subba reddy
-
ఏవీ సుబ్బారెడ్డి సభ వద్దకు రావద్దంటూ అఖిల ప్రియ అల్టిమేటం
-
సుదీప్ ప్రచారం పై కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి కామెంట్స్
-
మోడీ మాత్రమే కాదు ఏ యాక్టర్ వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది
-
శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు
తిరుమల: వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేశారు. తద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించనున్నారు. తద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు. కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది. తద్వారా ప్రతిరోజు మూడు గంటల సమయం ఆదా అవుతుంది. క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామివారి దర్శనం లభిస్తుంది. 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించి జూలై, ఆగస్టు నెలల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్సైట్ https://tiru patibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తిరుమలలో శ్రీవారిని శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రికి 81,833 మంది దర్శించుకున్నారు. హుండీలో కానుకల రూపంలో రూ.3.31 కోట్లు సమర్పించారు. శనివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టికెట్లు లేని భక్తులు స్వామిని దర్శించుకునేందుకు 18 గంటల సమయం పడుతోంది. -
AP: ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈనెల ఆఖరుకు ఖాళీ అవుతున్న ఏడు ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, శాసన మండలి సభ్యులు చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గత నవంబరు 2వ తేదీతో పూర్తి కాగా, ప్రస్తుత సభ్యులు నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గతనెల 27వతేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీంతో, సోమవారం ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రకటనను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి ఫారమ్-1 ద్వారా ఎన్నికల ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధులు స్వయంగా లేదా వారి ప్రతిపాదకుడి ద్వారా అయినా వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో రిటర్నింగ్ అధికారి వద్ద లేదా సహాయ రిటర్నింగ్ అధికారి, శాసన మండలి ఉపకార్యదర్శికి వారి నామినేషన్లను సమర్పించవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నాం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను పైన పేర్కొన్న స్థలం, సమయాల్లో పొందవచ్చని వివరించారు. ఈ నెల 14వతేదీన ఉదయం 11గంటలకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 16వతేది మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేష్ల ఉసంహరణకు గడువు ఉంటుందన్నారు. ఆ గడువులోగా ఎవరైనా అభ్యర్ధులు వారి నామినేష్లనను ఉపసంహరించుకోవచ్చునని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ అసెంబ్లీలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తైన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
ప్రతిపక్షాలకు అసత్య ప్రచారమే పనిగా మారింది: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: పాలన వికేంద్రీకరణపై ప్రతిపక్షాలకు అసత్య ప్రచారమే పనిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి. త్వరలోనే విశాఖ నుంచి పాలన అందించే యోచనలో సీఎం ఉన్నారని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్లో జరుగుతోన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. ‘త్వరలో విశాఖ నుంచి పాలన యోచనలో సీఎం ఉన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది. విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయం రాష్ట్ర కార్యాలయంగా మారనుంది. ప్రతిపక్ష పార్టీలకు అసత్య ప్రచారమే పనిగా మారింది. వారి దుష్ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు.’ అని పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి. జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతున్నాయని, ఇప్పటికే తిరుపతి, గుంటూరు-విజయవాడ, రాజమండ్రిలో పూర్తయినట్లు చెప్పారు. మన సంస్కృతి సాంప్రదాయలను ప్రతిబింబించేలా కార్యక్రమం నిర్వహించటం చాలా సంతోషంగా ఉందన్నారు. విశాఖ ఎంతో ప్రాముఖ్యత కలిగిన పర్యటక ప్రాంతమని, విశాఖను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ శ్రేణులో జోష్ -
టికెట్‌కి వెల కడతారా?.. మా కుటుంబాన్ని కరివేపాకులా తీసేస్తారా?
పచ్చపార్టీ బాస్ డబ్బుకు తప్ప మనుషులకు విలువ ఇవ్వడని తెలిసిందే. ఎన్నికల్లో కూడా కార్యకర్తల మద్దతు ఉన్నవారికంటే డబ్బున్నవారికే ప్రాధాన్యమిస్తారు చంద్రబాబు. ఇప్పుడు ఉమ్మడి కర్నూల్ జిల్లాలో కూడా ఒక అనామకుడికి నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇచ్చారంటూ కేడర్‌లో నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ అధ్యక్షుడ తీరుపై అక్కడి నాయకులు మండిపడుతున్నారు. బాబు తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బందిపడుతున్న నేత ఎవరో మీరే చదవండి. ఆక్ పాక్ కరివేపాక్ నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబు మీద మండిపడుతున్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అనేక సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న తమ కుటుంబాన్ని చంద్రబాబు కరివేపాకులా తీసేసారని కేఈ కుటుంబం మదనపడుతోంది. చంద్రబాబు తమను సంప్రదించకుండా.. ఎలాంటి సమాచారం లేకుండా డోన్ ఇన్‌ఛార్జి బాధ్యతలు ధర్మవరం సుబ్బారెడ్డికి అప్పగించడం కెఇ కుటుంబం ఆందోళన చెందుతోంది. మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ పుట్టిన రోజున తెలుగు తమ్ముళ్లు సెలబ్రేషన్స్ జరిపారు. ఇదే అవకాశంగా భావించిన కెఇ ప్రభాకర్ చంద్రబాబుపై ఘాటుగా స్పందించారు. చదవండి: (మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్) డోన్ టికెట్‌కు వెల కడతారా? ధర్మవరం సుబ్బారెడ్డిని డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడం ఏమాత్రం సరికాదని చంద్రబాబు నిర్నయాన్ని నేరుగా తప్పుపట్టారు కేఈ ప్రభాకర్. ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి వెళ్ళాలంటే రాజకీయంగా అనుభవం ఉండాలి, కనీసం వార్డ్ మెంబర్‌గా కూడా అనుభవం లేని వ్యక్తిని.. కేవలం డబ్బున్నదన్న ఒకే కారణంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటిస్తారా అంటూ మండిపడ్డారు. తమను పక్కన పెట్టి వేరే వ్యక్తిని అక్కడ నిలబెట్టడం ఏమాత్రం సరికాదని చంద్రబాబును ఉద్దేశించి స్పష్టంగా చెప్పేశారు ప్రభాకర్. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న కుటుంబాన్ని కాదని కేవలం డబ్బును చూసి తీసుకువస్తారా అంటూ అసహనం వ్యక్తంచేశారు. ఏ బాబు మాట విననంటే వినను అసలే పడిపోయిన పచ్చ పార్టీ ప్రతిష్టను చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు మరింత లోతుకు నెట్టేస్తున్నాయని కేడర్ ఆందోళన చెందుతోంది. చంద్రబాబు ఎవరిని తీసుకువచ్చినా.. తమకు సీటివ్వకపోయినా.. పత్తికొండ, డోన్ నియోజకవర్గాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేఈ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ తమ కుటుంబం నుంచి కచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించి తమ బాస్‌పై తిరుగుబాటు జెండా ఎగరేశారు ప్రభాకర్. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
చంద్రబాబుపై కేఈ ధిక్కార స్వరం
డోన్: తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ధిక్కార స్వరం వినిపించారు. డోన్ టీడీపీ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిని ప్రభాకర్ తిరస్కరించారు. డోన్ నియోజకవర్గంలో కేఈ కుటుంబం కచ్చితంగా పోటీ చేస్తుందని బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఈ నిర్ణయంపై కేఈ ప్రభాకర్ అసంతృప్తితో ఉన్నారు. తన జన్మదిన వేడుక సందర్భంగా బుధవారం డోన్‌లో ఓ ఫంక్షన్ హాలులో సభ నిర్వహించి, తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘40 ఏళ్లుగా కేఈ కుటుంబానికి డోన్ కంచుకోట. నేను జెడ్పీటీసీ నుంచి అంచెలంచెలుగా జనామోదంతో రాష్ట్ర మంత్రి వరకు ఎదిగాను. ఇప్పుడు ఎలాంటి అనుభవం, జనామోదం లేని వ్యక్తికి నియోజకవర్గ ఇన్చార్జి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు’ అని చెప్పారు. తమకు జన బలం, ధన బలం కూడా ఉందనే సంగతి ఎవ్వరూ మర్చిపోవద్దని అన్నారు. ఒంట్లో శక్తి కూడా తగ్గలేదని అన్నారు. కచ్చితంగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఈ విషయంలో కార్యకర్తలు సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. టిక్కెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతామని నేరుగా చంద్రబాబుకే స్పష్టం చేసినట్లు కేఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కేఈ జన్మదిన వేడుకకు హాజరుకాకుండా ఉండేందుకు సుబ్బారెడ్డి బుధవారమే నంద్యాలలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. -
రాష్ట్రంలో రూ.3,300 కోట్లతో రోడ్ల నిర్మాణం
పి.గన్నవరం: రాష్ట్రంలో రూ.3,300 కోట్ల వ్యయంతో 2,400 రహదారులను నిర్మిస్తున్నట్టు పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి.సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి 2,300 రహదారి పనులు ప్రగతిలో ఉన్నాయని వివరించారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక వద్ద వశిష్ట నదీ పాయపై నాలుగు లంక గ్రామాల ప్రజలకు అవసరమైన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.49.5 కోట్లు మంజూరు చేసింది. వంతెన నిర్మాణ ప్రాంతాన్ని ప్రాజెక్ట్ ఎస్ఈ ఎం.నాగరాజు, ఈఈ చంటిబాబు, డీఈఈ ఎ.రాంబాబుతో కలిసి ఆదివారం సుబ్బారెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా రూ.1,150 కోట్లతో వంతెనలు, రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. పీఎంజీఎస్‌వై కింద మంజూరైన రూ.2,600 కోట్లతో 3,285 కిలోమీటర్ల మేర రహదారులను ఆధునికీకరిస్తున్నామని వివరించారు. ఇంతవరకు 2,300 కి.మీ. మేర రహదారులకు టెండర్లు పూర్తయ్యాయని, మిగిలిన వాటికి త్వరలో ఖరారవుతాయని తెలిపారు. అంతకుముందు ఆయన ఊడిమూడిలంకలో ప్రజలు, నాయకులతో సమావేశమయ్యారు. ఇక్కడ వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ సమస్యను ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా లంక గ్రామాల ప్రజలు అప్పట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వంతెన నిర్మాణానికి సాంకేతిక బిడ్ పరిశీలనలో ఉందని, అది కూడా పూర్తయితే పనులు ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. -
సుబ్బారెడ్డి అంటే తెలంగాణవాడు కాదు!
సాహిత్య మరమరాలు ముప్పయ్యేళ్ల కిందటి మాట. మిత్రుడు కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవితాసంపుటి ‘గుండె కింద తడి’ (ఏప్రిల్ 1987) ఆవిష్కరణ సభ మహబూబ్‌నగర్‌లో జరిగింది. ఆవిష్కర్త డాక్టర్ సి.నారాయణరెడ్డి. వక్తలు కె.శివారెడ్డి, ఎం.కె.సుగమ్ బాబు. నిర్వాహకులు కాతోజు, వేణు సంకోజు. ఆ రోజు హైదరాబాదు నుంచి నారాయణరెడ్డిగారి కారులో ఆయనతో పాటు శివారెడ్డి, సుగమ్ బాబు, వెంకటేశ్వరరెడ్డి, నేనూ మహబూబ్‌నగర్ వెళ్లాం. ఆ రెండు గంటల ప్రయాణంలో సినారె ఎంత సరదాగా, ఎన్ని కబుర్లు చెప్పారో! ఆయన మిమిక్రీ కూడా చేస్తారని అప్పుడే నాకు తెలిసింది. వెంకటేశ్వరరెడ్డి తన పుస్తకాన్ని ఆ ఊరిలోని నటరాజ్ థియేటర్ యజమాని ఎన్.పి.సుబ్బారెడ్డికి అంకితమిచ్చాడు. సభానంతరం సుబ్బారెడ్డి తన థియేటర్ లోని ఒక గదిలో సినారె, శివారెడ్డి, సుగమ్ బాబులకు ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. మా భోజనాలయ్యాక వెంకటేశ్వరరెడ్డీ, నేనూ ఆ గది బయటే నిరీక్షిస్తూ నిలబడ్డాం. అప్పుడప్పుడు సుగమ్ బాబు సిగరెట్ తాగడానికి బయటికి వచ్చి, లోపలి విశేషాలు చెప్పి వెళ్లేవాడు. ‘మీరు ఈ ప్రాంతంవారు కావడానికి వీల్లేదే‘ అన్నారట నారాయణరెడ్డిగారు ఆ థియేటర్ యజమానితో. ‘ఎందుకు?’ అన్నాడట ఆయన. ‘సుబ్బారెడ్డి అనే పేరు తెలంగాణలో ఉండదు’ అన్నారట సినారె. అప్పుడాయన తను ఎక్కడి నుంచి వచ్చి మహబూబ్‌నగర్‌లో స్థిరపడ్డాడో చెప్పాడట. సుబ్బారెడ్డి, సుబ్బారావు, సుబ్బయ్య వంటి పేర్లు తెలంగాణలో ఉండవనే విషయం అప్పటిదాకా నాకు తెలీదు. రాత్రి దాదాపు పదకొండింటికి హైదరాబాదుకు తిరుగుప్రయాణం. వెంకటేశ్వరరెడ్డి నన్ను ఆ రాత్రికి అక్కడే ఉండిపొమ్మన్నాడు కాని నారాయణరెడ్డిగారు రమ్మనడంతో నేను కూడా బయలుదేరాను. (జూన్ 12న సినారె వర్ధంతి.) - గాలి నాసరరెడ్డి -
18 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. 2,839 పరీక్షా కేంద్రాలలో జరిగే ఈ పరీక్షలకు 6,21,634 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణపై విజయవాడ గొల్లపూడిలోని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేశామన్నారు. 11,690 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన 6,21,634 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. వీరిలో 3,18,524 మంది బాలురు 3,03,110 మంది బాలికలున్నారని చెప్పారు. వీరిలో 1,803 మంది దివ్యాంగ విద్యార్థిని, విద్యార్థులకు అనువుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, పరీక్షలు రాసేందుకు వారికి ఒక గంట ఆదనపు సమయాన్ని కేటాయించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు 156 ఫ్లయ్యింగ్ స్క్వాడ్లు, 289 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు. సమస్యాత్మకమైన 209 పరీక్షా కేంద్రాలలో నిశితంగా పరిశీలించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరంతరం మంచినీటి సౌకర్యం ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చోని పరీక్షలను రాసే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అన్ని పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. నిరంతరం మంచినీటి సరఫరా చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్లను ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలను నిర్వహించారని, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామని వివరించారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపి రవాణా సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈఏపీ.జీవోవీ.ఐఎన్’ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్ 0866–2974540 లేదా 18005994550 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు. 22న శాసనమండలి సభ్యుల ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఆరోజు జరగవలసిన పరీక్షను ఏప్రిల్ 3న నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గుర్తించాలని సూచించారు. పిల్లలను సమయానికి పరీక్ష కేంద్రానికి పంపండి తల్లిదండ్రులు తమ పిల్లలకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను సందర్శించి ప్రతిరోజూ సరైన సమయానికి వారిని పరీక్ష కేంద్రానికి చేరుకొనేలా చూడాలన్నారు. విద్యార్థులు రోజూ ఒక గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష రాయడానికి విద్యార్థులు, రైటింగ్ ప్యాడ్, పెన్నులు, పెన్సిల్స్, రబ్బరు, స్కేల్ వగైరా తీసుకురావాల్సి ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలలో సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబోమన్నారు. విద్యార్థులు ఎటువంటి స్కూల్ యూనిఫారంతో పరీక్షలకు హాజరుకాకూడదన్నారు. విద్యార్థులను బూట్లతో రాకూడదన్నారు. -
జగన్ వ్యాజ్యాన్ని ‘పిల్’తో జతచేస్తారా!?
సాక్షి, హైదరాబాద్ : తనపై జరిగిన హత్యాయత్నం మీద దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి తమ ముందున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)తో జత చేయడంపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వంలోని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఓ బాధితునిగా జగన్మోహన్రెడ్డి పిటిషన్ దాఖలు చేస్తే, దానిని పిల్‌తో జత చేయకుండా సింగిల్ జడ్జి విచారించి ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడుతూ జగన్ పిటిషన్‌ను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఇదే అంశంపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లతోపాటు విమానాశ్రయాల్లో భద్రతా లోపాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జగన్ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రతిపక్ష నేతైన పిటిషనర్‌పై పట్టపగలు విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిందన్నారు. ఘటన జరిగిన గంట వ్యవధిలోనే.. నిందితుడు ప్రచారం కోసమే ఈ పనికి పాల్పడినట్లు డీజీపీ మీడియా సమక్షంలో తేల్చేశారన్నారు. అలాగే, సీఎం కూడా ఈ ఘటనను చాలా తక్కువచేసి మాట్లాడారన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు నిష్పాక్షింగా జరిగే అవకాశంలేనందువల్ల రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని మోహన్‌రెడ్డి ధర్మాసనానికి నివేదించారు. పిటిషనర్‌పై దాడి వెనుక ఓ భారీ కుట్ర ఉందన్నారు. ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్రెడి జోక్యం చేసుకుంటూ, పార్టీ తరఫున తామూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్ బాధితుడైతే ఈ వ్యాజ్యం తమ ముందుకు ఎలా వచ్చిందని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు దీనిని పిల్‌తో జత చేశారని, వాస్తవానికి ఆ పిల్కూ తమ వ్యాజ్యానికి ఎటువంటి సంబంధంలేదని, ఈ విషయాన్ని సింగిల్ జడ్జికి కూడా చెప్పామని మోహన్‌రెడ్డి వివరించారు. అడ్వకేట్ జనరల్ చెప్పిన వివరాల మేర తమ వ్యాజ్యాన్ని ఈ పిల్‌కు జత చేయడం జరిగిందన్నారు. దీంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అనంతరం పిల్ ప్రస్తావన రాగా.. బాధితుడే స్వయంగా తమ ముందున్నప్పుడు దీనిని విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. అలాగే, ఈ వ్యాజ్యం దాఖలు చేసింది స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోసం.. అంతే కదా? అని అడిగింది. అవునని మోహన్‌రెడ్డి సమాధానం ఇవ్వగా, పోలీసుల దర్యాప్తునకు సంబంధించిన ఓ స్వల్ప నివేదికను మంగళవారం తమ ముందుంచాలని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను ధర్మాసనం ఆదేశించింది. కాగా, విచారణను శుక్రవారమే చేపట్టాలని మోహన్‌రెడ్డి పట్టుబట్టడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను ఆ మేర వాయిదా వేసింది. -
ప్రత్యేకహోదాపై వైఎస్సార్సీపీకి చిత్తశుద్ధి ఉంది
-
మంత్రి అఖిలకు ‘నూతన’ షాక్!
ఆళ్లగడ్డ: నూతన ఏడాది..మంత్రి అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరగడం తలనొప్పిగా మారింది. బంధువులు సైతం మంత్రి మాట వినకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆదివారం..ఆళ్లగడ్డలో నిర్వహించిన నూతన సంవత్సర స్వాగత వేడుక ఇందుకు వేదికగా నిలిచింది. ఏం జరిగిందంటే.. నూతన ఏడాదికి స్వాగతం చెబుతూ ఆదివారం ఆళ్లగడ్డలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశామని..అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరు కావాలని అధికార పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఈ విందుకు ఎవరూ వెళ్లవద్దని మంత్రి అఖిలప్రియ తన ప్రధాన అనుచరుడితో కార్యకర్తలకు, బంధువులకు ఫోన్ చేయించారు. అయితే మంత్రి ఆదేశాలను భేఖాతర్ చేస్తూ.. ఆదివారం రాత్రి ఆళ్లగడ్డలోని ఏవీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విందుకు 10వేల మంది వరకు హాజరయ్యారు. దీంతో షాక్ తినడం మంత్రి అఖిలప్రియ వంతైంది. మంత్రి ప్రధాన అనుచరులను సైతం విస్మయానికి గురి చేసింది. మంత్రి సొంత బంధువులైన ఎస్వీనాగిరెడ్డి, ఎస్వీ ప్రసాదరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఏవీ సుబ్బారెడ్డి ఫంక్షన్‌ను అడ్డుకోవాలని మంత్రి అఖిల ప్రియన చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ‘‘ కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి, మీ గ్రామాల్లో అభివృద్ధి పనులు మంజూరు చేస్తాను.. విందుకు వెళ్లవద్దు’’ అని చెప్పినా ఎవరూ వినలేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, గ్రామాల్లోని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున విందుకు హాజరు కావడం చర్చనీయాంశమైంది. భూమాను నమ్ముకున్న వారికి అండగా ఉండేందుకు ఆళ్లగడ్డలోనే ఉంటానని ఈ సందర్భంగా ఏవీ చెప్పారు. ఆరా తీసిన మంత్రి... ఏవీ ఏర్పాటు చేసిన విందుకు ఎవరెవరు హాజరయ్యారు.. వారి పేర్లతో సహా తనకు కావాలని మంత్రి తన అనుచరులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో మంత్రి అనుచరులు విందు కార్యక్రమానికి హాజరై గ్రామాల పేర్లతో పాటు వాటి నాయకుల పేర్లు.. ఏ గ్రామం నుంచి ఎంత మంది వచ్చారు వంటి వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు చేరవేశారు. తాను చెప్పినా వినకుండా వచ్చిన నాయకులపై ఇప్పటి నుంచి కఠినంగా వ్యవహరిస్తానని మంత్రి చెప్పిట్లు సమాచారం. ఆళ్లగడ్డలో పాగాకు ‘ఏవీ’ యత్నాలు దివంగత భూమానాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిల స్నేహం బలమైంది. వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా మెలిగారు. అయితే భూమా మరణించిన తర్వాత భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల మ«ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మంత్రి ఏవీ సుబ్బారెడ్డిని ఖాతరు చేయకపోవడంతో ఆళ్లగడ్డలో ఆయన తిష్టవేశారు. తన బలాన్ని అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకొని వెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఏదేమైనా మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఉన్న విభేదాలు ఈ విందు కార్యక్రమంతో మరోసారి బట్టబయలయ్యాయి. -
'కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. ఎన్నికల సమయంలో ఎన్డీయే మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, ఇచ్చిన వాగ్థానాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోందని, దీనిని కేంద్రం గుర్తించి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటన చేయాలని లోక్‌సభ జీరో అవర్ సమయంలో సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. -
చిత్తూరు డీఈవోగా సుబ్బారెడ్డి?
పోటీలో రవీంద్రనాథరెడ్డి శామ్యూల్‌పై వేటు టెన్త్ ఫలితాలను సీరియస్‌గా తీసుకున్న సీఎం సొంత జిల్లా చివరి స్థానం రావడంపై ఆగ్రహం సమర్థుడైన అధికారిని పంపాలంటూ విద్యాశాఖకు హుకుం నేడో, రేపో వెలువడనున్న ఉత్తర్వులు చిత్తూరు: జిల్లా విద్యాశాఖాధికారిగా సుబ్బారెడ్డిని నియమించనున్నట్లు సమాచారం. ఈ మేరకు నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. సుబ్బారెడ్డి గతంలో హైదరాబాద్ డీఈవోగా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషనరేట్‌లో డెప్యూటీ డెరైక్టర్‌గా విధులు నిర్వహించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సుబ్బారెడ్డిని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయన రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ కార్యదర్శి సిసోడియాకు రిపోర్టు చేసుకున్నారు. మరోవైపు ఖమ్మం డీఈవోగా పనిచేసి రిలీవైన రవీంద్రనాథ్‌రెడ్డి సైతం చిత్తూరు డీఈవోగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చిత్తూరు డీఈవోగా ఎవరు వస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చిత్తూరు సహా మొత్తం నాలుగు డీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో బదిలీల కసరత్తు ఊపందుకున్న నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు డీఈవో పోస్టు భర్తీ కానుంది. డీఈవోగా సుబ్బారెడ్డిని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. విద్యాశాఖపై సీఎం సీరియస్ చిత్తూరుకు సమర్థుడైన విద్యాశాఖాధికారిని నియమించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర విద్యాశాఖకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. పదో తరగతి ఫలితాల్లో సొంత జిల్లాకు చివరి స్థానం దక్కడంపై ఇప్పటికే సీఎం ఆగ్రహంతో ఉన్నారు. వెంటనే ఇన్‌చార్జ్‌ల పాలనకు స్వస్తి పలికి రెగ్యులర్ డీఈవోను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపింది. దీంతో కొత్త డీఈవో నియామకంపై రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్రెడ్డిలో ఒకరిని చిత్తూరు డీఈవోగా నియమించనున్నట్లు సమాచారం. శామ్యూల్‌పై వేటు ఇన్నాళ్లూ పచ్చచొక్కా నేతల మద్దతుతో రెండు డెప్యూటీ డీఈవో పదవులతో పాటు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖాధికారిగా కొనసాగిన శామ్యూల్‌పై వేటుకు రంగం సిద్ధమైంది. దేశం కార్యకర్తల చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప శామ్యూల్ విద్యాశాఖను గాలికి వదిలేశారన్న విమర్శలు ఉన్నారు. శామ్యూల్ నిర్వాహకంతో గత ఏడాది జిల్లా పదిలో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పటికీ ఇన్చార్జ్ డీఈవోగా కొనసాగేందుకు శామ్యూల్ తనవంతు ప్రయత్నాలుసాగిస్తున్నట్లు సమాచారం. -
బాలీవుడ్ హీరోలతో పోలుస్తున్నారు!
‘‘ఈ సినిమాలో నా సిక్స్ ప్యాక్ బాడీ చూసి చాలామంది, నన్ను బాలీవుడ్ హీరోలతో పోలుస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని సుధీర్‌బాబు చెప్పారు. ఆయన హీరోగా నటించిన ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఈ నెల 7న విడుదల కానుంది. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి నిర్మించిన ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. యూనిట్ సభ్యులకు షీల్డులందజేసిన అనంతరం నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ -‘‘సుధీర్‌బాబు కమిట్మెంట్, డెడికేషన్ నాకు బాగా నచ్చాయి. రెండు సినిమాలతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు తను’’ అన్నారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు ఆకాంక్షించారు. -
రైతులకు సత్వరం పరిహారం అందించాలి
పంగులూరు, నూస్లైన్: భారీ వర్షాలకు పంగులూరు మండలంలో పంట నష్టపోయిన రైతులకు సత్వరమే పరిహారం అందించాలని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని చందలూరు పొలాల్లో దెబ్బతిన్న పత్తి, మిరప పైర్లను సోమవారం ఆయన పరిశీలించారు. జిల్లాలో 42 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు చేశారని, మండలంలో 5,500 ఎకరాల్లో సాగు చేసిన పత్తి అధిక వర్షాలకు తుడిచిపెట్టుకుపోయిందన్నారు. గూడ, పూత, పిందె రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎకరాకు రూ. 10 వేలకు తగ్గకుండా పరిహారం అందిస్తేనే ప్రత్యామ్నాయ పైరు వేసేందుకు అవకాశం ఉంటుందని సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఉన్న భరోసా ప్రస్తుతం లేదని, ఆయన హయాంలో క్వింటా పత్తి రూ.7,500 పలకగా, ప్రస్తుతం రూ. 3,500కు మించి లేకపోవడం రైతులకు శాపంగా మారిందన్నారు. ఆనాడు రూ. 550 కే లభించిన యూరియా ప్రస్తుతం రూ. 1250 దాకా పలుకుతోందని, పెరిగిన ఖర్చులతో రైతు వ్యవసాయం చేసే స్థితిలో లేడన్నారు. ఎకరా పత్తికి రూ. 20 వేల నుంచి రూ. 25 వేలు, మిరపకు రూ. 20 నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టారని, ఆరుగాలం పండించిన పంట చేతికందే దశలో ఈ ఘోర విపత్తు సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పక్షం ఒత్తిళ్లకు అధికారులు తలవంచకుండా పంట నష్టపోయిన రైతులందరికీ నిష్పక్షపాతంగా పరిహారం అందించాలని, కౌలు రైతులకు నేరుగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ పులికం కోటిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కరి వెంకట సుబ్బారావు, ఎస్సీ సెల్ కన్వీనర్ సందెపోగు రవీంద్ర, వైఎస్ఆర్ సీపీ నాయకుడు నాగబోయిన తిరుపతయ్య, షేక్ మస్తాన్‌వలి, పెంట్యాల రామాంజనేయులు, మురకొండ సుబ్బారావు, గ్రామ రైతులు ఉన్నారు.