Sri Varaha Lakshmi nrsinhasvami
-
ఆలయాల మూసివేత
చంద్ర గ్రహణానంతరం మహా సంప్రోక్షణ నేటి ఉదయం 6.30 గంటల నుంచి ద ర్శనాలు చోడవరం/నక్కపల్లి: చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని దేవాలయాలన్నింటినీ బుధవారం మూసివేశారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి మూసివేశారు. గ్రహణ కాలం ముగిశాక రాత్రి ఆలయాన్ని తెరచి మహా సంప్రోక్షణ, రాజభోగం, ఆరాధన, పవళింపు సేవ నిర్వహించారు. గురువారం ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు యధావిధిగా దర్శనాలు అందజేయనున్నారు. దీంతో సింహగిరి బోసిబోయింది. నక్కపల్లి ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయం, ఒడ్డిమెట్ట లక్ష్మిగణపతి ఆలయాలను మూసివేశారు. గ్రహాణం విడిచాక సంప్రోక్షణ అనంతరం ఆలయాలను తెరుస్తామని అర్చకులు వరప్రసాద్, జయంతి గోపాలకృష్ణలు తెలిపారు. నిత్యం పూజలతో భక్తులకు దర్శన మిచ్చే అనకాపల్లి నూకాంబిక ఆలయం, చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరాలయం, శ్రీ స్వయంభూ గౌరీశ్వరాలయంతోపాటు కేశవస్వామి ఆలయం, చోడవరం, వడ్డాది, గోవాడ, మాడుగుల వెంకటేశ్వరస్వామి ఆలయాలు, అర్జునగిరి ల క్ష్మీనృసింహస్వామి ఆలయం మూసివేశారు. వెంకన్నపాలెం షిర్డిసాయిబాబా ఆలయాల సముదాయంలో ఉన్న ఉపాలయాలు, నూకాంబిక, మరిమాంబ, ముత్యమాంబ, దుర్గాంబిక ఆలయాలు, అభయాంజనేయస్వామి ఆలయాలు కూడా మూసివేశారు. గ్రహణం మధ్యాహ్నం ప్రారంభమైనప్పటికీ ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను పంపలేదు. గ్రహణం అనంతరం రాత్రి 7గంటలకు ఆలయాల్లో సంప్రోక్షణ అనంతరం పూజలు యథావిధిగా ప్రారంభిస్తామని స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం ప్రధాన అర్చకుడు కొండమంచిలి గణేష్ తెలిపారు. గురువారం ఉదయం నుంచి ఆలయాల్లో దర్శనాలు ఉంటాయన్నారు. -
నిజరూపం.. అపురూపం
అప్పన్న చందనోత్సవానికి పోటెత్తిన భక్తులు స్వామిని దర్శించి పులకించిన భక్తజనం పకడ్బందీగా ఏర్పాట్లు ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ తరపున డాలర్ శేషాద్రి పట్టు వస్త్రాల సమర్పణ సింహాచలం, న్యూస్‌లైన్ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూపాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఏడాదికి ఒక్క రోజు మా త్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకుని భక్తిపారవశ్యంలో మునిగితేలారు. వైశాఖ శుద్ద తదియని పురస్కరించుకుని అప్పన్న చందనోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి గురువారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. సుప్రభాతసేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, కలశారాధన చేశారు. ఒంటి గంట సమయంలో స్వామిపై ఉన్న చందనాన్ని వెండి బొరుగులతో తొలగించి నిజ రూపభరితున్ని చేశారు. తెల్లవారుజామున 2.45 గంటలకు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు కుటుంబ సమేతంగా తొలిదర్శనాన్ని చేసుకుని, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 3.15 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి 8.30 నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రీ వైష్ణవస్వాములు గంగధార నుం చి వెయ్యి కలశాలతో జలాలను తీసుకొచ్చి స్వామి నిజరూపాన్ని అభిషేకించారు. 108 వెండి కలశాలతో అర్చకులు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు శీతలోపచారాలు చేశారు. అనంతరం స్వామికి తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించి నిత్య రూపభరితున్ని చేశారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ రాష్ర్ట ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వరరావు, టీటీడీ తరపున డాలర్ శేషాద్రి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు కూడా స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. విశాఖ శారదా పీఠం స్వామిజీ స్వరూపనందేంద్ర సరస్వతి, రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తులు సూరి అప్పారావు, నూతి రామ్మోహనరావు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, కలెక్టర్ ఆరోఖ్యరాజ్, పోలీస్ కమిషనర్ శివధర్‌రెడ్డి, మాజీ మంత్రులు రెడ్డి సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల గురుమూర్తిరెడ్డి, గాజువాక అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. విస్తృత ఏర్పాట్లు తెల్లవారుజామున 3.15 నుంచే సాధారణ భక్తులకు స్వామి నిజరూప దర్శనాన్ని అధికారులు కల్పించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఫ్రీ పాస్‌లు జారీ చేయలేదు. ప్రొటోకాల్ వీఐపీలు, వీఐపీలకు వెయ్యి రూపాయల టికెట్లు అందజేశారు. లక్షా 25 వేల లడ్డూలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు. అడవివరం ఆరోగ్య కేద్రం ప్రధాన వైద్యాధికారి జగదీష్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆర్టీసీ పలు ప్రత్యేక బస్సులను నడిపింది. దేవస్థానం 40 బస్సులను ఉచితంగా కొండపైకి నడిపింది. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు విశేషలం దించాయి. -
కనులపండువగా అప్పన్న కల్యాణం
ఘనంగా రథోత్సవం పరవశించిన భక్తజనం భారీ ఏర్పాట్లు సింహాచలం, న్యూస్‌లైన్ : శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి సింహగిరిపై సందడి నెలకొంది. కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి ఉత్సవమూర్తులను అర్చకులు ఇక్కడి నృసింహ మండపంలోని కల్యాణ వేదికపై అధిష్టించారు. మాంగళ్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, హవల్దార్ టి.పి.గోపాల్, అర్చకులు రమణమూర్తి, సీతారాం, గోపాలకృష్ణమాచార్యులు తది తరులు ఈ కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణం... కమనీయం సాయంత్రం 4 గంటల నుంచి ఆలయంలో కొ ట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి వద్ద పూజలు నిర్వహించిన పసుపు కొమ్ములను ముత్తైవులు శిరస్సుపై పెట్టుకుని బేడా ప్రదక్షిణ చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి స్వామికి ఆరాధనను విశేషంగా చేశారు. రాత్రి 7 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణాన్ని ఘనంగా నిర్వహించారు. సమస్త దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానాన్ని అందిస్తూ గరుడాళ్వార్ చిత్ర పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. రాత్రి 8 గంటల నుంచి సింహగిరి మాడ వీధు ల్లో ఎదురు సన్నాహోత్సవాన్ని నిర్విహ ంచారు. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారు పల్లకీలో, శ్రీదేవి, భూదేవిలను ముత్యాల పల్లకీలో ఊరేగించారు. గాలిగోపురం వద్ద రథంపై అధిష్టించారు. రథంలో ఉన్న స్వామిని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు దంపతులు తొలి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం అందజేశారు.