ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ
రెహన్, శ్వేత, చరణ్, షరాజ్, అర్చన ముఖ్య తారలుగా శ్రీకరబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంకా ఏమీ అనుకోలేదు’.నిమ్మల శ్రీనివాస్, నిమ్మల రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నవనీత్ చారి మంచి పాటలు స్వరపరి చారని, ఈ చిత్రం టైటిల్‌కి మంచి స్పందన లభించిందని నిర్మాత అన్నారు. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుందని, పాటలన్నీ సందర్భానుసారం సాగుతాయని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: రమేష్‌రెడ్డి, సుకుమారన్, ఎడిటింగ్: రెమోజి, ఆషిస్.