Stphenson
-
అన్నింటికి నేనున్నానన్న బాబు
-
అన్నింటికీ నేనున్నా..
⇒ అంతా చూసుకుంటానని చంద్రబాబు అభయమిచ్చారు: స్టీఫెన్సన్ ⇒ తమ వాళ్లు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు ⇒ మే 30న సాయంత్రం 4 గంటల సమయంలో బాబు నాతో మాట్లాడారు ⇒ మత్తయ్య ద్వారా డీల్ మొదలైంది.. తర్వాత సెబాస్టియన్, రేవంత్ వచ్చారు ⇒ తొలుత రూ. 2.5 కోట్లు ఇస్తామన్నారు.. ఓటేయకుండా విదేశాలకు వెళ్లాలన్నారు ⇒ నేను స్పందించకపోవడంతో.. ఎంత కావాలో చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు ⇒ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామన్నారు ⇒ దీనిపై చంద్రబాబుతో సెబాస్టియన్ మాట్లాడించారు ⇒ ‘ఓటుకు కోట్లు’ వ్యవహారాన్ని వాంగ్మూలంలో పూసగుచ్చిన స్టీఫెన్సన్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తనతో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ధ్రువీకరిం చారు. ‘నీకు రూ.5కోట్లు ఇస్తాం.. నీ బాగోగులు చూసుకుంటా..’ అని బాబు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన ఆ ఫోన్ సంభాషణల్లో చంద్రబాబు మాటలను స్టీఫెన్సన్ యథాతథంగా తన వాంగ్మూలంలో ప్రస్తావించారు. మాథ్యూస్ జెరూసలేం (మత్తయ్య) ద్వారా ఈ డీల్ మొదలైందని, చంద్రబాబు పంపాడంటూ హ్యారీ సెబాస్టియన్ నేరుగా తన ఇంటికి వచ్చి బేరసారాలు చేశారని స్టీఫెన్సన్ వెల్లడించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండి ఓటు వేయకుంటే రూ. 2 కోట్లు ఇస్తామని, కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లేందుకు టికెట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అదే టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేస్తే రూ.5కోట్లు ఇస్తామన్నారని తెలిపారు. నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం ఇచ్చిన వాంగ్మూలంలో స్టీఫెన్సన్ ఈ వివరాలను వెల్లడించారు. బేరసారాలు మొదలైనప్పటి నుంచి రేవంత్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడేవరకు వరుసగా జరిగిన సంఘటనలను వివరించారు. మే 30న సాయంత్రం 4 గంటల సమయంలో బాబు తనతో ఫోన్లో మాట్లాడినట్లు స్టీఫెన్సన్ ఈ వాంగ్మూలంలో చెప్పారు. స్టీఫెన్సన్ వాంగ్మూలం.. ‘‘మే 28న ఉదయం 10 గంటల ప్రాంతంలో మత్తయ్య బోయిగూడలోని మా నివాసానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తనను సంప్రదించాలని చెప్పారని అన్నారు. రూ.2కోట్లు ఇస్తామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా ఎక్కడికైనా వెళ్లాలని మత్తయ్య నన్ను కోరారు. వేరే దేశానికి వెళ్లేందుకు విమానం టికెట్‌ను కూడా తామే ఏర్పాటు చేస్తామని చెప్పారు. నా నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. గంటన్నర తర్వాత ఆంథోనీ అనే వ్యక్తి హారీ సెబాస్టియన్‌తో కలిసి మా ఇంటికి వచ్చారు. సెబాస్టియన్ తనను తాను పరిచయం చేసుకున్నారు. పాస్టర్‌గా పనిచేస్తున్నానని. చంద్రబాబునాయుడు తనను పంపారని, మీ సహకారం కావాలని కోరాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయకుండా ఉండేందుకు అంగీకరిస్తే రూ.2కోట్లు ఇవ్వడంతోపాటు జెరూసలేం వెళ్లేందుకు కుటుంబం మొత్తానికి విమానం టికెట్లు సమకూరుస్తామన్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే రూ.5కోట్లు ఇస్తామని చెప్పారు. వీరి ప్రతిపాదనపై ఆలోచించి చెబుతానని చెప్పాను. లంచం తీసుకుని ఓటు వేయడం చట్టవ్యతిరేకమే కాకుండా అనైతికమని భావించాను. ఏసీబీకి ఫిర్యాదు చేశా.. నన్ను ప్రలోభ పెట్టిన వ్యవహారంపై గత నెల 28న ఏసీబీ డెరైక్టర్ జనరల్‌కు లేఖ రాశాను. దాన్ని పరిశీలించిన డీజీ.. తన ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌ను ఆదేశించారు. అదేరోజు సాయంత్రం 6 గంటల సమయంలో మత్తయ్య మరోసారి నాకు ఎస్ఎంఎస్ పంపారు. తాజ్‌కృష్ణా హోటల్లో కలిసేందుకు ఏ సమయమైతే వీలవుతుందో చెప్పాలని కోరారు. 29న మరోసారి ఎస్ఎంఎస్ చేశారు. 29న రాత్రి 9 గంటలకు సెబాస్టియన్ మరోసారి ఫోన్ చేశారు. టీడీపీకి చెందిన బాధ్యతాయుతమైన వ్యక్తులతోనే మాట్లాడిస్తామని చెప్పారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో జరుగుతోందని చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే డీఎస్పీ అశోక్‌కుమార్‌కు నేను తెలియజేశాను. 30వ తేదీన ఉదయం 10 గంటలకు రేవంత్‌రెడ్డితో కలిసి తాను వస్తానని సెబాస్టియన్ తెలియజేశారు. 30వ తేదీ ఉదయం 10 గంటలకు సెబాస్టియన్ నుంచి ఫోన్ వచ్చింది. రేవంత్‌రెడ్డితో కలిసి వస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో డీఎస్పీ తన సిబ్బందితో కలసి వీడియో, ఆడియోను రికార్డు చేసే ఒక ఐఫోన్‌ను సిట్టింగ్ హాల్లో టీవీకి దగ్గరగా ఏర్పాటు చేశారు. తీవ్రంగా ఒత్తిడి చేశారు.. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ మా ఇంటికి వచ్చారు. టీడీపీ అభ్యర్థికి ఓట్లను సమకూర్చే బాధ్యతను చంద్రబాబు తనకు అప్పజెప్పారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ డీల్ విషయం బయటపడితే రూ.2.5కోట్లు ఇవ్వడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ ఎమ్మెల్యే పదవిని లేదా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో క్రిస్టియన్ మైనారిటీ విభాగానికి సంబంధించిన నామినేటెడ్ పదవిని ఇస్తామని చెప్పాడు. చంద్రబాబుతో రహస్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తానని రేవంత్‌రెడ్డి నాతో చెప్పారు. అయితే నేను చంద్రబాబును కలిసేందుకు అంగీకరించలేదు. రేవంత్‌తో డీల్ జరుపుతానని చెప్పాను. రేవంత్‌ను కూల్‌డ్రింక్, లేదా టీ తాగాలని కోరగా.. మంచినీరు ఇవ్వాలని కోరారు. నా కుమార్తె జెస్సికా స్టీఫెన్సన్ అలియాస్ కుక్కీ రేవంత్‌రెడ్డికి మంచినీరు ఇచ్చింది. ఒకవేళ రెండున్నర కోట్లు సరిపోవని అనుకుంటే ఎంత కావాలో చెప్పాలని, ఆ విషయాన్ని చంద్రబాబుకు తెలియజేస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎన్ని కోట్లు ఇవ్వాలనేది చంద్రబాబు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రూ.2.5కోట్లు సరిపోకపోతే నిర్దిష్టంగా ఎంత మొత్తం కావాలో స్పష్టం చేయాలని పదేపదే రేవంత్‌రెడ్డి నన్ను అడిగారు. దాంతో రూ.5కోట్లు ఇవ్వాలని.. నాకు తోచిన మొత్తాన్ని ఆయన సూచన మేరకు చెప్పాను. దీంతో వారిద్దరూ లేచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజే చంద్రబాబు తనతో మాట్లాడుతారని, డీల్‌ను ఖరారు చేస్తారని రేవంత్ చెప్పారు. కలసి పనిచేద్దాం.. అదే రోజు సాయంత్రం సెబాస్టియన్ మూడు నుంచి నాలుగు సార్లు చంద్రబాబు ఇతర సమావేశాల్లో బిజీగా ఉన్నారని, సమయం దొరికినప్పుడు ఆయనతో మాట్లాడిస్తానని చెప్పారు. సాయంత్రం 4 గంటల సమయంలో సెబాస్టియన్ నాకు ఫోన్ చేశారు. చంద్రబాబు మాట్లాడుతారని నాకు చెప్పి ఆయనకు ఫోన్ ఇచ్చారు. చంద్రబాబునాయుడు ఫోన్లో మాట్లాడడం ప్రారంభిస్తూ.. ‘మావాళ్లు డీల్ గురించి బ్రీఫ్ చేశారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నీకు అండగా నేనుంటాను. మావాళ్లు నీకు ఎంత ఇస్తామన్నారో దాన్ని నెరవేరుస్తాను. ఓటు వేసే విషయంలో నిర్భయంగా నిర్ణయం తీసుకోండి. మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కలిసి పనిచేద్దాం’ అంటూ రూ.5కోట్లు ఇస్తామన్న హామీపై భరోసా ఇచ్చారు. అంతా తాను చూసుకుంటానని అభయమిచ్చారు. 30వ తేదీ రాత్రి 9 గంటలకు సెబాస్టియన్ కొత్త మొబైల్ నుంచి నాకు ఎస్ఎంఎస్ చేశారు. చివరి నిమిషంలో ప్లేస్ మార్చమన్నారు 31వ తేదీ ఉదయం 8.50కి సెబాస్టియన్ నాకు ఫోన్ చేశారు. ఓటు కోసం కుదుర్చుకున్న డీల్‌లో భాగంగా అడ్వాన్స్ రూ.50 లక్షలు తీసుకొని రేవంత్‌రెడ్డి, తాను 2 గంటల సమయంలో మా ఇంటికి వస్తానని చెప్పారు. మధ్యాహ్నం 3.20కి ఫోన్ చేసి నా ఇంటికి రావడం ఇష్టం లేదని, డబ్బు తీసుకునే స్థలాన్ని మార్చాలని కోరారు. దీంతో నా మిత్రుడు మాల్కం టేలర్‌కు చెందిన తార్నాక రైల్వే డిగ్రీ కళాశాల ఎదురుగా ఉండే అపార్టుమెంట్‌కు రమ్మని సూచించాను. కొంత మంది ముఖ్యమైన వ్యక్తులతో మీ ఇంట్లో కలుస్తానని టేలర్‌కు చెప్పాను. అయితే తన తల్లి ఇంట్లో లేనందున ఆమె ఇంట్లో కలుద్దామని టేలర్ సూచించారు. ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్‌కు తెలియజేశాను. ఆ తర్వాత మాల్కం టేలర్ తల్లి ఇంటికి వెళ్లాను. నేను, నా మిత్రుడు మాల్కం టేలర్ హాల్లో కూర్చున్నాం. ఏసీబీ అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్ పరికరాలను హాల్లో అమర్చారు. నాకు ఐఫోన్ వీడియో రికార్డర్ ఇచ్చి చేతిలో పట్టుకోవాలని చెప్పారు. సాయంత్రం 4 గంటల సమయంలో సెబాస్టియన్ నాకు ఫోన్ చేశారు. ఉప్పల్ వైపు నుంచి తాను రేవంత్‌రెడ్డి వస్తున్నామని, అడ్రస్ చెప్పాలని కోరారు. మాల్కం టేలర్ వారికి అడ్రస్ వివరించారు. 4.20 ప్రాంతంలో సెబాస్టియన్, రేవంత్‌రెడ్డి అక్కడికి వచ్చి హాల్లో కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత తెల్లచొక్కా, జీన్స్ ప్యాంట్ వేసుకుని, 5.8 అడుగుల పొడవున్న లావుపాటి వ్యక్తి అక్కడికి వచ్చి నల్లటి బ్యాగును రేవంత్‌రెడ్డి పక్కన పెట్టారు. రేవంత్‌రెడ్డి బ్యాగును ఎత్తి సదరు వ్యక్తికి ఇచ్చి.. డబ్బు తీసి టీపాయ్ మీద పెట్టాలని చెప్పారు. ఒక్కోటి 5 కట్టలున్న 500 రూపాయల 20 బండిళ్లను.. రూ.50 లక్షల మొత్తాన్ని రేవంత్‌రెడ్డి, అతను నా ముందుంచారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. రేవంత్‌రెడ్డి, ఆ వచ్చిన వ్యక్తి ఇద్దరూ లేచి నిలబడి తమకు అత్యవసర పని ఉన్నందున వెళ్తామని అన్నారు. ఇంకా కూర్చొని ఉన్న సెబాస్టియన్ చర్చలు కొనసాగించేందుకు అక్కడే ఉన్నారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు రేవంత్‌రెడ్డిని, డబ్బు తెచ్చిన వ్యక్తిని ఫ్లాట్ లోపలికి తెచ్చారు. నేను టేలర్ ఇంటి నుంచి బయటకు వెళ్లాను. ఆ ఇంటికి సమీపంలోనే ఉన్నాను. ఈ మొత్తం వ్యవహారం జరిగిన మూడు గంటల తర్వాత డీఎస్పీ అశోక్‌కుమార్ నన్ను పిలిపించి రేవంత్‌రెడ్డిని నా ఎదురుగా ఉంచి డబ్బు గురించి విచారించారు. ఈ సమయంలో రేవంత్‌రెడ్డితోపాటు సెబాస్టియన్, మరో వ్యక్తి ఉన్న విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. వారు తెచ్చిన రూ.50 లక్షల డబ్బు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఇవ్వజూపిన లంచం మొత్తమని ఏసీబీ డీఎస్పీకి చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ను డీఎస్పీ రికార్డు చేశారు. నన్ను, నా మిత్రుడు మాల్కం టేలర్, రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌తోపాటు డబ్బు తెచ్చిన మరో వ్యక్తిని డబ్బుతో సహా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఏసీబీ అధికారులు నన్ను విచారించి నా స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా ఆడియో, వీడియో ద్వారా ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. నేను చెబుతున్న విషయాలన్నీ వాస్తవాలు. స్వచ్ఛందంగా నేను ఈ వాంగ్మూలం ఇస్తున్నాను..’’ -
మాట్లాడింది బాబే..
-
మాట్లాడింది బాబే..
నా ఓటుకు మరో నాలుగున్నర కోట్లు ఇస్తానని బేరమాడారు ‘ఓటుకు కోట్లు’ కుట్రను బట్టబయలు చేసిన స్టీఫెన్సన్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం ప్రత్యక్ష సాక్షులుగా స్టీఫెన్సన్ కుమార్తె జెస్సికా, బంధువు మార్క్‌టేలర్ ఈ ముగ్గురి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈ వ్యవహారానికి సూత్రధారి చంద్రబాబేనన్న స్టీఫెన్సన్ టీడీపీకి చెందిన కీలక వ్యక్తుల పాత్రపైనా వివరణ నేడు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు సీల్డ్కవర్లో పంపించే అవకాశం భయపడాల్సిన పనిలేదు, నేనున్నానంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు. కలసి పని చేద్దామంటూ ఆహ్వానించారు.. - స్టీఫెన్సన్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పన్నిన కుట్రను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ బట్టబయలు చేశారు. ఈ కేసులో చంద్రబాబుతోపాటు టీడీపీ ముఖ్య నేతల కీలక పాత్రను బహిర్గతం చేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే తమ వాళ్లు ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు మిగతా రూ.4.5 కోట్లు ఇస్తామని చంద్రబాబు నేరుగా తనకు హామీ ఇచ్చారని స్టీఫెన్సన్ వాంగ్మూలంలో వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘భయపడాల్సిన పని లేదు, తానున్నానంటూ చంద్రబాబు భరోసా ఇచ్చారు. కలసి పనిచేద్దామంటూ ఆహ్వానించారు..’ అని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతల పేర్లతోపాటు కీలక సమాచారాన్ని కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.50 లక్షలను అందజేస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రేవంత్ డబ్బు ఇవ్వజూపిన దృశ్యాలతో పాటు స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడిన ఆడియో రికార్డులు బహిర్గతమయ్యాయి. అంతేకాదు మరికొందరు ఎమ్మెల్యేలనూ కొనుగోలు చేసేందుకు చంద్రబాబుతో పాటు ఏపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, పలువురు నేతలు చేసిన కుట్ర మొత్తం ఏసీబీ జరిపిన దర్యాప్తులో బయటపడింది. దీంతో ఈ కేసులో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న ఏసీబీ అధికారులు.. కుట్రలో భాగస్వాములందరికీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదే సమయంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్సన్, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఆయన కుమార్తె జెస్సికా, ఆయన బంధువు మార్క్టేలర్ల వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలని ఏసీబీ నిర్ణయించింది. ఈ మేరకు నేర విచారణ చట్టం (సీఆర్పీసీ) సెక్షన్ 164 కింద హైదరాబాద్‌లోని నాంపల్లి మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తిరుపతి బుధవారం వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. వీటిని గురువారం సీల్డ్కవర్లో ఏసీబీ ప్రత్యేక కోర్టుకు పంపనున్నట్లు తెలిసింది. ప్రత్యేక కోర్టు నుంచి ఏసీబీ అధికారులు ఈ వాంగ్మూలాన్ని అధికారికంగా తీసుకుని.. ‘ఓటుకు కోట్లు’ కుట్రలో పాత్రధారులుగా ఉన్న వారికి నోటీసులు జారీచేసే అవకాశం ఉంది. సీఆర్పీసీ సెక్షన్ 164 ఏం చెబుతోందంటే? నేర విచారణ చట్టం(సీఆర్పీసీ)లోని సెక్షన్ 164 కింద సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నేరుగా నమోదు చేస్తారు. ఈ సాక్ష్యం నమోదుకు ముందు ఆ సాక్షులతో ‘అంతా నిజమే చెబుతున్నామని, అబ ద్ధం చెప్పబోమని’.. న్యాయమూర్తి ప్రమా ణం చేయిస్తారు. స్వచ్ఛందంగా వాస్తవాలు మాత్రమే వెల్లడించాలని స్పష్టం చేస్తూ... వారు వెల్లడించిన అన్ని అంశాలను నమో దు చేస్తారు. ఈ వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్లో సదరు కేసును విచారిస్తున్న న్యాయస్థానానికి పంపుతారు. కేసు తుది విచారణ సమయంలోనూ ఇదే వాంగ్మూలాన్ని వారు న్యాయస్థానం ముందు ఇవ్వాల్సి ఉంటుం ది. ఇందుకు విరుద్ధంగా చెబితే భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 193 కింద వారిపై కేసు నమోదు చేయవచ్చు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యమిచ్చినట్లుగా రుజు వైతే వారికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ముగ్గురి వాంగ్మూలాల నమోదు స్టీఫెన్‌సన్‌తోపాటు జెస్సి కా, మార్క్‌టేలర్‌లు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు వీరి వాంగ్మూలాలను న్యాయమూర్తి నమోదు చేశారు. ఈ సమయంలో ఎవరినీ కోర్టు హాలులోకి అనుమతించలేదు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కోర్టు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన న్యాయమూర్తి.. తర్వాత మార్క్‌టేలర్, జెస్సికాల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ జెరూసలెం మత్తయ్య, రేవంత్‌రెడ్డితోపాటు టీడీపీకి చెందిన కీలక నేతలు తనను ప్రలోభపెట్టిన తీరును స్టీఫెన్సన్ వివరించినట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహ, సెబాస్టియన్లు తమ నివాసానికి వచ్చి రూ.50 లక్షలు ఇచ్చిన విషయాన్ని జెస్సికా, మార్క్‌టేలర్‌లు వివరించినట్లు సమాచారం. -
కోట్లూ పాయె... ఉన్న ఓట్లు రాకపాయే!
అనుకున్నదొక్కటి... అయ్యినదొక్కటీ.... అని విషాదగీతం పాడుకుం టున్నారు తెలుగు తమ్ముళ్లు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సవాల్ చేసి బలం లేకపోయినా ఎమ్మెల్సీని గెలిపించుకుంటామని బీరాలు పోయిన తెలుగు శిబిరానికి ఏసీబీ రూపంలో కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. 50 లక్షలు లంచంగా ఇస్తూ ఎమ్మెల్సీ ఎన్నికకు ఒక్కరోజు ముందు రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఆయనతో పాటు మరో ఏడుగురు ఎమ్మెల్యేలను ‘కొనుగోలు’ చేసి అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారంట!. రేవంత్ వ్యవహారం బయటపడ్డా... అడ్వాన్స్‌లు తీసుకున్నోళ్లయినా ఓట్లేస్తారని తెలుగుదేశం నేతలు ఆశించారు. కానీ కేసీఆర్ రూపం కళ్ల ముందు కనిపించడంతో ‘అడ్వాన్సయిన’ వాళ్లు కూడా ‘కారు గీత’ దాటలేదు. అందరికీ తెలిసి రూ. 50 లక్షలు స్టీఫెన్సన్ దగ్గర పోగా... గుట్టుగా మరో రూ. 3కోట్ల వరకు అడ్వాన్స్‌ల రూపంలో తెలుగు శిబిరం లాసయ్యింది. సరే కొనుగోళ్లతో గట్టెక్కకపోయినా... టీడీపీ, బీజేపీకి ఉన్న బలగం 15 మంది ఓట్లేసినా 15 ఓట్లు వస్తే గౌరవం నిలిచేది. కానీ వచ్చిన ఓట్లు తొమ్మిదే. అతి తెలివికి పోయి రెండో ప్రాధాన్యతగా ‘నోటా’కు ఓటేయడంతో ఆరు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఒకవేళ రేవంత్‌రెడ్డి వ్యవహారం బయటపడకపోయినా, కోట్లు లంచాలు ఇచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఓటేయించుకున్నా.... ‘నోటా’కు ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేల పుణ్యాన ఎమ్మెల్సీ మాత్రం గెలిచేవారు కాదు కదా! అని రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే తెలుగుదేశం నాయకులకు ఎమ్మెల్సీ ఓట్లేయించుకోవడం కూడా తెలియదు పాపం! జనంలో చులకనవడం తప్ప!! -
మా బాసే పంపించాడు
* నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి సంభాషణ * ఏదైనా ప్రాబ్లం వస్తే ఏపీలో నామినేటెడ్ ఎమ్మెల్యే పోస్టు * 5 కోట్లు డీల్.. చాలా కాన్ఫిడెన్షియల్.. రెండు, రెండున్నర అయితే ఇప్పుడే ఇస్తా * సెంట్రల్లో, ఏపీలో మాదే గవర్నమెంట్.. తెలంగాణలో నేనే పార్టీ కీ పర్సన్ * ఆంధ్రలో జగన్ ఉన్నాడు కాబట్టి తెలంగాణలో చంద్రబాబు రెడ్లను ప్రమోట్ చేస్తున్నాడని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆశీస్సులతోనే ఎమ్మెల్యే కొనుగోలు డీల్ నడిచింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్వయంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు చెప్పారు. రెండు రోజుల కింద రేవంత్‌రెడ్డి నేరుగా స్టీఫెన్సన్ బంధువు ఇంటికి వచ్చి డీల్ కుదిర్చిన వ్యవహారంతో పాటు ఆదివారం ఏసీబీకి పట్టుబడక ముందు రూ.50 లక్షలు అడ్వాన్సుగా ఇస్తూ జరిపిన సంభాషణ మొత్తం రహస్య కెమెరాల్లో రికార్డయింది. రెండు రోజుల కింద డీల్ కుదిర్చినప్పుడు రేవంత్ చెప్పిన మాటలు.. ‘తెలంగాణలో నేనే పార్టీ కీ పర్సన్‌ను. మీ(స్టీఫెన్సన్) మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే జిమ్మి, మట్టయ్య(స్టీఫెన్సన్ సన్నిహితులు)లను అప్రోచ్ అయ్యా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలి. మా బాస్(చంద్రబాబు)కు విషయం చెప్పా. బాసే మీ దగ్గరికి పంపించాడు. మీరేదైనా నెంబర్ చెబితే దాని గురించి ఆయనతో మాట్లాడుతా. ఈ వ్యవహారాన్ని మీ పార్టీ గుర్తించలేదు. మీరేం కావాలన్నా బాబు దగ్గరికి తీసుకెళ్తా. ఇది వంద శాతం కాన్ఫిడెన్షియల్. ఫైనాన్షియల్‌గా అయితే రెండూ రెండున్నర ఇవ్వగలం. టీడీపీలో నేనో ఇంపార్టెంట్ పర్సన్‌ను. నేనే తెలంగాణలో పార్టీని చూసుకుంటున్నా. బాబు కూడా నా వర్త్ గుర్తించారు. నావల్లే ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టారు. నేను వేం నరేందర్‌రెడ్డికి ఫైనాన్స్ చేస్తున్నా. మీరు ఓటేస్తారనే క్లారిటీ ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాను. ఏపీలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఇంకా ఫైనల్ కాలేదు. మీకేమైనా ప్రాబ్లం వస్తే ఏపీలో ఇప్పిస్తా. నన్నెప్పుడైనా కలవొచ్చు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో ఉంటాను. కొంత అడ్వాన్స్ ఇస్తాం. మరికొంత డిపాజిట్ చేస్తాం. మీకు అమౌంట్ కావాలంటే ఇప్పుడే ఇస్తాం. మీరెక్కడ కావాలంటే అక్కడ అందిస్తాం. ఈ ఎమ్మెల్సీ సీటు గెలవడం, ఓడడం వల్ల ఒరిగేదేమీ లేదు. కానీ చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ నడుస్తోంది. దట్స్ వై దిస్ గేమ్ స్టార్టెడ్. మీకు ఏప్రాబ్లం రాదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఐ విల్ టేక్ కేర్. బాబు దగ్గర కూచోబెడతా. మాట్లాడిస్తా. నేను మధ్యవర్తిని. మీకు ఏ అవసరమొచ్చినా అవుట్ అండ్ అవుట్. నేనే ఎమ్మెల్సీని నిలబెట్టా. అతను నాకు కావలసిన వ్యక్తి. ఆరునెలల్లో పార్టీ ప్రెసిడెంట్‌ను నేనే అవుతున్నా. ఇప్పుడే మహానాడులో ఇస్తానంటే నేనే వద్దన్నా. నా కూతురి పెళ్లి తరువాత ఫ్రీ అవుతా. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో రెడ్డీస్దే డామినేషన్. కేసీఆర్‌ను అప్పోజ్ చేసే గ్రూప్ ఇదే. ఆంధ్రా, రాయలసీమకు చెందిన రెడ్డీస్ కూడా తెలంగాణలో మాకే సపోర్టు చేస్తారు. ఆంధ్రాలో జగన్ రెడ్డి ఉన్నారు కాబట్టి తెలంగాణలో బాస్ రెడ్డీస్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడున్న కమ్మలు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా రెడ్డీస్‌ను ప్రమోట్ చేస్తున్నారు. నేను 25 ఏళ్లు పాలిటిక్స్‌లో ఉంటాను. నాకు క్యాస్ట్ ఉంది. బంధువులు ఉన్నారు. జైపాల్‌రెడ్డి నాకు మామ అవుతాడు. జానారెడ్డి కూడా నాకు బంధువే. జానారెడ్డి పని అయిపోయింది. కేసీఆర్‌తో మేం కొట్లాడలేమని జానారెడ్డి అన్నరు. నా వెనకాలే ఉండి జానారెడ్డి ప్రమోట్ చేస్తానన్నారు. సెంట్రల్లో, ఏపీలో మేమే గవర్నమెంట్లో ఉన్నం. కేంద్రంలో కూడా ఏమైనా కావాలంటే ఇస్తం..’ ఒకరు ఓటేయలేదనే తెలుస్తుంది.. ‘ఒక్కో ఎమ్మెల్సీకి 17 మంది ఎమ్మెల్యేలను కేటాయిస్తరు. మీకు ఒక ఎమ్మెల్సీకి ఓటేయాలని లెక్క చెపుతారు. మీరు మాకు ఓటేసినా పిన్‌పాయింట్‌గా మీరేనని తెలియదు. 20 ఏళ్లుగా మేం చూస్తున్నాం కదా. ఆ గ్రూప్‌లో ఒకరు తగ్గారని తెలుస్తుంది అంతే. కూకట్పల్లి కృష్ణారావు వేస్తానంటున్నాడు కానీ డౌటే. ఏపీలో, సెంట్రల్లో ఏమైనా చేయగలం. నేను పోయి బాస్‌తో మాట్లాడుతా. ఇవ్వాళ జరిగింది నేను వెళ్లి బాస్‌తో ఫీడ్ చేస్తా.’ ఆదివారం ఏసీబీ ట్రాప్‌కు ముందు సంభాషణ.. రేవంత్‌రెడ్డి: 50 లక్షలు తెచ్చాను. అడ్వాన్స్. నాకు మీ హెల్ప్ కావాలి. మీకు ఏం కావాలో చెప్పండి. స్టీఫెన్సన్: నేను సాధారణ మనిషిని. మీరేం కోరుకుంటున్నారు. ఏం ఇస్తారో చెప్పండి. రేవంత్: ఇప్పుడు ఫిఫ్టీ తీసుకోండి. మిగతా నాలుగున్నర కోట్లు ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అప్పుడు ఇస్తా. బయట ఎవరికి తెలియదు. స్టీఫెన్: నా లైఫ్ రిస్క్ కదా.. రేవంత్: అవును రాజకీయంగా పెద్ద డీల్. 5 కోట్లు కదా. నేను రిస్క్ చేస్తున్నాను. మనం ఓ పనిచేద్దాం. చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్తా. మీరు నాతో, తనతో (బాబు) మాట్లాడాల్సిన పనిలేదు. బాబు ఏం హామీ ఇచ్చారో అది మీకు రెండు గంటల్లో అందుతుంది. ఈ వ్యవహారం పూర్తి రహస్యంగా ఉంటుంది. నన్ను బాసే పంపించారు. నాకు మీ సపోర్టు కావాలి. మీకేం కావాలన్న చేయడానికి బాబు ఉన్నారు.