Special CS
-
ఏపీలో విద్యుత్ కోతలు లేవు.. అవాస్తవాలు నమ్మొద్దు: విజయానంద్
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని, పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చామని కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కే. విజయానంద్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహావసరాలకి ఎక్కడా కోతలు విధించటం లేదని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్ట్ లో 18 శాతం డిమాండ్ పెరిగిందని ఆయన వివరించారు. ఆగస్ట్ నెలలో సరాసరిన రోజుకి 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ కాగా, గత ఏడాదిలో 190 మిలియన్ యూనిట్ల మాత్రమే ఉంది. పెరిగిన డిమాండ్‌తో పాటు వర్షాభావ పరిస్ధితులు తోడయ్యాయి. ఆగస్ట్ 30, 31 తేదీల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సెప్టెంబర్ నెల ఈ వారంలో సరాసరిన 210 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ ఉంది. ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ఉంది. కర్ణాటక, తమిళనాడు, రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కోతలు అమలవుతున్నాయి. పెరిగిన విద్యుత్ డిమాండ్‌కి తగ్గట్లు ఏపీలో విద్యుత్ సరఫరా చేస్తున్నాం.’’ అని విజయానంద్ తెలిపారు. చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే ఏపీలో విద్యుత్ కొరత రాకుండా ముందు జాగ్రత్తగా 40 మిలియన్ యూనిట్ల కొనుగోలు చేశాం. యూనిట్‌ని 13 రూపాయిల వరకు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతి ఉన్నా యూనిట్ 7.50 రూపాయిలకే కొనుగోలు చేశాం. బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఏపీలో సెప్టెంబర్ నెలకి సరిపడా బొగ్గు నిల్వలు’’ ఉన్నాయని విజయానంద్ వెల్లడించారు. -
స్మార్ట్ మీటర్లపై అపోహలు సృష్టించొద్దు: విజయానంద్
సాక్షి, విజయవాడ: స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించొద్దని ఏపీ ఎనర్జీ స్పెషల్ సీఎస్ విజయానంద్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘వ్యవసాయంలో విద్యుత్ వినియోగం స్మార్ట్ మీటర్ల ద్వారా తెలుస్తుంది. స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ మీటర్లని ఏర్పాటు చేస్తున్నాం. మంచి టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు పది సంవత్సరాల క్రితం టెక్నాలజీని ఇపుడు ఎలా వాడతాం’’అని విజయానంద్ ప్రశ్నించారు. వాస్తవిక దృక్పథంతో పరిశీలించిన తర్వాతే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ రంగంతో పాటు గృహావసరాలకి, పరిశ్రమలకి కూడా స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. కేంద్ర ప్రభుత్వ సూచనలకి అనుగుణంగా 2025 లోపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ వినియోగంపై స్మార్ట్ మీటర్ల ద్వారా దాదాపు కచ్చిత సమాచారం లభిస్తుంది. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులపై భారం ఉండదు’ అని విజయానంద్ స్పష్టం చేశారు. ‘‘రైతు అకౌంట్లలోనే వారి సబ్సిడీ నేరుగా వేస్తాం. బ్యాంకు అకౌంట్లు ఉన్నవారిలో 11.95 లక్షల మంది రైతులు సార్ట్ మీటర్లకి అంగీకరించారు. బ్యాంకు అకౌంట్లు ఉన్నవారిలో దాదాపు 99 శాతం స్మార్ట్ మీటర్లకి మద్దతు తెలిపారు. ఫిబ్రవరి నాటికి శ్రీకాకుళం జిల్లా పైలట్ ప్రాజెక్ట్ లో 83.16 శాతం స్మార్ట్ మీటర్లు పనిచేస్తున్నాయి. దాదాపు 50 శాతం మీటర్లు పనిచేయడం లేదనేది వాస్తవం కాదు’’ అని అన్నారు. చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.. ‘‘స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ చాలా పారదర్శకంగా చేస్తున్నాం. తప్పుడు వార్తలు పదే పదే రాస్తే లీగల్ గా చర్యలు తీసుకుంటాం. స్మార్ట్ మీటర్ల టెండర్లపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. ప్రయాస్ రిపోర్ట్ వృధా.. తప్పు అని అనలేదు. సగటు విద్యుత్ ధర, కొనుగోలు ధరలని లెక్క వేయడంలో పొరపాట్లు వచ్చాయి. యూనిట్ రేట్లో వ్యత్యాసం వేయడం వలనే వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 25 వేల నుంచి 30 వేల మీటర్లని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని పరిశీలన చేశాం. ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత మిగిలి జిల్లాలలో మళ్లీ పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు?. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలియాల్సిన అవసరం ఉంది’’ అని విజయానంద్ అన్నారు. -
వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు పేరే సాల్ట్
-
ఏపీలో కీలక పరిశ్రమలను ప్రారంభిస్తున్న సీఎం జగన్.. లక్షల మందికి ఉద్యోగాలు
-
AP: కొత్త జిల్లాల కేంద్రాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల కేంద్రాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. 13 కొత్త జిల్లా కేంద్రాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ వర్తిస్తుంది. కొత్త జిల్లా కేంద్రాల ఆస్తుల విలువ పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్బన్, రూరల్ ప్రాంతాల మార్కెట్ విలువ సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు: సీఎం జగన్ కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలికింది. కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రారంభించారు. చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెరగనుంది. పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేయొచ్చు. అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసంతో పాటు సుస్థిర ప్రగతికి బాటలు వేస్తుంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి మైళ్ల కొద్దీ తిరిగే దుస్థితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం కనీసం 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో పది కాలాలపాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం సాగనుంది. -
AP: సమయానికి రాకపోతే ‘సెలవే’
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగులు నిర్ణీత సమ యంలోగా కార్యాలయానికి రావాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్–19 తరువాత ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అందువల్ల సచివాలయ ఆర్థిక శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులందరూ పని దినాల్లో ఉదయం 10 గంటలకల్లా కార్యాలయానికి రావాలని, సాయంత్రం 5.30 గంటల వరకు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా రాని అధికారులకు, ఉద్యోగులకు ఆ రోజు సెలవుగా పరిగణిస్తామని తెలిపారు. ఆయన ఆదేశాలు ఇవీ.. చదవండి: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. ►ఉదయం 10 నుంచి 10.10 గంటల్లోపు తప్పనిసరిగా విధులకు హాజరవడం తోపాటు పనిచేయడం ప్రారంభించాలి ►ఉదయం 10.10 నుంచి 11 గంటల్లోపు ఆలస్యంగా హాజరుకు నెలలో మూడు సార్లు మాత్రమే అనుమతి. ►ఒక పూట హాజరును ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరిగణిస్తారు ►ఉదయం 11 గంటల తరువాత వచ్చి మధ్యాహ్నం 1 గంటలోపే వెళ్లిపోయినా లేదా నిర్ణీత సమయంలోగా వచ్చి మధ్యా హ్నం 1 గంటకన్నా ముందే వెళ్లిపోయినా ఒక పూట సెలవుగా పరిగణిస్తారు ►మధ్యాహ్నం 1 గంట తరువాత హాజరైతే ఆ రోజు సెలవుగా లేదా గైర్హాజరుగా పరిగణిస్తారు ►ఉదయం 10 గంటలకు హాజరై సాయంత్రం 5.30 తరువాత కార్యాలయం నుంచి వెళ్తే పూర్తి రోజు హాజరైనట్లు ►ఉద్యోగులు ముందుగా అనుమతి తీసుకోకుండా సెలవు పెట్టడంవల్ల పని వాతావరణం దెబ్బతింటోంది. ఇక నుంచి సెలవుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే. అనుమతి తీసుకోకుండా సెలవు పెడితే అనధికార గైర్హాజరుగా పరిగణిస్తారు. ఒక పూట సెలవు కోసం ముందస్తు సమాచారం ఇవ్వాలి. ►అధికారులు, ఉద్యోగులందరూ పనివేళ లను కచ్చితంగా పాటించాలి. క్రమశిక్షణను, పని వాతావరణాన్ని నెలకొల్పాలి. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని రావత్ స్పష్టం చేశారు. ►కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
మార్కెట్ విలువల పెంపునకు నో!
► రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలను తిరస్కరించిన సర్కారు ► సవరిస్తే ఏటా రూ.400 కోట్ల ఆదాయం పెరుగుతుందన్న కమిషనర్ ► నోట్ల రద్దు నుంచి రియల్ఎస్టేట్ ఇంకా కోలుకోలేదన్న స్పెషల్ సీఎస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూము లు, భవనాల మార్కెట్ విలువల పెంపునకు సర్కారు విముఖత వ్యక్తం చేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రస్తుత విలువలే కొనసాగనున్నాయి. వాస్తవానికి నాలుగేళ్లుగా మార్కెట్ విలువలను ప్రభుత్వం సవరించకపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆశించిన మేర రాబడి లభించడం లేదు. ఏటా ఈ శాఖ ఆదాయ లక్ష్యాన్ని పెంచుకుంటూ పోతున్నా.. మార్కెట్ విలువలను సవరించ కపోవడంతో ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నా రు. 2016–17లోనైనా మార్కెట్ విలువలను సవరించాలని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ గతేడాది ఏప్రిల్‌లోనే ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆలస్యంగా స్పందించిన సర్కారు.. అది సరైన సమయం కాదంటూ ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టిం ది.కొద్ది రోజుల్లో 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుంది. ఇక ప్రభుత్వ తాజా నిర్ణ యంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా భూములు, భవనాల మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉండకపోవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆదాయానికి గండి: ఏపీ మార్కెట్ విలువ సవరణ నిబంధనలు, మార్గదర్శకాలు–1998 మేరకు ఏటా భూములు, భవనాల మార్కెట్ విలువలను రిజిస్ట్రేషన్ల శాఖ సవరించాల్సి ఉంది. ఒక ఏడాది పట్టణ ప్రాంతాల్లో, మరుసటి ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ విలువలను సవరించాలి. ఏటా ఏప్రిల్‌లో మార్కెట్ విలువల పెంపు కసరత్తు ప్రారంభించి.. ఆగస్టు 1 నుంచి సవరణ ప్రతిపాదనలను అమలు చేయాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో ధరలను అనుసరించి రిజిస్ట్రేషన్ విలువలను సమీక్షిస్తారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 2013లో చివరిసారిగా భూములు, భవనాల మార్కెట్ విలువలను సవరించారు. ఆ తర్వాతగానీ, రాష్ట్రం ఏర్పాటయ్యాకగానీ సవరణ చేపట్టలేదు. గత మూడేళ్లుగా రిజిస్ట్రేషన్ శాఖ విలువల సవరణ ప్రతిపాదనలను సమర్పిస్తున్నా.. ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. సవరిస్తే రూ.400 కోట్ల ఆదాయం రాష్ట్ర ఏర్పాటు అనంతరం అన్ని జిల్లాల్లో రియల్ ఎస్టేట్ క్రమేపీ పుంజుకుంటోందని.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూములు, భవనాల మార్కెట్ విలువలను సవరించేందుకు అనుమతించాలని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ గత ఏప్రిల్‌లోనే ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సవరణ జరిపితే ఏటా రూ.400 కోట్లకు పైగా రాబడి పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో భూములు, భవనాల మార్కెట్ విలువలు పెంచేందుకు ఇది సరైన సమయం కాదని రెవెన్యూ (రిజిస్ట్రేషన్లు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా రిజిస్ట్రేషన్ల శాఖకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2014, 2015 సంవత్సరాల్లో మార్కెట్ విలువలను పెంచేందుకు సరైన కారణాలు లేవని.. ఇటీవల వృద్ధిరేటు తక్కువగా ఉండడం, పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో రిజిస్ట్రేషన్ల రాబడి తగ్గిందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశముందని, ఈ పరిస్థితుల్లో మార్కెట్ విలువల సవరణ సరికాదని సూచించారు. -
ప్రత్యేక సీఎస్‌గా భన్వర్‌లాల్‌కు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారిగా కొనసాగుతున్న భన్వర్‌లాల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సీఎస్(ప్రధాన కార్యదర్శి)గా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మిగతా అధికారులకు గతంలోనే ప్రత్యేక సీఎస్‌లుగా పదోన్నతి కల్పించినప్పటికీ అప్పుడు భన్వర్‌లాల్‌కు అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆయనకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు.