సాక్షి, న్యూఢిల్లీ :రోడ్డు నిబంధనలను ఉల్లంఘించి మనం వాహనాలను నడిపినా, పరిమితికి మించి వేగంగా తీసుకెళ్లినా, నో పార్కింగ్ జోన్లలో పార్కింగ్ చేసినా మన వాహనాల నెంబర్ ప్లేట్లను ఫొటో తీసి ట్రాఫిక్ పోలీసులు మనకు జరిమానాలు విధించడం, వాటిని మనం ఆన్‌లైన్‌లో చూసుకొని బాధ పడడం, తప్పనిసరి పరిస్థితుల్లో జరిమానాలు చెల్లించడం మనకు కొత్త కాదు. మన పోలీసులకు ఉన్నత స్థాయి హెచ్ డీ కెమేరాలు లేకపోవడం వల్ల రోడ్డు నిబంధనలను అతిక్రమించే వారు రాత్రిపూట ‘రాంగ్ సైడ్’లో ఇప్పటికీ దూసుకుపోతున్నారు. (మళ్లీ రగులుకున్న ‘ఈశాన్యం’)
అలాంటి పరిస్థితి బ్రిటీష్ పోలీసులకు కూడా తరచూ ఎదురవుతుండడంతో వారు ‘ట్రూకామ్–2’ జనరేషన్ స్పీడ్ కెమేరాలను తెప్పించుకున్నారు. పగలే కాదు రాత్రి కూడా ఆటో ఫోకస్‌తో వాహనాల నెంబర్ ప్లేట్లను స్పష్టంగా ఫొటోతీసి పంపించే సామర్థ్యం ఈ కెమేరాలకు ఉంది. అంతేకాదు, నిమిషానికి 750 మీటర్ల వేగంతో దూసుకెళ్లే వాహనాల నెంబర్ ప్లేట్లను కూడా సునాయాసంగా పట్టుకోగల సామర్థ్యం కూడా వీటికి ఉంది. వీటి ధర కూడా అదిరిపోతుంది. ఒక్కో కెమేరాకు పదివేల పౌండ్లు (దాదాపు 9.80 లక్షల రూపాయలు). వీటిని ‘బ్లూ స్పీడ్ గన్స్’గా వ్యవహరిస్తున్నారు.
అందుకని నార్త్‌అంబ్రియా, వార్‌విక్‌షైర్ ట్రాఫిక్ పోలీసులు వీటిని కొనగోలు చేశారు. వీటి వల్ల వేగంగా దూసుకెళుతున్న వాహనాలను వెంటపడి, వెంటపడి పట్టుకోవాల్సిన పనిలేకుండా పోతుందని పోలీసులు అంటున్నారు. ఫోటోగన్‌లా పనిచేసే ఈ కెమేరాల ద్వారా నిబంధనలకు నీళ్లొదులుతున్న వాహనాలను, వాటి ద్వారా వాటి యజమానులను సులభంగానే గుర్తించే అవకాశం దొరికిందని అక్కడి పోలీసులు అంటున్నారు. ఈ విషయంలో మనలోని ‘రాంగ్ సైడర్స్’ భయపడాల్సిన అవసరం లేదు. కెమేరాల కోసం అంత డబ్బులు మన పోలీసులు పెట్టలేరేమో!(బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?)
Comments
Please login to add a commentAdd a comment