State Human Rights Commission
-
ఈడీ అరెస్ట్ వేళ సెంథిల్ తలకు గాయం?
సాక్షి, చెన్నై: ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని అరెస్ట్చేసినపుడు ఈడీ ఆయన పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించిందా అనే అనుమానాలను తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(టీఎన్ఎస్హెచ్ఆర్సీ) సభ్యుడొకరు వ్యక్తంచేశారు. అదే జరిగితే ఆ అంశాన్ని టీఎన్ఎస్హెచ్ఆర్సీ తప్పక పరిశీలిస్తుందని సంస్థ సభ్యుడు కన్నదాసన్ చెప్పారు. రవాణా శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురి నుంచి భారీఎత్తున నగదు తీసుకున్నారనే ఆరోపణలపై సెంథిల్‌ను విచారించిన ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక అరెస్ట్‌చేశారు. అరెస్ట్వేళ సెంథిల్ బిగ్గరగా రోదించడం, వెంటనే ఆస్పత్రిలో చేర్పించి యాంజియోగ్రామ్ చేయించడం, గుండె నాళంలో బ్లాక్‌లను గుర్తించడం విదితమే. అయితే అర్ధరాత్రి అరెస్ట్ సందర్భంగా తన పట్ల ఈడీ అధికారులు దురుసుగా ప్రవర్తించారని తనను ఆస్పత్రికి కలవడానికి వచ్చిన కన్నదాసన్‌కు సెంథిల్ ఫిర్యాదుచేశారు. ‘ ఈడ్చుకెళ్లారని ఆయన చెప్తున్నారు. లాక్కెళ్లినపుడే ఆయన తలకు గాయమైందట. ఈడీ దురుసు ప్రవర్తన అంశాన్ని టీఎన్ఎస్హెచ్ఆర్సీ పరిశీలిస్తుంది’ అని కన్నదాసన్ చెప్పారు. కాగా, చెన్నై ఓమందూరార్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను కావేరి ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్సకు అనుమతి ఇవ్వాలని మంత్రి భార్య మేఘల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కావేరి ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స, వైద్య సేవలకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఈడీ అధికారులను ఆదేశించింది. రెచ్చ గొట్టొద్దు: కేంద్రంపై స్టాలిన్ ఫైర్ ఈడీ దాడులు, మంత్రి అరెస్టు నేపథ్యంలో డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘డీఎంకే వాడిని. రెచ్చగొట్టొద్దు తట్టుకోలేరు’ అని కేంద్రాన్ని హెచ్చరించారు. కరుణానిధి చేసిన హెచ్చరికలను ఉటంకిస్తూ.. ‘డీఎంకే వాళ్లు తిప్పి కొట్టడం మొదలెడితే భరించలేరు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మేం చేయని రాజకీయాలు లేవు. మేం చూడని పోరాటాలు లేవు. ఒకసారి చరిత్రను చూసుకోండి’ అని హెచ్చరించారు. ‘ఇది బెదిరింపు కాదు. హెచ్చరిక’ అని అన్నారు. సెంథిల్ అరెస్ట్‌పై స్పందించారు. ‘ ఈడీ ద్వారానే రాజకీయాలు చేద్దామని బీజేపీ చూస్తోంది. ఈడీని అడ్డుపెట్టుకుని పదేళ్లనాటి పాత కేసులో మానసికంగా, శారీరకంగా సెంథిల్‌ను వేధిస్తున్నారు. ఈడీ అధికారులు పెట్టిన మానసిక ఒత్తిడితోనే ఆయనకు హృద్రోగ సమస్యలొచ్చాయి. 18 గంటలు నిర్బంధించిమరీ ప్రశ్నల పరంపర కొనసాగించారు. ఎవ్వరినీ కలవనివ్వలేదు. దాంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించాక ఆస్పత్రికి తరలించారు’ అని ఆరోపించారు. -
ఖాకీ జులుం: మందుబాబు మరణం
సాక్షి, చెన్నై : మద్యం మత్తులో మోటారు సైకిల్ మీద దూసుకొచ్చిన మందుబాబుపై ఓ ఖాకీ జులుం ప్రదర్శించాడు. లాఠీతో చితక్కొట్టాడు. ఈ దెబ్బలకు స్పృహ తప్పిన ఆ మందుబాబు ఆస్పత్రిలో మరణించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పెషల్ పార్టీ ఎస్ఐపై హత్య కేసు నమోదైంది. ఆయన్ని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్టు చేశారు. సేలం జిల్లా వాలప్పాడి పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం తదితర 11 జిల్లాల్లో ఇంకా మద్యం దుకాణాలు తెరచుకోలేదు. దీంతో మందుబాబులు పొరుగు జిల్లాల వైపుగా పోటెత్తుతున్నారు. అలాగే, సారా జోరు పెరగడంతో కట్టడి లక్ష్యంగా ఆయా జిల్లాల పరిధిలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎట్టపట్టిలో కిరాణా కొట్టు నడుపుతున్న మురుగేషన్ తన మిత్రులతో కలిసి కరుమందం గ్రామంలో మద్యం తాగాడు. మంగళవారం సాయంత్రం మోటారు సైకిల్‌పై తిరుగు పయనం అయ్యాడు. ఒకే మోటారు సైకిల్‌పై ముగ్గురు వ్యక్తులు రావడాన్ని పాపనాయకన్ పట్టి చెక్ పోస్ట్ సిబ్బంది గుర్తించి అడ్డుకున్నారు. ఆ ముగ్గురు మత్తుకు చిల్తై ఉండటం, ఇందులో మురుగేషన్ పోలీసుల మీద తిరబడడం.. విధుల్లో ఉన్న స్పెషల్ ఎస్ఐ పెరియస్వామిలో ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో మురుగేషన్‌ను ఆయన చితక్కొట్టేశాడు. ఈ దృశ్యాల్ని మురుగేషన్‌తో వచ్చిన మిత్రుడు సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. మరో మిత్రుడు ఎస్ఐ కాళ్లా.. వేళ్లా పడినా ఎస్ఐ మురుగేషన్‌ను వదిలిపెట్టలేదు. దెబ్బలకు తాళలేక మురుగేషన్ స్పృహ తప్పాడు. దీంతో అంబులెన్స్‌ను రప్పించి ఆత్తూరు ఆస్పత్రికి తరలించారు. మురుగేషన్ తలకు బలమైన గాయమైనట్టు ఆత్తూరు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం సేలం ఆస్పత్రికి తరలించగా, బుధవారం వేకువ జామున మురుగేషన్ మరణించాడు. మద్యం మత్తులో కిందపడడంతో మృతి చెందినట్లు తొలుత అందరూ భావించారు. అయితే మృతుడి మిత్రుడు చిత్రీకరించిన వీడియో వైరల్ కావడంతో ఎస్ఐ పైశాచికత్వం తెలిసింది. దీంతో బాధిత కుటుంబం న్యాయం కోసం ఏటావూర్ పోలీసు స్టేషన్ ముట్టడించారు. డీఐజీ సీరియస్.. ఆ వీడియో వైరల్‌తో సేలం ఎస్పీ శ్రీఅభినవ్ తొలుత స్పందించారు. ఆ చెక్ పోస్టులో ఉన్న సిబ్బందిని విచారించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్ఐపై కేసు నమోదుకు ఆదేశించారు. ఎస్ఐను అరెస్టు చేశారు. ఇక నిందితుడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఐజీ మహేశ్వరి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, బాధిత కుటుంబం న్యాయం కోసం పట్టుబడుతూ గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగింది. మృతుడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకునే ప్రసక్తే లేదని తేల్చారు. దీంతో అధికారులు వారిని బుజ్జగిస్తున్నారు. ఈ వ్యవహారం చివరకు అసెంబ్లీకి చేరింది. ప్రతిపక్ష నేత పళనిస్వామి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్పందించిన సీఎం స్టాలిన్ విచారణ సాగుతోందని, ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, గత ఏడాది జూన్ 22వ తేదీన పోలీసుల దాడిలో తూత్తుకుడి జిల్లా సాత్తాన్ కులంలో తండ్రి కుమారులు మరణించి సరిగ్గా ఏడాదైన సమయంలో తాజాగా మరోమారు ఓ ఖాకీ రూపంలో పోలీసు యంత్రాంగం రచ్చకెక్కింది. కాగా తాజా ఘటననపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సమగ్ర విచారణతో నివేదిక సమర్పించాలని సేలం జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. చదవండి: 'ఆ రూపాయి నాణేం కోటికి కొంటాను' -
జమ్మికుంట సీఐపై హెచ్చార్సీలో ఫిర్యాదు
సాక్షి, నాంపల్లి: భూ తగాదాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తూ మానసికంగా వేధిస్తున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ముచ్యంతల సమ్మిరెడ్డి బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో (హెచ్చార్సీ) ఫిర్యాదు చేశారు. తన తండ్రి రాజిరెడ్డి పేరిట 2.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తన తమ్ముడు సదాశివరెడ్డి జమ్మికుంట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా సీఐ సృజన్‌రెడ్డి 17 జూలై 2019న అన్నదమ్ములిద్దరిని పిలిపించి రాజీ కుదిర్చినట్లు వివరించారు. ఇరువురి సమక్షంలో తనకు 1–07 ఎకరాలు, తన తమ్ముడు సదాశివరెడ్డికి 1–01 ఎకరాల భూమిని పంచి ఒప్పందం కుదిర్చారని తెలిపారు. అనంతరం అట్టి భూమిని తన తండ్రి సమక్షంలో అన్నదమ్ములిద్దరి పేరిట విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామన్నారు. అయితే తనకు 3 గుంటల భూమిని ఎక్కువగా ఇప్పించినందుకు గాను సీఐ సృజన్‌రెడ్డి రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. తాను అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో సీఐ తన తమ్ముడితో కుమ్మక్కై అసభ్య పదజాలంతో దూషిస్తూ, కేసులు బనాయిస్తానని బెదిరించారని తెలిపారు. అంతటితో ఆగకుండా తనపై మూడు తప్పుడు కేసులు బనాయించి బైండోవర్ చేశాడన్నారు. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ, కరీంనగర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, సీఐ సృజన్‌రెడ్డి, తన తమ్ముడు సదాశివరెడ్డి తదితరులతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
హెచ్చార్సీ చైర్మన్‌గా జస్టిస్ సీతారామమూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్చార్సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తిని ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషన్ సభ్యులుగా రిటైర్డ్ జిల్లా జడ్జి దండే సుబ్రహ్మణ్యం (జ్యుడిషియల్), న్యాయవాది డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు (నాన్ జ్యుడిషియల్)ను ఎంపిక చేశారు. బుధవారం సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన శాసనమండలి చైర్మన్ షరీఫ్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, హోం మంత్రి మేకతోటి సుచరిత సభ్యులుగా ఉన్న కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. గత నెల 4న స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన పేర్లను తొలుత హోం మంత్రి సుచరిత ప్రతిపాదించగా కమిటీ ఆమోదించింది. ఎంపిక చేసిన వారి పేర్లను తదుపరి ఆమోదం కోసం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపించనుంది. హెచ్చార్సీ చైర్మన్, సభ్యుల వివరాలివే.. జస్టిస్ మంథాట సీతారామమూర్తి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1958, జనవరి 16న న్యాయవాదుల కుటుంబంలో జని్మంచారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. లా ఆఫ్ టార్ట్స్‌లో బంగారు పతకం సాధించారు. 1996లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యేంతవరకు న్యాయవాదిగా 12 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారు. 1996–97లో బెస్ట్ ట్రైనీ జిల్లా జడ్జిగా బంగారు పతకం పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ స్పెషల్ జడ్జి, విశాఖపట్నం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, విజయనగరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, రంగారెడ్డి ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు రిజి్రస్టార్ జనరల్‌గానూ వ్యవహరించారు. 2013, అక్టోబర్ 23న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2016, మార్చి 2న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది జనవరి 15న హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. డాక్టర్ గోచిపాత శ్రీనివాసరావు: గుంటూరు జిల్లా నంబూరు స్వస్థలం. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. మానవ హక్కులకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. మానవ హక్కులపై ఆయన రాసిన పలు ఆరి్టకల్స్ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. దండి సుబ్రహ్మణ్యం: కర్నూలు స్వస్థలం. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. 1955, ఆగస్టు 8న జన్మించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1982లో న్యాయవాదిగా నమోదై 1987 వరకు ప్రాక్టీస్ చేశారు. తర్వాత జిల్లా మున్సిఫ్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2005లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. తర్వాత హైకోర్టు లీగల్ సరీ్వసెస్ కమిటీ కార్యదర్శిగా, అప్పటి ప్రధాన న్యాయమూర్తి ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీటీడీ లీగల్ ఆఫీసర్‌గా, ఏపీ మానవహక్కుల కమిషన్ కార్యదర్శిగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. -
సివిల్ వివాదాల్లో ఖాకీల జోక్యం!
సాక్షి, హైదరాబాద్ : సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చి ఫిర్యాదుదారులపై బెదిరింపులకు దిగుతున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ వారంలో ఈ విధమైన రెండు ఘటనల్లో రాష్ట్ర మానవహక్కుల సంఘం (ఎస్హెచ్ఆర్సీ) కలగజేసుకుందంటే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. సూర్యాపేట జిల్లా నాగారం ఎస్సై ఓ భూవివాదంలో అకారణం గా దళితులపై దాడి చేశారని, చంపుతానని బెదిరించారనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర మానవ హక్కుల సంఘం దీన్ని సుమోటాగా స్వీకరించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఎస్పీ భాస్కరన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ విమర్శల నేపథ్యంలో స్పందించిన ఎస్పీ సదరు ఎస్సైని వీఆర్‌కు పంపారు. గతంలోనూ ఈ అధికారిపై ఇలాంటి ఆరోపణలున్నా యి. అదే జిల్లాలోని మునగాల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగుచూసింది. తన భూమిని ఆక్రమిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినా ఎస్సై పట్టించుకోకపోగా దూషించి వెనక్కి పంపడంతో బాధితుడు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు. ఈ విషయంపై విచారణ జరిపించాలని హెచ్చార్సీ సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. భూపంచాయితీలంటే ఎంత ఇష్టమో! రాష్ట్రంలో పట్టాదారు పాసుపుస్తకాల్లో దొర్లిన తప్పులు ఎంతమందిని బలి తీసుకుంటున్నా యో చూస్తున్నాం. ఈ క్రమంలో తలెత్తుతున్న వివాదాల నేపథ్యంలో బాధితులు ముందుగా పోలీసులనే ఆశ్రయియిస్తున్నారు. దీన్ని కొందరు పోలీసులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వాస్తవానికి సివిల్ కేసులు పోలీసుల పరిధిలోనివి కావు. కానీ, ఇలాంటి వివాదాలపై పోలీసులు ఠాణాల్లోనే పంచాయితీలు పెట్టి రెండు వర్గాల నుంచి డబ్బులు దం డుకుంటున్నారన్న విమర్శలున్నాయి. దీంతో బాధితులు ఎస్పీలు, మానవ హక్కుల సం ఘాలను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు ఎవరో ఒకరి పక్షం వహించడం వల్ల ఒకవర్గం మరోవర్గంపై దాడులు, బెదిరింపులకు దిగుతోంది. వీరంతా పేదలు, బలహీనులు కావడంతో భయపడి చాలామంది రాజీకే మొగ్గు చూపుతున్నారు. అందుకే, ఇలాంటి విషయాలు తక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నా కొందరి తీరు మారడం లేదు. డీజీపీ ఆదేశాలు బేఖాతరేనా? సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని, స్టేషన్ల చుట్టూ పదే పదే బాధితులను తిప్పించుకోవద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి పలుమార్లు హెచ్చరించారు. ఇలాంటి వైఖరి హత్యలు, అల్లర్లు, శాంతిభద్రతల సమస్యకు దారి తీస్తుందని చెప్పినా చాలామంది గ్రామీణ పోలీసుల తీరు లో మార్పు రావట్లేదు. విచారణలో తప్పు రుజువై వేటు పడుతున్నా కొందరు కిందిస్థా యి పోలీసు అధికారుల తీరు మారడంలేదు. కొంతకాలం తరువాత పోస్టింగ్ వస్తుందన్న ధీమాతో బరితెగిస్తున్నారు. -
కోదాడలో సీనియర్ సిటిజన్లకు పరీక్షలు చేయండి
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడలో కేరళ రెవెన్యూ కాలనీలోని సీనియర్ సిటిజన్లకు కోవిడ్–19 పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో సి.విద్యాధర భట్ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ‘ఓరల్ టెస్టింగ్ ల్యాబ్స్’ను ఇంతవరకు ఏర్పాటు చేయలేదని, ఈ అంశంపై ఆదేశాలివ్వాలంటూ ఆర్టీఐ, సామాజిక కార్యకర్త జలగం సుధీర్ కమిషన్‌కు చేసిన ఫిర్యాదును విచారించి పై విధంగా స్పందించారు. కోవిడ్–19 పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోని పక్షంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి స్పందించవచ్చునని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌దారు కోరినట్టుగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. -
బెగ్గింగ్ మాఫియాపై చర్యలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో విజృంభిస్తున్న బెగ్గింగ్ మాఫియాపై శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై బాలల హక్కుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలను భిక్షగాళ్ల మాఫియా నుంచి రక్షించి పునరావాసం కల్పించాలని ఈ మేరకు రాష్ట్ర డీజీపీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శనివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఆమోదించిన మానవ హక్కుల కమిషన్.. ఏప్రిల్ 11లోగా బెగ్గింగ్ మాఫియాపై తగిన చర్యలు చేపట్టి, నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. -
రూ.10 లక్షలు పరిహారం చెల్లించండి
‘మానవ కవచం’పై హెచ్ఆర్సీ శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ‘మానవ కవచం’ ఘటనపై విచారణ జరిపిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) బాధి తుడికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవా రం ఆదేశాలు జారీ చేసింది. కొంత కాలం క్రితం రాష్ట్రంలో అల్లర్లు జరిగిన సమయం లో ఫరూఖ్ అహ్మద్ దార్‌ను మేజర్ లీతుల్ గొగొయ్ తన జీపు బానెట్‌పై కట్టి మానవ కవచంగా వినియోగించుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారణ జరిపిన మానవ హక్కుల కమిషన్ బాధితుడికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫరూఖ్‌కు పరిహారం చెల్లించాలన్న ఆదేశాలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఖండించారు. ‘రాళ్లు విసిరేవాళ్లకు పరిహా రం ఇచ్చే సమస్యేలేదు’ అని ఆయన అన్నారు. -
సారూ.. మా పొట్ట కొట్టొద్దు!
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల గోడు సాక్షి, హైదరాబాద్: ‘‘సారూ.. మల్లన్న పేరుబెట్టి మా పొట్టలు కొట్టొద్దు. మా బోర్లల్ల నీళ్లున్నయ్.. మా చెర్లల్ల నీళ్లున్నయ్.. ఈ ప్రాజెక్టు మాకొద్దు.. అడవిలల్ల గట్టుకోండ్రి.. మమ్ముల మా ఊర్లె బతకనియ్యుండ్రి.. రెండుపొద్దుల తింటున్నాం.. ఊరిడిసిపోతే మా ముసలోళ్లు సచ్చిపోతరు.. మేం కొంగుజాపి అడుక్కతినాలె..’’ అంటూ మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు. తమ బతుకులు ఆగం చేయొద్దంటూ కన్నీరుమున్నీర య్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనైనా మౌనం వీడి, తమను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకుడు, ఏటిగడ్డ కిష్టాపురం గ్రామస్తుడు ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక నష్టపరిహారం ఇస్తున్నామంటూ మంత్రులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలోకి తొక్కి జీవో నంబరు 123తో ముంపు గ్రామాల ప్రజలను భయపెడుతున్నారని విమర్శించారు. ‘‘ప్రభుత్వం మెట్టు దిగకపోతే.. మా శవాలపై ప్రాజెక్టు కట్టాల్సి వస్తుంది. ఇప్పటివరకు 10 కుటుంబాలకు చెందిన భూముల రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగింది. అది కూడా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు తీసుకున్నట్టు కాకుండా.. ఆర్డీవో పేరున రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రికార్డులు సరిగా లేని వారి భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు’’ అని అన్నారు. ఎకరాకు రూ.60 వేలా? 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రజలు ఆమోదం తెలిపితేనే భూసేకరణ జరపాలని, దానిక్కూడా 75 శాతం పరిహారం ఇచ్చి, ఆయకట్టు కింద కనీసం ఎకరం భూమిని ఇవ్వాల్సి ఉంటుందని జేఏసీ కన్వీనర్ భాస్కర్ అన్నారు. రైతులు తమ వ్యక్తిగత కారణాలతో భూములమ్ముకుంటున్నట్టు రాయించుకుంటున్నారన్నారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించి, భూములు లాక్కుంటున్నారని చెప్పారు. మార్కెట్ విలువ రూ.5 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటే మంత్రి మాత్రం ఎకరానికి 60 వేలు మాత్రమే ఉందంటూ అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా వివిధ ముంపు గ్రామాల్లోని ప్రజలు గతంలో రూ.5 లక్షలు, రూ.6 లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రాలను చూపించారు. మరో ముంపు గ్రామం వేముల గట్టుకు చె ందిన శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ ఊళ్లో ఏనాడూ కరువు రాలేదని, ఈ ఏడాది గ్రామస్తులు 500 ఎకరాల వరి పంటను కోసారని వివరించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ఊరికి వచ్చి ప్రజలతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. మరో ముంపు గ్రామమైన పల్లెపాడుకు చెందిన పరిపూర్ణాచారి మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ విధ్వంసంతో తామంతా అడ్డాకూలీలుగా మారాల్సి వస్తుందన్నారు. పుట్టి పెరిగిన తమ ఊళ్లోకి వచ్చి పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ అశోక్ అనే బాధితుడు విలపించారు. భూమికి భూమి ఇవ్వండి తెలంగాణని సస్యశ్యామలం చేయాలనుకోవడంలో తప్పులేదని, ప్రాజెక్టులకు ఎవ్వరం వ్యతిరేకం కాదని కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. అయితే 2013 చట్టం ప్రకారం భూమికి భూమి యివ్వాలని, ఆయకట్టు కింద కనీసం ఒక ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి కోసం సేకరించిన భూమికి కట్టిన విలువనే ఈ భూములకూ ఇవ్వాలన్నారు. 50 టీఎంసీలతో అక్కడ ప్రాజెక్టు అవసరం లేదని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సమైక్యాంధ్ర శక్తుల మాదిరే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దళిత బహుజన ఫ్రంట్ నాయకుడు శంకర్ మండిపడ్డారు. సీపీఎం నాయకుడు సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయిత్రి విమల, సామాజిక కార్యకర్త సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హెచ్ఆర్సీకి ఫిర్యాదు తమ భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలివేసేలా చర్యలు తీసుకోవాలని సోమవారం మల్లన్న సాగర్ రిజర్వాయర్ బాధితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుంటున్నారని ఆరోపించారు. తమ భూములు, ఊళ్లు, ఇళ్లను కాపాడాలని ఫిర్యాదు చేసినట్లు వారు వివరించారు. -
ఉద్యోగాల పేరిట వ్యభిచారం రొంపిలోకి...
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని కేంద్రంగా సాగుతున్న మహిళల అక్రమ రవాణా మరోసారి వెలుగులోకి వచ్చింది. బెంగళూరు వ్యభిచారం గృహం నుంచి తప్పించుకుని వచ్చిన ఓ మహిళ... మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాపై గోల్కొండ ప్రాంతానికి చెందిన అజురా బేగం మంగళవారం ఫిర్యాదు చేసింది. దుబాయ్ లో ఉద్యోగం పేరుతో ఆమెను వారం క్రితం బెంగళూరులోని వ్యభిచార గృహానికి తరలించారు. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి ఆమె హెచ్చార్సీని ఆశ్రయించింది. తనతో పాటు వ్యభిచారం కూపంలో మగ్గుతున్న మరో 20 మందిని రక్షించాలని హెచ్చార్సీని ఆమె కోరింది. -
వివాదాస్పదమవుతున్న ‘ఖాకీ’లు
బెల్లంపల్లి : బెల్లంపల్లి ప్రాంతంలో కొందరు పోలీసుల వ్యవహార శైలి వివాదాలకు దారితీస్తోంది. ప్రజలతో సఖ్యత గా మెలిగి శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ కారణంగా పోలీ సు, ప్రజల మధ్య సంబంధాలు దూరమవుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో బెల్లంపల్లిలో మూడు సంఘటన లు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇవీ సంఘటనలు 1. బెల్లంపల్లికి చెందిన న్యాయవాది ఆరకొండ శేఖర్‌ను ఓ స్వల్ప సంఘటనలో పోలీసు ఉన్నతాధికారులు చితకబాదడం వివాదాస్పదమైంది. గత నెల 23వ తేదీన జరిగిన ఆ ఘటనలో బాధ్యులైన బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ , కాసిపేట ఎస్సై, గన్‌మెన్ , కానిస్టేబుల్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి న్యాయవాదులు వారం రోజుల నుంచి సామూహికంగా విధులను బహిష్కరించి ఆందోళనబాట పట్టారు. పోలీసు అధికారులపై రాష్ట్ర మానవ హక్కుల కమీషన్, ఎస్సీ, ఎస్టీ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. కోర్టులో ప్రైవేట్ కేసు కూడా పెట్టారు. 2. న్యాయవాదిపై దాడి ఘటన మర్చిపోకముందే దసరా పర్వదినం రోజు పాతబస్టాండ్ వద్ద వాహనాల క్రమబద్ధీకరణ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ఏరియాకు చెందిన పి.ధీరజ్‌కుమార్ అనే యువకుడిపై జులుం ప్రదర్శించి పరుషపదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా టేకులబస్తీలోని ఓ ఇంటి వద్ద నిలిపి ఉంచిన తన వాహనం అద్దాలను సదరు కానిస్టేబుళ్లు పగలగొట్టినట్లు ధీరజ్‌కుమార్ బెల్లంపల్లి డీఎస్పీ కె.ఈశ్వర్రావుకు ఈ నెల 5వ తేదీ రాత్రి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 3. ఇక తాజాగా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఓ యువతితో సాగించిన వ్యభిచారం గుట్టు రట్టయింది. జననివాసాల మధ్య తన క్వార్టర్లో పట్టపగలు ఓ యువతిని తీసుకువచ్చి వ్యభిచారం చేస్తుండగా చుట్టుపక్కల వారు పట్టుకునే లోపే సదరు కానిస్టేబుల్, యువతి ఇంటి వెనుక వైపు నుంచి గోడ దూకి పారిపోయారు. ఈ ఘటన పోలీసుల పరువుకు మచ్చగా మిగిలింది. ఇలా పక్షం రోజుల్లో మూడు సంఘటనలు జరగడం ప్రజల్లో చర్చకు దారితీసింది. మారని ఖాకీమార్క్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో సంస్కరణలు చేపట్టిన కొందరు ఖాకీల్లో మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై ప్రజాభి ప్రాయ సేకరణ నిర్వహిస్తూనే మరో పక్క దూకుడుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎలా వ్యవహరించాలి, ప్రజలతో ఏ విధంగా నడుచుకోవాలి, నేరాల అదుపులో ప్రజల సహకారం తదితర అంశాలపై పోలీసులు అభిప్రాయ సేకరణ నిర్వహించడంపై ప్రజల్లో ఒకింత సానుకూల దృక్పథం ఏర్పడింది. పోలీసులలో మార్పు వస్తుందని ప్రజలు భావించిన క్రమంలోనే అనూహ్యంగా జరిగిన సంఘటనలు ఖాకీ మార్క్‌ను గుర్తు చేస్తున్నాయి. యాదృచ్ఛికంగా ఏదేని సంఘటన జరి గితే వెంటనే స్పందించి సామరస్యపూర్వకంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులు ఆ దిశగా యత్నాలు చేయకపోవడంతో స్వల్ప సంఘటనలు కూడా పెద్దవి గా మారుతున్నాయి. పోలీసు శాఖపై ప్రజలకున్న అపోహలు, అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికైనా నూతన సంస్కరణలకు అనుగుణంగా పోలీసు అధికారులు ప్రజలపై సత్సంబంధాలు కలిగి ఉండి శాంతిభద్రతలు పర్యవేక్షించాలని పలువురు కోరుతున్నారు.