speed guns
-
అక్కడ వాహనదారుల ఆటలు సాగవు!
సాక్షి, న్యూఢిల్లీ :రోడ్డు నిబంధనలను ఉల్లంఘించి మనం వాహనాలను నడిపినా, పరిమితికి మించి వేగంగా తీసుకెళ్లినా, నో పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేసినా మన వాహనాల నెంబర్ ప్లేట్లను ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసులు మనకు జరిమానాలు విధించడం, వాటిని మనం ఆన్లైన్లో చూసుకొని బాధ పడడం, తప్పనిసరి పరిస్థితుల్లో జరిమానాలు చెల్లించడం మనకు కొత్త కాదు. మన పోలీసులకు ఉన్నత స్థాయి హెచ్ డీ కెమేరాలు లేకపోవడం వల్ల రోడ్డు నిబంధనలను అతిక్రమించే వారు రాత్రిపూట ‘రాంగ్ సైడ్’లో ఇప్పటికీ దూసుకుపోతున్నారు. (మళ్లీ రగులుకున్న ‘ఈశాన్యం’) అలాంటి పరిస్థితి బ్రిటీష్ పోలీసులకు కూడా తరచూ ఎదురవుతుండడంతో వారు ‘ట్రూకామ్–2’ జనరేషన్ స్పీడ్ కెమేరాలను తెప్పించుకున్నారు. పగలే కాదు రాత్రి కూడా ఆటో ఫోకస్‌తో వాహనాల నెంబర్ ప్లేట్లను స్పష్టంగా ఫొటోతీసి పంపించే సామర్థ్యం ఈ కెమేరాలకు ఉంది. అంతేకాదు, నిమిషానికి 750 మీటర్ల వేగంతో దూసుకెళ్లే వాహనాల నెంబర్ ప్లేట్లను కూడా సునాయాసంగా పట్టుకోగల సామర్థ్యం కూడా వీటికి ఉంది. వీటి ధర కూడా అదిరిపోతుంది. ఒక్కో కెమేరాకు పదివేల పౌండ్లు (దాదాపు 9.80 లక్షల రూపాయలు). వీటిని ‘బ్లూ స్పీడ్ గన్స్’గా వ్యవహరిస్తున్నారు. అందుకని నార్త్‌అంబ్రియా, వార్విక్షైర్ ట్రాఫిక్ పోలీసులు వీటిని కొనగోలు చేశారు. వీటి వల్ల వేగంగా దూసుకెళుతున్న వాహనాలను వెంటపడి, వెంటపడి పట్టుకోవాల్సిన పనిలేకుండా పోతుందని పోలీసులు అంటున్నారు. ఫోటోగన్లా పనిచేసే ఈ కెమేరాల ద్వారా నిబంధనలకు నీళ్లొదులుతున్న వాహనాలను, వాటి ద్వారా వాటి యజమానులను సులభంగానే గుర్తించే అవకాశం దొరికిందని అక్కడి పోలీసులు అంటున్నారు. ఈ విషయంలో మనలోని ‘రాంగ్ సైడర్స్’ భయపడాల్సిన అవసరం లేదు. కెమేరాల కోసం అంత డబ్బులు మన పోలీసులు పెట్టలేరేమో!(బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) -
స్పీడ్‌గా దొరికిపోతారు!
స్పీడ్‌గా దొరికిపోతారు! వాహనాల మితిమీరిన వేగానికి కళ్లెం వేసేందుకు పరిగి పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. స్పీడ్‌గా దూసుకెళ్లే వాహనాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. ఇందుకోసం స్పీడ్గన్లు వినియోగిస్తున్నారు. జిల్లా మీదుగా వెళ్లే హైదరాబాద్– బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ మార్గంగా మార్చారు. విస్తరణ పనులు కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో వాహనాల వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇలా వాహనదారులు విపరీతమైన స్పీడ్‌తో దూసుకెళ్లడంతో పాటు ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు స్పీడ్‌కు కళ్లెం వేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గడిచిన మూడు నెలల కాలంలో 154 స్పీడ్ కంట్రోల్ కేసులు నమోదు చేశారు. సాక్షి, పరిగి: పరిగి మీదుగా వెళ్లే హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై వాహనదారులు ఇటీవల 100 నుంచి 140 స్పీడ్‌తో దూసుకెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని నియంత్రించేందుకు క్రమం తప్పకుండా నిత్యం సాయంత్రం వేళల్లో రహదారిపై స్పీడ్ గన్లతో కాచుకుని ఉంటున్నారు. గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని దాటిపోతున్న వాహనదారులకు ఈ చలానా రూపంలో ఫైన్లు విధిస్తున్నారు. ఈ విషయం కొంతమంది వాహనదారులకు సైతం అర్థం కావటంతో పోలీసుల నిఘాలో ఉన్నామనే విషయాన్ని గమనించి వేగం తగ్గించారు. తెలియని వారు మాత్రం స్పీడ్ గన్‌కు దొరికిపోయి జరిమానాలు చెల్లిస్తున్నారు. గడిచిన మూడు నెలల కాలంలో అతి వేగం కారణంగా పోలీసులు రూ.1,59,390 జరిమానా విధించారు. స్కూల్ బస్సులకు స్పీడ్ గవర్నెన్స్ బిగింపు.. చిన్నారులను తరలించే స్కూల్ బస్‌ల విషయంలో పోలీసులు మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. అటు పోలీసు శాఖయే కాకుండా ఆర్టీఓ అధికారులు సైతం ఈ అంశాన్ని సున్నితంగా పరిగణించి స్కూల్ బస్‌ల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 70 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వీటి పరిధిలో 100 పైచిలుకు స్కూల్ బస్‌లు ఉన్నట్లు గుర్తించారు. స్కూల్ బస్ విషయంలో నూతనంగా కేంద్రం తీసుకు వచ్చిన ఎంవీఐ యాక్టు ప్రకారం ఇటీవల రెన్యువల్ చేసే సమయంలో స్కూల్ బస్సులన్నింటికీ స్పీడ్ గవర్నెన్స్‌ను బిగించారు. ఇవీ ఆటోమేటిక్ వేగ నియంత్రికలుగా పనిచేస్తూ వేగాన్ని నియంత్రిస్తాయి. -
వాహనాల వేగానికి కళ్లెం
సాక్షి, గుంటూరు : అతివేగం వలన జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్పీడ్ గన్‌తో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలను స్పీడ్‌గన్‌తో గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాకు ఒక స్పీడ్ గన్ను ప్రభుత్వం 2018లో అందించింది. ప్రతి రోజు ఒక మోటల్ వెహికల్ ఇన్స్పెక్టర్కు స్పీడ్ గన్‌తో జిల్లాలోని వివిధ రహదారుల్లో తనిఖీలు నిర్వహించే బాధ్యతను అప్పగించారు. స్పీడ్ గన్‌లో సంబంధిత రహదారిపై నిర్దేశించిన వేగాన్ని ముందుగానే సెట్టింగ్ చేస్తారు. రహదారిపై వాహనాలను స్పీడ్ గన్‌తో పరిశీలిస్తారు. నిర్దేశించిన వేగం కంటే అధిక వేగంతో ప్రయాణించే వాహనం ఫొటో తీసుకుంటారు. వాహనం నంబరు ఆధారంగా యజమానికి రూ.1500 అపరాధ రుసుం విధిస్తారు. అపరాధ రుసుం విధించిన వాహనాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయటం వలన వాహనంపై జరిగే ఇతర లావాదేవీలు అపరాధ రుసుం చెల్లిస్తేనే సాధ్యం అవుతాయి. అపరాధ రుసుం వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన ఫోన్ నంబరుకు సంక్షిప్త సమాచార రూపంలో అందిస్తారు. జిల్లాలో అతివేగంగా ప్రయాణించే వాహనాలపై 2018 సంవత్సరంలో 1,559 కేసులు నమోదు చేసి, రూ.21.82 లక్షల అపరాధ రుసుం విధించారు. 2019 జూన్ 9వ తేదీ వరకు 1,881 కేసులు నమోదు చేశారు. రూ.26.33 లక్షల జరిమానా వేశారు. అధిక వేగంతో అనర్థాలు వాహన ప్రమాదంలో ప్రాణ నష్టానికి వేగం ప్రధాన కారణం. వాహనాలు గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు రహదారిపై ప్రమాదం జరిగిన వాహనంలో ప్రయాణిస్తున్న వారికి జరిగే గాయాల శాతం తీవ్రత తక్కువుగా ఉంటుంది. వీటి మరణాలు శాతం కూడా 10శాతానికి మించి ఉండదు. కాని వాహన వేగం 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉంటే మాత్రం గాయాల శాతం తీవ్రత ఎక్కువుగా ఉండటంతో పాటు మరణాలు 90శాతం ఉంటుంది. ఇక 100 కిలోమీటర్లకు మించి వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమదాలు జరిగితే మాత్రం వాహనంలో రక్షణ పరికరాలైన ఎయిర్‌బెలున్సు ఉన్న అవి ఫెయిల్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రహదారుల పరిస్థితి కూడా వాహనాలు వేగంపై ప్రభావం చూపుతుంది. జిల్లాలోని అంతర్గత సింగిల్, డబుల్ రోడ్లు, స్థానిక పరిస్థితుల బట్టీ కూడా వాహన వేగం నియంత్రించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన వాహనాల్లో స్పీడ్ గంటకు 150 కిలోమీటర్ల పైనే ప్రయాణించే వీలు ఉంటుంది. స్థానికంగా ఉండే రహదారుల నిర్మాణం, పరిసరాల పరిస్థితుల ఆధారంగా అతి వేగంతో ప్రయాణించే వాహనం నియంత్రణ కోల్పోతుంది. వాహనాలు పక్కకు వెళితే చెట్లకు గుద్దుకోవటం, పక్కన ఉన్న కాల్వలోకి దూసుకుపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.జాతీయ రహదారులకు 100 కిలోమీటర్లు, ఎక్స్‌ప్రెస్ హైవేలకు 120 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. అన్ని రహదారులపై జనసమ్మర్థంగా ఉండే ప్రాంతాలు, మూలమలుపుల వద్ద, నారో బ్రిడ్జ్‌ల వద్ద, రోడ్డు క్రాసింగ్‌లు, సర్వీసు రోడ్డులకు వెళ్లే ప్రాంతాల్లో మాత్రం 10 కిలోమీటర్లు నుంచి 5 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సి ఉంది. వేగం నిర్దేశించిన రహదారుల్లో లైట్ మోటర్ వెహికల్(నాన్ ట్రాన్స్‌పోర్టు) నో లిమిట్, లైట్ మోటర్ వెహికల్ (ట్రాన్స్‌పోర్టు) 65 కిలోమీటర్లు, మోటర్ సైకిల్ 50 కిలోమీటర్లు, ప్యాసింజర్/ గూడ్స్ వెహికల్ 65 కిలోమీటర్లు, మీడియం/హెవీ వెహికల్స్ 65 కిలోమీటర్లు, ట్రైలర్ 50 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించాలని నిబంధన ఉంది. -
స్పీడ్ గన్స్, కెమెరాలు
సాక్షి, సిద్దిపేట : రాజీవ్ జాతీయ రహదారి.. ఇటీవల తరచూ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.. ఆ రహదారిపై ప్రయాణించాలంటేనే జనం జంకుతు న్నారు.. అయితే ఇకపై ఆ పరిస్థితి మారనుంది. రాజీవ్ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్దిపేట జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు, వాటికి గల కారణాలు తెలుసుకుని, అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, మానకొండూరులో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలతో అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌తోపాటు బీవోటీ డీజీఎం విజయభాస్కర్‌రెడ్డి సమావేశమయ్యారు. ప్రమాదాలపై అధ్యయనం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట నుంచి సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల మీదుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ప్రాంతం వరకు 207 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించారు. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గల పలు జాతీయ రహదారులను ఈ దారి కలుపుతుంది. సిద్దిపేట జిల్లాలో ఈ రహదారి ములుగు మండలం వంటిమామిడి నుంచి బెజ్జంకి వరకు సుమారు 125 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారి పనులపై అప్పట్లోనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎక్కడా పార్కింగ్ లేదు! రాజీవ్ రహదారిపై ఎక్కడిపడితే అక్కడ ఉన్న మూల మలుపులు, తొమ్మిది అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న డివైడర్ వల్ల ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఇసుక వాహనాలు, ఎక్స్‌ప్రెస్‌లు మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం అని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. వీటిని నిరోధించేందుకు ఓఆర్ఆర్ మాదిరిగా స్పీడ్ కంట్రోలింగ్ సిస్టమ్ (స్పీడ్ గన్స్) ఏర్పాటు చేయనున్నారు. 207 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిపై ఎక్కడా పార్కింగ్ సౌకర్యం లేదు. కొన్ని సందర్భాల్లో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని నివారించేందుకు సిద్దిపేట జిల్లాలోని 95 కిలోమీటర్ల పొడవున 7 పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు స్థల సేకరణ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు.. గుర్తుతెలియని వాహనాలను గుర్తించడంతో పాటు రహదారిపై జరిగే ఇతర నేరాలను అరికట్టేందుకు సిద్దిపేట జిల్లా పరిధిలో రాజీవ్ రహదారిపై 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా రహదారి వెంట ఉన్న గ్రామాల్లో రోడ్డు దాటే సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి నివారణకు ప్రతి గ్రామంలో లైటింగ్, ఇతర రక్షణ చర్యలు చేపట్టనున్నారు. జీబ్రా క్రాసింగ్ పెయింటింగ్, ప్రమాద సూచికలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. డివైడర్ల ఎత్తు పెంపు విషయంపై బీవోటీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అలాగే సిద్దిపేట సరిహద్దులోని పొన్నాల వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి మంజూరు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. రహదారికి ఇరువైపులా పార్కింగ్ ‘ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం. దీన్ని నివారించేందుకు సిద్దిపేట జిల్లా పరిధిలోని 75 కిలోమీటర్లలో అవసరమైన చోట పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు ప్రభుత్వ భూమి గుర్తించాలని ఆర్డీవోలు, తహశీల్దారర్లకు ఆదేశాలు జారీ చేశాం. మితిమీరిన వేగాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టే విషయంపై పోలీస్ కమిషనర్‌తో చర్చించాం.’ – వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక ‘రాజీవ్ రహదారిపై రోజూ ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. దీన్ని నివారించేందుకు జిల్లా కలెక్టర్ చొరవతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. పార్కింగ్, స్పీడ్ కంట్రోల్, సీసీ కెమెరాల ఏర్పాటు మొదలైన చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతాం. – జోయల్ డేవిస్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ రక్షణ చర్యలు చేపడుతున్నాం. రహదారిపై ప్రమాదాలు నివారించేందుకు రక్షణ చర్యలు చేపడుతున్నాం. రామునిపట్ల, లింగారెడ్డిపల్లి గ్రామాల వద్ద లైటింగ్ ఏర్పాటు, మార్కింగ్‌లు, ఇతర గుర్తులను తెలిపేలా ఎప్పటికప్పుడు పెయింటింగ్ చేస్తున్నాం. – విజయ భాస్కర్‌రెడ్డి, బీవోటీ, డీజీఎం -
నెత్తుటి మరకలు
మహబూబ్‌నగర్ క్రైం: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రయాణంలో కాలహరణను తగ్గించేందుకు జాతీయ రహదారులను నిర్మిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 185 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 44వ నంబరు జాతీయ రహదారి నిత్య ప్రమాదాలకు నిలయమైంది. ఈ రహదారిపై కనీసం కొన్ని జంక్షన్లలో కనీసం వెలుగునిచ్చే విద్యుత్ లైట్లు లేకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మిగిలింది. మరికొన్ని చోట్ల సాంకేతిక లోపాలు, ఇతరత్రా కారణాలతో ప్రమాదాలకు సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతుంది. వేగం కన్నా.. ప్రాణం మిన్న..రహదారి భద్రతలో ప్రధాన సూత్రమిది.. ప్రచారానికి బాగానే ఉన్నా.. పట్టించుకునేవారే కరువయ్యారు. కనిపించని స్పీడ్ గన్స్.. రహదారులపై పరిమితికి మించి వేగంగా వెళ్లిన వాహనాలను గుర్తించి జరిమానా విధించేందుకు వీలుగా స్పీడ్‌గన్స్ ప్రవేశపెట్టారు. గంటకు 240 కి.మీ. వేగంతో వెళ్తున్న వాహనాన్ని వీటితో గుర్తించవచ్చు. వేగంతో వస్తున్న వాహనాలను 100 మీటర్లలోకి వచ్చిన తర్వాత స్పీడ్‌గన్‌లో ఆపరేటర్ చూస్తే వాహనం, నంబర్, ఫొటో వేగం నమోదు అవుతుంది. ఇలాంటి సదుపాయం ఉన్న స్పీడ్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేయడం లేదు. దీనికితోడు రోడ్డుపై ఏర్పాటు చేసిన డివైడర్ల ఎత్తు తగ్గిపోవడంతో అవతలి వైపు నుంచి వచ్చే వాహనాల ఇవతలి రోడ్డుపైకి దూసుకువచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఘటనలు ఇలా.. ♦ జనవరి 28, 2015న అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లి దగ్గర జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 7మంది మృతిచెందారు. ♦ జూన్ 14, 2015న ఫరూఖ్‌నగర్ మండలం చటాన్‌పల్లి దగ్గర జరిగిన కారు ప్రమాదంలో 5మంది మృతిచెందారు. ♦ ఫిబ్రవరి 7, 2016న బాలానగర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మంది మృత్యువాతపడ్డారు. ♦ ఫిబ్రవరి 18, 2016న భూత్పూర్ దగ్గర జరిగిన ప్రమాదంలో కర్నూలుకు చెందిన 5మంది మృతిచెందారు. ♦ జూన్ 25, 2016న అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లి దగ్గర కారు కల్వర్టు ఢీకొనడంతో నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ♦ జూలై 26, 2016న మానవపాడు స్టేజీ దగ్గర లారీ ఆటోను ఢీకొనడంతో కర్నూలు పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన 5 మంది మృతిచెందారు. ♦ డిసెంబర్ 19, 2016న అడ్డాకుల దగ్గర మోపెడ్‌పై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఇద్దరూ దుర్మరణం చెందారు. ♦ నవంబర్ 19, 2016న కొత్తకోట మండలం అమడబాకుల స్టేజీ దగ్గర స్కార్పియో బోల్తాపడి 5మంది తాపీ కార్మికులు అనంతవాయువులో కలిసిపోయారు. ♦ మార్చి 26, 2016న భూత్పూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతిచెందారు. ♦ నవంబర్ 12, 2017న జడ్చర్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోను లారీ ఢీకొట్టడంతో జడ్చర్ల మండలం బండమీదిపల్లికి చెందిన నలుగురు కూలీలు మృతిచెందారు. ♦ ఇక ఒకరిద్దరు చనిపోయినవి, క్షతగాత్రులకు సంబంధించి లెక్కకు మించి ఉన్నాయి. -
ఔటర్ ఎంజాయ్‌మెంట్‌కు కాదు: డీజీపీ
హైదరాబాద్: ప్రజల సౌకర్యం కోసం ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించారు. అంతేకాని మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఎంజాయ్ చేయడానికి కాదని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. ఈ మధ్య కాలంలో ఔటర్‌రింగ్ రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఉన్నతాధికారులు ఔటర్‌పై స్పీడ్గన్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు బ్రీత్ ఎన్‌లైజర్లు, వేగ నియంత్రణ కోసం స్పీడ్ గన్లు ప్రారంభిచారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బొంగ్లూర్ అవుటర్ రింగ్ రోడ్డుపై ఈరోజు జరిగిన కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మతో పాటు సీపీ మహేశ్ భగవత్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు పాల్గొన్నారు.