sub contractor
-
‘నవయుగ’ ముందు ఆందోళన
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పనుల్లో తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు సబ్‌కాంట్రాక్టర్లు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ముందు ఆందోళన నిర్వహించారు. సుమారు వంద మంది వరకు కాంట్రాక్టర్లు ఉదయం గేటు ముందు బైఠాయించారు. కార్యాలయానికి వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో సుమారు రూ.150 కోట్ల బిల్లులు బకాయి పడ్డారని, ప్రభుత్వం నుంచి ఈ డబ్బులు వచ్చినా.. నవయుగ కంపెనీ వాటిని తమకు చెల్లించడం లేదని ఆరోపించారు. వ్యవహారాన్ని సెటిల్ చేస్తామంటూ చైర్మన్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు గత కొంతకాలంగా తమను కార్యాలయం చుట్టూ తిప్పిస్తున్నారని దుయ్యబ ట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు చైర్మన్‌తో అపాయింట్మెంట్ ఉందని చెప్పడంతో తామంతా ఇక్కడకు వచ్చామని, తీరా వచ్చాక చైర్మన్ లేడంటూ బయటకు పంపించారని ఆరోపించారు. తామంతా రోడ్డున పడ్డామని, ఇక ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. 11 నెలల నుంచి బిల్లులు చెల్లించడం నిలిపివేశారని ఆరోపించారు. మట్టి పనులు చేశాం.. తాను విజయవాడకు చెందిన కాంట్రాక్టర్‌నని, పోలవరం ప్రాజెక్టులో మట్టి పనులు చేశానని రాము అనే బాధిత కాంట్రాక్టర్ చెప్పారు. ఇందుకుగానూ రూ. 1.80 కోట్లు తనకు రావాల్సివుందన్నారు. గత జనవరి నుంచి మొన్నటి ఆగస్టు వరకు బిల్లుల చెల్లింపు జరగలేదని, ఎన్నిసార్లు అడిగినా ఎండీని అడుగుతామం టూ చెబుతున్నారని ఆరోపించారు. బిల్లులు బకాయిపడటంతో తనలాగే 50 మంది కాంట్రాక్టర్లు రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. సబ్ కాంట్రాక్టు తీసుకున్నాం.. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్‌వర్క్ కోసం తాను నవయుగ నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకోవడం జరిగిందని కిరణ్ అనే కాంట్రాక్టర్ తెలిపారు. రూ. 4.50 కోట్లు బకాయి పడ్డారని వెల్లడించారు. బకాయిలపై ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని, చైర్మన్‌ను కలవడంలో తాత్సారం చేస్తున్నారని, అందుకే బాధితులమంతా ఇక్కడకు వచ్చామని తెలిపారు. -
మరదలితో తిరగొద్దన్నందుకు మచ్చు కత్తితో దాడి
సాక్షి, ఎర్రగుంట్ల : తన మరదలితో తిరగొద్దన్నందుకు ఓబులేసు అనే వ్యక్తిపై గురుస్వామి అనే వ్యక్తి మచ్చు కత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం కలమల్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల మండల పరిధిలోని కర్చుకుంటపల్లి గ్రామానికి చెందిన ఎస్.ఓబులేసు ఆర్టీపీపీలోని ఆరవ యూనిట్లో కూలీలను పెట్టుకొని సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈ కూలీలతో పాటు తన మరదలు శేషమ్మ కూడా ఆర్టీపీపీకి పనికి వస్తుండేది. అయితే ప్రొద్దుటూరు పట్టణం హనుమాన్‌నగర్‌కు చెందిన డి. గురుస్వామి కూడా ఆర్టీపీపీలో బేల్దార్ పని చేసేవాడు. ఈ నేపథ్యంలో శేషమ్మ, గురుస్వామికి పరిచయం ఏర్పడింది. వారిద్దరు చనువుగా ఉండేవారు. ఇది గమనించిన ఓబు లేసు వారిద్దరిని మందలించాడు. తమ పరిచయానికి ఓబులేసు అడ్డుగా ఉన్నాడని భావించిన వీరిద్దరూ అతనిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో రోజు మాదిరిగానే ఓబులేసు చిలంకూరు గ్రామం నుంచి ఆర్టీపీపీకి ఆటోలో కూలీలను పిలుచుకొని తాను బైకుపై బయలు దేరాడు. ఆ సమయంలోనే కలమల్ల వంకపై ఉన్న వంతెన వద్ద గురుస్వామి కాపుకాశాడు. ఓబులేసు బైకుపై వస్తుండగా ఎదురుగా గురుస్వామి కూడా బైకుపై వెళ్లి ఢీకొట్టాడు. కింద పడ్డ ఓబులేసుపై తాను వెంట తెచ్చుకున్న మచ్చుకత్తితో తలపై, భుజంపై నరికాడు. వెంటనే స్థానికులు కేకలు వేయడంతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న ఓబులేసును చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింంచారు. దాడి చేసిన గురుస్వామిని కూడా వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. డాక్టర్ సుధీర్‌రెడ్డి పరామర్శ: కలమల్లలో జరిగిన సంఘటనను తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి గాయపడ్డ ఓబులేసును పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీ మైసూరారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. -
పోలవరం: బకాయిలు చెల్లించకుంటే అత్మహత్యలే శరణ్యం
-
ఇన్ఫార్మర్ నెపంతో సబ్ కాంట్రాక్టర్ హత్య
చర్ల: పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ సబ్ కాంట్రాక్టర్‌ను దారుణంగా హతమార్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా కొవ్వకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. కొవ్వకొండ ఠాణా పరిధిలోని గడిమిరికి చెందిన రాజు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ వద్ద సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను పనులు చేసే ప్రాంతానికి దంతెవాడ జిల్లా కేంద్రానికి నిత్యం రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని మావోయిస్టులు ఇన్ఫార్మర్గా భావిస్తూ బుధవారం తెల్లవారుజామున గడిమిరిలోని అతడి ఇంటి నుంచి తీసుకెళ్లి గ్రామ శివారులో దారుణంగా నరికి చంపారు. ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుండటం వల్లే హతమార్చినట్లు మావోయిస్టులు లేఖను విడిచిపెళ్లారు. -
మరమ్మతు..ఓ తంతు
ఉప్పునుంతల, న్యూస్‌లైన్: ఆ చెరువు నిండితే రైతులు ఏడాదికి రెండు పంటలు పండించుకుంటారు. భూగర్భజలాలు పెరిగితే రెండేళ్లవరకు బోరుబావుల్లో నీటికి ఢోకా ఉండదు. కానీ నిధులున్నా ఆులు ఆం చెరువుకు నాలుగేళ్లుగా మరమ్మతులు లేవు. పనులు ఓ తంతుగా సాగుతున్నా పట్టించుకునేవారు లేరు. చెరువులో ఉన్న నీరంతా వృ థాగా పారుతుండటం..పొరుగూరి రైతులు రబీనాట్లు వేస్తుం డటం చూసి ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మామిళ్లపల్లి ఊరచెరువు కింద 154 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు నిండితే గ్రామానికి చెందిన 80 మంది రైతులు ఏడాదికి రెండుపంటలు పండించుకునేవారు. అయితే 2009లో కురిసిన భారీవర్షాలకు చెరువు తెగిపోయింది. మరమ్మతుల కోసం 2010లో వరదనష్టం నిధులు రూ.33.60లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులను కాంట్రాక్టర్ కల్వకుర్తికి చెందిన ఓ సబ్‌కాంట్రాక్టర్‌కు అప్పగించాడు. గతంలో ఏమాత్రం అనుభవంలేని వారు సకాలంలో పనులు పూర్తిచేయలేకపోయారు. ఆలస్యంగా 2012లో పనులు ప్రారంభించినా పునాదిలో వేసిన కాంక్రీట్‌లో నాణ్యతలేదని క్వాలిటీకంట్రోల్ అధికారులు పనులను నిలిపేశారు. వారి సూచనమేరకు అందులో కొంతమందం కాంక్రీట్‌ను తొలగించి తిరిగి పనులు చేపట్టారు. ఇలా చెరువు పనులు పునాదులకే పరిమితమయ్యాయి. ఇలా ఇప్పటివరకు రూ.10లక్షలు ఖర్చుచేశారు. ఐదడుగుల మేర కాంక్రీట్ వాల్ నిర్మించడంతో చెరువులోకి వచ్చిన వరదనీరంతా ఎక్కిపారి దిగువకు పారుతోంది. దీంతోపాటు కాంక్రీట్ గోడ అంచువెంట ఉన్న మట్టికట్ట కోతకు గురై చెరువులో ఏమాత్రం నీరు నిల్వకుండా పోయింది. బీడుగా ఆయకట్టు మరమ్మతులకు నిధులు మంజూరై నాలుగేళ్లు గడుస్తున్నా పనులు పూర్తిచేయడంలో ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టరు నాన్చుడిధోరణి అవలంభించారు. వారి నిర్లక్ష్యం కారణంగా చెరువులో ఉన్న నీరు దిగువకు వృథాగాపోయింది. దీంతో నీళ్లులేకపోవడంతో వందెకరాలను రైతులు బీడుగా ఉంచాల్సి దుస్థితి ఏర్పడింది. ఈ మేరకు ఇటీవల గ్రామానికి వచ్చిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదరావుకు స్థానిక సర్పంచ్ దామోదర్, ఆయకట్టు రైతులు చెరువు మరమ్మతులపై ఫిర్యాదుచేశారు. అయినా అధికారుల్లో ఏమాత్రం స్పందన కని పించడం లేదు. దీంతో పచ్చనిపంటలతో కళకళలాడాల్సిన పొలాలు బీళ్లుగా మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఏ గ్రా మంలో చూసినా చెరువులు నీటితో నిండి రబీలో వరిపంట సాగుకు రైతులు సన్నద్ధమవుతుంటే ఇక్కడ మాత్రం చెరువులో నీళ్లులేక పంటలు వేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతుపనులను పూర్తిచేయాలని వారు కోరుతున్నారు. పూర్తిచేయిస్తాం.. చెరువు మరమ్మతు పనులు పూర్తి చేయించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని ఇరిగేషన్ డీఈఈ మనోహర్ తెలిపారు. సబ్ కాంట్రాక్టుకు తీసుకున్న వారు పనులపై నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. పనులకు కావాల్సిన ఇసుక, కంకర కూడా సేకరించినట్లు తెలిపారు. మరో రెండుమూడు రోజుల్లో పనులు ప్రారంభించి ఈ దఫా పూర్తిచేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.