state song
-
తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్ హారిక నారాయణ్ (ఫోటోలు)
-
తెలంగాణ రాష్ట్ర గేయం.. ఇప్పుడే ఎందుకు వివాదమైంది?
తెలంగాణ రాష్ట్ర గేయంపై కొత్తగా వివాదం ఎందుకు వచ్చింది? గతంలో లేని వివాదం ఇప్పుడే ఎందుకు వివాదమైంది? రాష్ట్ర గేయం రూపకల్పనలో గులాబీ పార్టీకి ఉన్న అభ్యంతరం ఏంటి? ఇందులో కాంగ్రెస్ సర్కార్ పాత్ర ఎంతవరకు ఉంది? పాటకు సంగీతం సమకూరుస్తున్న వ్యక్తే వివాదానికి కేంద్ర బిందువుగా మారారా? దీనిపై బీఆర్ఎస్ ఏమంటోంది? ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతోంది. దశాబ్ది ఉత్సవాలు చేసుకుకోవాల్సిన సమయంలో కొత్త వివాదాలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర చిహ్నంలో మార్పులు, రాష్ట్ర గేయం రూపకల్పనపైన ప్రధాన విపక్షం నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కారు, హస్తం పార్టీల మధ్య తెలంగాణ గేయం ఇరుక్కుంది. రాష్ట్ర గేయం అంశం పదేళ్లలో ఎన్నడూ చర్చనీయాంశం కాలేదు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గేయం అంశాన్ని మళ్ళీ తెరమీదకు తీసుకుని వచ్చింది. అందులో మార్పులు చేసి గేయాన్ని సరికొత్తగా ఆవిష్కరించాలని నిర్ణయించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆలోచన బాగానే ఉన్నా.. పాట రచయిత అందే శ్రీ తో ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, పాటకు సంగీతం సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించటంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.తెలంగాణ ఆత్మ గౌరవ అంశాన్ని తెలంగాణేతరులకు అప్పగించటం పట్ల గులాబీ పార్టీ నేతలు మండి పడుతున్నారు. సంగీత దర్శకులు, గాయకుల్లో తెలంగాణ బిడ్డలు చాలామంది ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని బీ ఆర్ ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గేయానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టేందుకే గులాబీ పార్టీ నాయకత్వం నిర్ణయించుకుంది.ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కూడా చూస్తోంది. రాష్ట్ర కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దనిబీఆర్‌ఎస్ అనుకుంటోంది. ఇది చిలికి చిలికి గాలి వానలా మారుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనతో చల్లగా వివాదం నుంచి తప్పుకున్నారు. తెలంగాణ గేయ రచన, సంగీతం సమకూర్చే పనిని కీరవాణికి అప్పగించే విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని ఇదంతా అందే శ్రీ చూస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి అనుమతి లేకుండానే అందెశ్రీ నిర్ణయాలు తీసుకుంటారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. అదేవిధంగా తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్లను తొలగించాలన్ని నిర్ణయాన్ని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. తెలంగాణ వారసత్వానికి, పోరాటాలకు చిహ్నాలుగా ఉన్నవాటిని ఎలా తొలగిస్తారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యతను తెలంగాణేతరులకు ఇవ్వడానికి వీల్లేదని గులాబీ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. మరి ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. -
‘మా తెలుగు తల్లికి’ 80 ఏళ్ళు!
తెలుగు వారి గొప్పతనాన్ని వర్ణించిన గీతాలలో ‘మా తెలుగు తల్లి’ గీతం ఒకటి. దీన్ని శంకరంబాడి సుందరాచారి రాశారు. ఆయన 1914 ఆగస్ట్ 10న జన్మించారు. 1942లో ‘దీనబంధు’ సినిమాకి తెలుగుతల్లి గీతాన్ని రాశారు. చిత్ర దర్శకుడు ఎం.ఎల్. టాండన్ సుందరాచారి రాసిన గీతాన్ని మెచ్చుకుంటూనే, తెలుగుతల్లి గీతం యుగళ గీతంగా ఉపయోగపడదని తెలిపారు. హెచ్.ఎం.వి. కంపెనీ సుందరాచారికి 116 రూపాయిలు ఇచ్చి ఈ పాటని కొని, టంగుటూరి సూర్య కుమారి చేత గానం చేయించింది. తొలుత ఈ పాటని కొన్ని పుస్తకాలలో దేవులపల్లి రాశారని ముద్రించారు. తరువాత తప్పు తెలుసుకొని శంకరంబాడి సుందరాచారి పేరు ముద్రించారు. ఇప్పటికీ ఈ పాట ప్రజల్లోకి వెళ్లినంతగా ఆయన పేరు వెళ్ళలేదు. 1975లో మా తెలుగుతల్లి పాటని అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ప్రకటించారు. ఆయన తెలుగుతల్లికి సమర్పించిన మల్లెపూలు ఎప్పటికీ వాడి పోనివి. ఆయన జీవిత చరిత్రను ఆయన స్నేహితుడు వై.కె.వి.ఎన్. ఆచార్య రచించారు. 2020లో వి.జి ఎస్. ప్రచురణ సంస్థ పిల్లల కోసం సుందరాచారిపై మరో పుస్తకాన్ని వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత తెలుగుతల్లి గీతం నవ్యాంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం అయింది. తెలుగు వారి వైభవాన్ని వర్ణించిన గీతమిది. ఈ గీత స్పూర్తితో తెలుగు వారు తమ ఉనికిని మరోసారి గట్టిగా చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుందరాచారి తనకంటూ ఏమీ దాచుకోలేదు. ఆయన సన్నిహితులే ఆయనను మోసగించారు. 1977 ఏప్రిల్ 8న ఆయన తుదిశ్వాస విడిచారు. – ఎం. రాం ప్రదీప్, తిరువూరు (‘మా తెలుగు తల్లి’ గీతానికి 80 ఏళ్ళు) -
తమిళనాడు రాష్ట్ర గీతంగా తమిళ్ తాయ్ వాళ్తు
తమిళ తల్లిని కీర్తిస్తూ రాసిన ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో జరిగే కార్యక్రమాల్లో తప్పని సరిగా ఆలపించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలపించే సమయంలో అందరూ నిల్చొని, గౌరవాన్ని ప్రదర్శించాలని పేర్కొంది. అయితే దివ్యాంగులు నిలబడాల్సిన అవసరం లేదని తెలిపింది. సాక్షి, చెన్నై: మనోన్మనియం సుందరం పిల్లై రచించిన ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఈ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 55 నిమిషాల నిడివితో కూడిన ఈ గీతాన్ని రికార్డింగ్ రూపంలో కాకుండా శిక్షణ పొందిన వారి ద్వారా పాడించాలని సూచించింది. అలాగే ఈ గీతం ఆలపించే సమయంలో అందరూ తప్పనిసరిగా లేచి నిలబడాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే దివ్యాంగులకు మాత్రం మినహాయింపు కల్పించారు. అన్ని విద్యా సంస్థలు, వర్శిటీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రతి రోజూ తప్పనిసరిగా తమిళ తల్లి గీతం ఆలపించే విధంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేడు ప్రాణ రక్షణ పథకానికి శ్రీకారం ప్రమాదాల బారిన పడ్డ వారికి తక్షణ వైద్య సేవల నిమిత్తం ప్రాణ రక్షణ పథకానికి ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం చెంగల్పట్టు జిల్లా మేల్ మరువత్తూరులో జరిగే కార్యక్రమంలో ఈ పథకానికి సీఎం ఎంకే స్టాలిన్ శ్రీకారం చుట్టనున్నారు. అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వం, ప్రైవేటు సహకారంతో ఈ పథకం అమలు చేయనున్నారు. ఇందు కోసం ప్రభుత్వం ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగిన పక్షంలో క్షతగాత్రులను ఎవరైనా సమీపంలోని ఆస్పత్రులకు తరలించవచ్చు. సకాలంలో వైద్య సేవలందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఇదిలా ఉండగా చెన్నైలోని దివంగత మాజీ సీఎం కరుణానిధి హయాంలో 58 ఎకరాల్లో అడయార్‌లో తోల్కాప్పియా పూంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పదేళ్లుగా ఈ పార్కును అన్నాడీఎంకే పాలకులు పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం పరిశీలించారు. పనులు త్వరితగతిన ముగించాలని ఆదేశించారు. -
రాష్ట్ర గేయం లేకుండానే పాఠ్య పుస్తకాల ముద్రణ!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 నెలలైనా ఖరారు చేయని ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్రం లో వచ్చే విద్యా సంవత్సరంలో (2015-16) విద్యార్థులకు ఇవ్వనున్న పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గేయం ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు రాష్ట్ర గేయాన్ని ఖరారు చేయకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే 61 లక్షలమంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు 2.5 కోట్ల పుస్తకాలు అవసరం. ఇందులో తెలుగు పాఠ్య పుస్తకాలు 61 లక్షలు ఉంటాయి. విద్యాశాఖ రాష్ట్ర గేయం లేకుండానే పుస్తకాల ముద్రణకు ఏర్పాట్లు చేసింది. ‘మా తెలుగుతల్లికి’ తొలగింపు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు పాఠ్య పుస్తకాల్లో జాతీయ గీతంతోపాటు రాష్ట్ర గేయంగా పెట్టిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ గేయాన్ని తెలుగు పాఠ్య పుస్తకాల నుంచి తొలగించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర గేయం వివిధ గేయాలను పరిశీలించారు. అంద్శైరాసిన ‘జయజయహే తెలంగాణ జననీ జనకేతనం..’ గేయాన్ని రాష్ట్ర గేయంగా చేస్తే బాగుంటుందని భావించారు. సీఎం కేసీఆర్ కూడా ఆ గేయానికి కొన్ని మార్పులు చేస్తున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడలేదు. విద్యాశాఖ రాష్ట్ర గేయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం పరిశీలనలోనే ఉందన్న సమాధానం రావడంతో మిన్నకుండిపోయారు. పుస్తకాల ముద్రణ ప్రారంభించాల్సి రావడంతో ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయాన్ని తొలగించి ముద్రణ ప్రారంభించినట్లు తెలిసింది. -
రాష్ట్ర గీతం మరిచిన ఉపాధ్యాయులు
ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్ర గీతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆలపించేలా ప్రభుత్వం, విద్యాశాఖ ఆదేశించినా మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గీతాలపనను ఉపాధ్యాయులు విస్మరించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం స్థానిక జెడ్పీఎస్‌ఎస్‌లో మండలంలోని ఉపాధ్యాయులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడైంది. గతంలో ఉన్న ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అనే గీతానికి బదులు ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించాలని సంబంధిత అధికారులు ఉపాధ్యాయులకు ఆదేశాలు అందాయి. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా ఆయా పాఠశాలల్లో విద్యార్థులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గీతాన్నే ఆలపిస్తున్నారని సమావేశంలో మానిటరింగ్ కమిటీ సభ్యులు వెల్లడించారు. తగ్గుతున్న విద్యాప్రమాణాలు.. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు కనీస స్థాయిలో కూడా లేరని మానిటరింగ్ కమిటీ సభ్యులు వివరించారు. ఓ పాఠశాలల్లో 22 మంది విద్యార్థులకు గాను 8 మంది మాత్రమే హాజరయ్యారని, ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక అటెండర్, మధ్యాహ్న భోజన కార్మికురాలు, వారిపై ఎప్పటికప్పుడు ఉన్నత, మండలస్థాయి అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుందని వివరించారు. పలుచోట్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ కొరవడిందని వివరించారు. టీఎల్ఎంలు ఉపయోగించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటరమణరెడ్డి, సీపీపీలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, టీం సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 32 అంశాలపై అధ్యయనం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 32 అంశాలపై మానిటరింగ్ చేయాలని గత నెల 29 నుంచి 31వరకు 12 వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులతో కూడిన 12 బృందాలు వెళ్లాయి. వీరు ప్రధానంగా ఉదయం ప్రార్థన సమయానికి హాజరవుతారు. ముందుగా జాతీయ గీతం, రాష్ట్ర గీతం, ప్రతిజ్ఞ, సూక్తి, వార్తలు, నేటి వార్త, ప్రధానోపాధ్యాయుడి సందేశం వరకు గమనించాల్సి ఉంటుంది. పాఠశాలలో విద్యార్థుల స్థాయి, మౌలిక సౌకర్యాలు, యూనిఫాంల పంపిణీ ఫాంల పంపిణీ, గత, ఈ , ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగిందా తగ్గిందా, విద్యాబోధన, పాత పద్ధతా లేక కొత్త పద్ధతా పరిశీలించడం, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ విధానం, ప్రగతి, పరీక్షల నిర్వహణ, ఎస్ఎంసీ సమావేశాల నిర్వహణ తదితర 32 అంశాలపై కూలంకశంగా మూడు రోజులు పరిశీలించాల్సి ఉంటుంది.