stone slab
-
23 అడుగుల శాసన స్తంభం.. 898 ఏళ్ల చరిత్ర వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: రాతిఫలకలపై చెక్కిన శాసనాలు చాలా కన్పిస్తాయి..కానీ, శాసనం కోసం ఇలా 23 అడుగుల ఎత్తైన స్తంభాన్ని ఏర్పాటు చేసిన అరుదైన ఘట్టం కళ్యాణ చాళుక్యుల కాలంలో జరిగింది. ఈ స్తంభానికి 898 ఏళ్లు. ఈ స్తంభం భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రానికి ఆరు కి.మీ.దూరంలో ఉన్న కొలునుపాక ఊబదిబ్బపై ఉంది. ఆరో విక్రమాదిత్యుని కుమారుడు సోమేశ్వరుని కీర్తి కోసం స్థానిక అంబర తిలకమనే జైనబసది భోగానికి (భోజన సదుపాయం) పానుపురాయి గ్రామాన్ని సర్వబాధా పరిహారంగా దానం ఇచ్చిన సందర్భంలో 1125లో వేయించిన శాసనంగా తెలుస్తోంది. నాలుగు వైపులా కన్నడ భాషలో... స్తంభం నలువైపులా 151 పంక్తులతో కన్నడంలో శాసనం చెక్కి ఉంది. నాటి చారిత్రక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు ప్రతిబింబంగా ఉన్న ఈ శాసనం ప్రస్తుతం ఒకవైపు వంగిపోతూ కూలిపోయే స్థితికి చేరుకుంది. చుట్టూ ముళ్లపొదలు, బురదతో నిండి అడుగుతీసి అడుగు వేయాలంటేనే కష్టంగా మారిందని, ఆ శాసనాన్ని పరిశీలించిన చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా దానికి సమీపంలోని కొన్ని ప్రాంతాలను పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే. అందులో కొలనుపాక సోమేశ్వరాలయం కూడా ఒకటి. ఆలయానికి చేరువగానే ఉన్న ఈ శాసన మూలస్తంభాన్ని హెరిటేజ్ ఆర్కిటెక్టు శ్రీలేఖతో కలిసి పరిశీలించారు. కుమార సోమేశ్వరుడు, త్రికలింగాధిపతిని, ద్రావిడ దేశాధిపతిని జయించాడని, అతని దండనాయకుడైన స్వామిదేవుడు హరి, హర, జిన, బుద్ధ అనే చతుస్సమయాలను ప్రోత్సహించాడన్న విషయాలు శాసనంలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ అరుదైన శాసన స్తంభాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొలనుపాకకు వచ్చే పర్యాటకులు ఈ శాసనస్తంభాన్ని చూసేలా ఏర్పాట్లు చేసి దాన్ని ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. -
భారీ వర్షం : తప్పిన పెను ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శనివారం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. వర్షం ధాటికి పెద్ద పెద్ద రాళ్లు ఇళ్లపై పడటం తీవ్ర భయాందోళన కలిగించింది. స్థానికుల సమాచారం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44 ఓ కాంట్రాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా 20 అడుగులు ఉన్న కొండను తవ్వాడు. ఈ క్రమంలోనే భారీ వర్షం సంభవించడంతో ఒక్కసారిగా పెద్ద బండలతో ఉన్న కొండ కూలి పక్కనే ఉన్న నాలుగు అంతస్థుల భవనంపై పడింది. ఇంట్లోని సామగ్రి ధ్వంసమవ్వగా.. నాలుగు అంతస్థుల భవనం పూర్తిగా దెబ్బతిన్నది. ఒక్కసారిగా పెద్దగా శబ్ధం రావడంతో భవనంలో ఉన్న వారంతా బయటకు పరుగులు తీశారు. భవనం బలంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడున్న వారు వాపోతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని.. బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
తండ్రిని హతమార్చిన తనయుడు
మహబూబ్‌నగర్: నారాయణపేటలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. భూమికి సంబంధించిన విషయంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆవేశానికి గురైన కుమారుడు తండ్రిని బండరాయితో కొట్టి చంపాడు. రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రించేందుకు ప్రయత్నించాడు. తండ్రి శవాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి రోడ్డు పక్కన తుప్పల్లో పడేస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు పోలీసులకు చిక్కాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
తొలిసారి జీసస్ సమాధి తెరిచారు
జెరూసలెం: చరిత్రలో తొలిసారి ఏసుక్రీస్తు సమాధిని తెరిచారు. ఆయన సమాధిపై మూసి ఉంచిన చలువరాయిని తొలగించారు. ఈ సమాధి చుట్టూ నిర్మించిన చర్చిని పునరుద్ధరించే చర్యల్లో భాగంగా సమాధిపై ఉన్న రాయిని పలువురు చర్చి మతపెద్దల సమక్షంలో పరిశోధకులు అతి జాగ్రత్తగా తొలగించారు. క్రీస్తును సమాధి చేసిన తర్వాత క్రీ.శ.1555 నుంచి ఈ పవిత్ర చలువరాతిని ఏనాడు కదిలించలేదు. అయితే, తాజాగా చర్చిని పునరుద్ధరించే భారీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పరిశోధకులు తొలిసారి దీనిని తెరిచారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఫ్రెడ్రిక్ హైబర్ట్ మాట్లాడుతూ 'క్రీస్తును ఉంచి సమాధి పైభాగాన్ని కప్పి ఉంచిన చలువరాతిని బయటకు తీశాం. దాని కింద ఉన్న వస్తువులు చూసి మేం చాలా ఆశ్చర్యపోయాం' అని చెప్పారు. 'చాలా సుదీర్ఘకాలంగా జరిగిన విశ్లేషణ అనంతరం క్రీస్తు సమాధిపై ఉంచిన అసలైన చలువరాయిని ఎట్టకేలకు ఇప్పుడు అందరం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. దీని కిందే క్రీస్తును ఉంచారు' అని కూడా ఆయన తెలిపారు. క్రీస్తును సమాధి చేసిన ఈ ప్రాంతంలో పెద్ద చర్చిని నిర్మించగా దాని మధ్యలో సమాధి చుట్టూ ఒక చిన్న నిర్మాణం ఉంది. దీనిని ఎడిక్యుల్ అంటారు. అతి సుందరంగా నిర్మించిన ఇందులో ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించడంతో 1808, 1810 మధ్య పునరుద్ధరించారు. ఆ సమయంలో నేషనల్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ పరిశోధకులు ఆ పనులు పూర్తి చేశారు. కాగా, తాజాగా మరోసారి పునరుద్ధరించనున్నారు. -
తొలిసారి జీసస్ సమాధి తెరిచారు
-
బండరాయి మీదపడి వ్యక్తి దుర్మరణం
ఘట్కేసర్ మండలం మైసమ్మగుట్టలో ఘటన ఘట్కేసర్: బండరాయి మీదపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మైసమ్మగుట్ట కాలనీలో నివాసం ఉండే వరికుప్పల లక్ష్మయ్య(32) రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో అతడు మంగళవారం ఉదయం కాలనీ సమీపంలోని గుట్టపైకి రాళ్లు కొట్టేందుకు వెళ్లాడు. రాళ్ళు కొడుతుండగా ప్రమాదవశాత్తు సమీపంలోని పెద్ద బండారారుు వచ్చి అతడిపై పడిపోరుుంది. తలకు తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బండరారుుని తొలగించి మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య స్వర్ణ, పిల్లలు సరిత, అశోక్ ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పార్కులో యువకుడి హత్య
- నిద్రిస్తుండగా బండరాయితో - మోది చంపిన దుండగులు బన్సీలాల్‌పేట్: పార్కులో నిద్రపోతున్న ఓ యువకుడిని దుండగులు బండరాయితో తలపై మోది హత్య చేశారు. సికింద్రాబాద్ బైబిల్‌హౌస్ పక్కన ఉన్న జీహెచ్ఎంసీ పార్కు లో ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. గాంధీనగర్ ఇన్స్పెక్టర్ ఆరేటి సంజీవరావు కథనం ప్రకారం.. బైబిల్‌హౌస్ పక్కన ఉన్న పార్కులో గుర్తు తెలి యని యువకుడు (25) హత్యకు గురైనట్టు ఆదివారం ఉదయం స్థాని కులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరి శీలించారు. ఎవరో అతడి తలపై బండరాయితో మోది చంపినట్టు గుర్తించారు. హతుడు ఎవరు? పార్కులో ఎందుకు నిద్రపోతున్నాడు, ఎవరు హత్య చేశారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డులో జులాయిలు, చిత్తుకాగితాలు ఎరుకొనేవారు ఎక్కువగా తిరుగుతుంటారని, వారిలో ఎవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. మృతుడి షర్టు కాలర్‌పై నేషనల్ 20 అనే టైలర్ సిక్టర్ ఉంది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి సంబంధీకులుంటే నేరుగా గాంధీనగర్ పోలీసుస్టేషన్లో, లేదా ఫోన్ నెం. 040-2785 3585, ఇన్స్పెక్టర్ సంజీవరావు (94906 16335)ను సంప్రదించవచ్చు. ఈ హత్యకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తమకు తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ హామీ చేశారు. -
కొండపై నుంచి దొర్లిన బండరాయి
కిలేశపురం(ఇబ్రహీంపట్నం) : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కిలేశపురం కొండపై నుండి బండరాయి దొర్లింది. ఓ ఇంటి సమీపంలోకి వచ్చి నిలిచి పోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొండపైన అనేక మంది పేద ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. సుమారు 80 టన్ను ల బరువు ఉండే రాయి ఇళ్లపై పడిఉంటే భారీగా ఆస్తి, ప్రాణనష్టం తప్పింది. సమాచారాన్ని రెవెన్యూ, పోలీస్, పంచాయతీ సిబ్బందికి గ్రామస్తులు అందజేశారు. అక్కడకు చేరుకున్న ఇబ్రహీంపట్నం స్టేషన్ సీఐ జె.మురళీకృష్ణ, కార్యదర్శి కె.సురేష్‌బాబు, వీఆర్వో లలితకుమారి దొర్లిన బండరాయిని పరి శీలించారు. సమీపంలోని నివాస గృహా ల సభ్యుల ను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. వర్షం తగ్గుముఖం పట్టాక రాయిని తొలి చేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. నివాసగృహాలకు సమీపంలో క్వారీ నిర్వహిస్తున్నారు. క్వారీలో పేలుళ్లస్థాయి అధికంగా ఉన్నందునే అనేక సార్లు కొండరాళ్లు దొర్లి ఇళ్లసమీపంలోకి వచ్చిపడ్డాయిని స్థానికులు తెలిపారు. గతంలో పేలుళ్ల దాటికి కదిలిన కొండరాళ్లు వర్షానికి మట్టి నా నటంతో కిందకు జారాయని ఆరోపిస్తున్నారు. స్థానికులను వేరే ప్రాంతానికి తరలించటంలో టీడీపీ మండలఅధ్యక్షుడు ఆర్.రాజశేఖర్, గ్రామ నేతలు గౌర్నేని పిచ్చేశ్వరరావు, నరశింహస్వామి, ఏ రాజేశ్వరరావు, వార్డు సభ్యులు సహకారాన్ని అందజేశారు. నగరంలో..:గుణదల : గత మూడురోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు గుణదల ప్రాంతాలలో రెండు చోట్ల కొండచరియలు విరిగిపడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. మూడో డివిజన్ పరిధిలోని గంగిరెద్దుల దిబ్బ కొండప్రాంతంలో కొండచరియ విరిగిపడి ఒక ఇంటిగోడ కూలింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో దుర్గా అనే మహిళ ప్రమాదం నుంచి బయటపడింది. విషయం తెలుసుకున్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మూడో డివిజన్ కార్పొరేటర్ బొప్పన భవకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఇటువంటి ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే చెప్పారు. సున్నపుబట్టీల సెంటర్లో మెగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్ సమీపంలో కొండరాళ్లు విరిగిపడ్డాయి. ఈ కారణంగా స్థానిక ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఒకేరోజు రెండు ప్రదేశాలలో ఇటువంటి సంఘటనలు జరగడంతో కొండప్రాంత వాసులు ఆందోళనలు చెందుతున్నారు.