Students Award
-
CM YS Jagan Vijayawada Tour: మీకు జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది
Updates జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. ►మీకు జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది ►గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చదువుపై ధ్యాస పెట్టలేదు ►10వ తరగతిలో రాష్ట్రస్థాయి పస్ట్ ర్యాంకర్ నగదు పురస్కార రూ. 1 లక్ష ►ద్వితీయ ర్యాంకు రూ. 75 వేలు, తృతీయ ర్యాంకు వారికి రూ. 50 వేలు నగదు పురస్కారం ►ప్రభుత్వ స్కూల్స్‌లో చదువుతున్న పేద వర్గాల పిల్లలు ప్రపంచాన్ని ఏలే రోజు వస్తుంది ►నిరుపేద వర్గాలు కూడా ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుతారు ►రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో పరీక్షా పశ్నాపత్రాలు రూపకల్పన ►అట్టడుగు వర్గాల వారే ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు ►జగనన్న ఆణిముత్యాలు పేరుతో ఈ నెల 12 నుంచ 19 వరకూ సత్కారాలు ►ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్ మైండ్స్, షైనింగ్ స్టార్, ఫ్యూచ్ ఆఫ్ ఏపీ మనది ►మన మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు, ఈరోజు మహావృక్షాలై ప్రపంచానికి అభివృద్ధి ఫలాలు అందించాలి ►ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు, కరిక్యూలమ్ అన్ని మారాయి ►ప్రతి విద్యార్థికి ట్యాబ్‌లు అందిస్తున్నాం ►ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిస్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ అందుబాటులోకి వచ్చింది. ► విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని ఈ కార్యక్రమం. మన విద్యార్థి ఏ రాష్ట్రానికి వెళ్లినా పోటీతత్వంలో నిలబడతారు. విద్యార్థులే రేపటి భవిష్యత్తుగా ఏపీ ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది అని అన్నారు. ► విజయవాడ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► విజయవాడలో అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం జగన్ ► పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది ఇంటర్లో సత్తాచాటిన 26 మంది నగదు పురస్కారంతో పాటు సర్టిఫికేట్, మెడల్ ప్రదానం ►రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు 22,710 మంది ►గత ప్రభుత్వంలో పెత్తందార్ల చేతిలో బందీ అయిన విద్యావ్యవస్థలో ప్రస్తుత ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది. లక్షల్లో డబ్బు గుంజే కార్పొరేట్ స్కూళ్ల కన్నా మిన్నగా పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించింది. ►ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చి, డిజిటల్ విద్యను ప్రవేశపెట్టి, మెరుగైన విద్యనందిస్తోంది. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక కలెక్టర్, ఒక సైంటిస్ట్, ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక లీడర్ వంటి ఆణిముత్యాలు రావాలన్న తపన, తాపత్రయంతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పనిచేస్తోంది. ►ఈ నాలుగేళ్లలో కేవలం విద్యా రంగ సంస్కరణలపైనే ప్రభుత్వం అక్షరాలా రూ.60,329 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా సంస్థల్లో చదువుతూ.. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది, ఇంటరీ్మడియట్ గ్రూపుల వారీగా టాపర్స్‌గా సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డులను ప్రదానం చేయనున్నారు. విజయవాడ ఎ–కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగే వేడుకలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులను సత్కరించనున్నారు. ►వీరితో పాటు ఉన్నత విద్యలో ఐదు కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు ‘స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డులు’ను ప్రదానం చేయనున్నారు. కార్యక్రమ వేదిక ఏర్పాట్లను సోమవారం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌లు పరిశీలించారు. 22,710 మంది విద్యార్థులకు ప్రోత్సాహం ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ కేటగిరీ విద్యాసంస్థల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జగనన్న ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పదో తరగతి, ఇంటర్లో విద్యార్థులను ఎంపిక చేసింది. పదో తరగతిలో కేటగిరీ వారీగా (జెడ్పీ, మున్సిపల్, మోడల్, ట్రైబల్/ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ తదితర) రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పాఠశాల స్థాయిలో ప్రతి స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అవకాశం కల్పించింది. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ, హెచ్ఈసీ(నాలుగు) గ్రూపుల్లో ప్రతి గ్రూపులోను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన మొత్తం 22,710 మంది విద్యార్థులకు ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’గా ప్రోత్సాహం అందించనుంది. 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో పాఠశాల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో తొలి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12 నుంచి 19 వరకు ఇప్పటికే నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్తో సత్కరించింది. వీరితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను, సంబంధిత విద్యాసంస్థలకు మొమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాళ్లను ప్రభుత్వం సన్మానించింది. జగనన్న ఆణిముత్యాలు ప్రోత్సాహకాలిలా.. పదో తరగతి విద్యార్థులకు.. - రాష్ట్రస్థాయి నగదు పురస్కారం: ప్రథమ స్థానం– రూ.1,00,000, ద్వితీయ స్థానం– రూ.75,000, తృతీయ స్థానం– రూ.50,000, విద్యార్థులు 42 మంది. - జిల్లా స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.50,000, ద్వితీయ– రూ.30,000, తృతీయ– రూ.15,000, విద్యార్థులు 609 మంది. - నియోజకవర్గ స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.15,000, ద్వితీయ– రూ.10,000, తృతీయ–రూ.5,000, విద్యార్థులు 681 మంది. - పాఠశాల స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.3,000, ద్వితీయ–రూ.2,000, తృతీయ– రూ.1,000, విద్యార్థులు 20,299 మంది. ఇంటర్ విద్యార్థులకు.. - రాష్ట్ర స్థాయి గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.1,00,000 చొప్పున 26 మంది విద్యార్థులకు ప్రదానం - జిల్లా స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.50,000 చొప్పున 391 మంది విద్యార్థులకు ప్రదానం - నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.15,000 చొప్పున 662 మందికి ప్రదానం - మొత్తం విద్యార్థుల సంఖ్య: 22,710 - ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరినీ సత్కరించనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి నగదుతో పాటు సర్టిఫికేట్, మెడల్ అందజేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇది కూడా చదవండి: కదిలిన రుతుపవనాలు..వచ్చే 4 రోజుల్లో రాష్ట్రమంతటికీ విస్తరణ -
దేశంలో ఐటీఐలు చాలా పూర్
సాక్షి, అమరావతి: దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్ధలు)ల పనితీరు చాలా పేలవంగా ఉందని, వాటిని తక్షణం సంస్కరించి, అధునాతనంగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నీతి ఆయోగ్ సూచించింది. నీతి ఆయోగ్ అధ్యయన బృందం వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటుఐటీఐలను స్వయంగా సందర్శించింది. అక్కడి విద్యార్థులు, బోధకులతో మాట్లాడటంతో పాటు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పరిశ్రమల అనుసంధానం తదితర అంశాలను పరిశీలించి, సమగ్ర అధ్యయన నివేదికను విడుదల చేసింది. దేశం మొత్తం మీద ఐటీఐల్లో శిక్షణ పొందిన వారిలో ప్లేస్మెంట్ కేవలం 0.90 శాతమే ఉందని ఆ నివేదిక పేర్కొంది. దేశం మొత్తం మీద 2021 సంవత్సరంలో 4,14,247 మంది ఐటీఐల్లో శిక్షణ పొందితే 405 మంది మాత్రమే ప్లేస్‌మెంట్స్ పొందినట్లు వెల్లడించింది. అత్యధికంగా తమిళనాడులో 7,676 మంది విద్యార్థుల్లో 248 మందికి అంటే 3.2 శాతం ప్లేస్‌మెంట్స్ పొందారని, ఆ తరువాత గుజరాత్లో 0.25 శాతం ప్లేస్‌మెంట్స్ ఉండగా మిగతా రాష్ట్రాల్లో చాలా అధ్వాన్నంగా ఉందని నివేదిక వివరించింది. దేశంలో ప్రత్యేకంగా మహిళా ఐటీఐలు 2021 నాటికి 16.83 శాతం ఉంటే అందులో చేరికలు కేవలం 6.6 శాతమే. బోధకుల్లోనూ మహిళలు 15.83 శాతమే ఉన్నారు. ఇక్కడ లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రధానాంశాలివీ.. ప్రభుత్వ ఐటీఐలకే విద్యార్థుల ప్రాధాన్యత దేశవ్యాప్తంగా 14,789 ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మొత్తం 25,38,487 సీట్లు ఉండగా, వీటిలో 48.20 శాతం సీట్లే భర్తీ అవుతున్నాయి. మొత్తం ఐటీఐల్లో 78.40 శాతం ప్రైవేటు రంగంలో, మిగతావి ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అయితే, సీట్ల భర్తీలో ప్రైవేట్‌కన్నా ప్రభుత్వ ఐటీఐలే మెరుగ్గా ఉన్నాయి. ప్రైవేటు రంగంలో 43.07 శాతం సీట్లు భర్తీ అవుతుండగా ప్రభుత్వ ఐటీఐల్లో సీట్ల భర్తీ 56.74 శాతం ఉందని నివేదిక పేర్కొంది. అత్యంత ఆదరణ పొందిన ట్రేడ్లలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మోటారు వెహికల్ మెకానిక్, డ్రాప్ట్స్‌మెన్ మొదలైనవి ఉన్నాయి. అయినప్పటికీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఉన్న సీట్లలో 64.81 శాతం, ఫిట్టర్ ట్రేడ్‌లో 71.57 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో 35.19 శాతం, ఫిట్టర్లో 28.43 శాతం సీట్లే భర్తీ అవుతున్నాయి. అప్రెంటిస్‌లుగానే ఉపాధి ఐటీఐల్లో విద్యార్ధుల అనుభవాలు మిశ్రమంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. అత్యున్నత ప్రమాణాలతో ఉన్న ఐటీఐల్లో ప్లేస్‌మెంట్స్ 80 శాతం ఉంటున్నాయి. వీటిలో చదివిన విద్యార్థులు కెరీర్ పట్ల భరోసాతో ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది సొంతంగా వెంచర్ ప్రారంభించాలన్న ఆసక్తిని కనబరుస్తున్నారు. మరికొందరు బోధకులుగా మారాలనుకుంటున్నారు. మధ్యస్థాయి, తక్కువ స్థాయి ఐటీఐల్లో అతి కొద్ది సంస్థల్లో మాత్రమే 20 శాతానికి పైగా ప్లేస్‌మెంట్స్ పొందుతున్నారు. ఐటీఐ విద్యార్థులను సంస్థలు ఉద్యోగులుగా కాకుండా అప్రెంటిస్‌లుగానే పరిగణిస్తున్నాయి. సాధారణంగా ఐటీఐ అభ్యర్థుల కనీస వేతనం నెలకు రూ.20 వేలుగా ఉంది. చాలా కంపెనీలు ఐటీఐ అభ్యర్ధులను ఉద్యోగులుగా కాకుండా రిపేర్ల కోసం అప్రెంటిస్‌లగానే తీసుకుంటున్నాయి. వీరికి నెలకు రూ. 9,000 నుంచి రూ.12,000 వరకు ఇస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం 18 సంవత్సరాల వయస్సుగల వారు కావడం, సౌకర్యాల కోసం డిమాండ్ చేయడం. ఇవీ అసౌకర్యాలు ఐటీఐల్లో సరైన బోధకులు లేరు. మంజూరైన బోధకుల పోస్టుల్లో 36 శాతమే ఉన్నారు. ఔట్ సోర్సింగ్ బోధకుల్లో సమర్ధత లేదు. ఐటీఐల్లో శిక్షణకు అవసరమైన లేబోరేటరీలు, సాధనాల కొరత తీవ్రంగా ఉంది. ఐటీఐలకు కనెక్టివిటీ కూడా తక్కువగా ఉంది. దీంతో కొంతమంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు -
కరోనా కాటేసిన పాఠాలు
కోవిడ్–19 తీవ్రఘాతం చదువులమీద పడింది. వానాకాలపు చదువులనుంచి ఆన్లైన్ చదువుల్లోకి మళ్లాం. కంప్యూటర్ అనబడే చిన్నడబ్బా ముందు కూచుని, స్మార్ట్ విద్యార్థులైతే చిట్టి మొబైల్ ముందుం చుకుని చదువు చెబుతున్నామనీ, చదువుకుంటున్నామనీ అనుకుంటున్నారు. ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఉంటారు. విద్యార్థి వింటున్నాడో లేదో కెమెరాముందు ఉన్నాడో లేదో తెలియదు. ఉన్నంత మాత్రాన విన్నట్టూ, విన్నంత మాత్రాన అర్థం చేసుకున్నట్టూ కాదు. విద్యార్థి ముఖంలో కవళికలను చూడడం ఒక భాగ్యం. అర్థం కానట్టు ముఖం పెడితే టీచర్ మరో ప్రయత్నం చేస్తాడు. ఒక వ్యక్తి చెప్పిన అంశం మరొక వ్యక్తి మనసుకు తగిలి, అతనిని కదలించి, ఆ కదలిక సంగతిని మొదటి వ్యక్తికి తెలియజేసినప్పుడు భావ ప్రసారం పూర్తవుతుంది. ఈ ప్రసారం ప్రతిస్పందన ప్రయాణించి తొలి ప్రకటనకర్తకు చేరితే సంపూర్ణ చక్రం. ఎన్ని సాంకేతిక సమాచార ప్రసార వ్యవస్థలు వచ్చినా గురుశిష్య బోధనా విధానం ముందు వెలవెల బోవలసిందే. ఒక వ్యక్తి నిలువెత్తు నిలబడి, ఆలోచిస్తూ, చేతులు కదిలిస్తూ, చూపుడు వేలుచూపుతూ మార్గదర్శకత్వం చేస్తుంటే ఆయన జీవకళలోంచి కొన్ని కాంతులు మనకు చేరుతుంటే, చదువు రూపుదిద్దుకున్న గురువై కళ్లెదుట కదులుతూ ఉంటే ఎంత బాగుం టుంది. అంతర్జాల మాయాజాలంలో పడి కరోనా ఇంద్రజాలంలో నలిగి చదువు బక్కచిక్కుతున్నది. సిలబస్‌ను తగ్గించడం ద్వారా పిల్లల మూపున భారం తగ్గించవచ్చని కేంద్ర విద్యా పాలనా యంత్రాంగం ఒక నిర్ణయానికి వచ్చింది. సరే. 30 శాతం సిలబస్ భారాన్ని కత్తిరించారు. చాలా గొప్ప సంస్కరణ. సులువైన సంస్కరణ. పెద్దగా ఆలోచించాల్సిన పనే లేదు. ఏ ముప్పై శాతం పోతుంది అనేది ప్రశ్న. ఎవరు కోస్తారనేది మరో కీలకసమస్య. మంత్రులు, ఐఏఎస్ అధికారులు, సీబీఎస్ఈ పాలకులు ఖడ్గాలు ఝళిపిస్తూ 30 శాతం దగ్గర వేటు వేస్తారా? ఈ సందేహం పాలనాపరమైన సమస్యకు సంబంధించినది. సీబీఎస్ఈ అధికారులు, పదకొండో తరగతి పాఠ్యాంశాలనుంచి కొన్ని కోసేశారు. కోవిడ్–19 చదువుమీద కూడా ఎంత క్రూరప్రభావం చూపిందో కోతపడిన అంశాలు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా రాజకీయ శాస్త్రం నుంచి తొలగించిన అంశాలు కీలకమైనవి. శాస్త్రం చేస్తున్న ఆర్తనాదం ఎవరికైనా వినబడిందో లేదు. ఇందులో పూర్తిగా వేటుబడిన అంశాలివి. తొమ్మిదో తరగతి నుంచి ప్రజాస్వామిక హక్కులు, మనదేశంలో ఆహార భద్రత, పదోతరగతి నుంచి ప్రజాస్వామ్యం భిన్నత్వం, ప్రఖ్యాత ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామ్యానికి సవాళ్లు, లింగం, మతం కులం, పదకొండో తరగతినుంచి సమాఖ్య లక్షణాలు (ఫెడరలిజం), పౌరసత్వం, జాతీయతా వాదం, సెక్యులరిజం. పన్నెండో తరగతి నుంచి సామాజిక ఉద్యమాలు, నవసామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఆశలు, దేశవిభజనపట్ల అవగాహన అనే అంశాలు అక్కరలేదట. మనకు స్థానిక ప్రభుత్వాలెందుకు అనే అంశాన్ని కూడా తొలగించారు. మనదేశంలో ఉండవలసిన కేంద్ర, రాష్ట్ర సార్వభౌమ సమానత (ఫెడరలిజం), జాతీయత, పౌరసత్వం, ప్రజాస్వామ్య హక్కులు స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయో లేవో తెలియని మాయాజాలంలో పడిపోయిన అంశాలే. రాష్ట్రాల అధికారాలు వివరించే సమాఖ్య లక్షణాలు కూడా పాఠాలనుంచి తొలగించడమా? అన్నింటికీ మించి అన్ని మతాలకు సమానగౌరవం సమాన దూరం అనే సూత్రాన్ని పాటించనవసరం మన సిద్ధాంతమన్నట్టు, సెక్యులరిజం ఏదో పాపమైనట్టు అంటరాని దైనట్టు పాఠ్యాంశాలనుంచి పనిగట్టుకుని తొలగించడం ప్రశ్నించదగిన సంగతి. కారణాలేమిటి? వీటినే ఎందుకు తొలగించారు? తొలగించి ఏం సాధిద్దామనుకున్నారు అనే ప్రశ్నలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి, రమేశ్ పోక్రియాల్ గారే ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ఈ అంశాలు కనుక విద్యార్థులకు బోధిస్తే అవి దేశంలో ఉన్నాయో లేవో తెలుసుకునే శక్తి నవతరానికి వస్తుందన్న భయమా? వాటిగురించే తెలియజెప్పకపోతే ఇక తమ విధానాలకు తిరుగే ఉండదనే నమ్మకమా? మన సంవిధానం మౌలిక లక్ష్యాలు ఇవి. రాజ్యాంగ పీఠికలో ప్రత్యేకంగా రాసుకున్న లక్ష్య లక్షణ వాక్యాలు ఇవి. ఇవి లేకుండా రాజ్యాంగం లేదు. 30 శాతంలో ముందు ఇవే పోతాయంటే అంతకన్నా రాజ్యాంగ విరోధ ఆలోచన ఏమిటి? సంవిధానం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్యత్వం.. మస్తకాల్లోంచి తీసేద్దామా? వెన్నెముకల గురించి మరిచిపోయాం. కనీసం పుస్తకాలు మస్తకాలైనా ఉన్నాయా? ఉంటాయా? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
నచ్చిన రంగంలోనే సక్సెస్: మహేష్‌బాబు
సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి: ఎవరైనా తమకు నచ్చిన రంగాన్ని ఎన్నుకుంటే కెరీర్ పరంగా రాణించగలరని సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిప్రాయపడ్డారు. ఐడియా సెల్యూలర్ ఆధ్వర్యంలో బుధవారం తాజ్‌కృష్ణా హోటల్లో నిర్వహించిన ‘స్టూడెంట్స్ అవార్డ్’ కార్యక్రమానికి హాజరైన ఆయన విభిన్న అంశాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ తాను చిన్ననాటి నుంచి సినిమాలపై ఇష్టంతోనే పెరిగానని చెప్పారు. అదే విధంగా తన కుమారుడు గౌతమ్‌ని కూడా అతనికి ఇష్టమైన రంగంలోనే ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇటీవల ఓ మీడియా నిర్వహించిన సర్వేలో ఆదరణ, వ్యాపార ఒప్పందాల పరంగా మహేష్‌బాబు అగ్రగామిగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించగా.. సినిమాల పరంగా హార్డ్‌వర్క్ చేయడమే తన పని అని, దానికి ప్రతిఫలంగా లభిస్తున్న అభిమానుల ఆదరణకు తాను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పారు. ఇటీవల తన సినిమా పోస్టర్‌కు సంబంధించి తలెత్తిన వివాదం గురించి మాట్లాడుతూ అది వివాదాస్పదంగా ఎలా మారిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే వ్యక్తిగతంగా తాను వివాదాలకు చాలా దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ‘వన్’ సినిమా పరాజయం తన ఆలోచనా ధోరణిపై ఎలాంటి ప్రభావం చూపలేదని, అది ఒక ప్రయోగాత్మక సినిమాగా భావించినట్టు చెప్పారు. భవిష్యత్తులోనూ అలాంటి ప్రయోగాలు చేస్తుంటానని తెలిపారు. తన కుమారుడు గౌతమ్‌తో కలిసి మరోసారి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. దర్శకుడు మణిరత్నంతో తన సినిమా ఇంకా చర్చల దశలో ఉందని, అవి పూర్తి కాగానే దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. తాజాగా నటిస్తున్న 3 చిత్రాల విశేషాలనూ వివరించారు.