stressed students
-
ఎందుకీ ఆత్మహత్యల పరంపర?.. రాజస్తాన్ కోటాలో ఏం జరుగుతోంది?
రాజస్తాన్‌లోని కోటా. ప్రవేశ పరీక్షల కోచింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్యలకు కోటలా మారింది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 18 మంది నిండు ప్రాణాలను తీసుకున్నారు. ఈ ఆత్మహత్యలకి కారణలేంటి ? విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించలేరా? కోటాలో ఏ కోచింగ్ సెంటర్లో అడుగుపెట్టినా కళ్లు చెదురుతాయి. పెద్ద రిసెప్షన్ హాలు, లగ్జరీ ఫరీ్నచర్, గోడలకి పెయింటింగ్‌లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ సిస్టమ్, ఫైవ్ స్టార్ హోటల్స్‌ని తలపించేలా సకల సదుపాయాలు. ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఆశతో కలలు కనే విద్యార్థులకు కావల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవడానికి దేశం నలుమూలల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఐఐటీ, ఐఐఎంలలో అత్యధిక మందికి సీటు లభిస్తున్నప్పటికీ చాలా మందిలో భవిష్యత్‌పై భరోసా కూడా కరువు అవుతోంది. రాను రాను విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కొందరు హాస్టల్ భవనంపై నుంచి దూకి, మరికొందరు సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని , కొందరు సూసైడ్ నోట్ రాసి మరికొందరు మౌనంగా కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన బహదూర్, రాజస్తాన్ జలోర్‌కు చెందిన పుషే్పంద్ర సింగ్ , బిహార్‌కు చెందిన భార్గవ్ మిశ్రా, యూపీకి చెందిన మంజోత్ చాబ్రా, ఇప్పుడు యూపీలోని అజమ్‌గఢ్‌కు చెందిన మనీశ్ ప్రజాపతి .. గత కొద్ది రోజుల్లో కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు వీరంతా. అందరూ 16 నుంచి 19 ఏళ్ల వయసు మధ్యనున్న వారే. మనీష్ నాలుగు నెలల క్రితమే కోటాలో ఇంజనీరింగ్ కోచింగ్‌లో జాయిన్ అయ్యాడు. బుధవారమే అతని తండ్రి వచ్చి కొడుకుని చూసి క్షేమసమాచారాలు అడిగి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన తన ఊరు చేరకుండానే మనీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచి్చంది. అంతే ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. ఈ మధ్య కాలంలో కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 12 ఏళ్లలో 150 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిçÜ్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత కోచింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాక 2021లో నలుగురు ఆత్మహత్యకు పాల్పడితే, 2022లో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 18 మంది బలవన్మరణం చెందారు. ప్రధాని హోదాకు తగని ప్రసంగం గురువారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. ప్రధాని మోదీ రెండు గంటల ప్రసంగమంతా హాస్యం, వ్యంగ్యం, అసందర్భ వ్యాఖ్యలతోనే గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ లాంటి తీవ్రమైన, సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు నవ్వడం, ఎగతాళి చేయడం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తగదు’అని ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. ► ఇది పోటీ ప్రపంచం. వంద సీట్లు ఉంటే లక్ష మంది పరీక్ష రాస్తున్నారు. అంత పోటీని తట్టుకొని విజయం సాధించడం సులభం కాదు. అందుకే విద్యార్థులు ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టుగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. తాము కన్న కలలు కల్లలవుతాయన్న భయంతో నిండు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ► కోటాలో ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్లో యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువ. ఆ విద్యార్థులు వారి స్కూల్లో ఫస్ట్ ర్యాంకర్స్. దీంతో తల్లిదండ్రులు గంపెడాశలతో అప్పో సప్పో చేసి కోటాలో చేరి్పస్తున్నారు. తమ స్కూల్లో హీరోగా వెలిగిన విద్యారి్థకి అక్కడికి రాగానే తాను లక్షల మందిలో ఒకడినన్న వాస్తవం తెలుస్తుంది. మిగిలిన విద్యార్థులతో నెగ్గుకు రాలేక, తల్లిదండ్రుల్ని నిరాశపరచలేక ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ► కోటాలో కోచింగ్ తీసుకునే విద్యార్థులు రోజుకి 16–18 గంటల చదవాలి. ఉదయం 6.30 నుంచి మళ్లీ అర్థరాత్రి 2 వరకు తరగతులు ఉంటాయి. అంటే విద్యార్థి పడుకోవడానికి ఇచ్చే సమయం కేవలం నాలుగు గంటలు. మధ్యలో తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ‘‘ఏదో ఒకరోజు బాగా నిద్ర వచ్చి పావుగంట ఎక్కువ సేపు పడుకుంటే గిల్టీగా ఫీలవుతాను. తోటి వారి కంటే వెనకబడిపోతానన్న భయం వేస్తుంది. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటాను’’ అని ఐఐటీకి ప్రిపేర్ అవుతున్న సమర్ అనే విద్యార్థి చెప్పాడు. కంటినిండా నిద్రకి కూడా నోచుకోని చదువుల భారం వారి ప్రాణాలు తోడేస్తోంది. ► కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కోవిడ్ తర్వాత మరింత ఎక్కువయ్యాయి. కరోనా సమయంలో విద్యార్థులకి చదివే అలవాటు తప్పిపోయింది. దానికి తోడు కోవిడ్ సోకిన వారిలో మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. చదువుల ఒత్తిడి మరింతగా కుంగదీస్తోంది. ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. ► కోటాలో కోచింగ్‌కే ఏడాదికి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా అవుతుంది. నిరుపేద కుటుంబాల విద్యార్థులకి తల్లిదండ్రులు చేసిన అప్పే ఎప్పుడూ కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ లేత మనసులపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో కోచింగ్ సెంటర్ల పరీక్షల్లో ఫెయిలైనా జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఆత్మహత్యకి నివారణ మార్గాలేంటి ? విద్యార్థుల వరస ఆత్మహత్యలతో కోచింగ్ సిటీ కోటాపై వ్యతిరేకత పెరిగిపోతూ ఉండడంతో రాజస్తాన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. 24/7 పనిచేసే హెల్ప్‌లైన్ నెంబర్లు, పోలీసుల ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేశారు. కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రత్యేకంగా కౌన్సెలర్లను నియమించి ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. మానసిక ప్రశాంతతనిచ్చే యోగా, ధ్యానం, జుంబా డ్యాన్స్‌లు వంటి క్లాసులు కూడా కొన్ని కోచింగ్ సెంటర్లలో కనిపిస్తున్నాయి. అయితే ఈ చర్యలు సరిపోవని అనూ గుప్తా అనే టీచర్ చెబుతున్నారు. కోచింగ్ సెంటర్ యాజమాన్యాలు 24 గంటలూ పోటీ పరీక్షల్లో టెక్నిక్కులను బోధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప జీవితంలో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో, పోటీ ప్రపంచంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించే పోరాటస్ఫూర్తిని విద్యార్థుల్లో కలి్పంచడం లేదని అనూ పేర్కొన్నారు. ఎలాగైనా బతకగలమన్న ధీమా విద్యార్థుల్లో నింపినప్పుడే ఆత్మహత్యల్ని నివారించవచ్చునని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చదువు మీద పెట్టే సమయానికి, ఇతర కార్యక్రమాలకి ఇచ్చే సమయానికి మధ్య సమతుల్యత ఉండాలని అహ్లా మాత్రా అనే సైకాలజిస్ట్ చెప్పారు. రోజుకి 18 గంటలు చదువు రుద్దేయడం వల్ల మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల్ని కోటా ఫ్యాక్టరీకి పంపించే ముడి పదార్థాలుగా చూస్తున్నారని ఇప్పుడు వారిపై పెట్టుబడి పెడితే భవిష్యత్‌లో వారు ఉపయోగపడతారన్న ధోరణి నుంచి బయటకు రావాలని అవిజిత్ పాఠక్ అనే సైకాలిజిస్టు సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల నియంత్రణ బిల్లుని తీసుకురావాలని భావిస్తోంది.ఆ బిల్లు వెంటనే తీసుకువచ్చి విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టిక్‌టాక్‌తో ఒత్తిడి చిత్తు!
సాక్షి, హైదరాబాద్: పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థుల్లో టెన్షన్.. టెన్షన్.. సరిగ్గా చదవకపోవడం, తల్లిదండ్రుల ఒత్తిడి, క్లాస్‌మేట్స్‌తో పోటీ.. ఇలా ఒత్తిడికి కారణాలు బోలెడు! అనుకున్న మార్కులు రాకపోతే అఘాయిత్యాలకు పాల్పడేది కూడా ఒత్తిడి వల్లే.. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2014–2016 మధ్యకాలంలో దేశం మొత్తం మీద 26 వేల మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడితే.. వీరిలో పరీక్షల్లో ఫెయిలైన కారణంగా తనువు చాలించిన వారు 7,462 మంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. పరీక్షల చుట్టూ ఉన్న ఒత్తిడిపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు ‘సేవ్ ది చిల్డ్రన్’స్వచ్ఛంద సంస్థ ఓ వినూత్నమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వీడియో అప్లికేషన్ ‘టిక్‌టాక్’ఈ ప్రయత్నానికి తనవంతు సాయం అందిస్తోంది. వీడియోల రూపంలో చిట్కాలు.. పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటి గురించి తెలిస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. సేవ్ ది చిల్డ్రన్, టిక్‌టాక్‌లు ఇదే పనిచేస్తున్నాయి. "# BeatTheStress’ కార్యక్రమం కింద సేవ్ ది చిల్డ్రన్ కార్యకర్తలు ఒత్తిడిని జయించే చిట్కాలను వీడియోల రూపంలో అందిస్తారు. పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి? ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? వంటి అనేక అంశాలపై టిక్‌టాక్ ద్వారా వీడియో సందేశాలు అందిస్తారు. ఉదాహరణకు సమాధానాలు బాగా వచ్చిన ప్రశ్నలకు ముందు సమాధానాలు రాయడం. తద్వారా ప్రశ్నపత్రాలు దిద్దే వారిలో ఆ విద్యార్థిపై సానుకూల దృక్పథం ఏర్పడుతుందని, తద్వారా మంచి మార్కులు సాధించొచ్చని ఓ నిపుణుడు చెప్పడం ఒక వీడియోలో ఉంటే.. మరో వీడియోలో పరీక్షలు ముఖ్యమే గానీ.. జీవితం అంతకంటే ఎక్కువ విలువైందన్న సందేశం కూడా ఉంటుంది. చిన్నచిన్న పాటలు, గేయాలు, సరదా సన్నివేశాలు, యానిమేషన్లు, జీఐఎఫ్లన్నింటినీ వాడుతూ విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉంచేందుకు బీట్ ది స్ట్రెస్ కార్యక్రమం ద్వారా ప్రయత్నిస్తున్నట్లు టిక్‌టాక్ ఫర్ గుడ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ సుబి చతుర్వేది తెలిపారు. చదువును ఒక వేడుకగా చేసేందుకు, తద్వారా విద్యార్థుల విపరీత ఆలోచనలను నివారించేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని సేవ్ ది చిల్డ్రన్కు చెందిన జ్యోతి నాలే తెలిపారు. -
నిద్ర పట్టడం లేదా.. అయితే గుంటూరు జీజీహెచ్‌కు రండి
ఆ బాలిక పేరు మానస. నిండా 13 ఏళ్లు కూడా లేవు. ఆమెకు ఆరోగ్య సమస్యలేమీ లేవు. కానీ.. ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. చాలామంది డాక్టర్లకు చూపించారు. నిద్ర మత్తు ఆవహించే మందుల్ని కూడా ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో చెబితే.. తల్లిదండ్రులు ఆమెను గుంటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి న్యూరాలజీ విభాగంలో చూపించగా.. అక్కడి స్లీప్ ల్యాబ్‌లో రాత్రంతా ఉంచి పరీక్షలు చేశారు. చదువుల ఒత్తిడి వల్లే బాలిక నిద్రపోవటం లేదనే విషయాన్ని వైద్యులు నిర్థారించి.. కంటి నిద్ర రావటానికి వీలుగా తగిన సూచనలిచ్చారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. గుంటూరు (మెడికల్) సాధారణంగా వయసు మీరిన వారికి నిద్ర పట్టదని అనుకుంటారు. కానీ.. చిన్న పిల్లలూ, యువకులు సైతం నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి, స్మార్ట్ ఫోన్స్ యుగంలో ప్రతి ఒక్కరూ కాలంతో పరుగులు తీస్తుండటం వల్ల పాఠశాల విద్యార్థి మొదలుకుని పెద్దవారి వరకు అనేక మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. లేనిపక్షంలో అనేక అనర్థాలు తలెత్తుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న ఎందరికో పరిష్కారాన్ని చూపిస్తోంది గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్). తొలి ఆస్పత్రిగా రికార్డు ‘మీకు నిద్ర పట్టడం లేదా.. అయితే గుంటూరు జీజీహెచ్‌కు రండి’ అని ఆహ్వానిస్తున్నారు అక్కడి వైద్యులు. నిద్ర పట్టకపోవటానికి గల కారణాలను వైద్య పరీక్షల ద్వారా తెలుసుకుని హాయిగా నిద్రపోయేందుకు అవసరమైన వైద్యాన్ని జీజీహెచ్ డాక్టర్లు అందిస్తున్నారు. ఇక్కడి న్యూరాలజీ వైద్య విభాగంలో నిద్ర ప్రయోగ శాల (స్లీప్ ల్యాబ్)ను దాతల సాయంతో ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లీప్ ల్యాబ్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి రికార్డు సృష్టించింది. నాట్కో ఫార్మా కంపెనీ చైర్మన్ నన్నపనేని వెంకయ్యచౌదరి ఇక్కడి ల్యాబ్‌కు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు రూ.20 లక్షల ఆర్థిక సాయం చేశారు. నిద్ర సమస్యలకు చెక్ పెట్టొచ్చు తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత లోపించడం, సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, నిరాశ, నిస్సత్తువ, నీరసం, విసుగు, తలనొప్పి, ఇతర రుగ్మతలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడేవారు శారీరక, మానసిక పటుత్వాన్ని కోల్పోతారు. ఉద్విగ్నతలకు లోనవుతారు. మనిషి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోని పక్షంలో పై రుగ్మతలతో పాటు గుండెపోటు సైతం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా నిద్రపట్టదు. ఊబకాయంతో ఉన్నవారు సైతం రాత్రిళ్లు నిద్రపట్టక గురక సమస్యతో నిద్రాభంగమై ఇబ్బంది పడతారని, నిద్రలో నడవడం, నిద్రలోనే సైకిల్ తొక్కినట్లు కాళ్లు కదిలించడం, ఫిట్స్ రావడం వల్ల నిద్రపోవటానికి భయపడతారని వైద్యులు వివరిస్తున్నారు. రుగ్మతల నిర్ధారణకు స్లీప్‌ల్యాబ్ ఈ రుగ్మతలు రావడానికి గల కారణాలు నిర్ధారించేందుకు స్లీప్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. కొంతమంది రాత్రివేళలో నిద్రపోకుండా, పగటి పూట నిద్రిస్తుంటారు. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అనేకం ఉంటాయి. ఎలాంటి సమయాల్లో నిద్రపోవాలి, నిద్ర పోకపోతే ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయనే విషయాలను స్లీప్ డిజార్డర్‌తో బాధపడేవారికి స్లీప్ ల్యాబ్‌లో వైద్య పరీక్షలు చేసి వివరిస్తున్నారు. నిద్రపట్టకపోవడానికి గల కారణాలు తెలుసుకోవడం ద్వారా సమస్యను త్వరితగతిన సులభంగా నయం చేయవచ్చని, అందుకోసం స్లీప్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ సుందరాచారి తెలిపారు. పరీక్షల విధానం ఇలా.. ఒక్కో వ్యక్తికి వైద్య పరీక్ష చేసేందుకు సుమారు 8 గంటలకు పైగా సమయం పడుతుంది. ► సుమారు 30 నుంచి 40 వరకు వైర్లను శరీరంలోని వివిధ భాగాలకు అతికిస్తారు. ► రాత్రి వేళల్లో సహజ సిద్ధంగా నిద్రించే సమయంలో ఈ పరీక్ష నిర్వహించటం ద్వారా కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ► ఇక్కడి ల్యాబ్‌లో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు పరీక్షలు చేస్తారు. – ఆస్పత్రి ఓపీ విభాగంలో మంగళ, గురు, శనివారం న్యూరాలజీ విభాగానికి వచ్చిన వారికి నిద్ర సమస్యలు ఉంటే స్లీప్ల్యాబ్లో పరీక్ష చేసి చికిత్స అందిస్తారు. ► వైద్య పరీక్షలు చేసే సమయంలో ప్రత్యేక శిక్షణ పొందిన న్యూరో టెక్నీషియన్‌తో పాటు ఒక డాక్టర్, రోగి అటెండెంట్ ఉంటారు. ► నిద్ర సమస్యలపై పరిశోధన చేసేందుకు ఒక పీజీ డాక్టర్‌ను ప్రత్యేకంగా నియమించారు. రెండేళ్లుగా ఉచిత పరీక్షలు స్లీప్‌ల్యాబ్‌ను 2017 జూలైలో ప్రారంభిం చినా వైద్య పరీక్షలు మాత్రం 2018 జనవరి నుంచి చేస్తున్నాం. 2018లో 47 మందికి, 2019 లో 40 మందికి స్లీప్ ల్యాబ్‌లో పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించాం. నిద్ర సమస్యలతో వచ్చే వారిలో మగవారే ఎక్కువగా ఉంటున్నారు. 13 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపు వారు కూడా నిద్ర సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం రావటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువగా 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారు నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రంలో కేవలం గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే నిద్రలేమి సమస్యలను నిర్ధారించే పాలిసోనోగ్రఫీ (పీసీజీ) పరీక్ష చేస్తున్నాం. సుమారు రూ.25 వేలు ఖర్చయ్యే ఈ పరీక్షను న్యూరాలజీ విభాగంలో ఉచితంగా చేస్తున్నాం. – డాక్టర్ నాగార్జునకొండ సుందరాచారి, విభాగాధిపతి, న్యూరాలజీ వైద్యం -
16న విద్యార్థులతో మోదీ ‘టౌన్ హాల్’ భేటీ
న్యూఢిల్లీ: పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, సన్నద్ధమవ్వాల్సిన అవసరాన్ని వివరించేందుకు ప్రధాని∙మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులతో సమావేశం కానున్నారు. ఈ నెల 16న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో లేదా ఇందిరా గాంధీ మైదానంలో విద్యార్థులతో ముచ్చటించనున్నారు. విద్యార్థుల ప్రశ్నలకు సామాజిక మాధ్యమాలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ సమాధానాలిస్తారు. -
12 మంది విద్యార్థుల ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 10, 12 తరగతుల పరీక్ష పలితాలు శుక్రవారం విడుదలవ్వగా ఉత్తీర్ణత సాధించలేకపోయిన 11 మంది విద్యార్థులు తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఒకే ఇంటికి చెందిన అక్కా తమ్ముళ్లు(సాంతా జిల్లా) రష్మీ(18) దీపేంద్ర(15) కూడా ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. జాబల్పూర్కు చెందిన విద్యార్థిని ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చాయని రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. రాజధాని భోపాల్‌కు చెందిన నమన్ కడ్వే అనే 10వ తరగతి విద్యార్థి మాత్రం 90 శాతం మార్కులు వస్తాయని ఊహించగా 74 శాతం మార్కులే రావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 12కు చేరింది. ఫలితాలు వెలువడిన వెంటనే సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు హెల్ప్‌లైన్ నంబర్లకు విద్యార్థుల నుంచి ఫోన్స్ కాల్స్ పోటెత్తాయి. 12 తరగతి పరీక్షల్లో 72 శాతం మంది బాలికలు, 64.16 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. 67.87 శాతం ఉత్తీర్ణత నమోదయింది. 10వ తరగతి పరీక్షల్లో బాలికలు 51.43 శాతం, బాలురు 48.53 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 49.86 శాతం ఉత్తీర్ణత నామోదయింది.