Sub-committee
-
ఏపీ :కరోనా కట్టడి చర్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
-
నేడు సీఎంకు కొత్త జిల్లాల నివేదిక!
-
నేడు సీఎంకు కొత్త జిల్లాల నివేదిక!
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు తమ నివేదికను సమర్పించనుంది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆధ్యర్యంలోని సబ్‌కమిటీ వరుసగా మూడు రోజుల పాటు అన్ని జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లతో భేటీ అయింది. జోనల్ వ్యవస్థ, ఉద్యోగుల విభజన అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైంది. వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులన్నింటినీ క్రోడీకరించి సబ్ కమిటీ నివేదికను రూపొందించింది. ‘జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలన్నీ తెలుసుకున్నాం. అందరి విజ్ఞప్తులు, ప్రజాభిప్రాయాలతో నివేదికను సిద్ధం చేశాం. మంగళవారం ముఖ్యమంత్రిని కలసి ఈ నివేదికను అందజేయాలనుకుంటున్నాం..’ అని మహమూద్ అలీ సోమవారం వెల్లడించారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాల సంఖ్య ఇంకా ఖరారు కాలేదని, 24 ఉండాలా.. కొత్తగా వచ్చిన డిమాండ్లతో 26కు పెంచాలా.. అన్నది తేలలేదన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విషయంలోనే పీటముడి ఉందని, ఆ వివాదం కూడా త్వరలో సమసిపోతుందని అభిప్రాయపడ్డారు. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు జిల్లాలుగా విభజించే ప్రతిపాదనలున్నాయి. దానికి బదులు మరో జిల్లాను ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు లేవనెత్తిన వివాదాన్ని పరిష్కరించాలని కేబినెట్ సబ్ కమిటీ తమ నివేదికలో సిఫారసు చేసినట్లు తెలిసింది. ఇక జనగామను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వరంగల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాలను జిల్లాగా చేయాలని ఆ ప్రాంత ప్రతినిధులు పట్టుబట్టారు. ఈ రెండు ప్రతిపాదనలను కూడా సబ్ కమిటీ నివేదికలో పొందుపరచనున్నట్లు సమాచారం. సిరిసిల్ల జిల్లాపై ప్రజా ప్రతినిధుల భేటీలో చర్చ జరగకపోవడం, నిర్మల్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం కావడంతో... సబ్ కమిటీ ఈ రెండింటిని నామమాత్రంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఇక జోనల్ వ్యవస్థను రద్దు అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు నివేదికలో ఉండనున్నాయి. ముందుగా ఈనెల 16న అఖిల పక్ష సమావేశం, 17న కలెక్టర్లతో సబ్ కమిటీ భేటీ కావాల్సి ఉంది. అయితే సీఎంతో సబ్ కమిటీ అనంతరమే ఈ రెండు సమావేశాలపై స్పష్టత వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
సబ్ కమిటీ నిర్ణయం మేరకే చర్యలు
♦ విచారణ కమిషన్ ఎదుట ♦ హెచ్‌సీయూ వీసీ అప్పారావు హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటనపై మూడు రోజులుగా జరుగుతున్న ఏకసభ్య కమిటీ విచారణ గురువారంతో ముగిసింది. ఈ ఘటనలో వర్సిటీ యాజమాన్యం తప్పేమీ లేదని హెచ్‌సీయూ అధికారులు అశోక్ రూపన్‌వాలా నేతృత్వంలోని కమిషన్‌కు నివేదించారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఉన్నతాధికారులు, విద్యార్థులను కమిషన్ ఈ సందర్భంగా విచారించింది. చివరి రోజు విచారణకు హెచ్‌సీయూ వైస్‌చాన్స్‌లర్ పొదిలె అప్పారావు హాజరయ్యారు. అంబేడ్కర్ స్టూడెం ట్స్ అసోసియేషన్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన గొడవ సమయంలో తాను వీసీగా బాధ్యతలు చేపట్టలేదని అప్పారావు కమిషన్‌కు తెలిపారు. అప్పటి వీసీ తొలుత యూనివర్సిటీ క్రమశిక్షణ సంఘంతో విచారణ జరిపారని, తదనంతరం నిపుణులతో సబ్ కమిటీని నియమించారని చెప్పారు. సబ్ కమిటీ నిర్ణయం మేరకే విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు విన్నవించారు. శిక్ష పరిమితిని తగ్గించేలా తాను కృషి చేశానని, విద్యార్థులతో స్నేహపూర్వక ధోరణి ప్రదర్శించానన్నారు. రోహిత్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని, తప్పేమి లేనప్పటికీ తనపై నిందలు మోపడం తీవ్రంగా బాధిం చిందన్నారు. అనంతరం ప్రస్తుత ఇన్చార్జి వీసీ పెరియసామి... ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను కమిషన్‌కు నివేదించారు. కమిషన్‌ను కలసిన వారిలో హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఎం.సుధాకర్, ఫైనాన్స్ ఆఫీసర్ పాండురెడ్డి ఉన్నారు. విరాచణ కమిటీ ఈ నివేదికను త్వరలో కేంద్రానికి సమర్పిస్తుంది. -
'మంత్రులు జిల్లాల్లో, యనమల ఢిల్లీలోనా'
-
'మంత్రులు జిల్లాల్లో, యనమల ఢిల్లీలోనా'
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ టీయూసీ నేత గౌతంరెడ్డి విమర్శించారు. కార్మికుల సమస్యలు, సామాన్యుల కష్టాలు గాలికి వదిలేసిందని ఆయన శుక్రవారమిక్కడ మండిపడ్డారు. కార్మికుల సమ్యలపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం ఏం చేస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని గౌతంరెడ్డి అన్నారు. సమస్యను గాలికి వదిలేసి మంత్రులు శిద్ధా రాఘవరావు, అచ్చెన్నాయుడులు సొంత జిల్లాల్లో తిరుగుతున్నారని, ఇక కమిటీ సభ్యులు యనమల రామకృష్ణుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన సమస్యను పట్టించుకోకుండా జిల్లాల్లో పర్యటిస్తున్నారని గౌతంరెడ్డి అన్నారు. విమానాల ఇంధన చార్జీలలు తగ్గించిన ప్రభుత్వం ఆర్టీసీపై మాత్రం ఇంధన ఛార్జీల భారం మోపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని గౌతంరెడ్డి సూచించారు. -
భూములు ఇచ్చేదిలేదు:తేల్చి చెప్పిన రైతులు
-
సీఎం ఇక్కడికే వచ్చి చర్చించాలి
సాక్షి, గుంటూరు: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేం దుకు వ్యతిరేకిస్తున్న 13 గ్రామాల రైతులతో కేబినెట్ సబ్‌కమిటీ నిర్వహించిన సమావేశం వాడీవేడిగా సాగింది. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా భూములిచ్చేది లేదని రైతులు కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్‌లో సీఎంతో సమావేశానికి రావాలంటూ సబ్ కమిటీ సభ్యులు కోరగా... హైదరాబాద్ వచ్చేది లేదనీ, విజయవాడలోనో గుంటూరులోనో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిసింది. ఇక్కడి ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో గురువారం రాత్రి 9 గంటల ప్రాంతం లో స్పీకర్ కోడెల అతిథి గృహానికి చేరుకునేటప్పటికే రైతులు సమావేశాన్ని బహిష్కరించి గేటు బయటకు వెళ్ళారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ రైతులను బతిమిలాడి వెనక్కు తీసుకుని వచ్చారు. సమావేశం జరుగుతున్నంతసేపు మీడియాను బయటకు పంపి కిటికీల కర్టన్లను సైతం మూసివేశారు. వాస్తు బాగుందని సీఎం ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారని మంత్రి చెప్పగా... మా వాస్తు పగిలిపోతుంటే మీరె లా భూ సమీకరణ చేస్తారని రైతులు నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేందుకు సిద్ధంగాలేమని 13 గ్రామాల రైతులు స్పష్టంచేశారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడుతూ... 13 గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు నిరాసక్తత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఒకటికి నాలుగుసార్లు రైతులతో సమావేశం ఏర్పా టు చేసి వారిని సంతృప్తిపరిచేలా ముందుకు వెళతామని తెలిపారు. సమావేశంలో రైతు నాయకుడు మల్లెల హరీంద్రనాథ్ చౌదరితో పాటు 13 గ్రామాల రైతులు పాల్గొన్నారు. రైతుల సమావేశం రసాభాస రాజధాని ప్రాంత రైతులతో మంత్రుల సబ్ కమిటీ గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. తొలుత విజయవాడలో సమావేశమని రైతులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత గుంటూరుకు మార్చినట్టు రైతులకు తెలపడంతో రాజధాని ప్రాంతానికి చెందిన రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, తాళ్ళాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం గ్రామాల రైతులు ఐదు గంటల ప్రాంతానికే గుంటూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్నారు. కానీ ఎనిమిది గంటలవరకు ఎమ్మెల్యే కానీ మంత్రుల సబ్ కమిటీ సభ్యులు కానీ రాలేదు. ఆగ్రహించిన రైతులు ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చిన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ను నిలదీశారు. సమావేశానికి 15మంది రైతులు సరిపోతారని ఆయన వ్యాఖ్యానించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధలు చెప్పుకోవడానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి స్థానం కల్పించాలని ఉండవల్లి, పెనుమాక రైతులు పట్టుబట్టారు. అసలు తాము భూములు ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. రుణమాఫీపై రైతు చంద్రశేఖర్ మాట్లాడుతుండగా మంత్రి రావెల అనుచరులు, వాదనకు దిగారు. దీంతో తమను అవమానిస్తున్నారంటూ రైతులు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు.