Srikakulam collecterate
-
వేగంగా జిల్లా అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాను వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పేర్కొన్నారు. 70 గణతంత్ర దిన వేడుకలు శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 9న రామాయపట్నం పోర్టు వద్ద రూ.4,240 కోట్ల అంచనాలతో పోర్టు నిర్మాణం, రూ.24 వేల కోట్ల అంచనాతో ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ లిమిటెడ్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. రూ.3500 కోట్లతో జిల్లాలో జిందాల్ స్టీల్స్ లిమిటెడ్ కంపెనీ స్టీల పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందని చెప్పారు. దొనకొండలో మెగా ఇండస్ట్రీయల్ హబ్, పామూరు ప్రాంతంలో జాతీయ పారిశ్రామిక ఉత్పాదక జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు చంద్రన్న కానుక ద్వారా 10 లక్షల 55 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పించన్లు, రేషన్ కార్డులు, పంట సంజీవని, ఎన్టీఆర్ జలసిరి, ఎన్టీఆర్ వైద్య పరీక్షలు, తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. రైతు రుణ ఉపశమనం కింద మూడు విడతలుగా రూ.1359 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేసినట్లు చెప్పారు. రైతులకు యంత్ర పరికరాలు అందిస్తున్నామన్నారు. గత సంవత్సరం కరువు మండలాలకు సంబంధించి పెట్టుబడి రాయితీ రూ.125 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా 48,227 ఎకరాల్లో రూ.139.09 కోట్ల విలువైన బిందు, తుంపర పరికరాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.6 కోట్లతో సబ్సిడీపై సైకిళ్లు, వలలు, మోపెడ్స్ ఇచ్చామన్నారు. వనం–మనం కార్యక్రమం ద్వారా కోటి 20 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. నాగార్జున సాగర్ కాలువల ఆధునికీకరణలో భాగంగా రూ.73.63 కోట్లతో పనులు చేపట్టామన్నారు. నీరు–చెట్టు కింద రూ.652 కోట్లతో 9522 పనులు చేపట్టామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను రూ.5,150 కోట్లతో చేపట్టి త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2019 సెప్టెంబర్ నాటికి టన్నెల్ 1 పనులు, డిసెంబర్ 2019 నాటికి టన్నెల్ 2 పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుతో పాటు పోతుల చెంచయ్య పాలేరు జలాశయాన్ని పూర్తి చేస్తున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 297 లక్షల పని దినాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.881 కోట్లు ఖర్చు చేసి 238 లక్షల పనిదినాలు కల్పిస్తామన్నారు. ఎన్టీఆర్ జలసిర కింద జిల్లాలో రూ.20 కోట్లతో 6373 బోర్లు వేశామన్నారు. రూ.161.51 కోట్లతో 4686 మంది లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లు బిగించామన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 74,506 గృహాలు రూ.1130.64 కోట్లతో చేపట్టారన్నారు. ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణం కింద రూ.277.47 కోట్లతో 7928 గృహాలను మంజూరు చేశామని చెప్పారు. రూ.250 కోట్లతో 619 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించి 4576 మందికి ఉపాధి కల్పించామన్నారు. పరిశ్రమలకు రాయితీ కింద రూ.84.17 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. చేనేత సహకార సంఘాలకు రూ.3.43 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. చంద్రన్న సంచార చికిత్స ద్వారా 10 లక్షల 15 వేల మందికి ఉచిత వైద్య సేవలు అందించామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 27,865 మందికి రూ.79 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా 19741 మంది తల్లీ పిల్లలను ప్రసవానంతరం వారి గృహాలకు చేర్చామన్నారు. జిల్లాలోని 2345 ఆవాస ప్రాంతాల్లో 707 ఆవాస ప్రాంతాలకు పూర్తిగా, 1638 ఆవాస ప్రాంతాలకు పాక్షికంగా రక్షిత తాగునీరు అందించినట్లు తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి పరీక్షల్లో 97.93 శాతంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో సంక్షేమ అభివృద్థి« పనులతో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి, ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలు ఇచ్చారు. వివిధ శాఖల శకటాలు ప్రదర్శించారు. కింద మూడు విడతలుగా రూ.1359 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేసినట్లు చెప్పారు. రైతులకు యంత్ర పరికరాలు అందిస్తున్నామన్నారు. గత సంవత్సరం కరువు మండలాలకు సంబంధించి పెట్టుబడి రాయితీ రూ.125 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా 48,227 ఎకరాల్లో రూ.139.09 కోట్ల విలువైన బిందు, తుంపర పరికరాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.6 కోట్లతో సబ్సిడీపై సైకిళ్లు, వలలు, మోపెడ్స్ ఇచ్చామన్నారు. వనం–మనం కార్యక్రమం ద్వారా కోటి 20 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. నాగార్జున సాగర్ కాలువల ఆధునికీకరణలో భాగంగా రూ.73.63 కోట్లతో పనులు చేపట్టామన్నారు. నీరు–చెట్టు కింద రూ.652 కోట్లతో 9522 పనులు చేపట్టామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను రూ.5,150 కోట్లతో చేపట్టి త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2019 సెప్టెంబర్ నాటికి టన్నెల్ 1 పనులు, డిసెంబర్ 2019 నాటికి టన్నెల్ 2 పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుతో పాటు పోతుల చెంచయ్య పాలేరు జలాశయాన్ని పూర్తి చేస్తున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 297 లక్షల పని దినాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.881 కోట్లు ఖర్చు చేసి 238 లక్షల పనిదినాలు కల్పిస్తామన్నారు. ఎన్టీఆర్ జలసిర కింద జిల్లాలో రూ.20 కోట్లతో 6373 బోర్లు వేశామన్నారు. రూ.161.51 కోట్లతో 4686 మంది లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లు బిగించామన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 74,506 గృహాలు రూ.1130.64 కోట్లతో చేపట్టారన్నారు. ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణం కింద రూ.277.47 కోట్లతో 7928 గృహాలను మంజూరు చేశామని చెప్పారు. రూ.250 కోట్లతో 619 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించి 4576 మందికి ఉపాధి కల్పించామన్నారు. పరిశ్రమలకు రాయితీ కింద రూ.84.17 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. చేనేత సహకార సంఘాలకు రూ.3.43 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. చంద్రన్న సంచార చికిత్స ద్వారా 10 లక్షల 15 వేల మందికి ఉచిత వైద్య సేవలు అందించామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 27,865 మందికి రూ.79 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా 19741 మంది తల్లీ పిల్లలను ప్రసవానంతరం వారి గృహాలకు చేర్చామన్నారు. జిల్లాలోని 2345 ఆవాస ప్రాంతాల్లో 707 ఆవాస ప్రాంతాలకు పూర్తిగా, 1638 ఆవాస ప్రాంతాలకు పాక్షికంగా రక్షిత తాగునీరు అందించినట్లు తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి పరీక్షల్లో 97.93 శాతంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో సంక్షేమ అభివృద్థి« పనులతో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి, ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంస పత్రాలు ఇచ్చారు. వివిధ శాఖల శకటాలు ప్రదర్శించారు. -
అంకితభావంతోనే అభివృద్ధి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘జాతీయ నాయకులు ఆశించిన ఉజ్వల భవిషత్ కోసం ప్రతిఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలి. జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకు అందరి సహకారం అవసరం. అందరూ సహకరిస్తేనే జిల్లా ప్రగతి పథంలో పయనిస్తుందని’ కలెక్టర్ కె.ధనంజయరెడ్డి అన్నారు. 70వ గణతంత్ర వేడుకలు శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఇటీవల జరిగిన జన్మభూమి–మా ఊరు, గ్రామ దర్శిని కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకున్నామన్నారు. సుమారు 26,335 వినతులు వచ్చాయన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన తిత్లీ తుపాను జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిందని, ఉద్దానం ప్రాంతం పూర్తిగా పాడైందన్నారు. బాధితులను ఆదుకోవడానికి తీవ్ర కృషి జరిగిందని చెప్పారు. ఉద్దానం పునర్నిర్మాణానికి ‘తూర్పు’ కార్యక్రమం చేపట్టామన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం జిల్లా వ్యయవసాయ ఆధారితం కావడంతో రైతులు లాభసాటి వ్యవసాయం దిశగా అడుగులు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, అధిక దిగుబడులు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఖరీప్‌లో రూ.1475 కోట్లు, రబీలో రూ. 428 కోట్లును రైతులకు రుణాలుగా అందించామన్నారు. షెడ్యూలు కులాల వారికి రాయితీతో పనిముట్లు అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది 8,305 మంది రైతులకు రూ.5.88 కోట్లు బీమాగా అందించామని, రైతు రుణ మాఫీ కింద 3 లక్షల మందికి రూ. 403 కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు వివరించారు. తుంపర, బిందు సేద్యాలకు రూ.29 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఉద్యానవన మిషన్ద్వారా వివిధ కేంద్ర, రాష్ట్ర పథకాలకు సంబంధించి రూ. 1459.34 లక్షలు లక్ష్యంగా తీసుకున్నామన్నారు. పాడి పంట అభివృద్ధికి పశుగ్రాసం పెంపకం, వివిధ కార్పొరేషన్ల ద్వారా పశువుల పంపిణీ చేస్తామన్నారు. మత్స్య సంపదను పెంచేందుకు ఆక్వా అభివృద్ధి, చెరువుల్లో చేపల పెంపకానికి పెద్ద పీట వేశామన్నారు. జిల్లాలో 12 ఆక్వా సాగు కేంద్రాలు ప్రారంభించామన్నారు. పొలాలకు సాగునీరు అందించేందుకు బీఆర్ఆర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో రెండు, మూడు పంటలు పండిం చేందుకు రైతులకు అవకాశం ఇస్తామన్నారు. వంశధార–నాగావళి అనుసంధానం వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు జరుగుతున్నాయని కలెక్టర్ ధనంజయరెడ్డి పేర్కొన్నారు. రూ. 84.90 కోట్లుతో పనులు జరుగుతున్నట్టు చెప్పారు. రూ. 466 కోట్లుతో ఆఫషోర్ ప్రాజె పనులు చేపట్టడం జరిగిందన్నారు. వంశధార–బాహుదా నదులు అనుసంధానానికి రూ. 6,342 కోట్లుతో అంచనాలు రూపొందించామన్నారు. తాగునీటి నీటి ఎద్దడి నివారణకు.. తాగునీటి సమస్యను అ«ధిగమించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ చెప్పారు. జలుమూరు, సావరకోట మండలాల్లోని 37 గ్రామాల్లో తాగునీరు అందించేందుకు రూ.28 కోట్లు, గార మండలంలోని 18 గ్రామాలకు రూ.4.5 కోట్లుతో పనులు జరుగుతున్నాయన్నారు. ఫోరైడ్ ప్రభావిత గ్రామాల్లో రూ.43.60 కోట్లుతో మూడు శుద్ధ జల పథకాలు మంజూరు చేశామన్నారు. ఉద్దానంలో మంచినీటి కోసం రూ.510 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. సర్కార్ బడుల బలోపేతానికి చర్యలు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంపై దృష్టిసారించామని కలెక్టర్ చెప్పారు. భవనాలు, ప్రహరీల నిర్మాణం, మరమ్మతులు, తాగునీరు, విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. 208 పాఠశాలలకు ఆదనపు తరగతి గదులు మంజూరు చేశారు. వైద్యంపై కూడా ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ఆస్పతుల్లో మెరుగైన సేవలు అందించేందుకు కృషి జరగుతోందని, వైద్య పరీక్షలకు ఉచిత ల్యాబ్‌లున్నాయన్నారు. మరికొన్నింటిపై దృష్టి... –పేదవారికి గత నాలుగున్నరేళ్లలో 89,185 ఇళ్లు మంజూరు చేశామని కలెక్టర్ ధనంజయరెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. 3.50 ఎకరాల్లో శాంతినగర్ కాలనీలో పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నదీతీరంలో రివర్యూ పార్కులను ఏర్పాటు చేస్తునామన్నారు. ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం, రాజాం, పాలకొండ పురపాలక సంఘాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతికి కృషి జరుగుతోందన్నారు. చిన్నారి చూపు కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, అద్దాలు సరఫరా చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 3,961 మంది పిల్లలకు కళ్లద్దాలు అందజేశామన్నారు. కిడ్నీ రోగులపై .. ్డఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించేందుకు, వారిలో భయాన్ని పొగొట్టేందుకు అవసమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిమ్స్‌లో 16 డయాలసిస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉద్దానంలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు జరుపుతున్నామన్నారు. స్కీనింగ్ పరీక్షల్లో 13,093 మందికి మూత్రపిండాల వ్యాధి ఉన్నట్టు గుర్తించామన్నారు. పారిశ్రామికాభివృద్ధికి చర్యలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి 451 ఎకరాల భూమి గుర్తించామని కలెక్టర్ చెప్పారు. చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. భావనపాడు పోర్టు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోందని.. ఇది పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకంలో 3,78,819 కుటుంబాలకు పని కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు, జిల్లా జడ్డీ బబిత, ఇన్చార్జి ఎస్పీ టి.పనసారెడ్డి, జేసీ–2 పి.రజనీకాంతరావు, డీఆర్వో కె.నరేంద్ర ప్రసాద్, బీఆర్‌ఏయూ వీసీ కూన రామ్‌జీ, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. అలాగే వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ఉద్యోగులకు, వివిధ పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులను అతిథులు ప్రదానం చేశారు. -
దుర్నీతిపై దండయాత్ర
⇒ కదిలివచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ⇒ మద్దతుగా నిలిచిన ప్రజాదండు ⇒ పోలీసుల ఆంక్షలను అధిగమించి వేలాదిమంది హాజరు ⇒ శ్రీకాకుళంలో మహాధర్నా విజయవంతం ⇒ చంద్రబాబు పాలనను ఎండగట్టిన నేతలు, సామాన్యులు ⇒ ఇదే పరిస్థితి కొనసాగితే గుణపాఠం తప్పదని ెహ చ్చరిక సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బధిర సర్కారు చెవికి సోకని జనం బాధలు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద శుక్రవారం వైఎస్ఆర్సీపీ చేపట్టిన మహాధర్నాలో సామాన్యుల గుండెల నుంచి తన్నుకొచ్చిన కన్నీటి గాధలు ఎన్నెన్నో. రుణమాఫీ లేదు. ఫీజు రియింబర్స్‌మెంట్ రాదు. రుణాలు ఇవ్వరు. డ్వాక్రా సంఘాల మాటే మరిచారు. తుపాను బాధితుల్ని పక్కన పెట్టేశారు. సాయం పక్కదోవ పట్టింది. ఇసుకను బంగారంగా మార్చేశారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఉన్నవే ఊడగొడుతున్నారు. అంతా కార్పొరేట్ల పాలన.. ఆరునెలలైనా కాకముందే టీడీపీ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతకు వైఎస్ఆర్సీపీ మహాధర్నా వేదికగా నిలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ మహాధర్నా అడుగడుగునా పోలీసుల ప్రతిబంధకాలను ఛేదించి మరీ విజయవంతమైంది. రైతులు, మహిళలు, వృద్ధులు, వితంతువులు, విద్యార్థులు, ఇసుక బళ్ల యజమానులు, సోంపేట బీల ప్రాంత వాసులు, తాపీ మేస్త్రీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున హాజరై చంద్రబాబు దుర్మార్గ పాలనను ఎండగట్టారు. ప్రధాన ప్రతిపక్షం చేపట్టిన ఆందోళన కార్యక్రమం తమదే అన్నట్లు వ్యవహరించారు. ఇలా జరిగింది ⇒ ఉదయం ఆరు గంటల నుంచే జిల్లా నలువైపుల నుంచి నేతలు జిల్లా కేంద్రానికి బయల్దేరారు. ⇒ ఏడుగంటల నుంచి పోలీసులు ఆంక్షలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి ధర్నాకు వస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పెద్ద వాహనాలతోపాటు ద్విచక్ర వాహనాలనూ నిబంధనల పేరిట అడ్డుకున్నారు. తెలుగుదేశం నేతల ఒత్తిళ్లతో ఎక్కడికక్కడ భారీ బందోబస్తు పేరుతో ఆటంకాలు సృష్టించారు. ⇒ 8 గంటల నుంచే ధర్నా వేదిక వద్ద ప్లకార్డులు, హోర్డింగ్‌లు, పోస్టర్లు వెలిశాయి. వైఎస్సార్సీపీ జెండాలు రెపరెపలాడాయి. ⇒ 9 గంటలకే ధర్నా ప్రాంగణానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, నాయకులు, ఎమ్మెల్యేలు రావడం మొదలెట్టారు. ⇒ 11 గంటలకు కార్యక్రమం మొదలైంది. నాయకులు చంద్రబాబు దుర్నీతిని ఎండగట్టారు. బాధిత ప్రజలకు బాసటగా ఉంటామని ప్రసంగాలతో భరోసా ఇచ్చారు. ⇒ ఎండ సుర్రున మండుతున్నా ఎవరూ వెరవలేదు. వేలాది జనం వేదిక వద్దే ఉండిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ఓ అవ్వ, ఓ వృద్ధుడు, ఓ భవన నిర్మాణ కార్మికుడు, ఓ ఇసుక బండి యజమాని, ఓ డ్వాక్రా సంఘం సభ్యురాలు తమ మాటల్లో వివరించారు. ⇒ మధ్యాహ్నం రెండుగంటల సమయంలో వైఎస్సార్సీపీ నేతలు జేసీ వివేక్ యాదవ్‌కు విజ్ఞాపన పత్రం అందించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు..ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్ ఇబ్బందుల్ని విడమర్చి చెప్పారు. ⇒ అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించినా, వాహనాలను అడ్డుకున్నా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే తామంతా నడుస్తామని, ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు.