Sri Lanka Navy
-
నేవీలో హై అలర్ట్
కోయంబత్తూర్/కొచ్చి: భారతీయ నేవీలో హై అలర్ట్ ప్రకటించారు. లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు తమిళనాడులోకి చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శుక్రవారం ప్రారంభించిన నిఘా రెండో రోజూ కొనసాగింది. ‘ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమా చారం మేరకు నేవీ.. సముద్రాలు, తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌ను విధించింది’అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ముష్కరులు శ్రీలం క నుంచి సముద్ర మార్గం ద్వారా రాష్ట్రంలోకి చొర బడి వివిధ నగరాలకు వెళ్లినట్లు సమాచారం అందడంతో తమిళనాడులో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కోయంబత్తూర్ నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలిపే రోడ్లు, రహదారుల్లో వెళ్లే వాహనాలను ఆర్మీ బలగాలు నిశితంగా తనిఖీలు చేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పా రు. గుజరాత్ తీరంలో పాక్ పడవలు గుజరాత్‌లోని కచ్ జిల్లాకు సమీపంలో గల హరామి నాలా ప్రాంతంలో పాక్‌కు చెందిన 2 మత్స్యకారుల పడవలను సరిహద్దు భద్రతాసిబ్బంది శనివారం గుర్తించారు. అవి అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేపట్టారు. -
భారత జాలర్ల అరెస్ట్.. బోట్లు స్వాధీనం
రామేశ్వరం: తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. శ్రీలంక ప్రాదేశిక జలాల్లో చేపల వేట కొనసాగిస్తున్నారన్న కారణంగా తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది జాలర్లను బుధవారం శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు బోట్లు స్వాధీనం చేసుకున్నారు. కంకేసంతురై నేవీ క్యాంపునకు జాలర్లును తరలించినట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న జాలర్లు పుడుకొట్టై జిల్లా కొట్టాయిపట్టినానికి చెందిన వారని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మళ్లీ సమ్మె బాట
సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం సాగిస్తున్న పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులు చేసి పట్టుకెళ్లడం, ఆందోళనలు బయలుదేరడంతో పాలకులు స్పందించడం, విడుదల కావడం పరిపాటిగా మారింది. అయితే, తమ సమస్యకు ఎప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తుందోనన్న ఎదురు చూపుల్లో జాలర్లు ఉన్నారు. పాలకులు కేవలం హామీలు ఇవ్వడం, ఆ తర్వాత విస్మరించడం పరిపాటిగా మారడంతో ఇక వారి నడ్డి విరిచి తమ సమస్యల్ని పరిష్కరించుకోవడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. తమ మీద దాడులకు శాశ్వత పరిష్కారం, శ్రీలంక ఆధీనంలో ఉన్న పడవల స్వాధీనం లక్ష్యంగా నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. ఇది వరకు తాము ఎన్నో సమ్మెలు చేపట్టినా, తాజాగా చేపట్టిన సమ్మె మాత్రం తమలో రగులుతున్న ఆక్రోశానికి ప్రతీరూపంగా జాలర్ల సంఘాలు ప్రకటించాయి. ఈ సమ్మెతో తమ బలాన్ని కేంద్ర, రాష్ట్రంలోని పాలకులకు చూపించే రీతిలో జాలర్లు నిరసనలకు సిద్ధమయ్యారు. నిరవధిక సమ్మె : తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై, కారైక్కాల్ జాలర్లు గురువారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. తమ సమ్మెకు మద్దతు ప్రకటించే రీతిలో ఇతర జిల్లాల్లోని జాలర్లు సైతం ఏకం కావాలని ఆ నాలుగు జిల్లాల జాలర్ల సంఘాలు పిలుపునిచ్చారుు. ఉదయం నుంచి జాలర్లు చేపల వేటను బహిష్కరించడంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితం అయ్యారుు. నాగపట్నం జిల్లా వేధారణ్యం, పూంబుహార్ హార్బర్ల నుంచి ఏ ఒక్క పడవ సముద్రంలోకి వెళ్ల లేదు. ఈ జిల్లాలోని 25 వేల మంది జార్లు సమ్మె బాట పట్టారు. పుదుకోట్టై, జగదాపట్నం, కొట్టై పట్నంలలో ఐదు వేల పడవలు వేటకు వెళ్లలేదు. కారైక్కాల్, తిరువారూర్ జిల్లాలోను జాలర్లు సమ్మెకు దిగడంతో వేట ఆగింది. ఈ నాలుగు జిల్లాల్లో 50 వేల మంది జాలర్లు చేపల వేటకు దూరం కావడంతో ఆ ప్రభావం ఇతర రంగాల మీద పడింది. ఐస్ గడ్డల ఉత్పత్తిని ఈ జిల్లాల్లో నిలుపుదల చేయాల్సిన పరిస్థితి. అలాగే, డీజిల్ విక్రయాలు తగ్గాయి. చేపల్ని కొనుగోలు చేసే టోకు, చిరు వర్తకులకు ఆదాయం తగ్గింది. ఈ సమ్మెను మరింత ఉధృతం చేసే విధంగా ఈ జిల్లాల జాలర్ల సంఘాలు నిర్ణయించాయి. రాష్ట్రంలోని అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకునే రీతిలో భారీ ఎత్తున నిరసనలకు వ్యూహ రచన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని జాలర్ల సంఘాలు ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డాయి. తమకు సముద్రంలో భద్రత కల్పించాలని, వేటకు ఆటంకాలు ఎదురు కాకూడదని, శ్రీలంక జాలర్ల సంఘాలతో చర్చలకు చర్యలు తీసుకోవాలని, శ్రీలంక ఆధీనంలో ఉన్న పడవల్ని, అక్కడి జైళ్లలో ఉన్న జాలర్లు అందర్నీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడక్కడ జాలర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 27 మంది విడుదల : శనివారం అర్ధరాత్రి కచ్చదీవుల సమీపంలో పుదుకోట్టై, రామేశ్వరానికి చెందిన 27 మంది జాలర్లను శ్రీలంక సేనలు బంధించారు. వీరందర్నీ తమ దేశానికి తీసుకెళ్లారు. అయితే, ఇన్నాళ్లు కోర్టుల్లో హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టే లంక సేనలు తాజాగా రూటు మార్చారుయి. పట్టుకెళ్లిన వారందర్నీ తీవ్రంగా మందలించి వదిలి పెట్టారు. అయితే, తమిళనాడు జాలర్ల సంఘాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుండడం, సమ్మె బాటలో నాలుగు జిల్లాల జాలర్లు పయనిస్తుండడాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుని ఒత్తిడి తెచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకే పట్టుకెళ్లిన వాళ్లను కేవలం మందలించి వదలి పెట్టినట్టు సమాచారం. -
సారీ.. జోక్యం చేసుకోలేం!
సాక్షి, చెన్నై:శ్రీలంకకు దారాదత్తం చేసిన కచ్చదీవులను మళ్లీ స్వాధీనం చేసుకోవాల్సిందే నని కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అసెంబ్లీలో తీర్మానాలు చేసినా, పదేపదే లేఖాస్త్రాలు సంధించినా ఫలితం మాత్రం శూన్యం. తమిళ భూభాగాన్ని గుప్పెట్లో పెట్టుకోవడమే కాకుండా, తమ మీద శ్రీలంక దాడులు చేస్తూ రావడం జాలర్లను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. కొత్త ప్రభుత్వంతోనైనా తమ జీవితాల్లో వెలుగు నిండుతుందని, కచ్చదీవుల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని భావించిన జాలర్లకు మిగిలింది కన్నీళ్లే. పారంపర్యంగా తమకు కల్పించిన చేపల వేట హక్కును కాలరాసే రీతిలో కేంద్రంలోని పాలకులు ఓ వైపు, శ్రీలంక నావికాదళం మరో వైపు వ్యవహరించడంతో జాలర్లలో ఆందోళన బయలుదేరింది. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కారు. పిటిషన్ : భౌగోళికంగానూ, సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత మేరకు కచ్చదీవులు భారత్ పరిధిలోనే ఉండాల్సిన అవసరం ఉందన్న డిమాండ్‌తో ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం తన గళాన్ని విప్పుతుంటే, మరో వైపు తమ హక్కులను పరిరక్షించాలంటూ మద్రాసు హైకోర్టును జాలర్లు ఆశ్రయించారు. వరుస దాడులను వివరిస్తూ, కడలిలో భద్రత కల్పించాలని, తమ హక్కులను రక్షించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఏడాది కాలంగా హైకోర్టులో సాగుతోంది. విచారణ సందర్భంగా కచ్చదీవుల వ్యవహారం ముగిసిన అధ్యాయం అంటూ కేంద్రం రిట్ పిటిషన్ దాఖలు చేయడం జాలర్లలో ఆగ్రహాన్ని రేపింది. అయితే, తమకు కోర్టు ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉన్న జాలర్లకు మాత్రం చివరకు మిగిలింది నిరాశే. జోక్యం చేసుకోం : మంగళవారం విచారణను మద్రాసు హైకోర్టు ముగించింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ తీర్పును వెలువరించింది. కచ్చదీవుల వ్యవహారం రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల సమస్యగా పేర్కొన్నారు. ఇందులో కోర్టు జోక్యం చేసుకునేందుకు వీలు లేదన్నారు. రెండు దేశాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని, ఆ దిశగా రెండు దేశాల దౌత్య అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దాడుల అడ్డుకట్ట విషయంలోను చర్చించి నిర్ణయం తీసుకోవాలని, కేంద్రం ఈ విషయంగా చర్యలు తీసుకోబోతున్న దృష్ట్యా, విచారణను ముగిస్తున్నామని ప్రకటించారు. బంతిని కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టడం నెట్టడంతో జాలర్లకు నిరాశ మిగిల్చింది. ఇక తమ పారంపర్య వృత్తిని వదులుకోవడమా లేదా, బతుకుదెరువు కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించడమా? అన్న సందిగ్ధంలో రామేశ్వరం జాలర్లు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఈ తీర్పును వ్యతిరేకిస్తూ, అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా...ఫలితం దక్కేనా..! అన్నది వేచి చూడాల్సిందే! -
జాలర్లకు షాక్
సాక్షి, చెన్నై : రామేశ్వరానికి కూత వేటు దూరంలో ఉన్న కచ్చదీవులు ఒకప్పుడు తమిళనాడు పరిధిలో ఉండేవి. 1974లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రభుత్వం శ్రీలంకతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కచ్చదీవుల్ని శ్రీలంకకు ధారాదత్తం చేసింది. దీంతో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న తమిళనాడులోని సముద్ర తీర జాలర్లకు కన్నీళ్లు మిగిలాయి. ఆ దీవుల్లో తమిళ జాలర్లు చేపల్ని వేటాడేందుకు శ్రీలంక నావికాదళం అడ్డుతగులుతోంది. దాడులు, కాల్పులతో పాటు బందీలుగా పట్టుకెళుతూ భయాందోళన సృష్టిస్తోంది. స్వాధీనమే లక్ష్యం: మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన జయలలిత కచ్చదీవులను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత యూపీఏ సర్కారుపై పలుమార్లు ఒత్తిడి తెచ్చారు. అసెంబ్లీలో సైతం తీర్మానం చేశారు. భౌగోళికంగా, సంస్కృతి, సంప్రదాయం, నాగరికత ప్రకారం కచ్చదీవులు భారత్‌లోనే ఉండాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గత ప్రభుత్వానికి వివరించే యత్నం చేశారు. భారత పార్లమెంట్ ఆమోదం లేకుండా కచ్చదీవుల్ని శ్రీలంకకు ధారాదత్తం చేయడం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పినా ప్రయోజనం శూన్యం. ఈ క్రమంలో ప్రజలు యూపీఏకు చరమ గీతంపాడి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ చేతికి అధికారం అప్పగించారు. దీంతో తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయన్న ఆశ తమిళ జాలర్లలో నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కచ్చదీవుల విషయంలో కొత్త ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని తమిళులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కచ్చదీవుల వ్యవహారం లో తమదీ యూపీఏ బాటేనని స్పష్టం చేస్తూ మోడీ సర్కారు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.కేంద్రం పిటిషన్: తమిళ జాలర్లపై వరుస దాడులు, కచ్చదీవులపై తమిళుల హక్కుల పరిరక్షణ నినాదంతో యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి చెందిన పీటర్ రాయల్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఏడాదిన్నర కాలంగా విచారణ జరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన విచారణ సందర్భంగా కేంద్రాన్ని వివరణ కోరుతూ కోర్టు నోటీసులు ఇచ్చింది. కచ్చదీవుల వ్యవహారం, జాలర్ల భద్రత విషయంగా స్పష్టమైన వివరాలతో రిట్ పిటిషన్ దాఖలు చేయూలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే విధానం కూడా మారలేదు. కేంద్ర ప్రభుత్వం తరపున బుధవారం మద్రాసు హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ జాలర్లకు పెద్ద షాక్ తగిలేలా చేసింది. 1974లో కచ్చదీవులు, 1976లో మన్నార్ వలిగుడా, వంగల వలిగుడాల విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి ఆ పిటిషన్లో కేంద్రం వివరించింది. వీసాలేకుండా, శ్రీలంక అనుమతి లేకుండా కచ్చదీవుల్లోకి తమిళ జాలర్లు వెళ్లవచ్చని, అక్కడ చేపల్ని వేటాడేందుకు అవకాశం లేదని ప్రకటించింది. కచ్చదీవుల్లోని ఆంథోనియార్ ఆలయ ఉత్సవాల్ని ఘనంగా శ్రీలంక, తమిళ జాలర్లు జరుపుకునేందుకు వీలుందని పేర్కొంది. చేపల వేట విషయంలో తమిళ జాలర్లకు ఎలాంటి హక్కులు లేవని, అంతర్జాతీయ సరిహద్దుల్ని దాటేందుకు వీలులేదని వెల్లడించడం రాష్ర్ట ప్రభుత్వాన్ని విస్మయంలో పడేసింది. జాలర్లలో ఆగ్ర హ జ్వాలను రగిల్చింది. ఆగ్రహం: ఈ పిటిషన్ తమిళ జాలర్లు, తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పక్షాల్లో ఆగ్రహాన్ని రేపింది. కచ్చదీవుల్ని స్వాధీనం చేసుకోవాల్సిందేనన్న డిమాండ్ మరోమారు తెరమీదకు వచ్చింది. తమిళుల భూభాగాన్ని ధారాత్తం చేసింది కాకుండా, చేపల వేట విషయంలో తమకు ఎలాంటి హక్కులు లేవంటూ కేంద్రం ప్రకటించడాన్ని జాలర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నాగపట్నం, రామేశ్వరం, పుదుకోట్టై జాలర్ల సంఘాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కేంద్రం తీరును ఎండగట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఎండీఎంకే నేత వైగో కేంద్రం తీరును తప్పుబడుతూ గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమిళుల హక్కుల్ని కాలరాయవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు. కచ్చదీవులకు సంబంధించిన పూర్తి వివరాల్ని, తాము చేసిన తీర్మానాల్ని ఆ లేఖలో వివరించారు. కచ్చదీవుల్ని స్వాధీనం చేసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. యూపీఏ పేర్కొన్న అంశాల్నే మళ్లీ కోర్టులో సమర్పించారని, సవరణలతో కూడిన మరో రిట్ పిటిషన్ దాఖలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తమిళ జాలర్లకు ఇక కడలిలో భద్రత కరువైనట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు. -
చర్చలు రద్దు
సాక్షి, చెన్నై: సముద్రంలో రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జాలర్ల సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. అలాగే రెండు దేశాల మధ్య చర్చల ద్వారానే దాడుల నివారణ సాధ్యమని తేల్చారుు. అందుకు తగ్గ చర్యలను సంఘాల నాయకులు తీసుకున్నారు. రెండు దేశాల అధికారులు, జాలర్ల ప్రతినిధుల మధ్య చర్చల ద్వారా కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా జనవరిలో చెన్నై వేదికగా జరిగిన రెండు దేశాల మధ్య తొలి విడత చర్చలు సంతృప్తికరంగా సాగారుు. ఇందులో తీసుకున్న నిర్ణయాల్ని రహస్యంగా ఉంచారు. మలి విడత చర్చల్లో సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి నిర్ణయాలు ప్రకటించడంతో పాటు అందుకు తగ్గ ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలుత ఫిబ్రవరి నెలాఖరులో చర్చలకు ఏర్పాట్లు చేస్తే శ్రీలంక అధికారులు స్పందించలేదు. ఎట్టకేలకు ఈ నెల 13న చర్చలకు సర్వం సిద్ధం చేశారు. చర్చలకు మరో వారం ఉన్న సమయంలో రాష్ట్రానికి చెందిన 177 మంది జాలర్లను శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లడం వివాదానికి దారి తీసింది. వారందర్నీ విడుదల చేస్తేనే చర్చలకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చర్చల తేదీని ఈ నెల 25కు వాయిదా వేసింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి దిగొచ్చిన కేంద్రం శ్రీలంకతో సంప్రదింపులు జరిపి జాలర్లందర్నీ విడుదల చేయించింది. చర్చలకు ఈ పర్యాయం షురూ అన్న ధీమా పెరిగింది. రెండు రోజుల క్రితం శ్రీలంక నావికాదళం 77 మంది రాష్ట్ర జాలర్లను పట్టుకెళ్లడంతో చర్చలపై నీలి మేఘాలు ఆవహించాయి. ఈ క్రమంలో 77 మందిని మంగళవారం విడుదల చేస్తారని అందరూ భావించారు. శ్రీలంక నుంచి వచ్చే సంకేతం మేరకు కొలంబో బయలుదేరడానికి జాలర్ల సంఘాల ప్రతినిధులు, రాష్ర్ట ప్రభుత్వ అధికారులు సిద్ధమయ్యూరు. ఏ ఒక్కర్నీ శ్రీలంక ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో చర్చలు రద్దు అయినట్టేనన్న సంకేతం వెలువడింది. అధికారులు చర్చలు వాయిదా వేసుకోవడంతో జాలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చర్చల ద్వారా సమస్య కొలిక్కి వ స్తుందనుకుంటే, అందుకు తగ్గ ప్రయత్నాలు ఆదిలోనే హంస పాదు అన్న చందంగా మారడం జాలర్లను ఆవేదనకు గురిచేసింది. చర్చల్ని పక్కదారి పట్టించడమే లక్ష్యంగా శ్రీలంక సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. -
మరో 18 మంది బందీ!
రాష్ట్ర జాలర్లలో ఆగ్రహ జ్వాల రగులుతోంది. తాజాగా మరో 18 మంది జాలర్లను శ్రీలంక సేనలు బందీగా పట్టుకెళ్లారుు. వరుస దాడులు జాలర్లలో ఆక్రోశాన్ని రగల్చడంతో భారీ ఆందోళనలకు జాలర్ల సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. కేంద్రం తీరును డీఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్రంగా దుయ్యబట్టారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర జాలర్లపై శ్రీలంక సేనలు వరుసగా దాడులు చేస్తూ వస్తున్న విషయం తెలి సిందే. 15 రోజుల వ్యవధిలో 250 మందిని శ్రీలంకకు పట్టుకెళ్లి జైళ్లలో బంధించేశారు. తమ వాళ్ల పరిస్థితి అంతు చిక్కక ఇక్కడున్న కుటుంబాలు తీవ్ర మనో వేదనలో మునిగి పోయూరుు. ఈ దాడులకు అడ్డుకట్ట వేస్తామంటూ శనివారం తనను కలిసిన జాలర్ల సంఘాల ప్రతినిధులకు ప్రధాని మన్మోహన్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హామీ ఇచ్చారు. వారు అలా హామీ ఇచ్చారో లేదో ఆదివారం 22 మందిని శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లిం ది. ఈ ఘటన జాలర్లలో ఆగ్రహాన్ని తెప్పిం చగా, పుండు మీద కారం చల్లినట్టుగా సోమవారం మరి కొందర్ని పట్టుకెళ్లారు. పడవలూ వదల్లేదు: రామేశ్వరానికి చెందిన జాలర్ల మర పడవలు ప్రస్తుతం చేపల వేటలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇందుకు కారణం శీలా వంటి చేపలు అత్యధికంగా ఈ సీజన్లో లభించడమే. ఆదివారం రాత్రి సుమారు 20కు పైగా మర పడవలు కచ్చ దీవుల సమీపంలో చేపల వేటలో నిమగ్నమయ్యాయి. సోమవారం వేకువజామున భారత సరిహద్దులో వేటలో ఉన్నప్పటికీ, మర పడవలను సైతం శ్రీలంక సేనలు వదిలి పెట్టలేదు. వచ్చీ రాగానే దాడులకు దిగారుు. మర పడవలను వేగంగా ఒడ్డుకు నడపడం కష్టతరం. దీంతో కొన్ని పడవలు తప్పించుకోగా, మూడు పడవలు మాత్రం లంక సేనల చేతికి చిక్కాయి. ఒక్కో పడవలో ఆరుగురు ఉండగా, వారందర్నీ తమ దేశానికి బందీగా పట్టుకెళ్లారు. వీరిలో మైఖేల్, ముసిన్, ప్రిన్స్, శేషు తదితరులు ఉన్నారు. సమాచారం అందుకున్న వారి కుటుంబాలు విచారవదనంలో మునిగాయి. రామేశ్వరంలోని జాలర్ల సంఘాల ప్రతినిధులు అగ్గిమీదబుగ్గిలా మండిపడుతున్నారు. కేంద్రం తమకు హామీ ఇచ్చినట్టు ఇచ్చి విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస దాడులు జరుగుతుండటంతో, తమ సత్తా ఏమిటో కేంద్రానికి చూపించడం లక్ష్యంగా భారీ ఆందోళనలకు సిద్ధం అవుతోన్నారు. ఇందు కోసం సముద్ర తీర గ్రామాల్లోని జాలర్ల సంఘాలు ఏకం అవుతున్నాయి. బందీ సమాచారంతో రామేశ్వరం తీరంలోని పలు గ్రామాల జాలర్లు ఉదయం చేపల వేటను బహిష్కరించారు. కరుణ ఆగ్రహం: కేంద్రం తీరుపై డీఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస బెట్టి శ్రీలంక సేనల వీరంగానికి తమిళ జాలర్లు బలి పశువులవుతుంటే, చోద్యం చూడటం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. తమ పార్టీ ఎంపీల నేతృత్వంలో జాలర్ల సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి వచ్చేలోపు కొందరు బందీగా శ్రీలంక సేనలు పట్టుకెళ్లడం బట్టి చూస్తే, ఓ వైపు జాలర్లకు హామీలు ఇచ్చినట్టు ఇచ్చి, మరో వైపు శ్రీలంక సేనల్ని ఉసిగొల్పుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం లేఖాస్త్రాలతో కాలం నెట్టుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. స్పష్టమైన నిర్ణయంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. కంటి తుడుపు చర్యల్ని మానుకుని, ఈ దాడులకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించేందుకు ముందుకు రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరారు. -
అన్నా సాలైలో ఉద్రిక్తత
తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వాన్ని నిరసిస్తూ గురువారం బీజేపీ వినూత్న నిరసన చేపట్టింది. అన్నాసాలైలో రోడ్డుపై వలలు విసిరి చేపల్ని వేటాడుతూ, శ్రీలంక సేనల తీరును నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ నిరసనతో అన్నా సాలైలో ఉద్రిక్తత నెలకొనడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తరచూ విరుచుకు పడుతోంది. జాలర్లను పట్టుకెళ్లి శ్రీలంక చెరలో బందిస్తోంది. సుమారు 300 మంది జాలర్ల వరకు ఆ దేశ చెరల్లో మగ్గుతున్నారు. ఆ కుటుంబాలు తీవ్ర మనో వేదనలో ఉన్నాయి. వీరి విడుదలకు డిమాండ్ చేస్తూ, నాగపట్నం, రామేశ్వరం, వేధారణ్యం, కారైక్కాల్ జాలర్లు ఆందోళన బాట పట్టారు. వీరికి మద్దతుగా రాజకీయ పక్షాలు గళం విప్పుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ నేతృత్వంలో వినూత్న నిరసనకు పిలుపు నిచ్చారు. చేపల వేట: గురువారం ఉదయాన్నే ఓ మినీ లారీలో అతి చిన్న పడవను ఎక్కించుకుని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అన్నా సాలైకు చేరుకున్నారు. ఆ పార్టీ నాయకుడు సతీష్ కుమార్, కొరట్టూరు మోహన్ నేతృత్వంలో వలల్ని చేత బట్టి మరో బృందం అక్కడికి చేరుకుంది. అన్నా సాలైలోని దివంగత నేత అన్నా విగ్రహం వద్ద ఆందోళన కారులు కాసేపు బైఠాయించారు. అనంతరం చేతిలో ఉన్న వలల్ని రోడ్డుపై విసిరి చేపల వేటకు సిద్ధం అయ్యారు. వలలో పడ్డ చిన్న పెద్ద చేపల్ని చేత బట్టి శ్రీలంక సేనలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. జాలర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాలర్లపై దాడుల పరంపర కొనసాగుతూ ఉన్నా కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని శివాలెత్తారు. ఈ నిరసనతో అన్నా సాలైలో కాసేపు రాకపోకలు నిలిచిపోయూరుు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసన కారుల్ని బుజ్జగించే యత్నం చేశారు. తగ్గేది లేదన్నట్టుగా నిరసన కారులు చేపల్ని చేత బట్టి ర్యాలీగా ముందుకు కదిలారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఉద్రిక్తత నెలకొనడంతో చివరకు బలవంతంగా అందర్నీ అరెస్టు చేశారు. -
లంక సేనల వీరంగం!
లంక సేనలు సముద్రంలో మళ్లీ వీరంగం సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమంగా పెద్ద ఎత్తున జాలర్లను బందీలుగా పట్టుకెళ్లాయి. సుమారు 250 మంది జాలర్లను, 39 పడవల్ని శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లిన సమాచారం నాగపట్నంలో కలకలాన్ని సృష్టించింది. సాక్షి, చెన్నై:రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తరచూ తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆ సేన పైశాచికత్వానికి అనేక మంది జాలర్ల కుటుంబాలు రాష్ట్రంలో అష్టకష్టాలకు గురవుతున్నాయి. ఇటీవల సరిహద్దులు దాటుతున్నారన్న నెపంతో రాష్ట్ర జాలర్లను పట్టుకెళ్లి ఆ దేశ జైళ్లలోకి నెట్టేస్తున్నారు. ఈ చర్యలు రాష్ట్రంలోని జాలర్లలో ఆందోళన రేకెత్తిస్తూ వస్తున్నాయి. ఇన్నాళ్లు పదుల సంఖ్యలో జాలర్లను అప్పుడప్పుడు పట్టుకెళుతూ వచ్చిన నావికాదళం, తాజాగా ఏక కాలంలో 39 పడవలను సీజ్ చేసి, అందులోని 250 మందిని బంధీలుగా పట్టుకెళ్లడం కలకలం రేపుతోంది. నాగపట్నం జిల్లాఅక్కరై పేట, కీచాన్ కుప్పుం, నంబియార్ నగర్ తీర జాలర్లు మంగళవారం చేపల వేటకు వెళ్లారు. సుమారు 300 పడవల్లో వేలాది మంది కలిసికట్టుగా వెళ్లారు. కోడియకరై వద్ద చేపల వేటలో నిమగ్నమైన జాలర్లపై అర్ధరాత్రి శ్రీలంక నావికాదళం సభ్యులు విరుచుకు పడ్డారు. తుపాకుల్ని గాల్లోకి పేల్చు తూ వీరంగం సృష్టించారు. జాలర్లను చుట్టుముట్టి తమ ప్రతాపం చూపించారు. శ్రీలంక నావికా దళం కాల్పులు విన్న జాలర్లు ఒడ్డుకు తిరుగు పయనమయ్యారు. అయితే, 39 పడవల్ని వారు చుట్టుముట్టడంతో, అందులో ఉన్న జాలర్లు భయాందోళనకు గురయ్యారు. మిగిలిన పడవలు తప్పించుకుని ఒడ్డుకు ఉదయాన్నే చేరగా 39పడవలు మాత్రం అదృశ్యం అయ్యాయి. ఆ పడవల్ని, అందులో ఉన్న సుమారు 250 మంది జాలర్లను శ్రీలంక నావికాదళం బంధీలుగా పట్టుకెళ్లి ఉండొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. తమ వాళ్లను పెద్ద ఎత్తున శ్రీలంక సేనలు పట్టుకెళ్లిన సమాచారం నాగపట్నంలో కలకలం రేపింది. జాలర్లు భయాందోళనతో ఉన్నారు. 250 కుటుంబాలు తమ వాళ్లకు ఏమయ్యిందోనన్న బెంగతో ఎదురు చూస్తున్నాయి. ఈ కలకలంతో మిగిలిన జాలర్లు వేటకు వెళ్లేందుకు బుధవారం వెనకడుగు వేయడంతో నాగపట్నం తీరానికి పడవలు పరిమితమయ్యాయి. అయితే, పెద్ద ఎత్తున తమిళ జాలర్లను బంధీగా పట్టుకెళ్లినా, ఇందుకు సంబంధిం చిన అధికారిక సమాచారం భారత కోస్టు గార్డుకుగానీ, మెరైన్ పోలీసులకు గానీ, రాష్ట్ర మత్స్య శాఖకు గానీ ఇంత వరకు శ్రీలంక నుంచి రాక పోవడంతో ఉత్కంఠ నెలకొంది.