12 మంది విద్యార్థుల ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 10, 12 తరగతుల పరీక్ష పలితాలు శుక్రవారం విడుదలవ్వగా ఉత్తీర్ణత సాధించలేకపోయిన 11 మంది విద్యార్థులు తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఒకే ఇంటికి చెందిన అక్కా తమ్ముళ్లు(సాంతా జిల్లా) రష్మీ(18) దీపేంద్ర(15) కూడా ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు.
జాబల్‌పూర్‌కు చెందిన విద్యార్థిని ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయని రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. రాజధాని భోపాల్‌కు చెందిన నమన్ కడ్వే అనే 10వ తరగతి విద్యార్థి మాత్రం 90 శాతం మార్కులు వస్తాయని ఊహించగా 74 శాతం మార్కులే రావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 12కు చేరింది.
ఫలితాలు వెలువడిన వెంటనే సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు హెల్ప్‌లైన్ నంబర్లకు విద్యార్థుల నుంచి ఫోన్స్ కాల్స్ పోటెత్తాయి. 12 తరగతి పరీక్షల్లో 72 శాతం మంది బాలికలు, 64.16 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. 67.87 శాతం ఉత్తీర్ణత నమోదయింది.
10వ తరగతి పరీక్షల్లో బాలికలు 51.43 శాతం, బాలురు 48.53 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 49.86 శాతం ఉత్తీర్ణత నామోదయింది.