succession jobs
-
వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే: కోదండరాం
శ్రీరాంపూర్(మంచిర్యాల): సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలకు గతంలో ఇచ్చిన సర్క్యులర్‌లో హైకోర్టు చేసిన సూచనల మేరకు మార్పులు చేసి డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో నిర్వహించిన సింగరేణి బిడ్డల సంఘం సదస్సులో ఆయన మాట్లాడారు. హైకోర్టు ఆర్టికల్ 14, 16 ప్రకారం కొన్ని అభ్యంతరాలను లేవనెత్తిందని, దానికి అనుగుణంగా సవరణలు చేసి ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. అలా చేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఊహించలేమన్నారు. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు పేర్కొందని, దాని ప్రకారం ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత ప్రభుత్వం అన్ని సంఘాలను పిలిచి చర్చించి అభిప్రాయాలు తీసుకుంటే బాగుండేదన్నారు. బొగ్గుబాయి, దుబాయి బతుకులు ఒకటే అని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు. వారసత్వ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో కార్మికులు వారి పిల్లలకు అప్పులు చేసి పెళ్లిళ్లు చేశారని, చాలా కుటుంబాలు నేడు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. తెలంగాణలో ఇంకా ఆంధ్ర పాలకుల వారసత్వమే కొనసాగుతోందని ప్రజా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు గాదె ఇన్నారెడ్డి విమర్శించారు. ఈ నెల 17 నుంచి తలపెట్టిన సింగరేణి సమ్మెను విజయవంతం చేసి 27న వరంగల్‌లో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభకు కేసీఆర్‌ను అడుగుపెట్టనీయవద్దని పిలుపునిచ్చారు. ఓసీపీలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్రావు మాట్లాడుతూ కోదండరామ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో సింగరేణి జేఏసీ చైర్మన్ ఎండీ.మునీర్, ప్రజా తెలంగాణ నాయకులు శ్రీశైల్‌రెడ్డి, జేఏసీ జిల్లా చైర్మన్ బాబన్న, కన్వీనర్ పీ సంజీవ్, సింగరేణి బిడ్డల సంఘం నాయకులు కొమ్ము శ్రీనివాస్, ఎర్రొళ్ల నరేశ్, అంబాల రాజ్‌కుమార్, నాయకులు నీరటి రాజన్న, శంకర్, రమణాచారి, అభిషేక్, తిరుపతి పాల్గొన్నారు. -
వారసత్వ ఉద్యోగాలంటూ మోసం
సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ధ్వజం ⇒ చెల్లని జీఓ జారీ చేయడమే కాకుండా కోర్టులో కేసు వేయించారు ⇒ ఆ నిందను మాపై మోపి రాజకీయ లబ్ధికి ప్రయత్నించారు ⇒ చిత్తశుద్ధి ఉంటే సింగరేణి కార్మికులకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలిస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేళ్ల తర్వాత చెల్లని జీఓ ఇవ్వడమే కాకుండా కోర్టులో కేసు వేయించి కార్మికులను మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. అబద్ధాలు, మోసమే టీఆర్ఎస్ విధానమని మండిప డ్డారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి. కుంతియాతో కలసి శుక్రవారం గాంధీభవన్ లో ఉత్తమ్ సమావేశమయ్యారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాల విషయం లో టీఆర్ఎస్ చేసిన మోసం, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణపై ద్రోహం, సింగరేణి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై చర్చించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, సింగరేణి కార్మికుల సమస్యలపై అధ్యయన కమిటీ చైర్మన్ గండ్ర వెంకట రమణారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తే టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న వారితోనే కోర్టులో కేసును ఎందుకు వేయించారని ప్రశ్నించారు. ఈ జీఓ చెల్లదని కేసీఆర్‌కు తెలిసినా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని, తద్వారా వారసత్వ ఉద్యోగాలకు అర్హులైన 16 వేల మందిని కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేతలను కోర్టుకు పంపి ఆ నిందను కాంగ్రెస్‌పై మోపి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలని ఉమాండ్ చేశారు. ఇచ్చిన హామీకీ దిక్కులేదు... సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ప్రస్తుతం అందులో ఒక్క కాంట్రాక్టు కార్మికుడూ లేరని బుకాయిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తామన్న హామీకీ మూడేళ్లుగా దిక్కులేద న్నారు. ఓపెన్‌కాస్టు గనులను మూసేయిస్తా మని చెప్పి కొత్తగా 16 ఓపెన్‌కాస్టు గనులకు అనుమతిచ్చారని విమర్శించారు. -
ఆరు నెలల్లో వారసత్వ ఉద్యోగం
సింగరేణిపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ • వీఆర్ఎస్ తీసుకున్నా డబ్బులు తీసుకోని వారికి అవకాశం • 1998కు ముందు దరఖాస్తు చేసుకున్న వారికీ వర్తింపు • కొత్తగా 20 ఓపెన్‌కాస్టులు, 12 భూగర్భ గనులు చేపడుతున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘‘ఎన్నికల హామీకి కట్టుబడి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరు ద్ధరించాం. జనవరి 1 నుంచి దర ఖాస్తులు స్వీకరిస్తున్నాం. పదవీ విరమణ చేసే కార్మికుడి ఉద్యోగాన్ని ఖాళీగా ఉంచడం సబబు కాదు. దరఖాస్తు చేసుకున్న ఆరు నెలల్లో వారసత్వ ఉద్యోగాన్ని ఇస్తాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం శాసనసభలో ప్రకటించారు. వారసత్వ ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతామన్నారు. 1998కి ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి డబ్బులు తీసుకోకుండా.. వారసత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగా వకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. సింగరేణి బొగ్గు గనుల సంస్థపై గురువారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రమాదంలో చనిపోయిన సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.36 లక్షలు పరిహారం ఇస్తున్నామని, పదిహేను రోజుల్లో వారసులకు ఉద్యోగమిస్తున్నామని తెలిపారు. ఉద్యోగం కాదంటే మరో రూ.12 లక్షలు కలిపి రూ.48 లక్షల పరిహారం చెల్లిస్తున్నామన్నారు. అదే సహజ మరణమైతే రూ.26 లక్షల పరిహారం, వారసులకు ఉద్యోగం.. లేదంటే రూ.38 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. భూగర్భ గనులను కొనసాగిస్తాం సింగరేణిలోని మొత్తం 46 గనుల్లో 30 భూగర్భ, 16 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయని... మొత్తం 56,866 మంది కార్మికులు పని చేస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. భూగర్భ గనుల్లో 34,764 మంది, ఓపెన్ కాస్టుల్లో 10,427 మంది కార్మికులు పనిచేస్తున్నా రన్నారు. 2015–16లో భూగర్భ గనులతో రూ.1,869 కోట్ల నష్టం రాగా.. ఓపెన్ కాస్టుల తో రూ.3,998 కోట్లు లాభం వచ్చిందని తెలి పారు. గత ఆరేళ్లలో భూగర్భ గనులతో రూ .8,118 కోట్ల నష్టంరాగా.. ఓపెన్ కాస్టులతో రూ.12,469 కోట్ల లాభం వచ్చిందన్నారు. అయితే భూగర్భ గనుల ద్వారా వస్తున్న నష్టాన్ని ఓపెన్ కాస్టుల ద్వారా వస్తున్న లాభాలతో పూడుస్తున్నామని చెప్పారు. కొత్తగా ఓపెన్ కాస్టులు ఓపెన్ కాస్టు గనులు లేకుండా సింగరేణి మనుగడ సాధ్యం కాదని సీఎం కేసీఆర్ చెప్పారు. భూగర్భ గనుల కార్మికులు, వారి పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడానికి సమాంతరంగా ఓపెన్‌కాస్ట్‌లను తేవాల్సి ఉందన్నారు. 2015–16లో 15 శాతం వృద్ధి రేటు సాధించిన సింగరేణి నేడు దేశంలోనే నంబర్ వన్ కంపెనీగా నిలిచిందన్నారు. అంతే తప్ప భూగర్భ గనులను ప్రభుత్వం మూసివేస్తుందనడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. కొత్తగా 20 ఓపెన్‌కాస్టులు, 12 భూగర్భ గనులను ప్రారంభించనున్నామని కేసీఆర్ తెలిపారు. తొలుత ప్రారంభించే 11 గనుల ద్వారా 11,600 ఉద్యోగాలు కల్పిస్తామని.. కార్మికుల కోసం వైద్య కళాశాలతో కూడిన 500 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పారు. ఓపెన్‌కాస్టుల కోసం భూములు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం చెల్లిస్తామని.. సింగరేణి ప్రాంతాల్లో ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. గతంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నామని, అక్ర మాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రక టించారు. సమైక్య పాలన లో ప్రభావం కోల్పోయిన సింగ రేణి, సిర్పూర్ పేపర్‌మిల్లు, రామ గుండం ఎఫ్‌సీఐ, ఆర్టీసీ సంస్థలను పునరు ద్ధరిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. విద్యు త్ ఉత్పత్తిలోకీ అడుగిడిన సింగరేణి.. జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల ప్లాంటును నిర్మించిం దని, త్వరలో మరో 800 మెగావాట్ల ప్లాంటు నిర్మించనుందని తెలిపారు. ♦ ఓపెన్ కాస్టులు లేకుండా సింగరేణి మనుగడ అసాధ్యం సాక్షి, హైదరాబాద్: లాభాలు ఆర్జిస్తున్న ఓపెన్ కాస్టు గనులు లేకుండా సింగరేణి సంస్థ మనుగడ సాధ్యం కాదని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలిలో గురువారం సింగరేణి సంస్థపై జరిగిన చర్చ లో మంత్రి మాట్లాడుతూ.. కోల్ ఇండియా సహా జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ ఓపెన్‌కాస్టు గనులపైనే ఆధారపడి నడుస్తున్నాయన్నారు. భూగర్భ గనుల నష్టాలను ఓపెన్ కాస్టుల లాభాలతో పూడ్చుతున్నామని తెలిపారు. సింగరేణి క్లరికల్ పోస్టుల భర్తీలో అక్ర మాలపై ఏసీబీ విచారణ ఎంత వరకు వచ్చిందో తెలపాలని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఓపెన్‌కాస్టుల వల్ల లాభాలు వస్తున్నా పంటలు, పర్యావరణానికి నష్టమని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కార్మిక కుటుంబాల ఇబ్బందుల దృష్ట్యా మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి కోరారు. భూగర్భ గనులు 60 నుంచి 30కి తగ్గిపోగా ఓపెన్‌కాస్టు గనులు 10 నుంచి 17కు పెరి గాయని, భూగర్భ గనులనూ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఓపెన్‌కాస్టుల కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ విధా నాలు అమలు చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు లక్ష్మీ నారాయణ సూచించారు. సింగరేణిలో గిరిజనుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మరో టీఆర్ఎస్ సభ్యుడు రాములు నాయక్ కోరారు. ఈ అంశంపై చర్చను శుక్రవారానికి చైర్మన్ స్వామిగౌడ్ వాయిదా వేశారు. -
సింగరేణిలో వేలది కుటుంబాల్లో పండుగ వాతావరణం
-
1 నుంచి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు
-
1 నుంచి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు
- పథకాన్ని ప్రకటించిన యాజమాన్యం - జనవరి 1 నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు మోక్షం కలిగింది. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు చేసింది. 2017 జనవరి 1 నుంచి వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 48–58 ఏళ్ల మధ్య వయసున్న సింగరేణి కార్మికులు అనారోగ్య కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వారి వారసులకు ఉద్యోగం ఇప్పించేందుకు అర్హులు. అయితే దరఖాస్తు సమయానికి కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలి. ఈ రెండేళ్ల కనీస సర్వీసు విషయంలోనూ ‘వన్ టైం’ మినహాయింపును వర్తింపజేశారు. దీనిద్వారా 2016 అక్టోబర్ 11 నాటికి ఏడాదికి మించి సర్వీసు ఉన్న ఉద్యోగులు(అంటే 2017 అక్టోబర్ 31వ తేదీ లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసేవారు) సైతం వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే 2017 జనవరి 1 నుంచి 2017 మార్చి 31లోగా దరఖాస్తు చేసుకుంటేనే వీరు అర్హులు కానున్నారు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణతో 30 వేల మందికి పైగా యువకులను సంస్థల్లో చేర్చుకునేందుకు అవకాశం కలిగిందని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్(ఎన్సీడబ్ల్యూఏ) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు.. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ కొత్త పథకాన్ని సింగరేణి ప్రకటించింది. ఈ అర్హతలు కలిగి ఉండాలి.. 48–58 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలి. అనారోగ్య కారణాలతో సర్వీసులో కొనసాగలేరని కంపెనీ మెడికల్ బోర్డు ధ్రువీకరించాలి. దరఖాస్తు నాటికి రెండేళ్లకు మించి సర్వీసు ఉన్న ఉద్యోగులు 58 ఏళ్ల వయసు వచ్చాకే పదవీ విరమణ చేసేందుకు అవకాశం ఉంటుంది. అనారోగ్య కారణాలతో యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగిస్తే మాత్రం అంతకు ముందే పదవీ విరమణకు అవకాశం కలగనుంది. భార్యాభర్తలిద్దరూ కంపెనీ ఉద్యోగులైతే.. ఒకరే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి. వారసులకు ఉండాల్సిన అర్హతలివీ.. ఉద్యోగిపై పూర్తిగా ఆధారపడి, అతడితో కలిసి నివాసం ఉండే కుమారుడు/అల్లుడు/తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందడానికి అర్హులు. ఉద్యోగి కోరిక మేరకు సంస్థ వీరిలో ఒకరికి ఉద్యోగాన్ని కల్పిం చనుంది. రెండో భార్యకు పుట్టిన కొడుకు, చట్టబద్ధంగా కాని పెళ్లి ద్వారా పుట్టిన సంతానం, దత్తత కొడుకులు ఈ పథకం కింద ఉద్యోగాలు పొందడానికి అనర్హులు. ఇది సాహసోపేత నిర్ణయం: సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ‘‘ఈ నిర్ణయంతో సీనియర్ కార్మికులు, వారి పిల్లలకే కాక కంపెనీ, రాష్ట్రానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వారసత్వ ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధిం చి కార్మికులకు పూర్తి సమాచారం, సలహా లు, సూచనలు అందించడానికి సింగరేణి వ్యాప్తంగా సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. అన్ని గనులు, ఏరియా ఏజీఎం కార్యాల యాలు, ఏజెంటు కార్యాల యాల్లో వీటిని ఏర్పాటు చేస్తాం. జనవరి 1 నుంచి సంబంధిత గని/శాఖలో కార్మికుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తాం. దాదాపు 2 దశాబ్దాలుగా కొత్త నియామకాలు జరగకపోవడంతో ప్రస్తుతం సింగరేణి కార్మికుల సగటు వయసు 53 ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం సంస్థలో 58 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా.. అందులో 30 వేల మంది స్వచ్ఛంద పదవీ విరమణ చేసి తమ వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అవకాశం లభించనుంది’’ -
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలివ్వాలి
దోమలగూడ: సింగరేణిలో ఎలాంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని పలువురు నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. సింగరేణిలో సర్వీసు నిబంధనలు లేని వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ సింగరేణి వారసత్వ బాధిత సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సింగరేణిలో ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, గతంలో 1. 30లక్షల మంది పని చేయగా, ప్రస్తుతం 60 వేల మంది మాత్రమే పని చేస్తున్నారన్నారు. ఓపెన్ కాస్ట్‌లు పెరుగుతుండడంతో కార్మికుల సంఖ్య తగ్గుతోందన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలతోనే యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దీన్ని సక్రమంగా అమలు చేయకపోతే కార్మిక కటుంబాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. వారసత్వ ఉద్యోగాల్లో ఒక సంవత్సరం నిబంధన ఎత్తివేస్తే దాదాపు 2600 మందికి మేలు జరుగుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న విఆర్ఎస్, గోల్డెన్ షేక్‌హ్యాండ్, డిస్మిస్డ్ కార్మికుల సమస్యలను వెటనే పరిష్కరించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తితో దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులు అనేక సమస్యలతో చీకట్లో మగ్గుతున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు బంగాళాఖాతంలోకి, నిధులు కాంట్రాక్టర్లకు, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి దక్కాయన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఎద్దేవా చేశారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో ఒక సంవత్పరం నిబంధన ఎత్తి వేసి, అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందని, సకల జనుల సమ్మెకు సంబంధించిన సింగరేణి కార్మికుల సమ్మెకాలపు వేతనాలపై గట్టిగా ప్రశ్నిస్తేనే ఏడాది తర్వాత ఇచ్చారన్నారు. సింగరేణిలో ట్రేడ్ యూనియన్ ఎన్నికల క్రమంలోనే ప్రభుత్వానికి వారసత్వ ఉద్యోగాలు గుర్తుకు వచ్చాయన్నారు. ఒక్క రోజు ముందు రిటైర్మెంట్ అయినా వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన టీజీబీకే యూనియన్ నాయకులు ఆ మాటను నిలబెట్టుకోవాలని కోరారు. బీజేపీ ఎమ్మేల్యే ఎన్వివిఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మేల్సీ ప్రేంసాగర్‌రావు, వేజ్‌బోర్డు సభ్యులు జనక్ప్రసాదు, సీతారామయ్య, బీఎంఎస్ నాయకులు పులి రాజిరెడ్డి, రవిశంకర్, సింగరేణి వారసత్వ భాదిత సంఘం నాయకులు టి నరేష్, వెంకటేష్, హజార్, సాయి, పి శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ నాయకత్వంలోనే వారసత్వ ఉద్యోగాలు
కాసిపేట : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధించి తీరుతామని గుర్తింపుసంఘం టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ తెలిపారు. గురువారం మందమర్రి ఏరియా కాసిపేట గనిపై ఏర్పాటు చేసిన గేటుమీటింగ్లో కార్మికులనుద్దేశించి మాట్లాడారు. కార్మికుల హక్కులను కాపాడుతూ అదనపు ప్రయోజనాలు సమకూర్చడం మినహా ఏఒక్క హక్కు తాకట్టు పెట్టలేదన్నారు. జాతీయ సంఘాలు ఒక్క సమస్య పరిష్కరించకుండా టీబీజీకేఎస్‌ను విమర్శించడం పనిగా పెట్టుకున్నాయన్నారు. 2009నుంచి2013వరకు అపాయింట్మెంట్ బీసీఎఫ్ కార్మికులందరికీ జనరల్ మజ్దూర్ ప్రమోషన్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. 2014-15లో 190మస్టర్లు నిండినవారు సైతం అర్హులేనన్నారు. ఏరియాలో 120మంది సర్ఫేస్ జనరల మజ్దూర్లకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. సింగరేణిలో రెండో కాన్పు, పీఎంఈ మస్టర్, సన్మానం ఖర్చు పెంపు, యూనిఫాం తదితర అనేక హక్కులు సాధించడం జరిగిందన్నారు. శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను నామమాత్రపు కిరాయితో రిటైర్డ్ కార్మికులకు ఇచ్చేందుకు సీఅండ్ఎండీకి విన్నవించినట్లు తెలిపారు. సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సకలజనుల సమ్మె కాలపు వేతనాలు, వారసత్వ ఉద్యోగాలకు ప్రధానంగా కార్మికులు ఎదురు చూస్తున్నారని, త్వరలో సమస్య పరిష్కరించి కార్మికుల ముందుకు రానున్నట్లు తెలిపారు. గతంలో నెలకు 25మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్న అగ్రిమెంట్‌ను తొలగించి ఒక్క సంవత్సరంలో 3,200మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. జనరల్ మజ్దూర్లకు ప్రమోషన్ కల్పిస్తూ డెప్యుటేషన్తో పాటు ఎక్కడ పనిచేసే వారికి అక్కడే కేటాయించనున్నట్లు తెలిపారు. సమావేశంలో గుర్తింపుసంఘం ఫిట్ కార్యదర్శి వొడ్నాల రాజన్న, టీబీజీకేఎస్ నాయకులు అమరకొండ రాజయ్య, కోరవేణి లక్ష్మణ్, సీపెల్లి రాజలింగు, బెల్లం అశోక్, బాబురావు, దుర్గం శ్రీను, భైరగోని సిద్దయ్య, రాజ్‌కుమార్ తదితరులున్నారు. -
తలతెగినా మేనిఫెస్టో అమలు చేస్తాం
- ఎంపీ బాల్క సుమన్ - వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ శ్రీరాంపూర్ : తలతెగిన కూడా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేసి తీరుతామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు, టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్యతో కలిసి శ్రీరాంపూర్ డివిజన్లోని ఎస్సార్పీ 3 గనిని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతు కార్మికులు ఆందోళన చెందవద్దని, వారసత్వ ఉద్యోగాలు ఇప్పించి తీరుతామని అన్నారు. కార్మికులకు ఐటీ మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని తెలిపారు. గనులపై కార్మికులకు బాత్రూంలు, రెస్ట్హాల్స్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి యాజమాన్యంతో చర్చించామని, రూ.63 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. తమ హయాంలో కంపెనీ లాభాల వాటాను 18 నుంచి 20శాతానికి పెంచి ఇచ్చామని, ఈసారి మరింత పెంచేందుకు ముఖ్యమంత్రిని ఒప్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బేర సత్యనారాయణ, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవిందర్‌రెడ్డి, బ్రాంచి ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు బంటు సారయ్య, పానుగంటి సత్తయ్య, నెల్కి మల్లేశ్, పోశెట్టి, ముక్కెర రమేశ్, కానుగంటి చంద్రయ్య, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకటేశ్వర్రావు, వేల్పుల రవిందర్, మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, సర్పంచ్ ఎం రాజే ంద్రపాణి, గని ఫిట్ సెక్రెటరీ గోపియా, నాయకులు నీలం సదయ్య, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై కార్మికుల ఆగ్రహం వేదిక ఎక్కే ముందు కార్మికులను కలుసుకుంటూ వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలను కార్మికులు నిలదీశారు. ‘ఇప్పుడా వచ్చేది.. ఇన్నాళ్లు ఎటు పోయారు.. నమ్మి టీబీజీకేఎస్‌ను గెలిపించిన పాపానికి అరిగోస పడుతున్నాం. వారసత్వ ఉద్యోగాలు ఏమయ్యారుు. కాళ్లు, రెక్కలు అరిగిపోయాయని అన్‌ఫిట్ చెయ్యమంటే చెయ్యడం లేదు..’ అంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీబీజీకేఎస్ యూనియన్‌పై ఉన్న ఆక్రోశాన్ని కార్మికులు వీరిపై చూపించారు. దీంతో కంగుతిన్న ఇద్దరు నేతలు వారికి సర్ది చెప్పారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగింది వాస్తవమేనని, వాటన్నింటి పరిష్కారానికి కొంత సమయం ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. అనంతరం కార్మికుల రెస్టు హాల్స్‌ను పరిశీలించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. క్యాంటీన్‌ను పరిశీలించి అందులోనే టిఫిన్ చేశారు. మేనేజర్ రమేశ్‌తో కార్మికుల సమస్యలపై చర్చించారు. -
వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలి
గోదావరిఖని, న్యూస్‌లైన్ : రాబోయే తెలంగాణ రాష్ర్టంలో సిం గరేణి విస్తరించిన నాలుగు జిల్లాల పరిధిలో నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు సంస్థలో వారసత్వ ఉద్యోగాలను తిరిగి కొనసాగిం చాలని ముథోల్ ఎమ్మెల్యే ఎస్.వేణుగోపాలచారి డిమాండ్ చేశారు. గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ-1 కమ్యూనిటీహాల్లో ఆది వారం నిర్వహించిన హెచ్ఎంఎస్ అనుబం ద సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ 13వ మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఒక్క ఖమ్మం జిల్లాలోనే 30 రకాల ఖనిజాలున్నాయని ఆయన తెలిపారు. అయితే సీమాం ధ్రులకు భద్రాచలంలోని రాముని హుండీ మీద కన్నా ఈ ఖనిజ సంపదపైనే ఎక్కువ గా కన్నేశారని, అందుకే భద్రాచలాన్ని సీ మాంధ్రలో కలపాలనే కుట్ర పన్నుతున్నార ని ఆయన పేర్కొన్నారు. కాగా సింగరేణిలో రాజకీయాలకతీతంగా సాగుతున్న హెచ్ ఎంఎస్‌ను కార్మికులు ఆదరించాలని, రాబో యే ఎన్నికల్లో సింగరేణిపై యూనియన్ జెం డా ఎగురవేసేలా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. బీఎంఎస్ నాయకుడు పులి రాజి రెడ్డి మాట్లాడుతూ దేశంలో పెట్టుబడిదారి, కాంగ్రెస్ కార్మిక సంఘాల బారి నుంచి కా ర్మికులను కాపాడేందుకు సామ్యవాద ధోరణితో జయప్రకాశ్ నారాయణ్ హెచ్ఎంఎస్ ను ప్రారంభించారని, అది నేడు దేశంలోని రైల్వే, సింగరేణి, ఇతర పబ్లిక్ సెక్టార్ పరిశ్రమల్లో కీలకభూమిక పోషిస్తున్నదని తెలిపా రు. జేఏసీ నాయకుడు డాక్టర్ శంకర్ముది రాజ్ మాట్లాడుతూ సింగరేణి పునర్నిర్మాణంలో కార్మికులు భాగస్వామ్యులు కావాల ని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించిన సభలో నాయకులు కర్ర యాదవరెడ్డి, సీ హెచ్ ఉపేందర్, గోమాస శ్రీనివాస్, యాదగిరి సత్తయ్య, దేవ వెంకటేశం, ప్రతాపరావు, కొలిపాక వీరస్వామి, షబ్బీర్ అహ్మ ద్, నాయిని ఓదెలు, ద శరథం, మంథని మల్లేశ్, కె.బాలయ్య, తదితరులు పాల్గొన్నా రు. అంతకుముందు యూనియన్ జెండా ను అధ్యక్షుడు నాయిని నర్సింహరెడ్డి ఆవి ష్కరించారు. సభ ప్రారంభానికి ముందు ఇటీవల అమరుడైన నెల్సన్మండేలా మృ తిపై నాయకులు, కార్యకర్తలు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటిం చారు. అలాగే సభలో కళాకారులు ఆలపిం చిన గీతాలు అలరించాయి. సీనియర్ కార్యకర్తకు సన్మానం సింగరేణిలో హెచ్ఎంఎస్ ప్రారంభమైన 1978 నుంచి పనిచేస్తూ కార్మికుల సమస్యల కోసం పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన రాంచంద్రం అనే సీనియర్ కార్యకర్తను యూనియన్ అధ్యక్షుడు నాయిని నర్సింహరెడ్డి, రియాజ్ అహ్మద్ పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. యైటింక్లయిన్‌కాలనీ : హెచ్ఎంఎస్ మహాసభకు పట్టణం నుంచి కార్యకర్తలు బైక్ ర్యాలీ గా తరలివెళ్లారు. దశరథంగౌడ్, రామయ్య, గోపాల్‌రెడ్డి, హబీబ్‌బేగ్ పాల్గొన్నారు.