
చర్ల: పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ సబ్ కాంట్రాక్టర్‌ను దారుణంగా హతమార్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా కొవ్వకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. కొవ్వకొండ ఠాణా పరిధిలోని గడిమిరికి చెందిన రాజు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ వద్ద సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను పనులు చేసే ప్రాంతానికి దంతెవాడ జిల్లా కేంద్రానికి నిత్యం రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని మావోయిస్టులు ఇన్‌ఫార్మర్‌గా భావిస్తూ బుధవారం తెల్లవారుజామున గడిమిరిలోని అతడి ఇంటి నుంచి తీసుకెళ్లి గ్రామ శివారులో దారుణంగా నరికి చంపారు. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తుండటం వల్లే హతమార్చినట్లు మావోయిస్టులు లేఖను విడిచిపెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment