sravankumar
-
తాడికొండ టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..!
సాక్షి, గుంటూరు: తాడికొండ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ తీరుకు వ్యతిరేకంగా జడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో అసంతృప్త నేతలు సమావేశం నిర్వహించారు. ఈసారి తాడికొండ టీడీపీ టికెట్ శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని ఈ సమావేసంలో తీర్మానం చేశారు. అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థికి సీటు ఇవ్వాలని వారు అధిష్టానాన్ని తీర్మానంలో కోరారు. -
‘జీవ నియంత్రణ’తో తెగుళ్ల నివారణ
పంటలకు జీవౌషధం.. ‘ట్రైకోడెర్మావిరిడి’ వాతావరణ కాలుష్యానికి చెక్ ఆరోగ్యకరమైన పంటలకు సోపానం దీని వాడకం ద్వారా అనేక తెగుళ్ల నివారణ గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ సలహా సూచనలు గజ్వేల్: రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు విచక్షణారహితంగా వాడటం వల్ల దుష్ఫలితాలు కలుగుతున్నాయి. పురుగులు, తెగుళ్లు రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఏ మందులకూ లొంగకుండాపోతున్నాయి. దీంతో సమస్య జఠిలమవుతున్నది. ఈ తరుణంలో రైతులు జీవనియంత్రణ పద్ధతులను పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చని గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ (సెల్: 7288894469) చెబుతున్నారు. జీవ నియంత్రణ పద్ధతుల వల్ల వ్యవసాయంలో ఖర్చును తగ్గించుకొని లాభసాటిగా మార్చుకోవచ్చని ఆయన అంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం పలుచోట్ల జీవనియంత్రణ ప్రయోగశాలలను ప్రారంభించిందని చెప్పారు. వీటి ద్వారా ట్రైకోడెర్మా విరిడి, సుడోమోనాస్ను తయారుచేసిన రైతులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రైకోడెర్మావిరిడి వాడకం, దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు. ట్రైకోడెర్మావిరిడి మనం పండించే వివిధ పంటలను వేరుకుళ్లు, మాగుడు తెగులు, ఎండు తెగులు, ఆశించి విపరీత నష్టాన్ని కలుగజేస్తున్నాయి. పంటభూముల్లో అనేక శిలీంధ్రాలు ఉంటాయి. వీటిలో స్లీ్కరోషియం, ఫిథియం, ఫైటోఫ్తరా, పుజేరియం, పైరికులేరియం వంటివి మొక్కలకు తెగుళ్లను ఆశించేలా చేసి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటిని నాశనం చేయడంలో ట్రైకోడెర్మావిరిడి బాగా పనిచేస్తుంది. ఇది భూమిలో అతి త్వరగా వృద్ధి చెందుతుంది. దీనికి ఆమ్ల నేలలు, తటస్థ నేలలు అనుకూలం. వేరుశనగ, పప్పుధాన్యపు పైర్లు, కూరగాయలు, పత్తి, నిమ్మ, కొబ్బరి, అరటి, పొగాకు, మిరప మొదలైన పంటలకు తీవ్రంగా నష్టం కలిగించే వేరుకుళ్లు, కాండం కుళ్లు, మాగుడు తెగులు, ఎండుతెగులు నివారణకు ఇది ఉపయోగపడుతుంది. దీనిని వాడినపుడు వేరు చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది విత్తనశుద్ధి చేయడానికి, సేంద్రియ ఎరువులతో కలిపి నేలలో వేయడానికి పనికి వస్తుంది. ట్రైకోడెర్మావిరిడిని పురుగు మందులతో కలిపి వాడకపోడం శ్రేయస్కరం. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలి. తెగుళ్ల నివారణ ఇలా.. కాండం తెగులు: టమాటా, వేరుశనగలో వచ్చే కాండం తెగులు నివారణకు ట్రైకోడెర్మావిరిడిని విత్తనశుద్ధి లేదా సాళ్లల్లో వేసే విధానంలో వాడవచ్చు. విత్తనకుళ్లు: కూరగాయలు, పొగాకు పంటలకు ఆశించే విత్తనకుళ్లు, వడల తెగులుకు విత్తనశుద్ధి లేదా మట్టితో కలిపే విధానంలో వాడవచ్చు. కుళ్లు తెగులు: శనగ, కంది, పత్తి, టమటా పంటలను ఆశించే ఈ తెగులు నివారణకు విత్తనశుద్ధి లేదా మట్టితో కలపడం వంటి పద్ధతుల ద్వారా నివారించవచ్చు. వేరుకుళ్లు: శనగ, పత్తి, టమటా పంటలను ఇది ఆశిస్తుంది. దీని నివారణకు విత్తన శుద్ధి లేదా నేలల్లో వేయడం పద్ధతుల ద్వారా నివారించవచ్చు. ఎర్రకుళ్లు: చెరకు పంటను ఆశించే ఈ తెగులు నివారణకు చెరకు గడ ముక్కలను ముంచడం ద్వారా నివారించవచ్చు. విత్తన శుద్ధి పద్ధతి 1 కిలో విత్తనానికి 8-10 గ్రాముల పొడి మందు సరిపోతుంది. 500 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడిని వంద లీటర్ల నీటితో కలిపి ఉపయోగించుకోవాలి. భూమిలో వేసే విధానం: ఎకరాకు 2-3 కిలోలు దుక్కిలో వేయాలి. ట్రైకోడెర్మా విరిడి 1 కిలో, వేప పిండి 10 కిలోలు, పశువుల ఎరువు 90 కిలోలను మిశ్రమంగా చేసి కావాల్సినంత తేమను అందించి వారం రోజుల పాటు నీడలో ఉంచిన తర్వాత దుక్కిలో వేసుకోవాలి. మోతాదు: వేరుశనగ, పత్తి, పొద్దుతిరుగుడు, అపరాలు, పొగాకు, తమలపాకు, వంగ, బెండ, ఉల్లి, బంగాళదుంప, మిరప, పుచ్చ, వరి పంటలకు సంబంధించి 1 కిలో విత్తనానికి 8-10 గ్రాములు వేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎకరాకు 2 కిలోలు దుక్కిలో వేయాల్సి ఉంటుంది. చెరుకు, అల్లం, పసుపు పంటలకు సంబంధించి ఎకరాకు 500 గ్రాములతో విత్తనశుద్ధి చేస్తే సరిపోతుంది. అదేవిధంగా 2-3 కిలోలు దుక్కిలో వేయాల్సి ఉంటుంది. కొబ్బరికి సంబంధించి మొక్క నాటినప్పుడు దాని వద్ద 25-50 గ్రాములు వేయాల్సి ఉంటుంది. ప్రతి ఆరు నెలలకోసారి మొక్కకు 50-70 గ్రాములు వేస్తే మంచి ఫలితాలుంటాయి. అరటిలో మొక్కనాటేటప్పుడు దాని వద్ద 2-3 గ్రాములు వేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆరు నెలలకోసారి మొక్క మొదలు దగ్గర వేయాలి. నిమ్మ, నారింజ తోటలకు సంబంధించి మొక్క నాటేటప్పుడు 10 గ్రాములు, ప్రతి ఆరు నెలలకోసారి 20-30 గ్రాములు మొక్క మొదళ్ల వద్ద వేయాల్సి ఉంటుంది. ట్రైకోడెర్మావిరిడి వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీనిని వాడేముందు భూమిలో తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి. లేదా వాడిన వెంటనే మొక్కలకు నీరు పెట్టాలి. కంపోస్టు, ఇతర పశువుల ఎరువులు, జీవసంబంధమైన పదార్థాలతో కలిపి ఈ మందును వాడుకోవచ్చు. చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయరాదు. తయారు చేసిన ట్రైకోడెర్మావిరిడి కల్చరును ఆరు నెలలలోపు వాడుకోవచ్చు. ట్రైకోడెర్మావిరిడి లభ్యమయ్యే ప్రదేశాలు జీవనియంత్రణ ప్రయోగశాలలు, జిల్లాలోని అన్ని వ్యవసాయశాఖ కార్యాలయాలు -
4న స్వేరోయిజం సమావేశం
గద్వాల న్యూటౌన్ : షాద్‌నగర్‌లో ఈ నెల 4న జరిగే స్వేరోయిజం సమావేశానికి తరలిరావాలని స్వేరోస్ కమిటీ డివిజన్ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని రామిరెడ్డి స్మారక గ్రంథాలయంలో స్వేరోస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశానికి విశిష్ట అతిథిగా తెలంగాణ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ రాంకిషన్, జెడ్పీ సీఈఓ లక్షీ్మనారాయణ, షాద్‌నగర్ ఏఎస్పీ కల్మేశ్వర్ సింగెనవార్తోపాటు వక్తలుగా ప్రొఫెసర్లు హాజరవుతారన్నారు. సమావేశంలో కమిటీ సభ్యు లు దిలీప్‌కుమార్, రాజు, రాబర్ట్, సురేష్, శ్రావన్, నాగన్న, విజయ్ పాల్గొన్నారు. -
‘వరి’ తగ్గించుకోవడమే మేలు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ గజ్వేల్: గజ్వేల్ వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్, తూప్రాన్, కొండపాక మండలాల్లో ఖరీఫ్ ఆశాజనకంగా ఉందని ఏడీఏ శ్రావణ్‌కుమార్ చెబుతున్నారు. ఆరుతడి పంటలకు ఇక ఢోకా లేదని తెలిపారు. భారీ వర్షాల్లేని కారణంగా చెరువులు, కుంటలు ఇతర జలాశయాల్లో నీరు చేరకపోవడం వల్ల భూగర్భజలమట్టం పెరిగే పరిస్థితి లేదని ఈ నేపథ్యంలో...బోరుబావుల సేద్యం కొంత ఇబ్బంది మారిందంటున్నారు. ‘వరి’ సాగును తగ్గించుకోవాలని సలహా ఇస్తున్నారు. తాజా పరిస్థితులపై ‘సాక్షి’ గజ్వేల్ ఏడీఏను ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు మీ కోసం... సాక్షి: గజ్వేల్ సబ్‌డివిజన్‌లో ఈసారి ఎన్ని హెక్టార్ల సాగు వస్తుందని భావించారు...? ఎంత సాగైంది..? ఏడీఏ: సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్ మండలంలో 12392 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ 11285 హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. కొండపాక మండలంలో 10368 హెక్టార్లకు 7506, తూప్రాన్ మండలంలో 6500 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ 5676 హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. సాక్షి: మొక్కజొన్న, పత్తి పంటల సాగు విస్తీర్ణం ఎంత...? ఏడీఏ: గజ్వేల్ మండలంలో మొక్కజొన్న 6744, పత్తి 3130 హెక్టార్లు, కొండపాక మండలంలో మొక్కజొన్న 3380, పత్తి 1941 హెక్టార్లు, తూప్రాన్‌లో మొక్కజొన్న 1770, పత్తి 30 హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. సాక్షి: వర్షపాతం నమోదు వివరాలు తెల్పండి..? ఏడీఏ: జూన్ నెలలో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. జూలై మాత్రం తక్కువగా ఉంది. అయినా పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మూడు మండలాల్లో పంటలు బాగానే వున్నాయి. సాక్షి: జూలై 15తో విత్తనాలు వేసే గడువు ముగిసిందని మీరంటున్నారు. ఇప్పటివరకు విత్తనాల వేయని వారి పరిస్థితి...? ఏడీఏ: ఇప్పటివరకు విత్తనాలు వేయని వారు ఆగస్టు 15వరకు కంది, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలు వేసుకోవచ్చు. సాక్షి: వరి సాగు పరిస్థితి...? ఏడీఏ: సబ్‌డివిజన్‌లో ఇప్పటివరకు వరి నాట్లు పెద్దగా ఊపందుకోలేదు. సబ్‌డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 900 హెక్టార్లకు సాగు మించలేదు. చాలా చోట్ల నారుమడి దశలో ఉన్నాయి. అక్కడక్కడా బోరుబావుల సాయంతో నాట్లు వేస్తున్నారు. భారీ వర్షాలు కురవడంలేదు, వరి నాట్లకు దూరంగా ఉండటమే మంచిది. సాక్షి: పంటల బీమా పరిస్థితి ఏమిటి...? ఏడీఏ: ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం రైతుల రుణమాఫీ పథకంతోనే వర్తిస్తుంది. -
రాయపూడి రైతుల తిరుగుబాటు
మంత్రివర్గ ఉప సంఘాన్ని అడ్డుకున్న అన్నదాతలు తుళ్ళూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో శనివారం రైతుల అభిప్రాయ సేకరణకు ఏర్పాటు చేసిన సమావేశం రణరంగంగా మారింది. రాజధానికోసం భూములు ఇచ్చేది లేదంటూ రైతులంతా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తొలుత సమావేశంలో రాజధాని ఏర్పాటు ఆవశ్యకతను, అందుకు భూములు ఇవ్వాల్సిన అవసరాన్ని రైతులకు వివరించారు. అనంతరం శాసనమండలిలో ప్రభుత్వ విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతుండగా ప్రసంగం మధ్యలోనే రైతులు ఆందోళనకు దిగారు. ప్రసంగాలు వినటానికి తాము రాలేదని, నెలల తరబడి ప్రభుత్వం చేస్తున్న రోజుకో వాగ్దానం.. పూటకో ప్రకటనవల్ల తామంతా హడలెత్తిపోతున్నామని, నిద్రాహారాలు మాని కుటుంబసమేతంగా రోదిస్తున్నామని, తమ గోడు వినాలని రైతులు ఆందోళనకు దిగారు. దీనికి శాసనసభ్యుడు శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ... రైతుల వేదన వినటానికే వచ్చానని, మాట్లాడే వారి పేర్లు తహశీల్దారుకు చెప్తే ఆర్డర్లో పిలుస్తానని చెప్పారు. ఈ లోగా ఓరైతు ఏది చెప్పినా ప్రభుత్వానికి భూములు ఇవ్వమని చెప్పడంతో పోలీసులు సభావేదికపై నుంచి నెట్టివేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మాట్లాడేందుకు వచ్చిన రైతులపై దౌర్జన్యం చేస్తారా? అంటూ ఆగ్రహిస్తూ కుర్చీలను విరగ్గొట్టి ఆందోళనకు దిగారు. మాట్లాడేందుకు వచ్చిన రైతుల గొంతులు నులుముతారా? మీ ప్రసంగాలు, మీకు అనుకూలంగా ఉన్నవారి మాటలు మాత్రమే వింటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చిన్న గ్రామంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇంతమంది పోలీసులతో రావాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. రైతుల గోడు వినటానికి వచ్చే అధికారులు మేళతాళాలతో, భాజభజంత్రీలతో రావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కార్యక్రమం నిర్వహిస్తున్న తీరుకు నిరసనగా కొంతమంది రైతులు విజయవాడ-అమరావతి కాలచక్ర రహదారిపై బైఠాయించారు. అనంతరం భూములు ఇవ్వబోమంటూ రాయపూడి గ్రామ రైతులు చేసిన తీర్మాన ప్రతులను ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు ఇచ్చి, స్వీకరించినట్లు సంతకాలు పెట్టించుకున్నారు. -
చేనేత ఫ్యాషన్‌లో విజేత!
ఫ్యాషన్ ప్రపంచంలో అత్యుత్తమ వేదికలైన న్యూయార్క్, ప్యారిస్, లండన్, వాంకోవర్ నగరాల్లో నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ వీక్‌లో డిజైన్లను ప్రదర్శించే అవకాశం రావడం డిజైనర్ల స్వప్నం. చిన్న వయసులోనే ఆ విశ్వ వేదికలపై అనేకమార్లు తను ప్రేమించిన చేనేత అద్భుతాలను ప్రదర్శిస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్ రామస్వామి. హైదరాబాద్‌కు చెందిన ఈ సృజనశీలి. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే మన చేనేతలతో సంప్రదాయ దుస్తులను రూపుకట్టడంలో మేటిగా నిలుస్తున్నారు. నగరంలో ఆలయం పేరుతో సొసైటీ ఏర్పాటు చేసి కంచి, బెనారస్, మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, నారాయణపేట.. మొదలైన చేనేతకారులకు ఒక వేదికను ఏర్పాటు చేశారు. శ్రవణ్ కుమార్ ఆవిష్కరించిన సరికొత్త అందాలు ఇటీవలే వాంకోవర్ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేశాయి. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో కనువిందు చేయబోతున్నాయి. ఈ సందర్భంగా శ్రవణ్‌కుమార్ తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 18 వరకు (కెనడా) వాంకోవర్ ఫ్యాషన్ వీక్ జరిగింది. అందులో నేను రూపొందించిన ప్రత్యేక దుస్తుల ప్రదర్శన జరిగింది. ఎంతో మంది మన్ననలు పొందాయి. రాజా రవివర్మ పెయింటింగ్స్ నుంచి స్ఫూర్తి పొంది ఆ దుస్తులను డిజైన్ చేశాను. వీనుల విందైన సంగీతం మదిని ఎంత రంజింపజేస్తుందో, చూపరులకు అంతగా నా డిజైన్లు కనువిందు చేయాలన్నదే నా ప్రయత్నం. చేనేతకే పెద్ద పీట.. హాలీవుడ్ ప్రపంచానికి రాజధాని అయిన లాస్ ఎంజిల్స్‌లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ జరగనుంది. అందులో మన నారాయణ పేట అందాలు, గుజరాత్‌కి చెందిన్ అబ్రక్ చేనేత వస్త్రాలను కూడా ఈ షో లో ప్రదర్శించబోతున్నాను. నారాయణపేట అందాలు ఇప్పటికే లండన్, దుబాయ్ ఫ్యాషన్ వీక్‌లలో ప్రదర్శించడంతో అంతర్జాతీయంగా ఈ చేనేతకు మంచి పేరు వచ్చింది. ట్రెండ్‌ను ఫాలో అయ్యే ఫ్యాషన్ ప్రపంచం చేనేత వస్త్రాలను ఎప్పటికీ ముందువరసలో నిలుపుతుంది. చేనేతకారుల చేతుల్లో ఊపిరిపోసుకున్న ఖాదీ, పోచంపల్లి, గద్వాల్, కలంకారి, బెనారస్... వంటి ఫ్యాబ్రిక్స్ అంటే నాకు ప్రాణం. చేనేతకారులను సంప్రదించి నాకు నచ్చిన విధంగా డిజైన్లు చెప్పి మరీ వస్త్రాలను నే యిస్తాను. ఇందుకు దేశంలోని చేనేతకారులను చాలామందిని సంప్రదించాను. నేను డిజైన్ చేయించే ప్రతి చీరకూ చేనేతకారుడు ఆర్గానిక్ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకుంటాను. సంప్రదాయ దుస్తులదే హవా! చేనేతలతో సంప్రదాయ దుస్తులను తయారు చే యడం నా ప్రత్యేకత అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతాను. భారతీయతను చాటే లంగా ఓణీలు, షేర్యానీ, ధోతి, బ్లౌజ్‌లు, చీరలు.. ఇలా సంప్రదాయ తరహా దుస్తుల డిజైన్లు ఎంత మందిలో ఉన్నా చూపు తిప్పుకునేలా చేస్తాయి. చలికి.. ఇవి బెస్ట్... ♦ కాలానుగుణంగా దుస్తుల ఎంపిక ఉండాలంటున్న ఈ డిజైనర్ సూచనలు... ♦ చలికి సిల్క్ దుస్తులు బాగుంటాయి. వీటిలో ముఖ్యంగా బెనారస్ అందాన్ని, చలిని తట్టుకునే వెచ్చదనాన్నీ ఇస్తుంది. ♦ హై నెక్, ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్‌లు, ఎక్కువ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన దుస్తులు మేలు. ♦ ఎరుపు, మెరూన్, గోల్డ్, రాయల్ బ్లూ, పర్పుల్, ఆరెంజ్...ఇలా చలికాలానికి మంచి రంగు దుస్తులు ఆకర్షణీయంగా ఉంటాయి. ♦ మన దేశీయ చర్మతత్త్వాలకు అన్ని రంగులు సూటవుతాయి. ♦ దుస్తులు మిమ్మల్ని ధరించవు. మీరే దుస్తులను ధరించాలి. అవి సౌకర్యవంతంగా, చూడచక్కగా ఉండాలి. తారల ‘కళ’నేత... సినీ తారలు, రాజకీయ ప్రముఖులు దాదాపు అందరికీ నా డిజైన్స్ సుపరిచితమే! సినీ తారలలో నయనతార, తాప్సీ, ప్రణీత, శ్రేయ శరణ్, సమంత, దీక్షాసేథ్, సిమ్రాన్ కౌర్, అమలాపాల్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీ ఆర్... ఇలా చాలా మందికి దుస్తులు డిజైన్ చేశాను. అలాగే మురారీ, గ్రీకువీరుడు... వంటి తెలుగుదనం ఉట్టిపడే ఎన్నో సినిమాలకు డ్రెస్ డిజైనర్‌గా ఉన్నాను. సంతోషకరమైన పనిలోనే వృద్ధి... ‘నచ్చిన పనే ఎంచుకో! అందులోనే సంతోషం ఉంటుంది. ఆనందంగా చేసే పనిలోనే వృద్ధి ఉంటుంది’అని మా అమ్మ పార్వతీదేవి ఎప్పుడూ అంటుంటారు. దుస్తుల డిజైన్లు సృష్టించడం నాకు అమితంగా నచ్చిన విషయం. అందుకే ఈ రంగంలో ఎప్పుడూ కష్టమనిపించలేదు. ఒడిదొడుకులూ ఎదురుకాలేదు. మా పూర్వీకులు కర్నాటక వాసులైనా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! నాన్న రామస్వామి. మేం ఆరుగురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెళ్లు. మా పెద్ద చెల్లెలు జ్యోతి కూడా 15 ఏళ్ల వయసులో నాతో పాటు ఈ రంగంలో అడుగుపెట్టింది. దాదాపు 20 ఏళ్లుగా ఇద్దరం ఈ రంగంలోనే ఉన్నాం. హైదరాబాద్‌లో అత్యంత చిన్నవయసు డిజైనర్లుగా పేరు తెచ్చుకున్నాం. ఎప్పుడూ కోరుకునేది... చేనేతకు పూర్వవైభవం తేవాలన్నదే నా ఆశయం. ‘శ్రవణ్‌కుమార్ అంటే అంకితభావంతో పనిచేస్తాడు. చెప్పిన సమయానికి దుస్తులు అందంగా రూపొందించి ఇస్తాడు. ఎంతో సౌకర్యంగా ఉంటాయి. మరెంతో రిచ్ లుక్‌తో ఉంటాయి’ అని వినియోగదారుల మనసుల్లో నిలిచిపోతే చాలు. జీవితాంతం నేను కోరుకునేవి ఇవే!’’ - నిర్మలారెడ్డి