strategic
-
బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ షాక్..
న్యూఢిల్లీ: వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు రామ్ లీలా మైదానం వరకు భారీ ర్యాలీగా కదిలి అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఆదివారం ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రిలాక్స్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులకు ఆదివారం ఉదయాన్నే సూపర్ స్ట్రోక్ ఇచ్చింది బీజేపీ పార్టీ. వారు ఢిల్లీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాత్రికి రాత్రే దారి పొడవునా బ్యానర్లు, ప్లకార్డులు తగిలించేశారు. బీజేపీ సూపర్ స్ట్రోక్.. అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ సభకు సంబంధించిన ప్రచార బ్యానర్ల కంటే కూడా బీజేపీ తగిలించిన ఈ పోస్టర్లే జనాలను బాగా ఆకర్షిస్తుండటం విశేషం. ఆమ్ ఆద్మీ పార్ట్ బ్యానర్లలో కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ అని ఉంటే .. బీజేపీ రాసిన బ్యానర్లలో ఢిల్లీ సీఎం నిర్మించుకున్న సొంత ఇంటి భవనం గురించి మాత్రమే ప్రస్తావించారు.. "ఇంటి పునర్నిర్మాణానికి రూ. 45 కోట్లా.. ప్రజల వద్ద టాక్స్ రూపంలో వసూలు చేసిందేగా..?" "మాక్కూడా రూ. 45 కోట్ల భవనాన్ని చూడాలని ఉంది.." అని రాసిన బ్యానర్లు ఢిల్లీ వీధుల్లో ఎక్కడ పెడితే అక్కడ దర్శనమిచ్చాయి. ग़रीबों की कमाई के 45 करोड़ खर्च कर राजमहल सजाया केजरीवाल जवाब दो?? pic.twitter.com/BOuT2RCQhW — BJP Delhi (@BJP4Delhi) June 11, 2023 కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకుండా ఉండడానికి ఢిల్లీ సీఎం దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నియంతృత్వ పాలనను తలపిస్తున్నాయని ఆరోపిస్తూ అందుకు వ్యతిరేకంగా ఈ భారీ ర్యాలీ, బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. కానీ ర్యాలీ రోజు ఉదయాన్నే బీజేపీ కౌంటర్ పోస్టర్లతో ఎన్ కౌంటర్ చేస్తుందని ఆయన అస్సలు ఊహించలేదు. అంతేకాదు బీజేపీ ఢిల్లీ తన ట్విట్టర్ అకౌంట్లో "ఢిల్లీని నాశనం చేయడానికి ఒక్కడు చాలు.. అతని పేరు అరవింద్ కేజ్రీవాల్" అని రాసి సీఎం ఫోటో ఉన్న ఒక సినిమా పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. सिर्फ एक बंदा काफ़ी है, दिल्ली को तबाह करने के लिए - नाम है केजरीवाल pic.twitter.com/EwwFDBnmV5 — BJP Delhi (@BJP4Delhi) June 11, 2023 ఇది కూడా చదవండి: జపాన్ జంట మెచ్చిన వంట.. ప్రధాని ట్వీట్ వైరల్ -
మూడేళ్లకు వ్యూహాత్మక ప్రణాళిక
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్ల కాలానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. 2023–24 సంవత్సరం నుంచి దీన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధించతగిన లక్ష్యాలను నిర్వచించుకోవాలని, కొత్తగా తీసుకోవాల్సిన చర్యలను గుర్తించాలని, వీటిని చేరుకునేందుకు కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని కోరింది. ఈ తరహా చర్యలు ‘మెరుగు పరిచిన సేవల అందుబాటు, శ్రేష్టత సంస్కరణలు 6.0 (ఈజ్ 6.0)’లో భాగమని, దీన్ని గత ఏప్రిల్‌లో ప్రారంభించినట్టు ఓ అధికారి తెలిపారు. ‘‘గడిచిన రెండేళ్లలో పీఎస్‌బీలు చాలా బాగా పనితీరు చూపించాయి. ప్రస్తుతం పీఎస్‌బీల తదుపరి దశ వృద్ధి నడుస్తోంది. ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, నూతన తరహా సాంకేతిక పరిజ్ఞానాలను అమల్లోకి తీసుకురావడం, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల నిర్వహణపై దృష్టి సారించాలని కోరినట్టు’’ ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ అధికారి తెలిపారు. అప్రాధాన్య వ్యాపారాలను సమీక్షించుకోవాలని, ఆర్థిక పనితీరును బలోపేతం చేసుకోవాలని పీఎస్‌బీలను కేంద్రం కొన్నేళ్ల నుంచి కోరుతూనే ఉన్నట్టు ఓ ప్రభుత్వ బ్యాంక్ అధికారి వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్పించే కార్యాచరణ ప్రణాళికల్లో అవి వైదొలిగే వ్యాపారాల వివరాలు కూడా ఉండొచ్చన్నారు. టెక్నాలజీకి ప్రాధాన్యం.. ప్రైవేటు రంగ బ్యాంకులు టెక్నాలజీ వినియోగం పరంగా ముందుంటున్నాయి. అదే మాదిరి ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవాలన్నది కేంద్రం ఉద్దేశ్యంగా ఉంది. పీఎస్‌బీలు బిగ్ డేటా అనలైటిక్స్‌ను వినియోగించుకోవడం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారపరమైన మంచి ఫలితాలు రాబట్టడం అన్నది నూతన ప్రాధాన్య అంశాల్లో భాగమని మరో బ్యాంకర్ తెలిపారు. మరింత సమర్థవంతగా మార్కెటింగ్ చేసుకోవడం, కొత్త ఆదాయ మార్గాలను గుర్తించడం, కస్టమర్ ఆధారిత సేవలు, నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడం గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం 2021–22లో రూ.66,539 కోట్లుగా ఉంటే, 2022–23లో రూ.లక్ష కోట్లకు చేరొచ్చన్న అంచనా నెలకొంది. మరింత బలోపేతం గతేడాది డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని మాట్లాడిన మాటలు ఓ సారి గుర్తు చేసుకుంటే, బ్యాంకింగ్ రంగానికి కేంద్రం ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి అయినా, బ్యాంకింగ్ రంగం బలోపేతంపైనే ఆధారపడి ఉంటుందని ప్రధాని ఆ సందర్భంలో పేర్కొనడం గమనార్హం. ‘‘దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడానికి జన్‌ధన్ ఖాతాలు పునాది వేశాయి. తర్వాత ఫిన్‌టెక్ సంస్థలు ఆర్థిక విప్లవానికి నాందీ పలికాయి’’అని ప్రధాని చెప్పారు. ‘ఈజ్ 5.0’ కింద ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మధ్య అంతర్గత సహకారం అవకాశాలను గుర్తించాలి. ప్రాంతాల వారీ, ఒక్కో వ్యాపారం వారీగా అవకాశాలనూ పరిశీలించాలి. హెచ్ఆర్ సంస్కరణలు, డిజిటలైజేషన్, టెక్నాలజీ, రిస్క్, కస్టమర్ సేవలు తదితర అంశాలకు సంబంధించి అంచనా వేయాల్సి ఉంటుంది. -
చైనాని శత్రువుగా చిత్రీకరించవద్దు! అమెరికా చారిత్రక తప్పిదం
Taking Us As Threat historic and strategic mistake: సింగపూర్‌లో యూఎస్ రక్షణాధికారి లాయిడ్ ఆస్టిన్‌తో చైనా రక్షణమంత్రి వీ ఫెంఘే ముఖాముఖి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సమావేశంలో యూఎస్ రక్షణాధికారి ఆస్టిన్ తైవాన్‌ని ఇబ్బంది పట్టేలా సైనిక చర్యలకు పాల్పడవద్దంటూ హెచ్చరించారు కూడా. దీంతో చైనా రకణ మంత్రి వీ ఫెంఘే తైవాన్‌ని అడ్డుపెట్టుకుని చైనాని బెదిరించాలనుకోవడం అమెరికా చారిత్రక వ్యూహాత్మిక తప్పిదం అవుతుందన్నారు. చైనాని ముప్పుగానూ లేదా శత్రువుగానూ పరిణించడం తగదని యూఎస్‌కి హితవు పలికారు. ఇది ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని చెప్పారు. ప్రపంచ శాంతికి ఇరు దేశాల అభివృద్ధి కీలకమని గట్టిగా నొక్కి చెప్పారు. ఇకనైనా చైనా ప్రయోజనాలను దెబ్బతీయాలని చూడటం మానుకోవాలని అమెరికాకు సూచించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారు. వాస్తవానికి 1949 అంతర్యుద్ధంలో తైవాన్, చైనా విడిపోయాయి. కానీ చైనా స్వయంపాలిత దేశమైన తైవాన్‌ని తిరుగబాటు ప్రావిన్స్‌గా పేర్కొంది. చైనాని బెదిరించడానికి తైవాన్ను వాడుకుంటే మాత్రం సహించబోమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అలాగే దక్షిణ చైనా సముద్ర తీరం వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా వియత్నాంతో సహా అన్ని వివాదాస్పదమైన భూభాగాలు తనవే అని చైనా వాదిస్తోంది కూడా. పైగా తూర్పు చైనా సముద్ర ప్రాంతంలో జపాన్‌తో కూడా చైనాకు ప్రాదేశిక వివాదాలు ఉన్నాయి. (చదవండి: తైవాన్ విషయంలో తగ్గేదే లే అంటున్న చైనా!... అమెరికాకు గట్టి వార్నింగ్) -
పవన్‌హన్స్‌లో ఆగిన వాటాల విక్రయం
న్యూఢిల్లీ: హెలికాప్టర్ సేవల సంస్థ పవన్‌హన్స్‌లో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నుంచి బిడ్ వచ్చినట్టు ఓ సీనియర్ అధికారి తెలియజేశారు. ఎన్నికల వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పవన్‌హన్స్‌లో కేంద్రానికి 51 శాతం వాటా, ఓఎన్జీసీకి 49 శాతం వాటా ఉన్నాయి. ఆసక్తి కలిగిన ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్ బిడ్లను దాఖలు చేసేందుకు మార్చి 6వరకు సమయం ఇచ్చారు. ప్రభుత్వం, ఓఎన్జీసీ కలసి నూరు శాతం వాటాను విక్రయించే యోచనతో ఉన్నాయి. ‘‘ఒకే ఒక్క ఇన్వెస్టర్ నుంచి ఫైనాన్షియల్ బిడ్ వచ్చిందని ఈ లావాదేవీ వ్యవహారాలు చూసే (ట్రాన్సాక్షన్ అడ్వైజర్) సంస్థ మాకు సమాచారమిచ్చింది. ఈ బిడ్ విషయంలో ముందుకు వెళ్లాలా? లేక తిరిగి ఈ ప్రక్రియను మొదట నుంచి ఆరంభించాలా? అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికలయ్యే వరకు వేచి చూసి, ఆ తర్వాత ఏర్పడే ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది’’ అని ఆ అధికారి వెల్లడించారు. మే 23న ఫలితాల వెల్లడితో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిపోనున్న విషయం తెలిసిందే. -
నల్లగొండలో ప్రచారానికి.. గులాబీ పదును!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక వ్యూహం అమలు చేస్తోంది. ప్రచారానికి అతి తక్కువ సమయమే మిగిలి ఉండడంతో నియోజకవర్గస్థాయి సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా గ్రామ గ్రామం తిరిగి కార్యకర్తలను కలిసేంత సమయం ఈ ఎన్నికలకు లేదు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే.. తక్కువ సమయంలో ఎక్కువ మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసేలా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుపుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి అన్న అంశాలను స్థానిక కేడర్‌కు వివరించడమే ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశంగా పేర్కొంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా ఎమ్మెల్యేలు ఈ బాధ్యతను భుజాన వేసుకుని ప్రచారం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు మండలాలను, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు గ్రామాల బాధ్యతను అప్పజెబుతూ కిందిస్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా ప్రచారంలో మమేకం చేసేలా వ్యూహం సిద్ధం చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు ప్రచారంలో విస్తృతంగా తిరిగి ప్రజలను కలిశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం మరోమారు గ్రామాలకు వెళ్లేందుకు, ప్రజలను కలిసి వివరించేందుకు తయారవుతున్నారు. రోజుకు రెండు చొప్పున సమావేశాలు శనివారం నల్లగొండ, సూర్యాపేటలో నియోజకవర్గ కార్యకర్తలను సమీకరించి సభలు నిర్వహించారు. ఆదివారం దేవరకొండ, హుజూర్‌నగర్‌లో మీటింగులు ఏర్పాటు చేశారు. 26వ తేదీన మిర్యాలగూడ, కోదాడ నియోజకవర్గంలో సమావేశాలు ఉంటాయి. 27వ తేదీన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సమావేశం జరగనుంది. ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ ఉంటుంది. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు సైతం ప్రచారంలో భాగంగా రోడ్‌షోలలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ అభ్యర్థి మెజారిటీ కోసం ఎమ్మెల్యేలకు టార్గెట్లు నల్లగొండ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు టీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. దీంతో ఏ సెగ్మెంటుకు ఆ సెగ్మెంటు ఎమ్మెల్యేకే అన్ని బాధ్యతలు అప్పజెప్పారు. ఆయా సెగ్మెంట్ల పరిధిలో ఎక్కువ పోలింగ్ జరిగేలా.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల కంటే అత్యధిక ఓట్ల మెజారిటీ పార్టీ ఎంపీ అభ్యర్థికి వచ్చేలా కృషి చేయాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలకే పెట్టారు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్ల మెజారిటీ కంటే ఈసారి మరిన్ని ఓట్లు వచ్చేలా టార్గెట్లు పెట్టారని అం టున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి 1.93లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. అప్పుడు ఒక్క సూర్యాపేట మినహా ఆరు చోట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో ఇది సాధ్యమైందన్న అభిప్రాయం ఉంది. ఈసారి ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయ్యింది. ఆరు శాసన సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలవగా, ఒక్కచోట మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వచ్చిన ఆధిక్యం 1.07లక్షల ఓట్లు. అయితే, హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు వచ్చిన ఏడువేల ఓట్ల మెజారిటీని తీసేసినా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓట్ల అధిక్యం ఒక లక్ష. ఈ మెజారిటీ సరిపోదని, ఏడు సె గ్మెం ట్లలో ప్రతిచోటా కనీసం పాతిక వేల నుంచి 30వేల ఓట్ల మెజారిటీ కోసం ఎమ్మెల్యేలు కృషి చేస్తే.. పార్టీ అభ్యర్ధి మెజారిటీ రెండు లక్షలు దాటుతుందని లెక్కలు గడుతున్నారు. ఈ మేరకు మెజారిటీ సాధించేందుకు ఎమ్మెల్యేలపై బాధ్యత పెట్టారని, దానిలో భాగంగానే నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుపుతున్నారని పేర్కొంటున్నారు. కాగా, ప్రతి సమావేశానికి అభ్యర్థితో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు, కార్పొరేషన్ పదవుల్లో ఉన్న వారు హాజరవుతారని చెబుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను రాబట్టేలా ఎన్నికల ప్రచార వ్యూహాన్ని గులాబీ నేతలు అమలు చేస్తున్నారు. -
కాంగ్రెస్.. వ్యూహాత్మకం!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, నల్లగొండ లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ సీనియర్లకే టికెట్లు దక్కాయి. ముందునుంచీ ప్రచారానికి భిన్నంగా పార్టీ నాయకత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. తమకు పట్టున్న జిల్లాలో, ఆ పట్టును కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా తమ అభ్యర్థులను ఎంపిక చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లగొండ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా తమకు బాగా పట్టున్న నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం (పూర్వపు మిర్యాలగూడ నియోజకవర్గంలోని సెగ్మెంట్లు నల్లగొండలో కలిశాయి)లో తమకు గెలుపునకు అవకాశాలు మెండుగా ఉంటాయన్న అంచనాతో అభ్యర్థుల ఖరారు విషయంలో సకల జాగ్రత్తలు తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవడం లేదని, ఇక్కడి స్థానాన్ని దక్కించుకునేందుకు సీరియస్‌గానే ఉన్నామన్న సంకేతాలను పంపించేందుకే ఏకంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని బరిలోకి దింపుతోందని విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో నల్లగొండనుంచి కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ ఎన్నికల్లో అనుకూలంగా పవనాలు వీచినా, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏకంగా ఆరు అసెంబ్లీ స్థానాలతోపాటు, నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని అత్యధికంగా 1.93లక్షల మెజారిటీతో కైవసం చేసుకుంది. దీంతో తమ ఓటు బ్యాంకు ఎంత బలమైందో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నిరూపించుకుంది. కానీ, 2018 అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం హుజూర్నగర్ మాత్రమే నిలబెట్టుకుని మిగిలిన ఆరు స్థానాలు కోల్పోయింది. వాటిని టీఆర్ఎస్ దక్కించుకుంది. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఆ అవకాశం ఇవ్వకుండా గట్టి అభ్యర్థిని పోటీకి పెట్టాలన్న వ్యూహంలో భాగంగానే పీసీసీ సారథిని నిలబెడుతున్నారని పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌కు... అగ్నిపరీక్ష ఈ పార్లమెంటు ఎన్నికల్లో వాస్తవానికి కాంగ్రెస్‌కు ఒక విధంగా అగ్నిపరీక్షే కానుంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ గెలవగా, ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ 1,07,601 ఓట్లు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ విజయం సాధించినా.. అక్కడి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేవలం 7,466 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఈ మెజారిటీని మినహాయించి చూసినా.. టీఆర్ఎస్ లక్ష ఓట్ల మెజారిటీని కలిగి ఉంది. అంతే కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఆరుగురు ఎమ్మెల్యేలు నిలవనుండగా, కాంగ్రెస్ అభ్యర్థి ఒక విధంగా ఒంటరి పోరు చేయాల్సిందే. గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. నాటి ఎంపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్ల మెజారిటీని పోలిస్తే.. టీఆర్ఎస్.. కాంగ్రెస్‌లు సమ ఉజ్జీలుగా ఉన్నట్టే లెక్క. అంతే కాకుండా నాగార్జున సాగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో మాత్రం టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యమే వచ్చింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం తమదే అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోతే పోటీపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు. -
పోలీసులకు సవాల్..
సాక్షి, వనపర్తి క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెలరోజులుగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. వ్యాపార దుకాణాలు, ఆలయాలు, ఇళ్లు తేడా లేకుండా వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు దగ్గరవుతున్న పోలీస్ యంత్రాంగం చోరీల విషయంలో ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో రోజురోజుకు వారిపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లుతోంది. చోరీల పర్వం ఇలాగే సాగితే.. పోలీస్ శాఖపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. దొంగతనం జరిగినప్పుడే హడావుడి.. దొంగతనం జరిగినప్పుడే క్లూస్ టీం, ఇతర పోలీస్ అధికారులు హడావుడి చేయడం, ఆ తర్వాత ఆ ఊసే మరిచిపోవడంతో చోరీలు యధావిధిగా కొనసాగుతున్నాయి. తరుచూ జరుగుతున్న దొంగతనాలను చేధించడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న చిన్న చోరీలను పోలీసులు నామమాత్రంగా వదిలేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా.. దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. రాత్రివేళలోనే కాకుండా పట్టపగలే చోరీలకు పాల్పడుతూ ఆనవాళ్లు దొరకకుండా విజృంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో నిత్యం ఏదో ఒకచోట దొంగతనం జరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తే అరికట్టవచ్చని ప్రజలు అంటున్నారు. దేవాలయాల్లో.. చోరీలకు అలవాటుపడిన కొందరు దేవాలయాలను కూడా వదలడంలేదు. ఆలయాల్లోకి చొరబడి మరీ హుండీలను పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు దేవాలయాల్లో వరుస హుండీల దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారింది. ఫిబ్రవరి 27 వనపర్తి మండలం నాగవరం కోదండరామస్వామి ఆలయం, రాజనగరం అయ్యప్ప దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని హుండీలను పగులగొట్టి నగదును ఎత్తికెళ్లారు. ఈ నెల 1న అర్ధరాత్రి చిన్నచింతకుంట మండలం కురుమూర్తిస్వామి ఆలయంలో హుండీని పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. మంగళవారం కొత్తకోట మండల శివారులోని వెంకటగిరి, పట్టణంలోని సాయిబాబ, కోట్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీలను పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. అదేవిధంగా వెంకటగిరి ఆలయంలో శఠగోపంతోపాటు తీర్థం పోసే పాత్ర ఎత్తుకెళ్లారు. ఆలయాల్లో జరుగుతున్న వరుస హుండీల చోరీలతో ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతుంది. -
‘వ్యూహాత్మక’ విక్రయానికి ఓకే
పీఎస్యూలపై కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) మెజారిటీ వాటాల (వ్యూహాత్మక) విక్రయానికి తిరిగి కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో గురువారం ఇక్కడ సమావేశమైన కేబినెట్ ఇందుకు ఆమోదముద్ర వేసింది. సమావేశం తరువాత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు ఈ విషయం తెలిపారు. లాభాల్లో ఉన్న సంస్థల్లో వాటాల విక్రయాలు కూడా ఉంటాయని ఇప్పటికే ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. వాటాల విక్రయాలకు సిద్ధమవుతున్న కంపెనీలు ఏమిటన్న ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, ‘ఆయా సంస్థల వాటాల్ని వేలంలో ఉంచినప్పుడే ఈ విషయం వెల్లడవుతుంది’ అని అన్నారు. విక్రయాలకు సంబంధించి నీతి ఆయోగ్ చేసిన సిఫారసులు అన్నింటినీ కేబినెట్ పరిశీలించిందని పేర్కొన్నారు. వాటాల అమ్మకానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని కూడా తెలిపారు. పెట్టుబడుల ఉపంసంహరణల విభాగం, ఆయా మంత్రిత్వశాఖలు పరిశీలించిన తర్వాత, వాటాల విక్రయాలకు సంబంధించి కంపెనీ వ్యవహారాలను వేర్వేరుగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వాటాల విక్రయాలకు ధర మదింపు గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘ఒక నిర్దిష్ట పక్రియలో ఇది ఉంటుంది. ఇక్కడ పారదర్శకతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది’ అని అన్నారు. రేటు నిర్ణయానికి సూత్రాలు ఖరారు! విక్రయించాల్సిన ధర విషయంపై ఐదు విధానాలు రూపొందాయి. ఆయా రంగాల్లో సమాన హోదాలో ఉన్న ఇతర కంపెనీలకు సంబంధించిన ధర, క్యాష్ ఫ్లో బ్యాలెన్స్ షీట్, అసెట్ విలువ, వ్యాపార లావాదేవీ విలువల వంటివి వీటిలో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక వాటాల విక్రయాలకు వివిధ రంగాల్లోని 12 కంపెనీలను గుర్తించినట్లు సమాచారం. పన్నెండేళ్ల తరువాత.. దాదాపు పన్నెండేళ్ల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. వ్యూహాత్మక వాటాలను ప్రైవేటు కంపెనీలకు విక్రయించడం ద్వారా నిధుల సమీకరణే కాకుండా ఆయా సంస్థల పనితీరు విషయంలో అత్యున్నత స్థాయి సామర్థ్యం, వ్యాపారతత్వం, పారదర్శకత తీసుకుని రావాలన్నది కేంద్రం లక్ష్యం. నీతి ఆయోగ్ చేసిన సిఫారసుల మేరకు ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) ఇప్పటికే వ్యూహాత్మక డిజిన్వెస్ట్మెంట్కు ఒక నమూనాను ఖరారు చేసిందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. మొత్తంమీద తాజా జాబితాలో లాభదాయక భారత్ ఎర్త్ మూవర్స్ అండ్ సర్టిఫికేషన్ ఇంజినీర్స్ ఇంటర్నేషనల్‌తో పాటు, నష్టాల్లో ఉన్న స్కూటర్స్ ఇండియా కూడా ఉన్నట్లు సమాచారం. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2016-17 బడ్జెట్ ప్రసంగంలో వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20,500 కోట్ల సమీకరణలను లక్ష్యంగా నిర్దేశించారు. 2003-04లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జెసాప్ అండ్ కోలో చివరిసారి వ్యూహాత్మక వాటా విక్రయాలను చేపట్టింది. 1999-2000లో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే తొలి మెజారిటీ వాటా విక్రయాలు జరగడం గమనార్హం. 1999-2000, 2003-04 మధ్యకాలంలో ప్రభుత్వం 16 ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.6,344 కోట్లు సమీకరించింది. వీటిలో పెట్రో రిటైలర్ ఐబీపీ లిమిటెడ్, ఇండియన్ పెట్రోకెమికల్ కార్పొరేషన్, వీఎస్ఎన్ఎల్, హిందుస్తాన్ జింక్ వంటి సంస్థలు ఉన్నాయి. -
రైలు లింక్ ఒప్పందం కుదిరింది..
బీజింగ్: చైనా, నేపాల్ దేశాలు ప్రధాన మైలు రాయిని దాటాయి. నేపాల్ ప్రధాని కెపి ఒలి అభ్యర్థనను చైనా అంగీకరించడంతో ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉన్న చైనా-నేపాల్ లింక్ రైల్ నిర్మాణంతో పాటు పది ఒప్పందాలపై సంతకాలు చేసి, ఇరు దేశాలమధ్య సంబంధాలను సుస్థిరం చేసుకున్నాయి. ప్రతి విషయానికీ నేపాల్ భారతదేశంపై ఆధారపడటాన్ని తగ్గించడంలో భాగంగా చైనా నుంచి టిబెట్ మీదుగా నేపాల్ కు వ్యూహాత్మక రైల్వే లింక్ నిర్మాణానికి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నేపాల్ ప్రధాని కెపి ఒలి ఏడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం చైనా చేరుకున్నారు. ఆయనకు చైనా ప్రీమియర్ కెక్వాంగ్ గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ లో రెడ్ కార్పెట్ తో ఘన స్వాగతం పలికారు. చైనా అధ్యక్షుడు క్సి జిన్ పింగ్ కు కూడ పిలుపినిచ్చారు. అయితే నేపాల్ లో ప్రభుత్వ మార్పు... అక్కడే స్థిరపడ్డ భారతీయులు వ్యతిరేకించడం, నేపాల్ సరిహద్దుల్లో ఇద్దరు భారతీయుల్ని నేపాల్ భద్రతా దళాలు కాల్చి చంపడం వంటి అనేక సంఘటనలు ఇటీవల భారత్, నేపాల్ దేశాల మధ్య సహృద్భావ వాతావరణాన్ని దెబ్బ తీశాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా, నేపాల్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, సరఫరా మార్గాలను పెంపొందించుకొనేందుకు నేపాల్ ప్రధాని పర్యటన ప్రధాన్యత నిచ్చింది. అయితే చర్చల సందర్భంగా ఇద్దరు ప్రధానమంత్రులు ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష చేసి, ఇరు దేశాలమధ్య క్రమంగా పెరుగుతున్న సంబంధాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, అవగాహన కుదిరిందని, అలాగే అన్ని రంగాల్లో లాభదాయకమైన సహకారం ఉంటుందని నేపాల్ విదేశాంగ శాఖ జారీ చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ట్రేడ్ విస్తరణ, సీమాంతర మార్గాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉత్పాదనలో పరస్పర సహకారం, పర్యాటకం, ఫైనాన్స్, విద్య మరియు సంస్కృతి లపై ప్రధానంగా ప్రధానులిద్దరూ చర్చించినట్లు తెలిపింది. ముఖ్యంగా లీ, ఒలి లు చర్చల్లో చైనా నుంచి టిబెట్ మీదుగా నేపాల్ కు రైల్వే మార్గం నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.