successfully complete
-
PSLV C-54 ప్రయోగం సక్సెస్
-
ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సమావేశాలు ముగియడంతో శుక్రవారం రాత్రి ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, వివిధ దేశాల మంత్రులను కలిశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంగా వారితో చర్చలు జరిపారు. నాలుగు రోజుల్లో 50కి పైగా ముఖాముఖి సమావేశాలతో పాటు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 5 చర్చా గోష్ఠిల్లో పాల్గొన్నారు. ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోకోకోల సీఈఓ జేమ్స్ క్వేన్సీ, సేల్స్‌ఫోర్స్ చైర్మన్ మార్క్ బెనియాఫ్, యూట్యూబ్ సీఈవో సుసాన్ వొజ్కికి వంటి కార్పొరేట్ దిగ్గజాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలు, పారిశ్రామిక పాలసీ, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, వనరులను పరిచయం చేశారు. సరళీకృత వ్యాపార ర్యాంకుల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. గత ఐదేళ్లుగా నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును, ఇక్కడి విశ్వనగర సంస్కృతి, అత్యుత్తమ జీవన ప్రమాణాలను వివరించారు. ఈ సదస్సుల్లో భాగంగా నిర్వహించిన చర్చల సందర్భంగా పిరమల్ గ్రూపు రూ.500 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలోని తమ ఔషధ పరిశ్రమను విస్తరించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు దావోస్‌లో ప్రభుత్వం తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలు ఈ సదస్సులో పాల్గొన్నప్పటికీ, రాష్ట్రానికి మాత్రమే పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
ప్రశాతంగా ముగిసిన నిమజ్జనం
-
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ- 46
-
జీశాట్–31 ప్రయోగం సక్సెస్
శ్రీహరికోట(సూళ్లూరుపేట)/బెంగళూరు: దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయోగించిన జీశాట్–31 సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.31 గంటలకు ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 ఉపగ్రహ వాహక నౌక (రాకెట్ వీఏ 247) ద్వారా జీశాట్–31 కమ్యూనికేషన్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ రావు ఉపగ్రహ పరిశోధన కేంద్ర డైరెక్టర్ కున్హికృష్ణన్ పర్యవేక్షణలో సుమారు రూ.400 కోట్ల వ్యయంతో తయారు చేశారు. జీశాట్–31తోపాటు సౌదీకి చెందిన 1/హెల్లాస్ శాట్–4 జియోస్టేషనరీ శాటిలైట్‌ను ఏరియన్ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ప్రయోగించిన 42 నిమిషాల్లోనే 2 ఉపగ్రహాలు అత్యంత సునాయాసంగా ముందుగా నిర్ణయించిన సమయానికే నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించాయి. జీశాట్–31 ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 250 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,850 కిలోమీటర్ల ఎత్తులోని దీర్ఘ వృత్తాకార భూ బదిలీ కక్ష్యలో 3.0 డిగ్రీల కోణంలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న మిషన్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తమ అధీనంలోకి తీసుకున్నారు. భూ బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాన్ని రెండు మూడు విడతల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కౌరునే ఎందుకు.. జూన్, జులైలో మరో జియోస్టేషనరీ శాటిలైట్ జీశాట్30ను ఇక్కడి నుంచే ప్రయోగిస్తామని కౌరు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్.పాండియన్ చెప్పారు. ఫ్రెంచ్ గయానాతో భారత్‌కు 1981 నుంచి అంతరిక్ష సంబంధాలు కొనసాగుతున్నాయని, ఇవి క్రమంగా మరింత బలపడుతున్నాయన్నారు. ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ మార్క్–2 ద్వారా ప్రయోగించే వీలున్నప్పటికీ ఇక్కడ చంద్రయాన్–2 ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాల్సి వచ్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. బహుళ ప్రయోజనకారి.. సుమారు 2,536 కిలోలు బరువున్న ఈ అధునాతన ఉపగ్రహాన్ని ఇస్రో తయారుచేసింది. ఇందులో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల అత్యంత శక్తివంతమైన కేయూ బాండ్ ట్రాన్స్‌ఫాండర్ల వ్యవస్థను అమర్చారు. ఇది ఇన్శాట్, జీశాట్ ఉపగ్రహాలకు ఆధునిక రూపంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇస్రో గతంలో ప్రయోగించిన ఇన్శాట్–4సీఆర్, ఇన్శాట్–4ఏ సమాచార ఉపగ్రహాల కాలపరిమితి త్వరలో ముగియనుంది. ఈ రెండు ఉపగ్రహాల స్థానాన్ని కూడా జీశాట్–31 ఉపగ్రహం భర్తీ చేయనుంది. ఈ ఉపగ్రహం ముఖ్యంగా భారత భూభాగం, ద్వీపాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర పరిసరాలను పర్యవేక్షించి తగిన సమాచారాన్ని అందించనుంది. దీని ద్వారా వీశాట్నెట్వర్క్స్, టెలివిజన్ అప్‌లింక్స్, డిజిటల్ శాటిలైట్ న్యూస్ గ్యాదరింగ్, సెల్యులార్ బ్యాకప్, డీటీహెచ్ టెలివిజన్ సర్వీసులు, స్టాక్ ఎక్చ్సేంజీ, ఈ–గవర్నెన్స్, ఏటీఎం సేవలన్నీ మెరుగుపడే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. నూతన టెలి కమ్యూనికేషన్ అప్లికేషన్లకు అవసరమైన సమాచారాన్ని పెద్దమొత్తంలో ట్రాన్స్ఫర్ ఇది చేయనుంది. -
‘ప్రశాంతంగా పోలింగ్’
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ (వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి శుక్రవారం తెలిపారు. జిల్లాలో పట్టభద్ర ఓట్లు 63.25 శాతం పోలయ్యాయని, ఉపాధ్యాయ ఓట్లు 92.84 శాతం పోలయ్యాయన్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా చూస్తూ పట్టభద్ర ఓటర్లు కళ్యాణదుర్గంలో అధికంగా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్నారన్నారు. ధర్మవరం డివిజన్లో ఉపాధ్యాయ ఓటర్లు అధికంగా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారన్నారు. డివిజన్ల వారీగా ఓటింగ్ శాతం.. రెవెన్యూ డివిజన్ పట్టభద్రులు ఉపాధ్యాయులు అనంతపురం 63.95 86.89 ధర్మవరం 66.90 95.90 కళ్యాణదుర్గం 72.60 93.60 కదిరి 67.69 94.75 పెనుకొండ 69.83 93.07