sriharsha
-
స్విగ్గీ ‘లాభాల’ డెలివరీ
ముంబై: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ షేరు లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు 17% లాభాలు డెలివరీ చేసింది. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.390)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.420 వద్ద లిస్టయ్యింది. నష్టాల మార్కెట్లో ఈ షేరుకు డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో 19.50% పెరిగి రూ.466 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 17% లాభంతో రూ.456 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.03 లక్షల కోట్లుగా నమోదైంది. → ఐపీఓ లిస్టింగ్‌తో స్విగ్గీ కంపెనీలో 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. పబ్లిక్ ఇష్యూ కంటే ముందే స్విగ్గీ తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈ–సాప్స్) కింద పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. ఐపీఓ గరిష్ట ధర శ్రేణి రూ.390 ప్రకారం వీటి విలువ రూ.9,000 కోట్లుగా ఉంది. దలాల్ స్ట్రీట్‌లో షేరు రూ.420 వద్ద లిస్ట్ కావడంతో ఉద్యోగులకు కేటాయించిన షేర్ల విలువ అమాంతం పెరిగింది. దీంతో సుమారు 500 మంది ఉద్యోగులు ఒక్కొక్కరి దగ్గర షేర్ల విలువ రూ. కోటికి పైగా చేరింది. → స్విగ్గీ షేర్లు మార్కెట్లోకి లిస్ట్ కావడంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. స్విగ్గీ, జొమాటోకు సంబంధించిన ఒక ఫొటోను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ ‘నువ్వు, నేను ఈ అందమైన ప్రపంచంలో..’ అంటూ రాసుకొచ్చారు. 5 ఏళ్లలో పటిష్ట వృద్ధి: సీఈఓ శ్రీహర్ష వచ్చే 3–5 ఏళ్లలో పటిష్ట వృద్ధి పథంలో దూసుకెళ్తామని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌స్టామార్ట్ నెట్‌వర్క్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద డార్క్ స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పెద్ద నగరాల్లో సగటు డెలివరీ సమయం 17 నిమిషాల నుంచి 12 నిమిషాలకు తగ్గిందన్నారు. -
17 కథలు రెడీగా ఉన్నాయి
‘‘నాలుగేళ్ల క్రితం ‘వై మేల్ ఈజ్ ఏ జోక్’ అనే వీడియో రూపొందించాను. సౌతిండియాలో వైరల్ అయిన తొలి వీడియో అది. ఆ వీడియోకి వచ్చిన ఒక కామెంట్ నాలో ఆసక్తి కలిగించింది. దాంతో రామాయణం మొత్తం చదివాను. సుమారు 8 వెర్షన్లు చదివాను. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో రాముడు, సీత లాంటి పాత్రలుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతోనే ‘రామ చక్కని సీత’ చిత్రాన్ని తీశాను’’ అని దర్శకుడు శ్రీహర్ష మండ అన్నారు. ఇంద్ర, సుకృత జంటగా శ్రీహర్ష తెరకెక్కించిన చిత్రం ‘రామ చక్కని సీత’. శ్రీహర్ష, ఫణి నిర్మించారు. గత శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ – ‘‘నేను విజయవాడలో పుట్టి పెరిగాను. చిన్నప్పుడు స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవాణ్ణి. ‘నువ్వు ఇందులో బాగా రాణిస్తావు రా’ అని టీచర్లు మెచ్చుకునేవారు. అలా సినిమాల్లోకి రావాలనే ఆలోచన వచ్చింది. వీవీ వినాయ్గారు తీసిన ‘నాయక్’ సినిమాకు నేను చివరి అప్రెంటిస్‌ని. నేను ఆ సినిమాకి పని చేశా అని బహుశా వినాయక్‌గారికి కూడా తెలిసుండదు. ఆ తర్వాత దశరథ్గారి దగ్గర ‘శౌర్య’, ఓంకార్‌గారి దగ్గర ‘రాజుగారి గది 2’ సినిమా, ‘సిక్త్స్ సెన్స్’ అనే షోకు వర్క్ చేశాను. ఈ సినిమాను నా స్నేహితుడు ఫణితో కలసి నిర్మించాను. ఊహించినదానికంటే మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు, రివ్యూలు చాలా పాజిటివ్‌గా వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయని చెప్పడం హ్యాపీ. ప్రస్తుతం నా దగ్గర 17కథలు రెడీగా ఉన్నాయి. ఏ సినిమా చేస్తాననేది త్వరలో చెబుతాను’’ అన్నారు. -
ఆర్ఎక్స్ 100 నేను చేయాల్సింది
‘‘రామ్‌లీలా’ సినిమా అప్పటి నుంచి నాకు, అజయ్ భూపతికి మంచి స్నేహం ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రాన్ని అజయ్ నాతోనే చెయ్యాలనుకున్నారు. కానీ, కుదరలేదు’’ అని ఇంద్రసాయి వెలివెల అన్నారు. శ్రీహర్ష మంద దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామ చక్కని సీత’. ఈ చిత్రంలో ఇంద్రసాయి, సుకృత వాగ్లే జంటగా నటించారు. జి.ఎల్. ఫణికాంత్, విశాలక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఇంద్రసాయి మాట్లాడుతూ– ‘‘బీటెక్ తర్వాత నటనలో శిక్షణ తీసుకుని ఏడేళ్ల క్రితం పరిశ్రమలో అడుగుపెట్టా. ‘రామ్‌లీలా’, ‘వంగవీటి’ చిత్రాల్లో సహాయ నటుడి పాత్రలు చేశాను. నా సన్నిహితుల ద్వారా ‘రామ చక్కని సీత’ ఆడిషన్స్‌కు వెళ్లా. నా నటన నచ్చడంతో శ్రీహర్షగారు హీరోగా అవకాశమిచ్చారు. ‘వంగవీటి’ సమయంలోనే ‘ఆర్ఎక్స్ 100’ ప్రాజెక్టు గురించి అజయ్ చెప్పారు. 80 కేజీల బరువు ఉన్న నేను ఆ పాత్ర కోసం దాదాపు 15 కిలోలు తగ్గా. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కార్తికేయగారికి దక్కింది. అయినా ఇప్పటికీ నాకు–అజయ్‌కు మంచి స్నేహం ఉంది. ‘రామ చక్కని సీత’లో దుందుడుకు స్వభావం కలిగిన బాలు పాత్రలో కనిపిస్తా. మంచి కథలు దొరికితే కమల్‌హాసన్‌లా విభిన్న పాత్రలు పోషించాలని ఉంది. త్వరలోనే అగస్త్య మంజు దర్శకత్వంలో కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నా’’ అన్నారు. పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నా సుకృత వాగ్లే మాట్లాడుతూ –‘‘మాది కర్ణాటక. కన్నడలో 7 చిత్రాలు చేశా. కన్నడ ‘బిగ్‌బాస్’ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాను. తెలుగులో నాకిది ఫస్ట్ మూవీ. నిర్మాత ఫణీంద్రగారు మాకు దూరపు బంధువు. అయినప్పటికీ నేనూ రెండుసార్లు ఆడిషన్లో పాల్గొన్నా. తెలుగమ్మాయి అయితే బావుంటుందని శ్రీహర్ష అనడంతో పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నా. ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
సమకాలీన క్రైమ్ కథ
‘వీకెండ్ లవ్’ సినిమా ఫేమ్ నాగు గవర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వసంత్ సమీర్, సెహర్ జంటగా, శ్రీహర్ష, రవివర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి క్లాప్ ఇవ్వగా, మరో దర్శకుడు దేవి ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకుడు అజయ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘జర్నలిస్ట్ వినాయకరావుగారి ద్వారా నాగు పరిచయమయ్యాడు. తను మంచి∙క్రైమ్ సబ్జెక్ట్ చెప్పాడు. ‘బిచ్చగాడు, డి16’ తరహాలోనే విభిన్నమైన చిత్రమిది’’ అన్నారు. ‘‘వీకెండ్ లవ్’ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకుని, వినాయకరావుగారి ద్వారా ఈ సినిమా చేస్తున్నా. ఇదొక సమకాలీన క్రైమ్ కథ. రియలిస్టిక్, గ్రిప్పింగ్ కథనంతో ఉంటుంది. ఈ నెల 14న చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు నాగు గవర. కాదంబరి కిరణ్, నీలిమ, జెమిని సురేష్, కమల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దుర్గా కిషోర్ బొయడపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్. -
‘రిషిత’ ఇంట విషాదఛాయలు
జగద్గిరిగుట్ట(బాచుపల్లి), నల్లకుంట: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి రిషితారెడ్డి ఇంట ఆదివారం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతదేహం ఆదివారం లభించినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో నగరానికి చెందిన 16 మందిలో ఇప్పటి వరకు 15 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక నల్లకుంటకు చెందిన శ్రీహర్ష ఆచూకీ లభించాల్సి ఉంది. గల్లంతైన 42 రోజుల తరువాత రిషితారెడ్డి మృతదేహం లభ్యమైందన్న సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆమె మరణ వార్త తెలియడంతో కుప్పకూలిపోయారు. అమ్మానాన్నల కుటుంబాల తరఫున.. రిషితారెడ్డి అమ్మ తరఫున, ఇటు నాన్న బంధువుల్లో ఒకే ఒక ఆడపడుచు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఖ: సాగరంలో మునిగిపోయారు. అంత్యక్రియలకుఏర్పాట్లు రిషిత అంత్యక్రియలను బాచుపల్లి గ్రామంలోని శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు బంధువులు పేర్కొన్నారు. అంత్యక్రియల కోసం కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు, బాచుపల్లి పంచాయతీ పాలక వర్గం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఇంకా ఎదురుచూపులే.. ఇక కల్లూరి శ్రీహర్ష (19) ఆచూకి నేటికి తెలియరాలేదు. నల్లకుంట శివం రోడ్డు బతుకమ్మ కుంట సబ్‌స్టేషన్ ఎదురు వీధిలోని శ్రీమత్ రాజాస్ రెసిడెన్సీలో ఉండే అడ్వకేట్ కేఆర్‌కేబీ.ప్రసాద్, స్వర్ణలత దంపతుల కుమారుడు కల్లూరి శ్రీహర్ష (19) గత నెల 8న బియాస్ నదిలో గల్లంతయ్యాడు. ఆదివారం మరో ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు లభ్యం కాగా గల్లంతైన వారిలో నల్లకుంటకు చెందిన శ్రీ హర్ష జాడ నేటికి తెలియరాలేరు.