stole
-
నమ్మి ఉద్యోగమిచ్చిన కంపెనీకే కన్నం.. కొట్టేసిన కోట్లతో...
Facebook former executive fraud: టాప్ కంపెనీలో ఉద్యోగం.. అది కూడా టాప్ పొజిషన్.. మంచి జీతం.. అయినా ఆమె బుద్ధి గడ్డి తినింది. జల్సాలు, లగ్జరీ లైఫ్ కోసం నమ్మి ఉద్యోగమిచ్చిన కంపెనీకే కన్నమేసింది. ఏకంగా రూ.33 కోట్లకు పైగా కొట్టేసింది. ఫేస్బుక్లో డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ విభాగానికి గ్లోబల్ హెడ్‌గా పని చేసిన అర్బరా ఫర్లో స్మైల్స్ అనే 38 ఏళ్ల మహిళ నకిలీ విక్రేతలు, కల్పిత ఛార్జీలు, క్యాష్ కిక్‌బ్యాక్‌ల ద్వారా కంపెనీ నుంచి 4 మిలియన్లకు పైగా (సుమారు రూ. 33 కోట్లు) కొట్టేసినట్లు అంగీకరించింది. కంపెనీలో 2017 నుంచి 2021 సంవత్సరాల కాలంలో కాజేసిన ఈ డబ్బును ఆమె కాలిఫోర్నియా, జార్జియాలో విలాసవంతమైన జీవనం కోసం ఖర్చు చేసింది. మోసం చేసిందిలాగే.. డబ్బును కాజేసేందుకు ఫర్లో స్మైల్స్ కంపెనీ ఖర్చు ఖాతా వ్యవస్థనే మార్చేసింది. పేపాల్, వెన్మో, క్యాష్ యాప్ వంటి చెల్లింపు సేవలకు తన కార్పొరేట్ క్రెడిట్ కార్డులు లింక్ చేసుకుంది. వీటి ద్వారా స్నేహితులు, బంధువులు, తెలిసినవారికి సంబంధించిన చెల్లింపులకు కంపెనీ సొమ్మును వినియోగించేది. తర్వాత వారి దగ్గర నుంచి కొంత డబ్బును తీసుకునేది. ఈ సొమ్మును నేరుగా, ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ లేదా మెయిల్ ద్వారా, కొన్నిసార్లు టీ షర్టుల వంటి వాటిలో దాచి ఆమెకు ఇచ్చేవారని ఈ కేసును డీల్ చేస్తున్న న్యాయవాదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదీ చదవండి: CEOs Secret WhatsApp chat: ‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్ ఖర్చు చేసింది వీటికే.. ఫేస్‌బుక్‌ను మోసం చేసి కాజేసిన సొమ్మును ఫర్లో స్మైల్స్ విలాసాలకు వినియోగించేది. హెయిర్ స్టైలిస్ట్‌లు, బేబీ సిట్టర్లకు భారీగా ఖర్చు పెట్టేదని తెలిసింది. పిల్లల ప్రీస్కూల్ ట్యూషన్ ఫీజుకే ఆమె 18,000 డాలర్లు (రూ.14 లక్షలకు పైగా) ఖర్చు చేయడం గమనార్హం. నేరాన్ని బార్బరా ఫర్లో స్మైల్స్ అంగీకరించింది. దీంతో ఆమెకు వచ్చే ఏడాది మార్చి 19న శిక్ష విధించనున్నారు. అప్పటి వరకు ఆమె 5,000 డాలర్లు (రూ.4.15లక్షలు) బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. -
తెలంగాణ, ఏపీల్లో కొట్టేసిన బైక్ ఎక్కడికి వెళ్తున్నాయంటే..!
జయపురం: అంతర్ రాష్ట్ర బైక్ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జయపురం సబ్ డవిజనల్ పోలీసు అధికారి హరీష్ బి.సి స్థానిక పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరుచుగా బైక్‌లు దొంగలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టు చేయబడినవారు జయపురం విక్రమనగర్ లాల్సాహి గ్రామానికి చెందిన ఎల్.అఖిల్ ఉరఫ్ ఉదయ్(22), బొయిపరిగుడ సమితి దసమంతపూర్కు చెందిన కృష్ణ నాయిక్ (19)లుగా వెల్లడించారు. వారిద్దరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచామని, అలాగే నవరంగపూర్ జిల్లా కొడింగ సమితి చొటాహండికి చెందిన పద్మణ హరిజన్ ఉరఫ్ గులెట్(25)ని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నామని వెల్లడించారు. నిందితుల నుంచి 11 మోటారు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముఠాలో ఇకెంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఇలా పట్టుబడ్డారు జయపురం పవర్ హౌస్ కాలనీలో ఉంటున్న జి.గణేష్ తన బైక్ దొంగిలించబడిందని ఫిర్యాదు చేశాడు. ఆ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నట్లు తెలిసిందని ఆయన తెలియజేశారు. పోలీసులు నిందితులు దొంగిలించిన బైక్‌ను వెంబడించి గాంధీ కూడలి వద్ద పట్టుకున్నారు. వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా తాము అనేక బైక్‌లు దొంగిలించి నవరంగపూర్ జిల్లా కొడింగ సమితి ఛొటాహండి గ్రామంలో పద్మన్ హరిజన్‌కు అమ్మినట్లు తెలియజేశారు. అనంతరం పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ మహంతి బెహర, ఏఎస్ఐ విష్ణు మడకామిలతో ఒక టీమ్ ఏర్పాటు చేశారు. కొడింగ పోలీసుల సహకారంతో చొటాహండి గ్రామంలో దాడి నిర్వహించగా, ఆ సమయంలో పద్మన్ 10 బైక్‌లు అమ్మేందుకు పెట్టాడని తెలిపారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న బైక్‌లలో జయపురం పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగలించబడిన 4 బైక్‌లు, కొరాపుట్ పట్టణం, జయపురం సదర్, కుంధ్రా పోలీసుస్టేషన్ల పరిధిలో ఒక్కొక్క బైక్‌లు కాగా, రెండు బైక్‌లు ఛత్తిష్‌ఘడ్ రాష్ట్ర జగదల్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలోనివి. అలాగే బెలడిల్లా పోలీసుస్టేషన్ పరిధిలో ఒకటి కాగా, తెలంగాణ రాష్ట్రం నల్గొండ పోలీసుస్టేషన్ పరిధిలో ఒక బైక్ దొంగిలించబడిందని వివరించారు. టార్గెట్ తెలంగాణ, ఏపీ ఒడిషాలోని ఈ దొంగల బ్యాచ్ ప్రధానంగా చిన్న పట్టణాలను టార్గెట్ చేస్తోంది. పెద్దగా హడావిడి లేకుండా.. తమ పని తాము చేసుకుపోతుంది. సిసి సర్వైలెన్స్ పెద్దగా లేని చోట.. బైక్ లను క్షణాల్లో మాయం చేయడం వీరి విధానం. ఎంతగా తాళాలు వేసినా.. వీరికున్న నైపుణ్యంతో సులభంగా అన్ లాక్ చేస్తారు. అదేవిధంగా నంబరు లేని ఒక బైక్ సైతం వారి నుంచి సీజ్ చేసినట్లు వెల్లడించారు. బైక్‌ల యజమానులు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి వారి బైక్‌లను తీసుకెళ్లవచ్చని తెలియజేశారు. సమావేశంలో జయపురం పట్టణ పోలీసు అధికారి సంబిత్ కుమార్ బెహర, ఎస్ఐ సంజయ కుమార్ మహంతి, సిద్ధార్ధ కుమార్ బెహరలు పాల్గొన్నారు. -
మంకీ హెయిస్ట్.. డబ్బుల బ్యాగ్‌ను భలేగా కొట్టేసింది
-
ఒక్క దెబ్బకి ఆ కోతి లక్షాధికారి అయ్యింది!
Monkey Stole Money Viral రాత్రికి రాత్రే నసీబ్ మార్చుకుని కోటీశ్వరులైన మనుషుల కథల్ని విని ఉంటాం. కానీ, ఓ కోతి పట్టపగలే.. అదీ అడ్డదారిలో కొన్ని గంటలపాటు లక్షాధికారిగా మారిపోయిందట. ఇది సోషల్ మీడియాలో పేలుతున్న జోక్ మాత్రమే. ఉత్తర ప్రదేశ్ షాహాబాద్‌లో జరిగిన ఓ సరదా ఘటన.. ఓ వ్యక్తిని కాసేపు ఆగమాగం చేసింది. ఓ కోతి లక్షా యాభై వేల నగదు ఉన్న సంచిని ఓ మోటర్ సైకిల్ నుంచి ఎత్తుకెళ్లింది. షరాఫత్ హుస్సేన్ అనే వ్యక్తి సేల్ డీడ్ కోసం నగదుతో రిజిస్ట్రీ ఆఫీస్ వచ్చాడు. ఆ సమయంలో ఓ కోతి అక్కడికి వచ్చింది. పార్కింగ్‌లో ఉన్న ఒక్కో బ్యాగ్‌ను వెతుక్కుంటూ ముందుకెళ్లింది. అయితే.. దాని కన్ను డబ్బులున్న షరాఫత్ బ్యాగ్ మీదే పడింది. అంతే.. నైస్‌గా దానిని ఎత్తుకెళ్లింది. కాసేపటికి బండి దగ్గరకు వచ్చిన ఆయన డబ్బు లేకపోయేసరికి దొంగతనం జరిగిందేమో అనుకుని లబోదిబోమన్నాడు. ఈలోపు కొందరు బ్యాగ్ కోతి ఎత్తుకెళ్లిందని చెప్పడంతో దాని కోసం వెతికారు. అది కాస్త దగ్గర్లోని ఓచెట్టుపై నిమ్మలంగా కూర్చుని ఉంది. చాలాసేపు ప్రయత్నించాకే.. అది ఆ బ్యాగ్‌ను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో షరాఫత్ ఊపిరి పీల్చుకున్నాడు. -
432 ఖరీదైన సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లిన దొంగలు
-
‘గగన్ తన భార్య నగలు దొంగిలించాడు’
ప్రముఖ బాలీవుడ్ టీవీ నటి దివ్యా భట్నాగర్ కరోనాతో పోరాడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అతి పిన్న వయసులోనే ఆమె కన్నుమూయడం విచారకరం. ఇక ఏడాది క్రితం దివ్యా భట్నాగర్.. తన తల్లిదండ్రులు, స్నేహితులకు ఇష్టం లేకుండా గగన్ గబ్రూ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా భర్తతో కలిసి ఉంటున్నారు. అయితే దివ్యకు కోవిడ్ సోకడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దివ్యా భట్నాగర్ బెస్ట్ ఫ్రెండ్ దేవోలీనా భట్టాచార్జీ గగన్పై సంచలన ఆరోపణలు చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. దివ్య భర్త గగన్ సరైన వ్యక్తి కాదని.. డబ్బు కోసమే ఆమెని వివాహం చేసుకున్నాడని దేవోలీనా ఆరోపించారు. (చదవండి: నన్ను, నా ఫ్యామిలీని చంపేస్తామంటున్నారు) దేవోలీనా మాట్లాడుతూ.. ‘కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఇష్టం లేకుండా దివ్య, గగన్ని వివాహం చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఆమె మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తోంది. గగన్, దివ్యని కొట్టేవాడు. తన బంగారాన్ని దొంగిలించాడు. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి షిమ్లా పోలీస్ స్టేషన్లో అతడిపై కేసు కూడా నమోదయ్యింది. ఆరు నెలలు తన సొంత ఊరిలో జైలులో గడిపాడు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతునే ఉంది. దివ్య చాలా భావోద్వేగాలు గల వ్యక్తి. ఆ విషయం గ్రహించే అతడు ఆమెని ఆకర్షించాడు. పెళ్లి చేసుకునేలా ఒప్పించాడు. తన నిర్ణయం గురించి ఆమెకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా తొందరపెట్టాడు. ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, స్నేహితులు అందరూ గగన్ని వివాహం చేసుకోవద్దని దివ్యని హెచ్చరించారు. కానీ ఆమె వారి మాటలను సీరియస్‌గా తీసుకోలేదు’ అంటూ దేవోలినా ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఆ రోజు రానే వచ్చింది) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) గగన్ గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు దేవోలీనా. ఇక దివ్య ‘ఏ రిషిత క్యా కెహలాతా హై’, ‘సంస్కార్’, ‘ఉడాన్’, ‘జీత్ గయి తొహ్ పియా మోర్రే’ వంటి సిరీయల్స్‌లో నటించారు. -
దారుణం.. బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడని
డెహ్రాడూన్ : బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడనే నెపంతో తోటి విద్యార్థిపై దాడి చేసి చంపేశారు సీనియర్ విద్యార్థులు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు యాజమాన్యం చనిపోయిన బాలుని మృతదేహాన్ని ఖననం చేసింది. రెండు వారాల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. డెహ్రాడూన్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను ఔటింగ్‌కు తీసుకుని వెళ్లాలని నిర్ణయించింది. అదే సమయంలో వాసు యాదవ్(12) అనే బాలుడు ఓ దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడని షాపు యజమాని ఆరోపించాడు. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చాడు. దాంతో విద్యార్థులు ఎవరూ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లొద్దని యాజమాన్యం ఆదేశించింది. ఔటింగ్ క్యాన్సిల్ కావడంతో వాసు యాదవ్ మీద సీనియర్ విద్యార్థులు కోపం పెంచుకున్నారు. క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో వాసు యాదవ్‌ను చావబాదారు. ఆ తర్వాత అతడిని చిత్రహింసలు పెట్టి శరీరం మీద చన్నీళ్లు పోశారు. అంతే కాదు, అతడిని కొన్ని గంటల పాటు క్లాస్ రూమ్‌లోనే వదిలేసి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత బాలుడిని వార్డెన్ గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వాసును ఆస్పత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. ఈ విషయం బయటకు పొక్కితే పాఠశాలకే ప్రమాదం అని భావించిన యాజమాన్యం.. గుట్టు చప్పుడు కాకుండా వాసు మృతదేహాన్ని ఖననం చేశారు. కానీ ఈ వార్త బయటకు రావడంతో సమాచారం రాబట్టేందుకు లోకల్ మీడియా ప్రయత్నించింది. కానీ పాఠశాల యాజమాన్యం వారిని పాఠశాల లోనికి అనుమతించలేదు. చివరకు ఈ విషయం గురించి ఓ ఆంగ్ల పత్రికలో రావడంతో పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని విచారణ చేశారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. తీవ్రంగా గాపడిన వాసును సకాలంలో ఆస్పత్రికి తరలించలేదు. అంతేకాక వాసు చనిపోయినట్లు అతని తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేద’ని తెలిపారు. -
అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీకి యత్నించిన ఎస్సై
-
దొంగ.. పోలీస్!
► అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీకి యత్నించిన ఎస్సై ► అదే సమయంలో ఇంటి యజమాని ► రావడంతో పట్టుబడిన వైనం ► అరెస్టు చేసిన పోలీసులు.. ► అల్మాస్‌గూడలో ఘటన ► 2009లో ఎస్సైగా ఎంపికైన మహేందర్‌రెడ్డి ► ఉగ్రవాది వికారుద్దీన్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌లో సభ్యుడు కూడా.. హైదరాబాద్: అతనో పోలీస్.. దొంగలను పట్టుకోవడమేమోగానీ తానే దొంగగా మారాడు. అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేని ఓ ఇంట్లో చొరబడ్డాడు. అందినకాడికి దోచుకెళదామనుకున్నాడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు. ఇతను ఓ ఎస్సై.. పేరు మహేందర్‌రెడ్డి. ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ఈ ఎస్సై సభ్యుడు కూడా. కానీ చోరీకి ప్రయత్నించి దొరికిపోయాడు. హైదరాబాద్‌లో మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అల్మాస్‌గూడలోని శ్రీశ్రీహోమ్స్‌లో నివాసం ఉంటున్న శివప్రసాద్ దసరా పండుగ కోసం తమ స్వస్థలం కరీంనగర్‌కు వెళ్లారు. తిరిగి గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత అల్మాస్‌గూడలోని తన ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇంటి తాళం పగలగొట్టి ఉంది. సందేహం వచ్చిన శివప్రసాద్.. 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వెంటనే మీర్పేట్ సీఐ రంగస్వామి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారు ఇంట్లోకి వెళ్లి మెల్లగా పరిశీలించడం మొదలుపెట్టగా.. మహేందర్‌రెడ్డి ఇంట్లో తాపీగా తిరుగుతూ కనిపించాడు. దీంతో అతడిని పట్టుకుని ప్రశ్నించారు. తొలుత మహేందర్‌రెడ్డి పొంతన లేని సమాధానాలు చెప్పాడు. తాను గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారినని బుకారుుంచాడు. మరి అర్ధరాత్రి ఈ ఇంట్లో ఏం పని అని నిలదీస్తే ఇష్టం వచ్చిన సమాధానాలు చెప్పాడు. దీంతో అతడిని అరెస్టు చేసి.. చోరీకి ప్రయత్నించినట్లుగా కేసు నమోదు చేసినట్లు మీర్పేట్ సీఐ రంగస్వామి తెలిపారు. పోలీసులు మహేందర్‌రెడ్డి గురించి ఆరా తీయగా .. అతను ఎస్సై అని తేలింది. గుర్రంగూడకు చెందిన మహేందర్‌రెడ్డి 2009లో ఎస్సైగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఎస్సై చోరీకి దిగిన ఇల్లు ఇదే.. -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలన దర్యాప్తు చేపట్టిన పోలీసులు టేకులపల్లి : ఏటీఎంలో డబ్బులు చోరీ చేసేందుకు ఓ యువకుడు యత్నించిన సంఘటన మండల కేంద్రంలో గురువారం వెలుగుచూసింది. ఎస్సై తాటిపాముల సురేష్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్బీహెచ్ ఏటీఎం కేంద్రంలోకి ఓ యువకుడు గురువారం తెల్లవారుజామున ముఖానికి గుడ్డ కట్టుకుని.. రాడ్డు, కటింగ్ ప్లేయర్‌తో ప్రవేశించాడు. లోపల ఉన్న సీసీ కెమెరాను కిందకు వంచాడు. మరో కెమెరాను గమనించకుండానే రాడ్డుతో ఏటీఎం యంత్రం తలుపును ధ్వంసం చేసి.. డబ్బులు ఉన్న బాక్సును తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశాడు. డిజిటల్ లాక్‌ను బలవంతంగా తొలగించి.. దాని వైర్లను కటింగ్ ప్లేయర్‌తో కత్తిరించాడు. ఎంతకూ డబ్బులు బయటకు రాకపోవడంతో విసుగు చెంది వెళ్లిపోయాడు. ఉదయం 6 గంటలకు ఏటీఎం కేంద్రంలో ఊడ్చేందుకు వచ్చిన స్వీపర్ సోమయ్య విషయాన్ని గుర్తించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు. మేనేజర్ అమరేశ్, ఎస్సై సురేష్, ఏఎస్సై అజీజ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలించారు. బోడురోడ్డు సెంటర్, దాసుతండా, రేగులతండా, సింగ్యతండా మీదుగా లచ్చతండా వైపు దొంగ కోసం అన్వేషిస్తున్న క్రమంలో వర్షం కురవడంతో శునకంతో తనిఖీలు నిలిపివేశారు. బ్యాంకు మేనేజర్ సహాయంతో క్లూస్‌టీం, పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. -
నన్ను భయపెట్టినందుకు థాంక్స్!
''మెరుపు మెరిస్తే, వానకురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే'' అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా పిల్లలు పువ్వుల్లా ఎంతో సుకుమారంగా, సున్నితంగా ఉంటారు కదా! అలాంటి ఆ పసివాళ్లు భయపడితే..ఆ ప్రభావం వారి మనసులపై తీవ్ర ప్రభావాన్నే పడేస్తుంది. అలా తనకు, తమ కుటుంబానికి ఎదురైన ఓ భయంకరమైన అనుభవాన్ని తలుచుకుంటూ.. ఓ చిన్నారి తన ఆవేదనకు అక్షర రూపాన్నిచ్చింది. తమకు నచ్చిన వస్తువులను, బహుమతిగా వచ్చిన బొమ్మలను ఎంతో అపురూపంగా దాచుకుంటారు పిల్లలు. అంతగా అభిమానించినవి ఉన్నట్టుండి పోతే.. ఎంత బెంగపడతారు! తన బాధ తెలుసుకున్న తరువాతైనా మీరు మారండి అంటున్న ఆ చిన్నారి రాసిన బహిరంగ లేఖ కరుడుగట్టిన నేరస్తులను సైతం ఆలోచనలో పడేస్తుంది. ఈ ఉత్తరాన్ని యూకేకు చెందిన పారిస్ ముల్ హోలాండే (11) అనే చిన్నారి రాసింది. ''వాళ్లు మానవత్వం లేని మనుషులు.. నేను ఎంత బాధపడ్డానో.. నా మనసు ఎంత కష్టపడిందో వారికి తెలియజేయాలనే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇప్పటికైనా వాళ్లు పశ్చాత్తాప పడతారని ఆశిస్తున్నాను. నా బెడ్ మీద పడుకోవాలంటేనే భయంగా ఉంది. ఆ దుర్మార్గులు నా రూంలోకి వచ్చి నా వస్తువులన్నీ దోచుకెళ్లారు.. ఇది నన్ను చాలా భయపెట్టింది. ఇది ఎవరి రూం, ఎవరి వస్తువులు ఇవేవీ వారికి పట్టవు.. నాకు చాలాకాలంగా చీకటి అంటే భయం... దాన్ని అధిగమించాను. కానీ మీరు నా రూంలోకి వచ్చినప్పటి నుంచి భయం మళ్లీ నన్ను చుట్టుకుంది. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు.. అందుకే బాగా ఏడ్చాను.. దాదాపు రెండు గంటల పాటు అలా ఏడుస్తూనే ఉన్నాను. నా నోట మాటలు లేవు.. నాకెంతో ఇష్టమైన డిస్నీ బొమ్మ లెగోను ధ్వంసం చేశారు. మా ఫ్యామిలీ ఫొటో చూసిన తర్వాతైనా వారి మనసు మారలేదా? వాళ్లకు తెలుసు.. ఇది చిన్న పాప రూం అని.. అయినా ఈ పని చేశారు. నిజంగా నన్ను భయపెట్టినందుకు థాంక్స్...'' ఇలా సాగుతుంది ఆ చిన్నారి లేఖ. చివరగా.. ''తలుపులకు తాళాలు వేసుకోండి. మీ వస్తువులు కాపాడుకోండి. నాలాంటి అనుభవం మీకెవ్వరికీ ఎదురు కాకూడదు'' అంటూ అందరికీ జాగ్రత్తలు కూడా చెప్పింది. యూకేలోని సౌత్ యార్క్‌షైర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పారిస్ ఇంట్లోకి చొరబడిన దొంగలు విలువైన వస్తువులు, నగదును దోచుకెళ్లారు. వారం క్రితం ఆమె పుట్టినరోజు సందర్భంగా.. ఆమెకు వచ్చిన బహుమతులు కూడా చోరీకి గురయ్యాయి. వాళ్ల ఫ్యామిలీ ట్రిప్ ఫొటోలున్న ఐ ఫోన్‌ను కూడా ఎత్తుకెళ్లారు. దీంతో బెంగపడిన పారిస్.. ఈ ఉత్తరం రాయడం అక్కడి పోలీసు అధికారులను సైతం కదిలించింది. క్రిస్మస్ పండుగ బహుమతులు, పారిస్ పుట్టిన రోజు కానుకలతో పాటుగా, అమ్మమ్మ బంగారు వాచ్, లాప్ టాప్, ఐ ఫోన్ ఎత్తుకెళ్లారని పారిస్ తల్లి గెమ్మ(29) తెలిపారు. ఈ ఘటనతోతన పాప చాలా భయపడిపోయిందన్నారు. ఇలా ఉత్తర రాయడం ద్వారా ఆమెకు కొంత ఉపశమనాన్ని పొంది ఉంటుందన్నారు. ఈ ఘటన ఆ పాపపై తీవ్ర ప్రభావం చూపడం విచారకరమని సౌత్ యార్క్‌షైర్ పోలీస్ పీసీ ఆడమ్ వ్యాఖ్యానించారు. నేరస్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. -
ఆర్మీ వైద్యుడి కారు దొంగతనం
-
ఆర్మీ వైద్యుడి కారు దొంగతనం.. ఢిల్లీలో అలర్ట్
న్యూఢిల్లీ: ఎన్నడూ లేనంతగా ఈసారి దేశ రాజధానిలో టెన్షన్ టెన్షన్ గా మారింది. గణతంత్ర దినోత్సవం దగ్గరపడుతున్నా కొద్ది చోటుచేసుకుంటున్న సంఘటనలు నిఘావర్గాల, పోలీసుల గుండెల్లో గుబులుపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే పలువురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని లోధి గార్డెన్ లో పార్క్ చేసిన ఓ ఆర్మీ ఆస్పత్రి వైద్యుడికి చెందిన తెల్లటి సాంత్రో కారు(హెచ్ఆర్51టీ6646)ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. కారుపై ఆర్ఆర్ ఆస్పత్రి స్టిక్కర్ ఉంది. తన కుటుంబంతో కలిసి కాలక్షేపం కోసం ఆ వైద్యుడు పార్క్ కు రాగా కొద్ది సేపటికి ఆయన కారు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. వెంటనే వాట్సాప్ ద్వారా పోలీసు బృందాలకు కారు ఫొటోను పంపించి వెతికే పని ప్రారంభించారు. ఉగ్రవాదులే ఆ కారును ఎత్తుకెళ్లి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా ఉగ్రవాదుల దాడుల ఎక్కువవడం, రిపబ్లిక్ డే దగ్గరపడటంతో ఢిల్లీ పోలీసులు కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు.