ఇన్‌ఫార్మర్‌ నెపంతో యువకుడి హత్య | A man Murdered with the name of maoist | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్‌ నెపంతో యువకుడి హత్య

Published Sun, Aug 12 2018 2:54 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

పర్ణశాల: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో పోలీసు ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఓ యువకుడిని మావోయిస్టులు కిరాతకంగా హత్య చేశారు. జిల్లాలోని కౌకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుడ్రా గ్రామానికి శనివారం తెల్లవారుజామున సుమారు 20 మంది మావోయిస్టులు వచ్చారు. గ్రామానికి చెందిన కుంజా లోకేష్‌ను, మాట్లాడే పని ఉందని చెప్పి ఇంటి నుంచి పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. అనంతరం లోకేష్‌ను చిత్రహింసలు పెట్టి గొంతు కోసి చంపారు. స్థానిక ఏఎస్పీకి సహకరిస్తున్నందుకే హత్య చేసినట్లు మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖ వదిలివెళ్లారు. మరోవైపు సుక్మా ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ఆగస్తు 13న సుక్మా జిల్లా బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement