spot-fixing scandal
-
ఆ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఖలీద్ లతీఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐదేళ్లపాటు నిషేధం విధించింది. 2017లో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఖలీద్ పాత్ర ఉండటంతో ఐదేళ్లపాటు అతను అన్ని ఫార్మెట్లలోనూ క్రికెట్ ఆడకుండా నిషేధించింది. పీఎస్ఎల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడిన ఖలీద్ పీసీబీ అవినీతి వ్యతిరేక నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించినట్టు ఆరు అభియోగాలు ఎదుర్కొన్నాడు. ఈ ఆరు అభియోగాల్లోనూ అతను దోషిగా తేలడంతో పీసీబీ ఈమేరకు చర్య తీసుకుంది. అంతేకాకుండా అతనిపై రూ. 10లక్షలు (పాక్ కరెన్సీ) జరిమానా విధించింది. ఈ వ్యవహారంపై సమగ్ర తీర్పు వెలువడిన అనంతరం ఖలీద్ లతీఫ్ 14 రోజుల్లో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. లతీఫ్ అప్పీల్ చేస్తాడా లేదా? అన్నది వేచిచూస్తామని పీసీబీ తరఫు న్యాయవాది తెలుపగా.. అప్పీల్ చేసే అవకాశం ఉందని లతీఫ్ తరఫు న్యాయవాది బాదర్ ఆలం తెలిపారు. -
శ్రీశాంత్ కు పెళ్లి కుదిరింది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంతో నిషేధం ఎదుర్కొంటున్న కేరళ ఫాస్ట్ బౌలర్ పెళ్లి కుదిరింది. రాజస్థాన్ కు చెందిన ఓ రాయల్ కుటుంబానికి చెందిన నయన్ తో గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో డిసెంబర్ 12 తేదిన పెళ్లి జరుగుతుంది అని శ్రీశాంత్ తల్లి సావిత్రి దేవి తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని.. ఐపీఎల్ ఆరవ ఎడిషన్ లో స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి.. జైలుకెళ్లిన సమయంలో కూడా శ్రీశాంత్ కు నయన్ బాసటగా నిలిచినట్టు తెలిసింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ ఆడకుండా బీసీసీఐ సెప్టెంబర్ లో నిషేధం విధించింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ప్రస్తుతం శ్రీశాంత్ బెయిల్ పై ఉన్నారు. శ్రీశాంత్ పై మోకా (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజడ్ క్రైమ్ యాక్ట్) కింద కేసు నమోదైంది. ఈ కేసు డిసెంబర్ 18 తేదిన విచారణకు రానుంది. -
మళ్లీ పోటీ చేస్తా: మీడియాకు శ్రీనివాసన్ సవాల్
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, ఇతర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ ఎన్ శ్రీనివాసన్ బోర్దు ఎన్నికల్లో టాప్ పోస్ట్ కు పోటీ చేస్తానని గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 29న జరిగే ఎన్నికల్లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటి పడుతానని ఆయన తెలిపారు. బీసీసీఐ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో శ్రీనివాసన్ మాట్లాడుతూ.. మీడియా తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఎన్నికల్లో పోటికి నిలబడుతానని సవాల్ విసిరాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో తన అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తడంతో శ్రీనివాసన్ రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలనంతరం శ్రీనివాసన్ పక్కకు తప్పించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్ మోహన్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు.