మధ్యాహ్నం 12:10 గంటలకు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ న్యాయస్థానంలోకి వచ్చారు. ఆ తరువాత, 10 నిమిషాల్లోనే నిందితులంతా నిర్దోషులేనని పేర్కొంటూ తీర్పు ఆపరేటివ్ భాగాన్ని వెలువరించారు. న్యాయమూర్తి ఎస్కే యాదవ్‌కు బుధవారం చివరి పని దినం కావడం గమనార్హం. 26 మంది హాజరు తీర్పురోజు నిందితులంతా కోర్టుకు హాజరు కావాలని జడ్జి గతంలో ఆదేశించారు. కానీ, కరోనా, తదితర కారణాలతో పలువురు హాజరు కాలేదు. జీవించి ఉన్న 32 మంది నిందితుల్లో 26 మంది హాజరయ్యారు. తీర్పు ప్రకటిస్తున్న సమయంలో కోర్టుహాళ్లో ఉన్న కొందరు నిందితులు జడ్జి ముందే గట్టిగా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. నిందితుల్లో వృద్ధాప్య కారణాలు చూపుతూ అద్వానీ, ఎంఎం జోషి, మహంత్ నృత్యగోపాల్‌దాస్ కోర్టుకు హాజరు కాలేదు. కళ్యాణ్ సింగ్, ఉమాభారతిలకు కరోనా సోకడంతో రాలేదు. విచారణ ఇలా.. విచారణ సమయంలో 351 మంది సాక్ష్యులను, 600 పత్రాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. 49 మందిని నిందితులుగా చేర్చింది. వారిలో విచారణ సాగుతుండగా వీహెచ్‌పీ అగ్రనేత అశోక్ సింఘాల్, శివసేన చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రే, విజయరాజె సింధియా తదితర 17 మంది చనిపోయారు. రోజువారీ విచారణ జరపాలని, రెండు సంవత్సరాల్లోగా విచారణ ముగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. నిందితులు మసీదు కూల్చివేతకు కుట్ర పన్నడంతోపాటు కరసేవకులను రెచ్చగొట్టారని సీబీఐ వాదించింది. విగ్రహాలను పూజారి కాపాడారు: మసీదును దుండగులు కూల్చివేస్తున్న సమయంలో గర్భాలయంలో ఉన్న రామ్‌లల్లా విగ్రహం, ఇతర విగ్రహాలను అక్కడి పూజారి సత్యేంద్ర దాస్ బయటకు తీసుకువెళ్లారని, దీనిబట్టి, మసీదు కూల్చివేత ముందస్తు ప్రణాళికతో జరిగింది కాదని అర్థమవుతుందని నిందితుల తరఫు న్యాయవాది విమల్ శ్రీవాస్తవ వాదించారు. వివాదాస్పద ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోని రామకథ కుంజ్ వద్ద వేదికపై నుంచి కూల్చివేత వద్దంటూ వీహెచ్‌పీ నేతలు, ఇతర నాయకులు ఇస్తున్న సూచనలను దుండగులు పట్టించుకోలేదన్నారు. కూల్చివేతను అడ్డుకునేందుకు అశోక్ సింఘాల్ ప్రయత్నించారన్నారు. మతపరమైన విశ్వాసంతో లాంఛనప్రాయంగా కరసేవ చేయాలనేదే నాయకుల ఉద్దేశమని, కాని కొందరు దురుద్దేశపూరితంగా దీన్ని భగ్నం చేసి, కూల్చివేతకు పాల్పడ్డారని వివరించారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన వీడియోలు సీల్ అయి లేవని, అవి నిజమైనవా? కాదా? అని లాబ్‌లో పరీక్షించలేదని పేర్కొన్నారు. ముందు నుంచీ చెబుతున్నాం.. మసీదును కూల్చేందుకు కుట్ర పన్నారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఎల్కే అద్వానీ, ఎంఎం జోషి, కళ్యాణ్ సింగ్, ఉమాభారతి తదితర నిందితులపై తప్పుడు కేసు పెట్టారని ముందు నుంచీ చెబుతున్నామని డిఫెన్స్ లాయర్ విమల్ కుమార్ శ్రీవాస్తవ తీర్పు అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు. అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడితో ఆ కేసు పెట్టారని, ఈ తాజా తీర్పు న్యాయానికి లభించిన విజయమని ఆయన పేర్కొన్నారు. అప్పీల్‌కు వెళ్లడంపై.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ పై కోర్టులో అప్పీల్ చేస్తుందా? అన్న ప్రశ్నకు సీబీఐ న్యాయవాది లలిత్ సింగ్ జవాబిస్తూ.. ఈ తీర్పు కాపీని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి పంపిస్తామని, తీర్పును సీబీఐ న్యాయ విభాగం అధ్యయనం చేసిన తరువాత అప్పీల్‌కు వెళ్లడంపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. మంచిదే: అన్సారీ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమన్య హక్కు కేసులో ప్రధాన కక్షిదారు అయిన ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు. ‘అందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. మంచిదే. జరగాల్సిందంతా గత సంవత్సరం నవంబర్ 9ననే జరిగింది. అదే రోజు ఈ కేసు కూడా ముగిస్తే ఇంకా బావుండేది’ అని వ్యాఖ్యానించారు. రామజన్మభూమి– బాబ్రీ మసీదు కేసులో రామజన్మభూమికి అనుకూలంగా 2019లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. మా విశ్వాసం నిలబెట్టింది తీర్పువినగానే జై శ్రీరాం అని అడ్వాణీ నినదించారు. ‘రామ జన్మభూమి ఉద్యమంపై నా నమ్మకాన్ని, బీజేపీ విశ్వాసాన్ని, మా నిబద్ధతను ఈ తీర్పు సమర్థించింది’ అని అన్నారు. ‘అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం నా చిరకాల స్వప్నం. అందుకు వీలు కల్పించే గత నవంబర్ 29 నాటి సుప్రీంకోర్టు తీర్పు తరువాత.. అదే స్ఫూర్తితో ఈ తీర్పు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక, అయోధ్యలో అద్భుతమైన రామ మందిర నిర్మాణం పూర్తి కావడం కోసం లక్షలాది భక్తులతో పాటు నేను ఎదురు చూస్తున్నా’ అన్నారు. అయోధ్య ఉద్యమ సమయంలో తనకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వామీజీలు, అందరికీ అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు తరువాత తన ఇంటి నుంచి బయటకు వచ్చి, అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులను, అభిమానులను ఆయన జైశ్రీరాం అంటూ పలకరించారు. ఆ 32 మంది వీరే.. 1, ఎల్కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్ జోషి, 3. కళ్యాణ్ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్ నృత్య గోపాల్ దాస్, 9. రామ్‌విలాస్ వేదాంతి, 10. చంపత్ రాయ్, 11. సతీష్ ప్రధాన్, 12. ధరమ్ దాస్, 13. బ్రిజ్ భూషణ్ సింగ్, 14. పవన్ కుమార్ పాండే, 15. జై భగవాన్ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్ సింగ్ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్ గుర్జార్, 22. ఆర్ఎం శ్రీవాస్తవ, 23. సతీష్ ప్రధాన్ కరసేవకులు: 24. రామ్ చంద్ర ఖత్రి, 25. సుధీర్ కక్కర్, 26. అమన్ నాథ్ గోయల్, 27. సంతోష్ దుబే, 28. వినయ్ కుమార్ రాయ్, 29. కమలేష్ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్ బహదూర్ సింగ్, 32. నవీన్ భాయ్ శుక్లా. తీర్పు వెలువడ్డాక వారణాసిలో మిఠాయిలు తినిపించుకుంటున్న ముస్లిం మహిళా ఫౌండేషన్ సభ్యులు -
‘దిల్సుఖ్నగర్’ గుణపాఠం
భాగ్యనగరిపై ఉగ్ర పంజా విసిరి దిల్‌సుఖ్‌నగర్‌లో 16మంది అమాయకుల ప్రాణా లను బలిగొన్న అయిదుగురు ముష్కరులకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం సోమవారం వెలువరించిన తీర్పు బాధిత కుటుంబాలకు సాంత్వన కలగజేస్తుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయ స్థానం 453మంది సాక్షులను విచారించి, 152 డాక్యుమెంట్లను పరిశీలించింది. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు చెందిన నిందితులంతా మారణహోమాన్ని సృష్టించి పౌరుల్లో భయోత్పాతాన్ని కలగజేసే ఉద్దేశంతో రెండు నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసుకుని పేలుళ్లకు పాల్పడిన తీరుపై ఎన్ఐఏ సకల సాక్ష్యాధారాలనూ సేక రించిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే దాడి సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతను పాకిస్తాన్లో తలదాచుకున్నాడంటున్నారు. అలాగే శిక్షపడినవారిలో ఒకడు పాకిస్తాన్ పౌరుడు. ఈ జంట పేలుళ్ల కేసులో అయిదుగురు నిందితులూ దోషులేనని ఈ నెల 13నే ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఆరు రోజుల తర్వాత ఇప్పుడు శిక్షలు ఖరారు చేసింది. ప్రత్యేక కోర్టు దోష నిర్ధారణ చేశాక తమను ఇందులో అన్యాయంగా ఇరికించారని, విచారణ ఏకపక్షంగా జరిగిం దని నిందితులు వేర్వేరుగా లేఖలు రాశారు. నిబంధనల ప్రకారం ప్రత్యేక న్యాయ స్థానం ఇప్పుడు విధించిన ఉరిశిక్షనూ ఎటూ హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఈ అయిదుగురి వాదనలు కూడా వినే అవకాశం ఉంది. ఎన్ఐఏ అధికారులు, సిబ్బంది, దర్యాప్తు బృందం సమష్టిగా పనిచేయడంవల్లే ఈ కఠిన శిక్షల విధింపు సాధ్యమైందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు చెప్పిన మాట నిజమే కావొచ్చు. కానీ ఇందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పట్టిం దన్న సంగతి మరువకూడదు. ఇది ఉగ్రవాద దాడి గనుక, దీని వెనక అంతర్జాతీయ ముఠాల ప్రాబల్యం ఉన్నది గనుక దీన్ని ఛేదించడం చాలా సంక్లిష్టమైన వ్యవహార మని కొందరు చేస్తున్న వాదనల్లో నిజం లేకపోలేదు. అయితే ఇలాంటి ఉగ్ర దాడుల ఉద్దేశం ప్రజానీకంలో భయోత్పాతాన్ని, అభద్రతాభావాన్ని కలగజేయడం గనుక దర్యాప్తు శరవేగంతో నడవాలని అందరూ కోరుకుంటారు. నిందితుల్ని పట్టుకోవడంలో, వారి నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించడంలో, న్యాయ స్థానం ఎదుట వాటిని రుజువు చేయడంలో విఫలమైతే పౌరుల్లో నిరాశా నిస్పృహలు, అభద్రత ఏర్పడతాయి. ఇందుకు భిన్నంగా సత్వర దర్యాప్తు, విచారణ సాగి వెనువెంటనే శిక్షలు పడితే నేరగాళ్ల వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి నేరాలకు పాల్పడే దుస్సాహసం మరెవరూ చేయరు. ఉగ్రవాదం నేడో, రేపో సమసిపోయే సమస్య కాదు. అది నిరంతరం కాచుకుని ఉంటుంది. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇంటెలిజెన్స్ సంస్థలు మొదలుకొని సాధారణ పౌరుల వరకూ అందరికందరూ అప్రమత్తంగా ఉంటే తప్ప దాన్ని ఓడించడం సాధ్యం కాదు. ఒక్క సారి అలసత్వం ప్రదర్శించినా, నిర్లిప్త ధోరణితో ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భారీయెత్తున ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది. నిజానికి ఆ కోణంలో చూస్తే దిల్సుఖ్ నగర్ పేలుళ్లు నివారించదగ్గవే. పేలుళ్లకు రెండు రోజుల ముందు నిఘా సంస్థల హెచ్చరికల్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ జేశామని అప్పటి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. అవి అందిన మాట నిజమే అయినా అలాంటివి సాధారణంగా ఎప్పుడూ వస్తూనే ఉంటాయని ఆనాటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవి చాలు... మన ప్రభుత్వాలు ఎంత అలసత్వంగా ఉన్నాయో చెప్పడానికి! వచ్చిన సమాచారాన్ని బట్వాడా చేయడమే తన ధర్మమని కేంద్రం అనుకుంటే... ఇందులో కొత్తేముందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ జంట పేలుళ్లు హైదరాబాద్ నగరంలో అయిదో ఉగ్ర వాద దాడి కాగా... అందులో దిల్సుఖ్నగర్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు మూడు సార్లు ఎంచుకున్నారని గుర్తుంచుకుంటే ఇదెంత బాధ్యతారాహిత్యమో అర్ధమవు తుంది. పైగా ఆ దాడులన్నీ గురువారాల్లోనే జరిగాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమ త్తంగా ఉంటే మిగిలిన ప్రాంతాల మాటెలా ఉన్నా దిల్సుఖ్నగర్లోనైనా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసేది. అంతక్రితం ఉగ్రవాదులు ఏ ఏ రూపాల్లో దాడి చేశారో తెలుసు గనుక అందుకు సంబంధించిన జాడలేమైనా ఉన్నాయేమో నన్న ఆరా పోలీ సులకు ఉండేది. సాధారణ పౌరులను సైతం అప్రమత్తం చేసి ఉంటే ఉగ్రవాదుల కదలికలు అంత సులభమయ్యేవి కాదు. ఈ పేలుళ్లకు ముందు ముంబై దాడి కారకుడైన కసబ్‌ను ఉరి తీయడం, పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరి అమలు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాద సంస్థలు హెచ్చరించాయి కూడా. అటువంట ప్పుడు కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికలు ‘రొటీనే’ అను కున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంలో అర్ధం లేదు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో చిక్కుకుని గాయాలపాలైనవారు, ఆప్తుల్ని కోల్పోయినవారు ఇప్పటికీ ఆ ఉదంతాలను తల్చుకుని వణికిపోతున్నారంటే అవి సృష్టించిన భయోత్పాతం ఏ స్థాయిలో ఉందో వెల్లడవుతుంది. నిఘా వ్యవస్థల్ని పటిష్టపరిచి, ఉగ్రవాదుల్ని మొగ్గలోనే తుంచేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసు కుంటే తప్ప ఇలాంటి స్థితి పోదు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సమన్వయం, వెనువెంటనే రంగంలోకి దిగే చురుకుదనం అవసరమవుతాయి. సీసీ కెమెరాలను పెట్టడమే కాదు... అవి ఎలా పనిచేస్తున్నాయో తరచుగా తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలి. పోలీసు విభాగాల సంసిద్ధత ఏ స్థాయిలో ఉన్నదో సమీక్షిస్తుం డాలి. ఇవన్నీ నిరంతరం జరుగుతున్నపుడే దిల్సుఖ్ నగర్ ఉదంతాల వంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ జంట పేలుళ్ల కేసు ఒక కొలిక్కి రావడానికి ఇంత కాలం పట్టింది. ఈ కేసుకు సంబంధించి ఉన్నత న్యాయస్థానాల్లో సాధ్య మైనంత త్వరగా విచారణ ప్రక్రియ పూర్తి కావాలని, నేరగాళ్లకు శిక్షలు ఖరారు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. -
జంట పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి
-
జంట పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఆరుగురు నిందితులను దోషులుగా ఖరారు చేశారు. వారికి ఏ శిక్ష విధించేదీ సోమవారం (ఈనెల 19వ తేదీన) వెల్లడిస్తారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 22 మంది మృతి చెందగా.. 140 మంది గాయపడ్డారు. దోషులలో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసీన్ భత్కల్ తో పాటు అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్‌లను ఎన్ఐఏ ఇంతకుముందు అరెస్ట్ చేసింది. వీరంతా చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. కాగా పేలుళ్ల సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. అరెస్టయిన ఐదుగురినీ ఎన్ఐఏ వర్గాలు మంగళవారం నాడు కోర్టులో హాజరుపరిచాయి. నిందితులపై దేశద్రోహం, హత్యానేరంతో పాటు పేలుడు పదార్థాల యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభియోగపత్రంలో 524 మందిని సాక్షులుగా చూపింది. ప్రాసిక్యూషన్ హాజరుపర్చిన 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.